
సాక్షి, విజయవాడ: చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పెగాసస్‌ను ఉపయోగించారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ, తమ ఫోన్లను ట్యాప్ చేశారని, ఈ విషయాన్ని గత ఎన్నికల సమయంలోనే చెప్పామన్నారు. అది ఇప్పుడు నిజమని తేలిపోయిందన్నారు.
చదవండి: పెగాసస్‌పై టీడీపీ ఎందుకు కంగారుపడుతోంది: అంబటి రాంబాబు
చంద్రబాబుపై సీబీఐ విచారణ చేయాలని, కేంద్రాని కూడా కోరతామని తెలిపారు. ప్రజా క్షేత్రంలో నిలబడలేక చంద్రబాబు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారన్నారు. చంద్రబాబు నిజాయితీ పరుడైతే విచారణ జరపమని ఆయనే డిమాండ్ చేయాలన్నారు. పెగాసస్‌ను ఉపయోగించడం ద్వారా రాష్ట్రానికే కాదు. దేశ రక్షణకు విఘాతం కలిగించారన్నారు. చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి వెల్లంపల్లి డిమాండ్ చేశారు.