న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పెగసస్ స్పైవేర్‌తో ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్‌లో మోదీ సర్కార్ పాత్రను బహిర్గతంచేయాలని ఇద్దరు సీనియర్ పాత్రికేయులు మంగళవారం సుప్రీంకోర్టు తలుపుతట్టారు. కేంద్ర ప్రభుత్వంగానీ, కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే దర్యాప్తు, విచారణ సంస్థలుగానీ పెగసస్ స్పైవేర్ లైసెన్స్‌ను కొనుగోలు చేశాయా? వాక్ స్వాత్యంత్య్రాన్ని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించాయా? అనేది తేల్చాలని పాత్రి కేయులు కోర్టును కోరారు.
కోర్టు సిట్టింగ్ జడ్జి లేదా మాజీ జడ్జి నేతృత్వంలో కేసు విచారణకు ఆదేశాలు జారీచేయాలని కోర్టును కోరారు. ప్రత్యక్షంగానీ, పరోక్షంగాగానీ, మరేదైనా పద్దతిలో కేంద్రప్రభుత్వం/కేంద్ర దర్యాప్తు సంస్థలు స్పైవేర్‌ను వాడాయో లేదో తేటతెల్లం చేయాలని వారు కోర్టును అభ్యర్థించారు. భారత్‌లో 142 మందిపై నిఘా కొనసాగిందని ప్రముఖ విదేశీ ప్రచురణ సంస్థలు పలు సంచలన కథనాలను/ నివేదికలను వెల్లడించాయని వారు కోర్టుకు నివేదించారు.
Comments
Please login to add a commentAdd a comment