సాక్షి, న్యూఢిల్లి: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో పార్టీలు పోటాపోటీగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర ఇంఛార్జి తరుణ్‌చుగ్. ఫోన్ల ట్యాపింగ్ సహా నగదు లావాదేవీల ఆరోపణలపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
‘తెలంగాణలో బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. మునుగోడు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నగదు లావాదేవీలపై విష ప్రచారం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ కోసం ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రచారం చేస్తున్నాయి.’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు తరుణ్‌చుగ్.
ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి
Comments
Please login to add a commentAdd a comment