K. Srinivasa Reddy
-
ప్రెస్‌క్లబ్ ఉత్సవాలకు టీయూడబ్ల్యూజే దూరం
జర్నలిస్టుల ఐక్యతను దెబ్బతీసే విధంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గంలో ఉన్న కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని.. ఈ తీరును జీర్జించుకోలేక ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాలకు దూరంగా ఉంటున్నట్లు టీయూడబ్ల్యూ జే నేతలు తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడిన ఐజేయూ నేతలు కే.శ్రీనివాస్ రెడ్డి, దేవుల పల్లి అమర్ బషీర్ బాగ్ లో ఉన్న ప్రెస్ క్లబ్ కు సోమాజీ గూడలో ఉన్న ప్రభుత్వ భవనాన్ని కేటాయిస్తూ.. 1995లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారని.. యూనియన్ వారసత్వంగా ఉన్న ప్రెస్ క్లబ్ రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన టీయూడబ్ల్యూ జేకి అనుబంధంగానే కొనసాగాల్సి ఉంటుందని అన్నారు. కార్యవర్గంలోని కొందరు వ్యక్తులు జర్నలిస్టుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చట్టబద్దంగా ప్రెస్ క్లబ్ కు సంక్రమించిన అధికారాలను కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రెస్‌క్లబ్ పాలకమండలి పదవీకాలం ముగియగా, స్వర్ణోత్సవాల పేరుతో మూడు రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారన్నారు. 50 సంవత్సరాలు ప్రెస్‌క్లబ్‌ను తీర్చిదిద్దిన వారిని కనీసం సంప్రదించకుండా, ప్రెస్‌క్లబ్‌కు మాతృసంస్థగా ఉన్న యూనియన్ నేతలను పరిగణలోకి తీసుకోకుండా స్వర్ణోత్సవాలు ఎలా జరుపుతారని ప్రశ్నించారు. 1965 మే 25న ఏర్పాటైన ప్రెస్‌క్లబ్‌కు ఆరునెలల తరువాత స్వర్ణోత్సవాలు నిర్వహించ డాన్ని తప్పుపట్టారు. ఈ సమావేశంలో ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు అమరనాథ్, ఐజేయూ కార్యదర్శి నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యుజె ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, హెచ్‌యూజే అధ్యక్షుడు కోటిరెడ్డి పాల్గొన్నారు. -
ప్రెస్‌క్లబ్ ఉత్సవాలకు టీయూడబ్ల్యూజే దూరం
-
రుణ మాఫీ అమలుపై ‘బాబు’ మోసం
నేతల ఎన్నికల వాగ్దానాలకు చట్టబద్ధత అవసరం కాంగ్రెస్ సదస్సులో అభిప్రాయపడ్డ సీనియర్ జర్నలిస్టులు ‘ఓ ప్రభుత్వమా.. ప్రజల గోడు ఆలకించు’ పేరుతో సదస్సు సాక్షి, హైదరాబాద్: రుణ మాఫీ అమలు విధానంపై ప్రభుత్వ తీరు రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేసే విధంగా ఉన్నాయని సీనియర్ జర్నలిస్టులు పొత్తూరి వెంకటేశ్వరరావు, కె.శ్రీనివాసరెడ్డి, తెలకపల్లి రవిలు అభిప్రాయపడ్డారు. రాజకీయ నేతల హామీలతో ప్రజలు మోసపోకుండా ఎన్నికల వాగ్దానాలకు చట్ట బద్ధత ఉండాలన్నారు. రుణమాఫీ, ఆదర్శ రైతులను తొలగిం చడం, మంజూరైన ఎస్సీ, ఎస్టీ రుణాలు రద్దు, ఇసుక, రాజధాని కోసం భూములను లాక్కోవడం వంటి అంశాలపై బాధితులు తమ గోడు వెల్లడించేందుకు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సుందర య్య విజ్ఞాన కేంద్రంలో ‘ఓ ప్రభుత్వమా... ప్రజ లగోడు ఆలకించు’ అనే పేరుతో కార్యక్రమం నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు, కార్మికులు తమ బాధలు చెప్పుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెంది న శ్రీరాములు అనే రైతు మాట్లాడుతూ అప్పు కట్టొద్దంటూ చంద్రబాబు పదేపదే చెప్పడంతో తాను చెల్లించలేదని, దీంతో బ్యాంకర్లు వేలం వేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారని చెప్పారు. హుద్‌హుద్ తుపాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 50 వేలు ఇస్తామని రూ.5 వేలు మాత్రమే ఇస్తున్నారని విశాఖకు చెందిన శ్రీనివాస్ అనే బాధితుడు తెలిపారు. రాజధాని కోసం భూములను లాక్కొని ప్రభుత్వ పెద్దలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నారని వెంకటయ్య అనే రైతు ఆరోపించారు. తర్వాత సీని యర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇసుక విధానంలో మార్పులు చేసి పేదలకు న్యాయం చేయాలన్నారు. అరచేతిలో వైకుంఠం చూపేవిధంగా ప్రభుత్వ పాలన ఉంద ని, రాజధానిపై ఇప్పటికైనా దాగుడుమూతలు ఆపాలని తెలకపల్లి రవి సూచించారు. రాజధాని నిర్మాణంపై ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరమని, దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. -
లగడపాటి తీరును ఖండించిన జర్నలిస్ట్ సంఘాలు
హైదరాబాద్: మీడియా ప్రతినిధుల పట్ల విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యవహరించిన తీరును జర్నలిస్టు సంఘాలు, నాయకులు ఖండించారు. పాత్రికేయులపై లగడపాటి వాడిన పదజాలం సముచితం కాదని సీనియర్ జర్నలిస్ట్ కె.శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన చాలా పరుషంగా మాట్లాడారని పేర్కొన్నారు. లగడపాటి వాడిన పదజాలంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. లగడపాటి అనుచిత పశ్చిమగోదావరి ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు కె. మాణిక్యరావు, ప్రధాన కార్యదర్శి వినాయకరావు వ్యాఖ్యలను ఖండించారు. నోరు జారి మాట్లాడిన లగడపాటి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లగడపాటి వ్యాఖ్యలను నిరసిస్తూ రేపు మెదక్ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.