రుణ మాఫీ అమలుపై ‘బాబు’ మోసం
నేతల ఎన్నికల వాగ్దానాలకు చట్టబద్ధత అవసరం
కాంగ్రెస్ సదస్సులో అభిప్రాయపడ్డ సీనియర్ జర్నలిస్టులు
‘ఓ ప్రభుత్వమా.. ప్రజల గోడు ఆలకించు’ పేరుతో సదస్సు
సాక్షి, హైదరాబాద్: రుణ మాఫీ అమలు విధానంపై ప్రభుత్వ తీరు రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేసే విధంగా ఉన్నాయని సీనియర్ జర్నలిస్టులు పొత్తూరి వెంకటేశ్వరరావు, కె.శ్రీనివాసరెడ్డి, తెలకపల్లి రవిలు అభిప్రాయపడ్డారు. రాజకీయ నేతల హామీలతో ప్రజలు మోసపోకుండా ఎన్నికల వాగ్దానాలకు చట్ట బద్ధత ఉండాలన్నారు. రుణమాఫీ, ఆదర్శ రైతులను తొలగిం చడం, మంజూరైన ఎస్సీ, ఎస్టీ రుణాలు రద్దు, ఇసుక, రాజధాని కోసం భూములను లాక్కోవడం వంటి అంశాలపై బాధితులు తమ గోడు వెల్లడించేందుకు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సుందర య్య విజ్ఞాన కేంద్రంలో ‘ఓ ప్రభుత్వమా... ప్రజ లగోడు ఆలకించు’ అనే పేరుతో కార్యక్రమం నిర్వహించారు.
వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు, కార్మికులు తమ బాధలు చెప్పుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెంది న శ్రీరాములు అనే రైతు మాట్లాడుతూ అప్పు కట్టొద్దంటూ చంద్రబాబు పదేపదే చెప్పడంతో తాను చెల్లించలేదని, దీంతో బ్యాంకర్లు వేలం వేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారని చెప్పారు. హుద్‌హుద్ తుపాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 50 వేలు ఇస్తామని రూ.5 వేలు మాత్రమే ఇస్తున్నారని విశాఖకు చెందిన శ్రీనివాస్ అనే బాధితుడు తెలిపారు. రాజధాని కోసం భూములను లాక్కొని ప్రభుత్వ పెద్దలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నారని వెంకటయ్య అనే రైతు ఆరోపించారు. తర్వాత సీని యర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇసుక విధానంలో మార్పులు చేసి పేదలకు న్యాయం చేయాలన్నారు. అరచేతిలో వైకుంఠం చూపేవిధంగా ప్రభుత్వ పాలన ఉంద ని, రాజధానిపై ఇప్పటికైనా దాగుడుమూతలు ఆపాలని తెలకపల్లి రవి సూచించారు. రాజధాని నిర్మాణంపై ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరమని, దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.