
తాడేపల్లి: పెగాసస్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేస్తే టీడీపీకి భయమెందుకని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. ‘తప్పు చేశాం.. ప్రాయశ్చిత్తం చేసుకుందాం’ అని కూడా టీడీపీకి లేదని కన్నబాబు విమర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడిన కన్నబాబు పెగాసస్ వ్యవహారంపై కమిటీ వేయడం శుభపరిణామం అని అన్నారు.
కాగా, పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం మాట్లాడుతూ.. పెగాసస్‌పై హౌస్‌కమిటీ వేస్తున్నామని ప్రకటించారు. ఈ వ్యవహారంపై విచారణ హౌస్ కమిటీ విచారణ చేపడుతుందని తెలిపారు. దీనికీ సంబంధించి కమిటీ సభ్యులను రేపు(మంగళవారం) కానీ, ఎల్లుండి(బుధవారం)కానీ ప్రకటిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో గత చంద్రబాబు ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ కోసం రూ.25 కోట్లతో ఇజ్రాయెల్ నుంచి పెగసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందనేది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారం కలకలం సృష్టిస్తుండగా, దీనిపై హౌస్ కమిటీ వేస్తున్నట్లు ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని అసెంబ్లీలో ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment