సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాల దృష్ట్యా.. ఉప ఎన్నికలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్‌ను కోరారు మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు. మునుగోడు ఉప ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాల పేరిట మూడు పేజీల వినతిపత్రాన్ని ఆయన్ని కేంద్ర ఎన్నికల కమీషన్‌కు, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి పంపారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘానికి.. ఎన్నికలు రద్దు చేసే విస్తృత అధికారం ఉందని ఆయన గుర్తు చేశారు. గతంలో ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు పంపిణి, అధికార దుర్వినియోగం, ఇతర అక్రమాలు చోటు చేసుకున్నప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను సైతం తన వినతిపత్రంలో ప్రస్తావించారు.
భారతదేశ చరిత్రలోనే అతి ఖరీదైన ఉప ఎన్నికగా మునగోడు నిలవనుంది. మునుగోడులో ఒక్క అక్టోబర్ నెలలోనే దాదాపు 132 కోట్ల రూపాయల విలువైన మద్యం ఏరులై పారింది. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీ అక్రమాలకు.. ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిఓటర్‌కు రూ.20 వేల రూపాయల డబ్బు, మహిళలకు ఒక గ్రాము బంగారం ఇవ్వడానికి పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి అని గోనె ప్రకాష్‌రావు ఆరోపించారు. మునుగోడులో జరుగుతున్న అక్రమాలు, డబ్బు, మందు పంపిణీ కట్టడి చేసి.. ఎన్నికలు రద్దు చేయకపోతే ప్రజాస్వామ్యంపైనే ప్రజలకు నమ్మకం పోతుందన్నారు ఆయన.
ఇదీ చదవండి: టీఆర్‌ఎస్‌పై కిషన్‌రెడ్డి కౌంటర్ ఎటాక్
Comments
Please login to add a commentAdd a comment