ట్యాపింగ్‌ దుమారం : మీకూ ఇలా అవుతోందా? చెక్‌ చేసుకోండి! | How to check if your phone is hacked or is being spied upon? | Sakshi
Sakshi News home page

ట్యాపింగ్‌ దుమారం : మీకూ ఇలా అవుతోందా? చెక్‌ చేసుకోండి!

Published Mon, Apr 1 2024 11:53 AM | Last Updated on Mon, Apr 1 2024 12:53 PM

How to check that your phone has been hacked or is being spied upon - Sakshi

రాను రాను ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. 2024లో ఫోన్ హ్యాకింగ్ అనేది దాదాపు ప్రతి వినియోగదారుని ఆందోళన రేపుతోంది. డెలాయిట్ నిర్వహించిన  ఇటీవలి సర్వేలో 67శాతం మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ గాడ్జెట్స్‌ భద్రతపై ఆందోళన చెందుతున్నారని  కనుగొన్నారు.  2023 ఏడాదితో ఇది పోలిస్తే  54 శాతం పెరిగింది. 

మొన్నపెగాసెస్‌ వివాదం ప్రకంపనలు రేపింది. ప్రస్తుతం తెలంగాణాలో ఫోన్‌ ట్యాపింగ్‌ దుమారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇది వినియోగదారుల వ్యక్తిగత వ్యవహారాల గోప్యత, భద్రతపై గుబులు రేపుతోంది.  ఈ నేపథ్యలో  ఫోన్ హ్యాక్ అయిందని గుర్తించాలి?   ముఖ్యంగా అమ్మాయిలు,మహిళలు ఈ విషయంలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 

మీ ఫోన్ ఎవరైనా ట్యాపింగ్ చేస్తున్నారన్న విషయాన్ని ఎలా గుర్తించాలి?  
కాల్స్ మాట్లాడుతున్న సమయంలో అసాధారణ శబ్దాలు, అస్పష్టంగా దూరంనుంచి శబ్దాలు రావడం
కెమెరా, మైక్రోఫోన్‌లు యాదృచ్ఛికంగా ఆన్‌  కావడం. ఐఫోన్‌, శాంసంగ్‌ ఫోన్లలో అయితే  స్క్రీన్ పైభాగంలో నారింజ లేదా ఆకుపచ్చ  లైట్‌ వెలుగుతుంది.
⇒ ఉన్నట్టుండి ఫోన్‌ బ్యాటరీ చార్జింగ్‌ తగ్గిపోవడం,బ్యాటరీ కండిషన్ సరిగ్గానే ఉన్నా, పెద్దగా యాప్స్‌ అవీ వాడపోయినా, తరచుగా ఛార్జ్ చేస్తున్నా కూడా  వేగంగా అయి పోతుంటే మాత్రం  అప్రమత్తం కావాలి.
⇒ ఫోన్ షట్ డౌన్ కావడానికి చాలా సమయం పడుతోందా? ముఖ్యంగా  షట్ డౌన్ కావడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకుంటే, ప్రత్యేకించి కాల్, టెక్స్ట్, ఇమెయిల్ లేదా వెబ్ బ్రౌజింగ్ తర్వాత  ఇలా జరుగుతోంటే. థర్ట్‌ పార్టీకి మన డేటాను ట్రాన్స్‌మిట్అవుతోందా అని అనుమానించాలి.
⇒ మొబైల్ స్పైవేర్  ఫోన్‌ని నిరంతరం  ట్రాక్‌ చేస్తూ, డేటాను  ఎక్కువ వాడుకుంటుంది.ఫోన్‌ చార్జింగ్‌లో లేకపోయినా, ఎక్కువ మాట్లాడకపోయినా ఉన్నట్టుండి ఫోన్ వేగంగా వేడెక్కుతోందా? ఇది గమనించాల్సిన అంశమే.  మామూలుగా ఉన్నపుడు కూడా ఫోన్‌ విపరీతంగా వేడెక్కడం కూడా ఒక సంకేతం. సాధారణంగా గేమింగ్ లేదా సినిమాలు చూసినప్పుడు సాధారణంగా ఫోన్లు వేడెక్కుతుంటాయి. హ్యాకర్లు మన ఫోన్‌ టార్గెట్‌ చేశారా  అని చెక్‌ చేసుకోవాల్సిందే.
⇒ సైలెంట్ మోడ్‌లో ఉన్నప్పటికీ కాల్‌లు, నోటిఫికేషన్స్‌ స్వీకరిస్తూ, ఆకస్మికంగా రీబూట్ అవుతున్నా రిమోట్ యాక్సెస్‌ అయిందనడానికి సూచిక కావచ్చు.  జాగ్రత్త పడాలి.
⇒ స్మార్ట్‌ఫోన్ అకస్మాత్తుగా స్లో  కావడం. యాప్‌లను ఇన్‌స్టాల్ చేశారో  ట్రాక్‌ చేసి, మీరు ఇన్‌స్టాల్‌ చేయని యాప్‌లు కూడా కనిపిస్తే..అది హ్యాకింగ్‌కు సంకేతం కావచ్చు.
⇒ ఫోన్ తరచుగా సడన్ రీబూట్‌లు, షట్‌డౌన్‌,  లేదా  రీస్టార్ట్ అవుతూ ఉండవచ్చు. స్క్రీన్ లైట్‌లో మార్పులు కనిపిస్తే ఏదైనా మాల్వేర్ ఎఫెక్ట్ అయి ఉండవచ్చు.

జాగ్రత్తలు 
ఈ జాగ్రత్తలను పాటిస్తూ మొబైల్ భద్రతకోసం విశ్వసనీయ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. అనుమానాస్పద లింక్‌లు, మెసేజ్‌లకు స్పందించకుండా ఉండటం ఉత్తమం.

ముఖ్యంగా ట్యాప్‌ అయిందో లేదో  తెలుసుకోవాలంటే.. *#*#4636#*#* – ఈ కోడ్‌ని డయల్ చేయండి. మీ ఫోన్‌ ట్రాక్ అవుతోందా,  లేదా ట్యాప్  అవుతోంది తెలియ చెప్పే  కోడ్ (నెట్‌మోనిటర్) కోడ్.  ఫోన్ ఆపరేటింగ్ సిస్టంను బట్టి ఈ కోడ్‌ను డయల్ చేయాల్సి ఉంటుంది. Android యూజర్లు  *#*#197328640#*#* లేదా *#*#4636#*#* ని డయల్‌  చేయాలి.  iPhone యూజర్లు అయితే: *3001#12345#* ని డయల్‌ చేయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement