Senior journalists
-
జర్నలిస్ట్ పై టీడీపీ నేతల దాడి
-
సాక్షిపై అక్రమ కేసులు.. సీనియర్ జర్నలిస్టుల రియాక్షన్
-
పెగసస్‌లో కేంద్రం పాత్రను బయటపెట్టండి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పెగసస్ స్పైవేర్‌తో ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్‌లో మోదీ సర్కార్ పాత్రను బహిర్గతంచేయాలని ఇద్దరు సీనియర్ పాత్రికేయులు మంగళవారం సుప్రీంకోర్టు తలుపుతట్టారు. కేంద్ర ప్రభుత్వంగానీ, కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే దర్యాప్తు, విచారణ సంస్థలుగానీ పెగసస్ స్పైవేర్ లైసెన్స్‌ను కొనుగోలు చేశాయా? వాక్ స్వాత్యంత్య్రాన్ని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించాయా? అనేది తేల్చాలని పాత్రి కేయులు కోర్టును కోరారు. కోర్టు సిట్టింగ్ జడ్జి లేదా మాజీ జడ్జి నేతృత్వంలో కేసు విచారణకు ఆదేశాలు జారీచేయాలని కోర్టును కోరారు. ప్రత్యక్షంగానీ, పరోక్షంగాగానీ, మరేదైనా పద్దతిలో కేంద్రప్రభుత్వం/కేంద్ర దర్యాప్తు సంస్థలు స్పైవేర్‌ను వాడాయో లేదో తేటతెల్లం చేయాలని వారు కోర్టును అభ్యర్థించారు. భారత్‌లో 142 మందిపై నిఘా కొనసాగిందని ప్రముఖ విదేశీ ప్రచురణ సంస్థలు పలు సంచలన కథనాలను/ నివేదికలను వెల్లడించాయని వారు కోర్టుకు నివేదించారు. -
సీనియర్ జర్నలిస్టు ‘తుర్లపాటి’ కన్నుమూత
లబ్బీపేట (విజయవాడ తూర్పు)/సాక్షి, అమరావతి : సీనియర్ పాత్రికేయులు, రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత తుర్లపాటి కుటుంబరావు కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే తుదిశ్వాస వదిలారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. 1933 ఆగస్టు 10న కృష్ణాజిల్లాలో జన్మించిన ఆయన, 14 ఏళ్ల వయస్సులో జర్నలిజంలోకి అడుగుపెట్టారు. ఏడు దశాబ్దాలపాటు ఆయన పాత్రికేయునిగా, రచయితగా వివిధ హోదాల్లో పనిచేశారు. విలువలకు పెద్దపీట పాత్రికేయునిగా ‘తుర్లపాటి’ విలువలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారని, నేటి తరానికి ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని పలువురు స్మరించుకుంటున్నారు. రాష్ట్రంలోనే పద్మశ్రీ అవార్డు పొందిన తొలి జర్నలిస్టు ఆయనే కావడం విశేషం. తెలుగు జర్నలిజం, సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని కృషితో అనేక అవార్డులు అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. ప్రముఖులు రాజాజీ, డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, వీవీ గిరి, పీవీ నరసింహారావు వంటి వారితో తుర్లపాటికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. జర్నలిస్టుగా ఆయన ప్రస్థానం వివిధ హోదాల్లో 33 ఏళ్లపాటు ఆంధ్రజ్యోతి పత్రికలోనే కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఆయన రచనలు జాతక కథలు (1958), జాతి నిర్మాతలు (1968), మహానాయకులు (1971), 1857 విప్లవ వీరులు, 18 మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు, నా కలం–నా గళం వంటివి ప్రజాదరణ పొందాయి. గిన్నిస్ రికార్డుల్లో చోటు ఏ విషయంపైనైనా అనర్గళంగా మాట్లాడగలిగే తుర్లపాటి కుటుంబరావు.. 20 వేలకు పైచిలుకు సభల్లో పాల్గొన్నారు. అంతేకాక.. వేలాది సభలకు అధ్యక్షత వహించి 1993లో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో స్థానం పొందారు. తానా ఆహ్వానం మేరకు 1985 లాస్ ఏంజెల్స్‌లో జరిగిన తెలుగు సభల్లో ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొన్నారు. గవర్నర్ విశ్వభూషణ్ సంతాపం తుర్లపాటి మృతిపట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు వేలకు పైగా జీవిత చరిత్రలు రాయటమే కాక, వేలాది ప్రసంగాలతో గిన్నీస్ రికార్డుల్లో స్థానం పొందారని కొనియాడారు. కుటుంబరావు ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశీలి తుర్లపాటి : సీఎం జగన్ ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, రచయిత, గొప్ప వక్త తుర్లపాటి కుటుంబరావు మృతిపట్ల సీఎం వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గొప్ప రచయిత, మంచి వక్త, బహుముఖ ప్రజ్ఞాశీలి అని తుర్లపాటిని ముఖ్యమంత్రి కొనియడారు. ఆయన అనేక అవార్డులు గెలుచుకున్నారని.. తెలుగు సాహిత్యం, జర్నలిజానికి ఆయన చేసిన కృషి చాలా గొప్పదని సీఎం తెలిపారు. అలాగే, మంత్రి పేర్ని నాని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలువురు జర్నలిస్టులు కూడా తుర్లపాటి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. తుర్లపాటి కుటుంబరావు భార్య కృష్ణకుమారి 1969లోనే మృతిచెందారు. ఆయన తనయుడు టీవీఎస్ జవహర్లాల్ విజయవాడలోనే క్రెడాయ్ సంస్థలో సీఈవోగా పనిచేస్తున్నారు. కుమార్తె ప్రేమజ్యోతి పదేళ్ల కిందట మృతిచెందారు. -
తెలుగు వారమండీ!
చిన్న నుంచి పెద్ద దాకా ఫేస్‌బుక్‌ను ఎడాపెడా ఉపయోగిస్తుండడాన్ని చూసిన సీనియర్ పాత్రికేయులు పట్నాయకుని వెంకటేశ్వరరావు బుర్రలో ఓ చక్కటి ఆలోచన తళుక్కున మెరిసింది. అదేమిటంటే, తెలుగును ఇష్టపడే వారందరికీ ఆ మధురిమను రుచి చూపిస్తే బాగుంటుంది కదా, అందుకు ఫేస్‌బుక్‌నే వేదికగా మార్చుకుంటే ఎలా ఉంటుంది?’ అని. తనకు వచ్చిన ఈ ఆలోచనను వెంటనే అమలు చేసేశారు. అందులో భాగమే యూ ట్యూబ్‌లో తనకున్న వీఆర్ తెలుగు ఛానల్ ద్వారా ‘వారం వారం తెలుగు హారం’ పేరిట ప్రతి ఆదివారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఫేస్బుక్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ప్రారంభించేశారు. దీనిని మొక్కుబడిగా కాకుండా ఎంతో చిత్తశుద్ధితో తనకు ఎన్ని పనులున్నా పక్కనపెట్టేసి, ఆ సమయాన్ని పూర్తిగా కేటాయిస్తూ, ఓ యజ్ఞంలా నిర్వర్తిస్తున్నారు. అలా గత ఏడాది మార్చి 17 నుంచి ఇప్పటి వరకు అంటే 54 వారాలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. తెలుగును ఇష్టపడే వారిలో చాలామందిని తన వీఆర్ తెలుగు ఛానల్‌కు వీక్షకులుగా చేసుకోగలిగారు. ఎంతోమంది తెలుగు భాషాభిమానులను, పెద్దలను, యువతను ఇందులో భాగస్వాముల్ని చేశారు. అది ఎలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే...‘‘తెలుగు మాట ప్రతీ ఇంటా మార్మోగాలనే సదుద్దేశంతో దీన్ని నేను ప్రారంభించాను. ఇల్లే వేదికగా నిర్వహిస్తున్న ఈ మహా యజ్ఞం ఇంత చక్కగా సాగడానికి కారణం తెలుగు భాషాభిమానులు ఇస్తున్న ప్రోత్సాహం. నాకు సలహాలు ఇచ్చి వెన్నుదన్నుగా నిలుస్తున్న పెద్దలు, తెలుగు భాషాభిమానులకు నా నమస్సులు. ఇంటివద్ద సహకరిస్తున్న నా సతీమణి ఇందిర, మా అమ్మాయి శివప్రత్యూషలకు కృతజ్ఞతలు. ఇక నేను అడిగిన తడవుగానే ఎలాంటి బేషజాలు చూపకుండా ఇంటికి వచ్చి కార్యక్రమంలో పాలు పంచుకున్న అతిథులు, ఫోన్ ద్వారా ముచ్చటించి కార్యక్రమంలో తెలుగు భావాలను పంచుకున్న పెద్దలకు వందనాలు. ఇలా ఇప్పటికి 25 మంది ప్రముఖులు ఇంటివద్దకు వచ్చి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. మరో 25 మంది శ్రీకాకుళం, విశాఖ, అనంతపురం, కడప, కర్నూలు, సిద్దిపేట, వరంగల్, హైదరాబాద్‌లనుంచి ఫోన్ ద్వారా ముచ్చటించి చక్కని తెలుగుకు చిక్కని బాటలు వేశారు. ఇక నేను వ్యక్తిగత వ్యాఖ్యానం ద్వారా 90 కి పైగా వేమన పద్యాలు, 50 వరకూ తెలుగు దనం నింపే పద్యాలు, 50 సామెతలు, తెలుగు విశేషాలు, తెలుగు ప్రముఖుల ముచ్చట్లు, సందర్భోచితంగా కొత్త అంశాలు మీముందు ఉంచాను. ఇవి కూడా ముమ్మరంగా షేర్ అయ్యాయి. వేలమంది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ చూశారు. దీనికి అనుబంధంగా యూ ట్యూబ్‌లో నడుస్తున్న ‘వీఆర్ తెలుగు చానల్’ ద్వారా 10 వేల వరకూ వీక్షకులు ఆదరించారు. ముఖ్యంగా తెలుగు విశేషాలు కొత్త తరానికి చేర్చాలనే సంకల్పంతో సాగుతున్న ఈ మహత్తర వినూత్న కార్యక్రమం మీ ముందుకు తెస్తున్నందుకు, దీనికి మీ ఆదరణ తోడుగా నిలుస్తున్నందుకు ఒడలు పులకరిస్తోంది. ఈ సరికొత్త ప్రయోగానికి సదా మీ ఆశీస్సులు కోరుకుంటున్నాను..’’ తెలుగు హారంలో పరిమళించిన కొన్ని పుష్పాలు... రత్నాల నరసింహమూర్తి (సీనియర్ జర్నలిస్టు), వర్థనపు సుధాకర్( డీడీ ఖజానా శాఖ, విశాఖ), పి. లక్ష్మణ్ (వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మహబూబ్ నగర్); పోకల సుబ్బారెడ్డి (వ్యక్తిత్వ ప్రేరకుడు, కర్నూలు), ఆర్. మధుసూదన రావు(కథకుడు, సినీగేయ రచయిత); బాబూచారి (గాయకుడు), మక్కపాటి మంగళ (స్వర్ణపుష్పం పత్రిక ఎడిటర్); కాలువ మల్లయ్య (సాహితీ ప్రముఖుడు, ఉమ్మడి రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ సభ్యుడు), డా. వకుళాభరణం కృష్ణమోహన్ (తెలంగాణ రాష్ట్రం బీసీ కమిషన్ సభ్యుడు, సాహితీ వేత్త)లు అతిథులుగా వచ్చి తెలుగు భావాలను ప్రత్యక్షంగా పంచుకున్నారు. ఫోన్ ద్వారా ముచ్చటించిన వారు... సన్నశెట్టి రాజశేఖర్ (సంపాదకులు, ఉత్తరాంధ్ర పత్రిక, శ్రీకాకుళం), 2. భద్రి కూర్మారావు (జానపద కళా ప్రముఖుడు, డిగ్రీ కళాశాల ఉపన్యాసకుడు, శ్రీకాకుళం; శ్యామసుందర శాస్త్రి, (రేడియో వ్యాఖ్యాత, అనంతపురం) ఈశ్వర రెడ్డి (ఆచార్యుడు, వేమన వర్సిటీ, కడప), మహ్మద్ మియా (గజల్ గాయకుడు, కర్నూలు), నందిగం శివప్రసాద్ (సినీ సంగీత దర్శకుడు, హైదరాబాద్); జంద్యాల రఘుబాబు (కవి, రచయిత, కర్నూలు), శ్యామ్ ప్రసాద్ లాల్ (జేసీ, కరీంనగర్), ఎం. హరికిషన్ (ప్రఖ్యాత బాలల కథకుడు, కర్నూలు) తెలుగు హారం కార్యక్రమ లక్ష్యాలుప్రతీ ఇల్లూ తెలుగుకు పెద్ద పీట వేయాలి; తెలుగు భాష, సంస్కృతి, పద్యం, పాట, నాటకం, సామెతలు, నుడికారాలు, అవధానం వంటి అన్ని ప్రక్రియలను కొత్త తరం పిల్లలకు తెలియచేసి భాషా మమకారం పెంచడం, మన మాతృభాష కొన్ని వందల తరాలకు అందేలా తెలుగు కుటుంబాలు కృషి చేసేందుకు ప్రేరణ కలిగించడం -
మనం చూడదలుచుకోని నిజం
1947లో ఎక్కడ ప్రారంభించామనే కొలబద్ధతో గాక, 2015కి ఎక్కడికి చేరి ఉండాల్సింది అనే కొలబద్ధతో దేశ ఆర్థిక ఆరోగ్యం, సామాజిక న్యాయం ప్రమాణాలను లెక్కించాల్సి ఉంది. అలా చూస్తే మనమిప్పుడున్నది సంక్షోభపు అంచున కాదు, మహా విపత్తుకు అంచున. సావధానులుకండి. మన వైఫల్యం కషాయపు అడుగు అవశేషాల కటిక చేదు విషయమిది. దేశంలో సగ భాగం ఆకలికి, అర్ధాకలికి మధ్యన ఇరుక్కుని, శిఖరాగ్రానున్న ఐదో వంతు తమ సంతోషాల బుడగలో మహా ఉల్లాసంగా గడుపుతున్నారు. నడమన పీల్చిపిప్పయిపోతున్న మధ్య భాగం గందరగోళంతో, అనిశ్చితంగా... టీవీ సీరియళ్లు తినిపించే ఆశావహ దృక్పథానికి, వీధి తిరుగుబాటు వెల్లువలకు మధ్య తెగ ఊగిసలాడుతోంది. 2015నాటి భారతావని గురించిన ఈ సత్యాలు అత్యంత సమగ్రంగా నిర్వహించిన సామాజిక-ఆర్థిక గణన నుంచి తీసుకున్నవి. అవి సంతృప్తితో కళకళలాడే అతి సుసంపన్న వర్గీయుల సౌందర్యసాధనాలతో అలంకరించి చూపెడుతున్న భారతావని మొహానికి పెద్ద చెంపపెట్టు. దేశంలో ప్రతి ముగ్గురు బాలల్లో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నవారే. దీన్ని సబ్‌సహారా (సహారా ఎడారికి దక్షిణాన ఉన్న) దేశాల్లోని ప్రతి ఐదుగురిలో ఒకరితో పోల్చి చూడండి. మన దేశంలో 51%కి శారీరక శ్రమతో కుంగిపోవడమే ఏకైక ఆదాయ వనరు. శారీరక శ్రమంటే జీవనాధార స్థాయి మనుగడకు సమానార్థకం. కాబట్టే నేను ఉద్దేశపూర్వకంగానే శారీరక శ్రమ అన్నాను. 92%గ్రామీణ కుటుంబాలు నెలకు రూ.10,000 కంటే తక్కువతోనే జీవిస్తున్నాయి. వ్యక్తులు కాదు, కుటుంబాలే. మరీ నగ్నంగా చెప్పాలంటే ఇంచుమించు 75 శాతం కుటుంబాలు నెలకు రూ. 5,000 లేదా అంతకంటే తక్కువతోనే బతుకుతున్నాయి. ఈ సర్వే పొడవునా ఒకదాన్ని మించి మరొకటి మరింతగా ఎక్కువ ఆందోళనకరమైన ఇలాంటి గణాంకాల మరకలే ఉన్నాయి. కావాలనుకుంటే, పిల్లల్లో పోషకాహార లోపం 45.1% నుంచి 30.7%కి తగ్గిందని మీరు ఉపశమమంపొందొచ్చు. కానీ దైన్యం నిండిన తల్లుల కళ్లు నిస్సహాయంగా చూస్తుండగానే దారిద్య్రానికి హరించుకుపోతున్న ప్రతి మూడో శిశువు ముందు ఇలాంటి ప్రలాపనలను చేయడం మూర్ఖత్వం. బహుశా ఆ తల్లులు సైతం అప్పటికే తమ పిల్లలంత దుర్బలంగా ఉండి ఉంటారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు యూపీఏ ప్రభుత్వం దేశంలో 30% మాత్రమే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నదంటూ ఒక బూటకపు అంచనాను చలామణి చెయ్యాలని యత్నించింది. ఎన్నికల రాజకీయల సేవలో దారిద్య్ర రేఖను మరికాస్త మింగుడుపడేలా చేయడం కోసం ప్రదర్శించిన గణాంకాల గారడీ అది. 1947లో మనం ఎక్కడ ప్రారంభించామనే కొలబద్ధతో గాక, 2015కి మనం ఎక్కడికి చేరి ఉండాల్సింది అనే కొలబద్ధతో మన దేశ ఆర్థిక ఆరోగ్యాన్ని సామాజిక న్యాయం ప్రమాణాలను లెక్కించాల్సి ఉంది. అలా చూస్తే మనమిప్పుడున్నది సంక్షోభపు అంచున కాదు, మహా విపత్తుకు అంచున. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రాథమిక అవసరాలైన ఆహారం, ఉపాధుల కోసం తమ హక్కుల పట్ల విశ్వాసంతో ఉన్న ప్రజలు తరాలతరబడి ఇంకా ఎదురు చూడ లేరు. ఆగ్రహావేశానికి అత్యంత శక్తివంతమైన కారణం ఆకలి. కోట్లాది మంది ప్రజలు ఇంకా తలదాచుకోను గూడూ, ఎలాంటి గౌరవమూ, ఏ ఆశా లేక బతుకుతున్నారు. పేదరిక సూచికకు కొలబద్ధగా ప్రపంచం సబ్ సహారన్ ఆఫ్రికాను స్వీకరించింది. కానీ అదొక భ్రమ. మన దక్షిణ ఆసియా ఉపఖండమే నిజానికి పేదరికానికి సరైన నమూనా. అదేపనిగా ఇతరుల్ని చూడటమంటే మనకు మహా ఇష్టం. ఒక్కసారి అద్దంలో మనల్ని మనం తేరిపార చూసుకోవడం అవసరం. మనకది చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. మీకు అంతరాత్మంటూ ఉంటే ఆందోళన కూడా కలుగుతుంది. అయినా మనకు సంతృప్తి కలగడానికి రెండు కారణాలున్నాయి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ వాస్తవాలను మీడియా ముందుంచేటప్పుడు కుంటిసాకులతో వాటిని సుతి మెత్తగా మార్చే ప్రయత్నించలేదు. పరిష్కారం దిశగా వేసే తొలి అడుగు సమస్యను గుర్తించడమే. నాటకీయతకు ప్రాధాన్యం ఇచ్చి వాస్తవాలను బలిపీఠంపైకి ఎక్కించేస్తుందని మీడియా అతి తరచుగా విమర్శలను ఎదుర్కొంటుంది. కానీ అది ఈ చే దు వాస్తవాల విస్తృతిని, లోతును అర్థం చేసుకున్నాయి. దినపత్రికలు మొదటి పేజీ బ్యానర్ హెడ్డింగులు పెట్టాయి. ఆలోచించదగిన ఈ పోలికను చూడండి. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఈ సర్వేపై పలు కథనాలను ప్రచురించిన రోజున లోపలిపేజీల్లో అది ‘‘భారతీయ టీనేజర్లలో పెరిగిపోయిన ఊబకాయం’’ అనే నివేదికను కూడా ప్రచురించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం గత ఐదేళ్ల కాలంలో స్థూలకాయులైన టీనేజర్లు 13% నుంచి 15%కి పెరిగింది. ఆ కథనంలోని ఈ రెండు వాక్యాలను చూడండి : ‘‘భారత పట్టణాల్లో 1.5 కోట్ల మంది పిల్లలు అధిక బరువుగలవారని అంచనా. అయితే గ్రామీణ భారతంలో ఇది బాగా తక్కువే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.’’ ఇదేంటిలా అని ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. పట్టణాల స్థాయిలో హామ్బర్గర్లను తినగలిగేటంత మిగులు ఆదాయం గ్రామీణ భారతం వద్ద లేదు, అంతే. పేదరికానికి జవాబు వాగాడంబరం కాదు, కావాల్సింది పరిష్కారం. కేంద్రం తలపెట్టిన మూడు పథకాలు ఆశలను రేకెత్తిస్తున్నాయి. భారీ ఎత్తున చేపట్టిన గృహనిర్మాణం, పట్టణ పునరుజ్జీవం, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు దేశంలోని పట్టణాల పటం రూపు రేఖలను మార్చడం కోసం మాత్రమే కాదు. అవి భారీ ఉపాధి కర్మాగారాలు కూడా. నిర్మాణ రంగం పేదలకు భారీ ఎత్తున ఉపాధిని కల్పించగలుతుంది. ఏడాదికి రూ.12 అతి తక్కువ ప్రీమియంతో బీమా పాలసీలు ఎక్కువగా అవసరమైన వారికే సహాయాన్ని అందించడం కోసం ఉద్దేశించిన సానుకూల ప్రభుత్వ జోక్యం. మరుగుదొడ్ల నిర్మాణ కృషి వంటి ఆత్మగౌరవ పథకాలు జీవన నాణ్యతలో తక్షణమే మార్పును తేగలిగినవి. మన ప్రభుత్వం ఉదాసీనంగా ఉండటం లేదా చొరబడిపోయేదిగా ఉండటం మాత్రమే ఎక్కువ. అది సమ్మిళితమైనదిగా మారాలి. గత ప్రభుత్వాలు పేదరికాన్ని సవాలు చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని ఎవరూ అనరు. అవి ఆ ప్రయత్నాలు చేశాయి. కాకపోతే ఆ తక్షణ ఆవశ్యకతను గుర్తించడంలో, స్థాయిలో తేడా ఉంది. పేదరికాన్ని తగ్గించడం, నిర్మూలించడం అనే లక్ష్యాల్లో తేడా ఉంది. ఆకలితో ఉన్నవారు బాగా ఎక్కువ కాలమే వేచి చూశారు, చాలు. కొద్దిమంది భారీ సంపన్నుల చేతుల్లో సంపద పోగుబడటం పెరిగిపోతుండటం ప్రజల అసంతృప్తిని కుతకుతలాడే ఆగ్రహమయ్యేలా వేడెక్కించేస్తోంది. నేటి పెద్దగా ఖర్చులేని కమ్యూనికేషన్ల కాలంలో అసమానతను, అన్యాయాన్ని కప్పిపుచ్చలేరు. చరిత్ర వేచి చూసే గదిలో పేదలు సుదీర్ఘంగానే నిరీక్షించారు. వారికిక ఉద్యోగాలు, విద్య, న్యాయం, గౌరవం కావాలి. లేదంటే వారి ఆగ్రహం పెల్లుబుకుతుంది. (వ్యాసకర్త: ఎంజే అక్బర్, సీనియర్ సంపాదకులు) -
విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.
-
విద్వేషాలు రెచ్చగొడుతున్న చంద్రబాబు
* ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏపీ సీఎం తీరుపై పాత్రికేయుల ఆగ్రహం * అర్ధరాత్రి టీ చానల్‌కు నోటీసులు ఇవ్వడంపై మండిపాటు * నోటీసులు ఉపసంహరించు కోవాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తున్నారని, తెలుగు ప్రజలమధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీనియర్ పాత్రికేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే శుక్రవారం అర్ధరాత్రి టీ న్యూస్ చానల్‌కు నోటీసులు ఇచ్చారని ధ్వజమెత్తారు. శనివారమిక్కడ టీ న్యూస్ చానల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న పలు చానళ్లకు చెందిన సీఈఓలు, పత్రికా ప్రతినిధులు, సీనియర్ పాత్రికేయులు, జర్నలిస్టు యూనియన్ నాయకులు చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రెస్‌అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం కావాలని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందని మండిపడ్డారు. ఈ కేసులో చంద్రబాబు అవినీతి బాగోతాలను బయటపెట్టిన టీ న్యూస్ చానల్‌కు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. వెంటనే నోటీసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ... తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసుకోవాలంటే ప్రజల్లోకి వెళ్లి మన్నన పొందాలే తప్ప ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే నేరస్తులు అవుతామనే చిన్న లాజిక్‌ను కూడా చంద్రబాబు తెలుసుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చర్యలను చూస్తుంటే దేశంలో మరోసారి ఎమర్జెన్సీ నిజంగానే వచ్చేలా కనిపిస్తోందన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు నేరం నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నందునే.. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ... నోటీసులు ఇచ్చిన తీరు, అంతకుముందు జరిగిన రాజకీయ ప్రకటనలు చూస్తే ఆధిపత్యంతో దాడిచేసి లొంగదీసుకోవడానికి చూసే పక్రియలా కనిపిస్తోందన్నారు. టేపులు బయటకు వచ్చి రెండు వారాలు గడుస్తున్నా అది తన గొంతో కాదో ఇప్పటివరకూ చెప్పకుండా ఓ మీడియా సంస్థకు నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. 6టీవీ సీఈవో శైలేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు టీ చానల్‌కు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు టంకశాల అశోక్, టీ న్యూస్ సీఈవో నారాయణరెడ్డి, గౌరీ శంకర్ (దక్కన్ క్రానికల్), ఆర్.రవికాంత్‌రెడ్డి (ద హిందూ), ఈశ్వర్‌రెడ్డి(ఆంధ్రభూమి) క్రాంతి కిరణ్ (జై తెలంగాణ), పల్లెరవికుమార్, విరాసత్ఆలీ తదితరులు పాల్గొన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళన: టీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్యలు తెలిపారు. -
సీనియర్ జర్నలిస్టు సీవీఆర్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు, రచయిత, ‘ఆంధ్రపత్రిక’ పూర్వ సంపాదకులు చండ్రుపట్ల వెంకట రాజగోపాలరావు(సీవీఆర్) బుధవారం తెల్లవారుజామున నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందారు. సీవీఆర్(83) హైదరాబాద్‌లోని అంబర్‌పేట డీడీకాలనీలో తన కుటుంబంతో కలసి నివసిస్తున్నారు. 1932 ఆగస్టు 12వ తేదీన తూర్పు గోదావరి జిల్లా ఇందుకూరుపేటలో ఆయన జన్మించారు. సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వర్లు, వరదాచారి, ఎం.వి.ఆర్ శాస్త్రి, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ సురేందర్ తదితరులు సీవీఆర్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అంబర్‌పేటలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరి గాయి. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, నాటి ‘కాంగ్రెస్’ పత్రిక సంపాదకులు చండ్రుపట్ల హనుమంతరావు కుమారుడు సీవీఆర్. టంగుటూరి ప్రకాశం పంతులు స్థాపించిన ‘ప్రజాపత్రిక’ ద్వారా సీవీఆర్ జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించారు. ‘ఆంధ్రపత్రిక’లో దాదాపు నాలుగు దశాబ్దాలపాటు కొనసాగి చివరకు ఎడిటర్‌గా పనిచేశారు. పలు పరిశోధనా గ్రంథాలు రచించారు. ‘ఆంధ్రపత్రిక చరిత్ర’ పుస్తకాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథంగా ప్రకటించింది. కాగా, సీవీఆర్ మృతిపట్ల సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆంధ్రపత్రికకు ఎడిటర్‌గా పనిచేసి తనదైన ముద్ర వేశారని కొనియాడారు. -
రుణ మాఫీ అమలుపై ‘బాబు’ మోసం
నేతల ఎన్నికల వాగ్దానాలకు చట్టబద్ధత అవసరం కాంగ్రెస్ సదస్సులో అభిప్రాయపడ్డ సీనియర్ జర్నలిస్టులు ‘ఓ ప్రభుత్వమా.. ప్రజల గోడు ఆలకించు’ పేరుతో సదస్సు సాక్షి, హైదరాబాద్: రుణ మాఫీ అమలు విధానంపై ప్రభుత్వ తీరు రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేసే విధంగా ఉన్నాయని సీనియర్ జర్నలిస్టులు పొత్తూరి వెంకటేశ్వరరావు, కె.శ్రీనివాసరెడ్డి, తెలకపల్లి రవిలు అభిప్రాయపడ్డారు. రాజకీయ నేతల హామీలతో ప్రజలు మోసపోకుండా ఎన్నికల వాగ్దానాలకు చట్ట బద్ధత ఉండాలన్నారు. రుణమాఫీ, ఆదర్శ రైతులను తొలగిం చడం, మంజూరైన ఎస్సీ, ఎస్టీ రుణాలు రద్దు, ఇసుక, రాజధాని కోసం భూములను లాక్కోవడం వంటి అంశాలపై బాధితులు తమ గోడు వెల్లడించేందుకు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సుందర య్య విజ్ఞాన కేంద్రంలో ‘ఓ ప్రభుత్వమా... ప్రజ లగోడు ఆలకించు’ అనే పేరుతో కార్యక్రమం నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు, కార్మికులు తమ బాధలు చెప్పుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెంది న శ్రీరాములు అనే రైతు మాట్లాడుతూ అప్పు కట్టొద్దంటూ చంద్రబాబు పదేపదే చెప్పడంతో తాను చెల్లించలేదని, దీంతో బ్యాంకర్లు వేలం వేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారని చెప్పారు. హుద్‌హుద్ తుపాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 50 వేలు ఇస్తామని రూ.5 వేలు మాత్రమే ఇస్తున్నారని విశాఖకు చెందిన శ్రీనివాస్ అనే బాధితుడు తెలిపారు. రాజధాని కోసం భూములను లాక్కొని ప్రభుత్వ పెద్దలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నారని వెంకటయ్య అనే రైతు ఆరోపించారు. తర్వాత సీని యర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇసుక విధానంలో మార్పులు చేసి పేదలకు న్యాయం చేయాలన్నారు. అరచేతిలో వైకుంఠం చూపేవిధంగా ప్రభుత్వ పాలన ఉంద ని, రాజధానిపై ఇప్పటికైనా దాగుడుమూతలు ఆపాలని తెలకపల్లి రవి సూచించారు. రాజధాని నిర్మాణంపై ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరమని, దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. -
కెరీర్ బయోగ్రఫీలో ఇంకా చెప్తాను!
సీనియర్ పాత్రికేయులు ఎబికె ప్రసాద్. ఒక తరం తెలుగు పత్రికలన్నింటిలోనూ ఆయన ముద్ర ఉంది. ఆయన వేసిన బీజాలతో మొలకెత్తిన మొక్కలు శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షాలయ్యాయి. విస్తృతమైన జీవితాన్ని, సమాజాన్ని చూసిన అనుభవం ఆయనది, అభ్యుదయ భావాల ఈ కలం వీరుడి అంతరంగ వీక్షణానికి ఓ ప్రయత్నం. కమ్యూనిస్టు పార్టీ కోసం, మార్క్సిస్టు పార్టీ పత్రిక ‘జనశక్తి’ని నడపడంలో 15 ఎకరాల పొలాన్ని కరిగించేశాను. పాత్రికేయులకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకున్నాను. తర్వాత ఆ ఇంటినీ అమ్మేసి ఆ డబ్బుతో నేను, నా భార్య సుధ ఇద్దరం హైదరాబాద్, కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్‌లో జీవిస్తున్నాం. ఎబికె ప్రసాద్ - అంతర్వీక్షణం మీరు పుట్టింది ఎప్పుడు? ఎక్కడ? 1935వ సంవత్సరం ఆగస్టు ఒకటవ తేదీన కృష్ణాజిల్లా ఉయ్యూరులో పుట్టాను. మీ సొంతూరు ఉయ్యూరా? అమ్మానాన్నలు... సొంతూరు కృష్ణాజిల్లా ఉప్పలూరు. మా మేనమామ చలసాని వాసుదేవరావు ఉయ్యూరు దగ్గర భట్ల పెనుమర్రులో ఉండేవారు. అమ్మ చంద్రావతమ్మ, నాన్న బుచ్చివీరయ్య. నాన్న నా ఐదవయేటనే పోయారు. నన్ను అమ్మ పెంచింది. మీరు ఏం చదివారు? ఎం.ఎ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిస్కంటిన్యూ చేశాను. ఎందుకలా?... నాగపూర్‌లో ఎం.ఎ చదువుతూ అక్కడ తెలుగువారు జరుపుకునే సాంస్కృతిక కార్యక్రమాలను ‘విశాలాంధ్ర’ పత్రికకు రిపోర్ట్ చేసేవాడిని. అలా ఫైనలియర్‌కి వచ్చేటప్పటికి నాకు కావలసింది ఈ కోర్సులో ఏమీ ఉండదనిపించి చదువు మానేసి ఉద్యోగంలో చేరాను. మీ తొలి ఉద్యోగం ఎక్కడ? విజయవాడలో, ‘విశాలాంధ్ర’ పత్రికలో. మీ పాత్రికేయ జీవితానికి ఎన్నేళ్లు? 1958లో విశాలాంధ్రలో సబ్ఎడిటర్గా చేరాను. అప్పటి నుంచి లెక్కిస్తే 56 ఏళ్లు. నా కలం మరో నాలుగేళ్లు పెద్దది. బి.ఎ రోజుల్నుంచి రాస్తున్నాను. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు? కమ్యూనిస్టు ఉద్యమాన్ని కళ్లారా చూశాను. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మా మేనమామ వాసుదేవరావు, మద్దుకూరి చంద్రశేఖరరావు, మాకినేని బసవపున్నయ్య లాంటి ప్రముఖుల చర్చలను ప్రత్యక్షంగా చూశాను. నన్ను వాళ్లు చాలా ప్రభావితం చేశారు. అప్పటి రాజకీయాలతో మీకు ప్రత్యక్ష సంబంధాలుండేవా? పునాదిపాడులో ఎనిమిది- తొమ్మిది తరగతులు చదువుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల పట్ల ఆకర్షితుణ్ణయ్యాను. కొద్దికాలానికే బయటికొచ్చేశాను. ఆర్ఎస్ఎస్ నచ్చలేదా? గాంధీజీ హత్యతో ఆర్ఎస్ఎస్ పట్ల విముఖత కలిగింది. గాంధీజీ హత్య మిమ్మల్ని తీవ్రంగా గాయపరచినట్లుంది! నిజమే. ఊరు ఊరంతా అట్టుడికిపోయింది. పెద్దవాళ్లందరూ గాంధీజీ దేశం కోసం జీవితాన్ని అర్పించడాన్ని చెప్పుకోవడం విని నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. సంపాదకులుగా ఎన్ని పత్రికలను నడిపించారు? ఆంధ్రపత్రిక, సాక్షిలో తప్ప తెలుగులో అన్ని పత్రికలకూ పనిచేశాను. ఈనాడు, ఉదయం, వార్త(విజయవాడ, వైజాగ్ ఎడిషన్లు) పత్రికలకు ప్రారంభ సంపాదకుడిని కూడా. వృత్తిపరమైన ఒడుదొడుకులు...! ‘జనశక్తి’ సంపాదకుడిగా నా మీద కేసులు ఫైలయ్యాయి. జైలుకెళ్లాను కూడ. జైలు జీవితం దుర్భరంగా అనిపించిందా? పుస్తకాలు చదువుకునే వాడికి జైలు దుర్భరంగా ఉండదు. కావలసినంత సమయం దొరికినట్లవుతుంది. అక్కడ జక్కా వెంకయ్య, డాక్టర్ శేషారెడ్డి వంటి పార్టీ సీనియర్ నాయకులతో అభిప్రాయాలు పంచుకునే అవకాశం వచ్చింది. వందలాది అంశాల మీద వేలాదిగా వ్యాసాలు రాసి ఉంటారు? తాజాగా ఏం రాస్తున్నారు? నా కెరీర్ బయోగ్రఫీ ఈ డిసెంబర్లో మొదలు పెడతాను. అందులో చాలా విషయాలను చెప్తాను. సంతోషం కలిగించే విషయం! అనేక పత్రికలకు ప్రారంభ సంపాదకుడిని కావడం. తరచూ పత్రికలు మారతారనే అపప్రథ కూడా ఉంది కదా! కొత్తగా పత్రిక పెట్టే వారికి నా సేవలు కావాలి. బండి పట్టాలెక్కిన తర్వాత నా ముక్కుసూటితనాన్ని భరించాల్సిన అవసరం వారికి ఉండకపోవచ్చు. రాజీ పడి ఉద్యోగం చేయడం నాకిష్టం లేదు. జీవితంలో రాజీ పడాల్సిన సందర్భం వచ్చిందా? రాజీ పడాల్సిన సందర్భాలు ఎవరికైనా సరే చాలానే వస్తాయి. రాజీ పడి ఉంటే పొలాలు, ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరమే వచ్చేది కాదు. ఉద్యోగాలు మారేవాడినీ కాదేమో. రాజీలేని జీవితంతో తృప్తి కలుగుతోందా? చాలా తృప్తిగా ఉన్నాను. తృప్తిని మించిన ఆస్తి లేదు. సంపాదకుడి ప్రతిభకు కొలమానం ఉంటుందా? ఉంటుంది. పత్రిక అమ్మకాలు పెరగడం, తగ్గడం- రెండూ సంపాదకుడి ప్రతిభకు గీటురాళ్లే. విమర్శలను ఎలా స్వీకరిస్తారు? కుత్సితాల లోయలోకి వెళ్లేకొద్దీ మనలోని నైపుణ్యాలు అణగారిపోతాయి. కుహనా విమర్శను అక్కడితోనే వదిలేయాలి. మనసులోంచి తుడిచేయాలి. అప్పుడే లక్ష్యాలను చేరగలం. మీరు నమ్మే సిద్ధాంతం? ఎన్ని అడ్డంకులు ఎదురైనా మానసికంగా దెబ్బతినకూడదు. ఎంచుకున్న బాటను వదల కూడదు. పాత్రికేయులకు మీరిచ్చే సందేశం? ప్రతి వాక్యాన్నీ బాధ్యతగా రాయాలి. ఆ సంస్థను వదిలి వెళ్లేటప్పుడు రాసిన చివరి వాక్యం కూడా ఉద్యోగంలో ఉన్నప్పుడు రాసినట్లే రాయాలి. రాసిన ప్రతి వాక్యానికీ బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉండాలి. - వాకా మంజులారెడ్డి -
సాక్షి టీవీ సీనియర్ జర్నలిస్ట్‌లకు అవార్డుల ప్రధానం
-
దీక్ష విరమించాలని జగన్ కు పొత్తూరి లేఖ