phone tapping row
-
ట్యాపింగ్ దుమారం : మీకూ ఇలా అవుతోందా? చెక్ చేసుకోండి!
రాను రాను ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. 2024లో ఫోన్ హ్యాకింగ్ అనేది దాదాపు ప్రతి వినియోగదారుని ఆందోళన రేపుతోంది. డెలాయిట్ నిర్వహించిన ఇటీవలి సర్వేలో 67శాతం మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ గాడ్జెట్స్ భద్రతపై ఆందోళన చెందుతున్నారని కనుగొన్నారు. 2023 ఏడాదితో ఇది పోలిస్తే 54 శాతం పెరిగింది. మొన్నపెగాసెస్ వివాదం ప్రకంపనలు రేపింది. ప్రస్తుతం తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ దుమారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇది వినియోగదారుల వ్యక్తిగత వ్యవహారాల గోప్యత, భద్రతపై గుబులు రేపుతోంది. ఈ నేపథ్యలో ఫోన్ హ్యాక్ అయిందని గుర్తించాలి? ముఖ్యంగా అమ్మాయిలు,మహిళలు ఈ విషయంలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ ఫోన్ ఎవరైనా ట్యాపింగ్ చేస్తున్నారన్న విషయాన్ని ఎలా గుర్తించాలి? ⇒ కాల్స్ మాట్లాడుతున్న సమయంలో అసాధారణ శబ్దాలు, అస్పష్టంగా దూరంనుంచి శబ్దాలు రావడం కెమెరా, మైక్రోఫోన్లు యాదృచ్ఛికంగా ఆన్ కావడం. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లలో అయితే స్క్రీన్ పైభాగంలో నారింజ లేదా ఆకుపచ్చ లైట్ వెలుగుతుంది. ⇒ ఉన్నట్టుండి ఫోన్ బ్యాటరీ చార్జింగ్ తగ్గిపోవడం,బ్యాటరీ కండిషన్ సరిగ్గానే ఉన్నా, పెద్దగా యాప్స్ అవీ వాడపోయినా, తరచుగా ఛార్జ్ చేస్తున్నా కూడా వేగంగా అయి పోతుంటే మాత్రం అప్రమత్తం కావాలి. ⇒ ఫోన్ షట్ డౌన్ కావడానికి చాలా సమయం పడుతోందా? ముఖ్యంగా షట్ డౌన్ కావడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకుంటే, ప్రత్యేకించి కాల్, టెక్స్ట్, ఇమెయిల్ లేదా వెబ్ బ్రౌజింగ్ తర్వాత ఇలా జరుగుతోంటే. థర్ట్ పార్టీకి మన డేటాను ట్రాన్స్మిట్అవుతోందా అని అనుమానించాలి. ⇒ మొబైల్ స్పైవేర్ ఫోన్‌ని నిరంతరం ట్రాక్ చేస్తూ, డేటాను ఎక్కువ వాడుకుంటుంది.ఫోన్ చార్జింగ్‌లో లేకపోయినా, ఎక్కువ మాట్లాడకపోయినా ఉన్నట్టుండి ఫోన్ వేగంగా వేడెక్కుతోందా? ఇది గమనించాల్సిన అంశమే. మామూలుగా ఉన్నపుడు కూడా ఫోన్ విపరీతంగా వేడెక్కడం కూడా ఒక సంకేతం. సాధారణంగా గేమింగ్ లేదా సినిమాలు చూసినప్పుడు సాధారణంగా ఫోన్లు వేడెక్కుతుంటాయి. హ్యాకర్లు మన ఫోన్ టార్గెట్ చేశారా అని చెక్ చేసుకోవాల్సిందే. ⇒ సైలెంట్ మోడ్‌లో ఉన్నప్పటికీ కాల్లు, నోటిఫికేషన్స్ స్వీకరిస్తూ, ఆకస్మికంగా రీబూట్ అవుతున్నా రిమోట్ యాక్సెస్ అయిందనడానికి సూచిక కావచ్చు. జాగ్రత్త పడాలి. ⇒ స్మార్ట్‌ఫోన్ అకస్మాత్తుగా స్లో కావడం. యాప్‌లను ఇన్స్టాల్ చేశారో ట్రాక్ చేసి, మీరు ఇన్స్టాల్ చేయని యాప్‌లు కూడా కనిపిస్తే..అది హ్యాకింగ్‌కు సంకేతం కావచ్చు. ⇒ ఫోన్ తరచుగా సడన్ రీబూట్లు, షట్‌డౌన్, లేదా రీస్టార్ట్ అవుతూ ఉండవచ్చు. స్క్రీన్ లైట్లో మార్పులు కనిపిస్తే ఏదైనా మాల్వేర్ ఎఫెక్ట్ అయి ఉండవచ్చు. జాగ్రత్తలు ఈ జాగ్రత్తలను పాటిస్తూ మొబైల్ భద్రతకోసం విశ్వసనీయ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసుకోండి. అనుమానాస్పద లింక్‌లు, మెసేజ్‌లకు స్పందించకుండా ఉండటం ఉత్తమం. ముఖ్యంగా ట్యాప్ అయిందో లేదో తెలుసుకోవాలంటే.. *#*#4636#*#* – ఈ కోడ్‌ని డయల్ చేయండి. మీ ఫోన్ ట్రాక్ అవుతోందా, లేదా ట్యాప్ అవుతోంది తెలియ చెప్పే కోడ్ (నెట్మోనిటర్) కోడ్. ఫోన్ ఆపరేటింగ్ సిస్టంను బట్టి ఈ కోడ్‌ను డయల్ చేయాల్సి ఉంటుంది. Android యూజర్లు *#*#197328640#*#* లేదా *#*#4636#*#* ని డయల్ చేయాలి. iPhone యూజర్లు అయితే: *3001#12345#* ని డయల్ చేయాలి. -
'సీఎం జగన్‌కు నమ్మకం తప్ప అనుమానాలు లేవు'
తాడేపల్లి: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలను మాజీ మంత్రి కొడాలి నాని తిప్పికొట్టారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. ఆ పని చేయడం చంద్రబాబుకే అలవాటు అని పేర్కొన్నారు. సీఎం జగన్ వల్లే తనకు పదవి వచ్చిందని కోటంరెడ్డి అనేక సార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈయనకు చంద్రబాబు మంత్రి పదవి ఆఫర్ చేసినట్టున్నారని, పార్టీ మారాలనుకున్నాడు కాబట్టే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి ఇలాంటి వారు పోతేనే మంచిదని చెప్పారు. సీఎం జగన్ బలహీన వర్గాలకు పదవులు ఇస్తున్నారని కొడాలి చెప్పారు. బలమైన వర్గాలకు పదవులిస్తే బలహీన వర్గాలు ఏమై పోవాలని ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్‌కు అబద్దాలు చెప్పడం చేతకాదని, ఏదైనా ముక్కుసూటిగా చెబుతారుని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్‌ను ఏం చేయలేకపోయారని, ఇప్పుడు ఏం చేయగలరని ప్రశ్నించారు. 'ఐఫోన్ నుంచి ఐఫోన్ రికార్డు కాదని ఎవరు చెప్పారు? మాకందిన సమాచారం పోలీసులతో పంచుకోవడం సహజమే ఇంటెలిజెన్స్ డీజీ కూడా ప్రభుత్వంలో భాగమే. డీజీ ఎమ్మెల్యేలకు మెసేజ్‌లు పెట్టకూడదా? సీఎం జగన్‌కు నమ్మకం తప్ప అనుమానాలు లేవు. ఆయన బీ ఫారం ఇస్తానంటే.. నెల్లూరు నుంచి జనం క్యూ కడతారు.' అని కొడాలి పేర్కొన్నారు. పేర్ని నాని రియాక్షన్.. మాజీ మంత్రి పేర్ని నాని కూడా కోటంరెడ్డి ఆరోపణలపై స్పందించారు. ప్రతి ఫోన్లో రికార్డింగ్ యాప్ ఉంటుందన్నారు. ప్రతి కాల్ రికార్డు చేసి సర్క్యూలేట్ చేయవచ్చని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే మూడు నెలల కిందే చెప్పొచ్చు కదా? అని ప్రశ్నించారు. సానుభూతి కోసమే కోటంరెడ్డి ఇదంతా చేస్తున్నాడని విమర్శించారు. 'ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. వెళ్లిపోవడానికి నిర్ణయించుకుని ప్రభుత్వంపై బురద వేస్తున్నావా? ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్ప ఇంకే పని ఉండదా? మేం ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్‌ను కొనలేదు. జగన్ పార్టీ పెట్టకపోతే ఇంతమంది ఎమ్మెల్యేలు అయ్యేవారా?' అని పేర్ని వ్యాఖ్యానించారు. చదవండి: 'కోటంరెడ్డి బ్రదర్స్ తినే ప్రతి మెతుకు సీఎం జగన్ పెట్టిన భిక్షే' -
'కోటంరెడ్డి బ్రదర్స్ తినే ప్రతి మెతుకు సీఎం జగన్ పెట్టిన భిక్షే'
నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆనం విజయ్‌కుమార్ రెడ్డి. జిల్లాలో అనవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. అధిష్టానం గుర్తిస్తేనే ఎవరైనా ఎమ్మెల్యే కాగలరని పేర్కొన్నారు. కోటంరెడ్డి పార్టీలో గుర్తింపు లేదనడం భావ్యం కాదన్నారు. పార్టీ నుంచి వెళ్లాలని కోటంరెడ్డికి ఎవరూ చెప్పలేదని విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. నెల జీతాలిచ్చి రౌడీషీటర్లను పెట్టుకొని దందాలు చేసిన వ్యక్తి ఆయన అని వ్యాఖ్యానించారు. హింసా రాజకీయాలు చేసి నీచ సంస్కృతికి తెరలేపారని ధ్వజమెత్తారు. కోటంరెడ్డి సోదరులు రాక్షసులుగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. కౌన్సిలర్ స్థాయి కూడా లేని కోటంరెడ్డిని సీఎం జగన్ ఎమ్మెల్యేని చేశారని విజయ్‌కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కోటంరెడ్డి బ్రదర్స్ తినే ప్రతి మెతుకు సీఎం జగన్ పెట్టిన భిక్షే అన్నారు. టీడీపీతో కుమ్మక్కై అన్నం పెట్టిన పార్టీపై అభాండాలు మోపుతారా అని ప్రశ్నించారు. తన సోదరుడు ఆనం రామనారాయణరెడ్డి కూడా ఏం తక్కువై పార్టీకి దూరమయ్యారో తెలియడం లేదని విజయ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ తమ కుటుంబానికి అండగా నిలిచారని గుర్తు చేశారు. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారికైనా చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. రామనారాయణరెడ్డి తమ్ముడిగా కాకుండా సీఎం జగన్ మనిషిగా ఉంటానని పేర్కొన్నారు. చదవండి: ఇంకేం చర్యలు తీసుకుంటాం.. కోటంరెడ్డి వ్యవహారంపై స్పందించిన సజ్జల -
‘ఓటర్లను ప్రభావితం చేసేందుకు మునుగోడులో ఫోన్ల ట్యాపింగ్’
సాక్షి, న్యూఢిల్లి: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో పార్టీలు పోటాపోటీగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర ఇంఛార్జి తరుణ్‌చుగ్. ఫోన్ల ట్యాపింగ్ సహా నగదు లావాదేవీల ఆరోపణలపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ‘తెలంగాణలో బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. మునుగోడు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నగదు లావాదేవీలపై విష ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ కోసం ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రచారం చేస్తున్నాయి.’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు తరుణ్‌చుగ్. ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి -
విజయవాడ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు స్టే
-
విజయవాడ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు స్టే
ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ సరికొత్త మలుపు తిరిగింది. ఫోన్ ట్యాపింగ్ రికార్డులను తమకు ఇవ్వాలని అడిగే హక్కు విజయవాడ కోర్టుకు లేదంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ 4 వారాలకు వాయిదా పడింది. కాగా, ఈ విషయంలో ఇంతకుముందు విజయవాడ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. కాగా, ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కాల్ డేటాను హైకోర్టు రిజిస్ట్రార్‌కు అందించాలని కోర్టు ఆదేశించింది. సర్వీస్ ప్రొవైడర్లు తమ కాల్ డేటా వివరాలను సీల్డ్ కవర్లో విజయవాడ కోర్టుకు సమర్పించాలని, ఆ సీల్డ్ కవర్‌ను హైకోర్టు రిజిస్ట్రార్‌కు యథాతథంగా అందజేయాలని తెలిపింది.