
సాక్షి, ఏలూరు: ఏపీలో పెగాసన్ దుమారం కొనసాగుతోంది. చంద్రబాబు హయంలో పెగాసస్ వాడకంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పెగాసస్ అంశంపై వైఎస్‌ఆర్‌సీపీ దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి స్పందించారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పెగాసస్ ద్వారా ఎవరి ఫోన్‌నైనా టాప్ చేయవచ్చు. మన ఫోన్‌లో డేటాను పూర్తిగా పరిశీలించవచ్చు.. ఈ శాతాబ్దంలోనే అతి పెద్ద స్కామ్ ఇది.. మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని గతంలోనే గ్రహించాం. పెగాసస్ స్పైవేర్‌తో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారు.. అధికార దాహంతోనే ఎలాంటి కుట్రకైనా పాల్పడే వ్యక్తి చంద్రబాబు.. ప్రత్యర్థి పార్టీల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే పెగాసస్ కొన్నారు.. గతంలో చంద్రబాబుతో రాజకీయంగా జతకట్టిన మమతా బెనర్జీనే పెగాసస్ గురించి చెప్పారు’’. అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment