Gone Prakash Rao
-
రామోజీరావు కబ్జాలపై చర్యలేవీ?
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): రాష్ట్రంలో కొందరు కబ్జాదారులపై మాత్రమే చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందని.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎలాంటి రాగద్వేషాలకు పోకుండా కబ్జాదారులందరిపైనా చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు కోరారు. రేవంత్ సర్కారు హెచ్ఎండీఏ పరిధిలోని భూముల కబ్జాదారులపై చర్యలు చేపట్టడాన్ని అభినందిస్తున్నట్టు చెప్పారు. ఫిలింసిటీ పేరుతో ప్రభుత్వ రోడ్డును, పేదల భూములను ఆక్రమించిన రామోజీరావుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేటలోని 920 ఎకరాల భూకబ్జాపై కూడా సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ భూకబ్జా వెనుక మాజీ మంత్రుల హస్తం ఉందని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్లో గోనె ప్రకాశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణి కమిటీ ద్వారా వాస్తవాలను తేల్చి భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ మంత్రుల సహకారంతో భూకబ్జా.. బొమ్మరాసిపేట గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 323 నుంచి 409 వరకు 1,049 ఎకరాల భూమి ఉందని.. అందులో కొందరు రైతు సంఘం ముసుగులో 920 ఎకరాల భూమిని కబ్జా చేశారని గోనె ప్రకాశ్‌రావు ఆరోపించారు. 1965లో మీర్ రెహమత్ అలీతోపాటు మరో ఆరుగురి నుంచి మాజీ ఎంపీ దుగ్గిరాల బలరామకృష్ణ ఈ భూమి ని కొనుగోలు చేశారని.. ఆయన వారసులైన దుగ్గిరాల అమరేందర్బాబుతోపాటు మరో 20 మంది పేరిట ఆ భూమి రిజిస్టర్ అయిందని తెలిపారు. ఈ భూమి హక్కుదారులు విదేశాలలో స్థిరపడటంతో కొందరు దానిపై కన్నేశారని.. నకిలీ పత్రాలను సృష్టించి మాజీ మంత్రుల సహకారంతో కబ్జాకు పాల్పడ్డారన్నారు. రైతు సంఘం నేతలు ధర్నాలు చేస్తూ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ కూడా భూకబ్జాదారులకు వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. ఈ భూముల విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయాలని.. జిల్లా కలెక్టర్ ద్వారా పూర్తి వివరాలు సేకరించి, అసలైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. ఈ వ్యవహారంపై త్వరలో సీఎం రేవంత్‌ను కలుస్తానని చెప్పారు. -
వైఎస్ఆర్ ఇచ్చిన భూములు తిరిగిచ్చేయ్...రామోజీకి డెడ్ లైన్..
-
ప్రభుత్వ రహదారిని రామోజీ ఫిలింసిటీ కింద ఆక్రమించారు
-
రామోజీకి గోనె ప్రకాశరావు బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: సమాజానికి మార్గదర్శకులు అని మీకు మీరే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దంటూ రామోజీకి గోనె ప్రకాశరావు బహిరంగ లేఖ రాశారు. మీ నిత్య జీవితంలో విలువలు పాటిస్తున్నారా?. ఇతరుల విషయాల్లో మీరు పాటించే సూత్రాలు మీ విషయంలో ఎందుకు పాటించరు?. ఈ బహిరంగ లేఖ ద్వారా ప్రజల పక్షాన అడిగే ప్రశ్నలకు రామోజీ సమాధానం చెప్పాలి’’ అంటూ ప్రకాశ్‌రావు డిమాండ్ చేశారు. ‘‘పదిహేను సంవత్సరాలుగా బలహీన వర్గాలకు చెందాల్సిన భూములు మీ అధీనం లో ఉన్నాయి. నాగన్‌పల్లి గ్రామంలో సర్వే నెంబర్ 189, 203 కింద 14 ఎకరాల 30 గుంటల భూమిని దివంగత సీఎం వైఎస్సార్ బలహీన వర్గాలకు కేటాయించారు. మీ రాజకీయ పలుకుబడితో 15 ఏళ్లుగా పేదల భూమిని ఆక్రమించారు. ప్రభుత్వ రహదారిని రామోజీ ఫిలిం సిటీ కింద ఆక్రమించారు. అనాజ్ పూర్ నుండి ఇబ్రహీంపట్నం వరకు 13 కి.మీ ప్రభుత్వ రహదారి ఆక్రమించారు. దాని వల్ల కోహెడ ,ఇబ్రహీంపట్నం వెళ్ళటానికి దూరం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మీరు ప్రభుత్వ రహదారిని ఆక్రమించడం వల్ల 16 గ్రామాల్లోని 90 వేల మంది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’’ అంటూ ప్రకాశరావు దుయ్యబట్టారు. ‘‘ప్రజా రహదారిని కబ్జా చేయటాన్ని మీరెలా సమర్ధించుకుంటారు?. మీరు ప్రజా రహదారులను కబ్జా చేయటం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రభుత్వ రహదారులు మీ ఎస్టేట్ కాదు. మీ సామ్రాజాన్ని సామాన్యులు చూడకూడదు అనుకుంటే భారీ ప్రహరీలు నిర్మించుకోండి. అంతే కానీ అటువైపు ప్రజలు రాకూడదని ప్రభుత్వ రహదారులు ఆక్రమించటం ఏమిటి?’’ అని ప్రకాశరావు ప్రశ్నించారు. ‘‘రామోజీకి 2024 మార్చి 31 వరకు డెడ్ లైన్. ఈ లోపు ప్రభుత్వ భూములు తిరిగి ఇచ్చేయాలి. మీ స్టూడియోలో పని చేసే వారిని ఉన్న పళంగా తీసేస్తారు. వారికి జీతాలు ఇవ్వరు. కార్మికుల చట్టాలు ఉల్లఘించారు. రామోజీ పిరికివాడు, చావు అంటే భయం.సీఎం రేవంత్ రెడ్డికి మెమోరాండం ఇస్తా. రామోజీ ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలి. లేదంటే వైఎస్సార్ పేరు తలుచుకోవడానికి మీరు అర్హులు కాదు. డెడ్ లైన్ లోపు ప్రభుత్వ భూములను రామోజీ తిరిగి అప్పగించాలి. లేదంటే బుల్డోజర్లు పెట్టి మీ గోడలు కూలుస్తా’’ అంటూ గోనె ప్రకాశరావు హెచ్చరించారు. -
రామోజీఫిల్మ్‌సిటీలో రాజవంశీకుల భూములు
సాక్షి, న్యూఢిల్లీ: రామోజీ ఫిల్మ్‌సిటీలో రాజవంశీకులకు చెందిన భూములతోపాటు అసైన్డ్, రహదారి భూములున్నాయని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రామోజీ ఫిల్మ్ సిటీలో భూఆక్రమణలపై మీడియాతో ఆయన మాట్లాడారు. రామోజీ ఫిల్మ్‌సిటీకి చెందిన 3 వేల ఎకరాల్లో 1,700 ఎకరాలు గాలిబ్ జంగ్కు చెందిన భూములున్నాయని... ప్రజారహదారులు, హరిజనుల భూములు, భూదాన్ భూములను సైతం కబ్జా చేశారని చెప్పా రు. కార్మికుల చట్టాలను కూడా ఉల్లంఘిచారని, గతంలో ఈనాడులో పనిచేసిన వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారని గుర్తుచేశారు. అనాజ్‌పూర్–ఇబ్రహీంపట్నం రహదారిని మూసేసి, కబ్జా చేశారని... దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గోనె పేర్కొన్నారు. దివంగత వై.ఎస్.రాజ శేఖరరెడ్డి హయాంలో 682 మందికి 200 గజాల చొప్పున పట్టాలు ఇవ్వగా లబ్దిదారులను వారి స్థలాల్లోకి రానివ్వట్లేదని గోనె ప్రకాశ్‌రావు ఆరోపించారు. ఈ ఆస్తులను ప్రభుత్వం వెంటనే అ«దీనంలోకి తీసుకొని రామోజీరావుకు నోటీసులు జారీ చేయాలన్నారు. ‘కోర్ట్ ఆఫ్ వార్డ్స్’చట్టం ప్రకారం నోటీసులపై రామోజీరావు కోర్టుకు వెళ్లడానికి వీల్లేదని... ఇది చాలా పటిష్టమైన చట్టమని చెప్పారు. న్యాయ పోరాటం క్లైమాక్స్‌కు... బ్రిటిష్ పాలకులు ‘కోర్ట్ ఆఫ్ వార్డ్స్’అనే చట్టం తీసుకొచ్చారని, అందులో దేశవ్యాప్తంగా వివిధ రాజవంశాలకు చెందిన 560 మందిని చేర్చారని గోనె ప్రకాశ్‌రావు తెలిపారు. నిజాం స్టేట్‌లో మార్వాడీ, ముస్లింలు తదితర 8 కుటుంబాలు ఉన్నాయన్నారు. అయితే ఈ రాజవంశీకులకు చెందిన రూ. లక్షల కోట్ల విలువైన ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని.. ఈ విషయంలో తాను చేస్తున్న పోరాటం క్లైమాక్స్‌కు వచ్చిందన్నారు. ‘కోర్ట్ ఆఫ్ వార్డ్స్’చట్టం ప్రకారం రాజవంశీకుల మరణానంతరం వారి వారసులు మైనర్లయితే పరిశ్రమలు, ఆస్తులు, భూములను ప్రభుత్వం అదీనంలోకి తీసుకుంటుందని... వారసులు మేజర్లు అయ్యాక ఆ ఆస్తులను వారికి తిరిగి అప్పగిస్తుందని ఆయన చెప్పారు. అయితే తెలంగాణలో ఆ ఆస్తులు, భూములు అన్యాక్రాంతమయ్యాయని, రూ. లక్షల కోట్ల విలువైన ‘కోర్ట్ ఆఫ్ వార్డ్స్’కిందకు వచ్చే ఆస్తులు ఒక పత్రికాధిపతి (రామోజీరావు), తెలుగు రాష్ట్రాల్లోనే నంబర్ వన్ బిల్డర్‌గా ఉన్న రామేశ్వరరావు అధీనంలో ఉన్నాయని గోనె ఆరోపించారు. వాటిలో పెద్దపెద్ద భవనాలు కట్టారని తెలిపారు. రాష్ట్రంతోపాటు అమెరికాలో పెద్ద పారిశ్రామికవేత్త, ఎయిర్‌పోర్టులు నిర్మించిన ఆయనకు స్టార్ హోటళ్లు కూడా ఉన్నాయని వాటిని తాజ్ గ్రూప్‌నకు ఇచ్చారని, అవి కూడా ‘కోర్ట్ ఆఫ్ వార్డ్స్’భూములే అన్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు విచారణ చేపట్టాలి రాజవంశానికి చెందిన వారందరినీ కలుపుకొని న్యాయం కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ గాం«దీలను కలిసి ఆధారాలు అందిస్తానని గోనె ప్రకాశ్‌రావు తెలిపారు. ఈ తరహా వ్యవహారాలు కర్ణాటకలోనూ ఉన్నందున చర్యలు తీసుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఒక కమిటీ వేసి విచారణ జరిపించాలని కోరారు. సంబంధిత పత్రాలు, సమాచారం కోసం హైదరాబాద్‌లోని రాజ్యాభిలేఖ కార్యాలయానికి దరఖాస్తు చేశానన్నారు. 2008లో పాయిగా వంశానికి చెందిన 140 ఎకరాలు (రూ. 20 వేల కోట్ల విలువైన) రిలీజ్ అయ్యాయని తెలిపారు. దీనిపై రాయచూర్‌లోని ఆ కుటుంబంతో మాట్లాడానని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు హామీలిచ్చిన పథకాల అమలుకు ఆ ఆస్తులను వాడాలని కోరతామని చెప్పారు. లక్ష నాగళ్లతో (రామోజీ ఫిల్మ్‌సిటీని) దున్నిస్తానని చెప్పిన కేసీఆర్... సీఎం అయ్యాక కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని త్వరలో కలిసి ఈ వ్యవహారాన్ని వివరిస్తానని చెప్పారు. ఆర్థిక చిక్కుల్లో నుంచి రాష్ట్రం బయటపడేందుకు తాను చెబుతున్న విషయం ఒక ఫార్ములా అని అన్నారు. ఈ సందర్భంగా గతంలో రామోజీరావు ఆక్రమణలపై 2010లో ‘ఇండియా టుడే’ ప్రచురించిన కథనాలను, పత్రాలను గోనె ప్రకాశ్‌రావు మీడియాకు చూపించారు. -
రామోజీరావు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు: గోనె ప్రకాశ్
-
రామోజీ ఫిలిం సిటీ ఆక్రమణల పర్వం: గోనె ప్రకాశరావు
సాక్షి, ఢిల్లీ: ఈనాడు అధినేత రామోజీరావు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన ప్రకటన చేశారు. ఫిలిం సిటీ ప్రాంతంలో గాలిబ్ జంగ్ రాజవంశానికి చెందిన 1700 ఎకరాల భూమిని రామోజీరావు ఆక్రమించుకున్నారని ప్రకాశ్ రావు ఆరోపించారు. కాగా, మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రావు తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘రామోజీ ఫిలిం సిటీలో ప్రభుత్వ భూములున్నాయి. రామోజీరావు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు. ఫిలిం సిటీలో రాజ వంశీకుల భూములు, అసైన్డ్, రహదారి భూములు ఉన్నాయి. గాలిబ్ జంగ్ రాజ వంశానికి సంబంధించిన 1700 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. అనాజ్‌పూర్-ఇబ్రహీంపట్నం ప్రజా రహదారిని కూడా ఆక్రమించారు. ఈ విషయంలో ప్రజలు ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆక్రమణలపై దృష్టి పెట్టాలి. రాజుల వంశంలోని నాటి మైనర్లకు సంబంధించిన భూములు అవి. మైనర్లు కావడం వల్ల ఆ భూములు కోర్టు ఆఫ్ వార్డ్స్ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. కానీ, ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తులు ఆ భూములన్నింటినీ ఆక్రమించుకున్నారు. రాష్ట్రంలో పత్రికాధిపతి చేతిలో ఈ భూములు ఉన్నాయి. అలాగే ఓ రియల్టర్, పారిశ్రామికవేత్త కూడా ఈ భూములను ఆక్రమించారు. ఈ అంశాలపై చర్యలు తీసుకోవాలని త్వరలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కూడా కలుస్తాను. ఈ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి’ అని అన్నారు. -
గోనె ప్రకాష్ రావుపై దాడికి యత్నం
సాక్షి, ఢిల్లీ: మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు (Gone Prakash rao)పై దాడికి యత్నం జరిగింది. ఢిల్లీలో గోనెను బీసీ సంఘాల నేతలు కొందరు కొట్టేందుకు యత్నించారు. ఢిల్లీ ఏపీ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన గోనె.. ఆ క్రమంలో కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. అది గమనించిన బీసీ సంఘాల కార్యకర్తలు కొందరు.. గోనె ప్రకాశ్‌ను నెట్టేసి దాడికి యత్నించారు. -
‘మునుగోడు.. ఒక్కో ఓటర్‌కు 20 వేలు పంచారు!’
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాల దృష్ట్యా.. ఉప ఎన్నికలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్‌ను కోరారు మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు. మునుగోడు ఉప ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాల పేరిట మూడు పేజీల వినతిపత్రాన్ని ఆయన్ని కేంద్ర ఎన్నికల కమీషన్‌కు, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి పంపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘానికి.. ఎన్నికలు రద్దు చేసే విస్తృత అధికారం ఉందని ఆయన గుర్తు చేశారు. గతంలో ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు పంపిణి, అధికార దుర్వినియోగం, ఇతర అక్రమాలు చోటు చేసుకున్నప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను సైతం తన వినతిపత్రంలో ప్రస్తావించారు. భారతదేశ చరిత్రలోనే అతి ఖరీదైన ఉప ఎన్నికగా మునగోడు నిలవనుంది. మునుగోడులో ఒక్క అక్టోబర్ నెలలోనే దాదాపు 132 కోట్ల రూపాయల విలువైన మద్యం ఏరులై పారింది. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ అక్రమాలకు.. ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిఓటర్‌కు రూ.20 వేల రూపాయల డబ్బు, మహిళలకు ఒక గ్రాము బంగారం ఇవ్వడానికి పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి అని గోనె ప్రకాష్‌రావు ఆరోపించారు. మునుగోడులో జరుగుతున్న అక్రమాలు, డబ్బు, మందు పంపిణీ కట్టడి చేసి.. ఎన్నికలు రద్దు చేయకపోతే ప్రజాస్వామ్యంపైనే ప్రజలకు నమ్మకం పోతుందన్నారు ఆయన. ఇదీ చదవండి: టీఆర్ఎస్పై కిషన్‌రెడ్డి కౌంటర్ ఎటాక్ -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరాచకాలు చూస్తే చంపాలని అనిపిస్తోంది..!
విద్యానగర్ (కరీంనగర్): టీఆర్ఎస్ పాలనలో ఎంపీటీసీలు మొదలు.. ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు అవినీతి అడ్డూఅదుపు లేకుండా పోయిందని, అందుకే మావోయిస్టుల హెచ్చరికలు మొదలయ్యాయని మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు అన్నారు. ఆదివారం కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకుల అవినీతి ఇలాగే సాగితే రానున్న రోజుల్లో ‘అన్నలు’వస్తారని, పది నిమిషాల్లో అందరినీ చంపేసి వెళ్లిపోతారని సంచలన వ్యాఖ్యాలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, మెడికల్ ఉద్యోగాల మాఫియాపై మావోయిస్టులు సీరియస్‌గా ఉన్నారని, వారు దాడి చేయాలనుకుంటే 10 నిమిషాల్లో పని పూర్తిచేసి బార్డర్ దాటి వెళ్లిపోయే అవకాశం ఉందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి అంతా సీఎం కేసీఆర్‌కు తెలిసినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ మంత్రి బావ రూ.8కోట్ల ప్రాపర్టీని ఆక్రమించినప్పటికీ అతడిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ఎమ్మెల్యేల అరాచకాలు చూస్తే తనకే చంపాలని అనిపిస్తోందని గోనె వ్యాఖ్యానించారు. -
రామోజీ ఫిల్మ్‌సిటీపై దర్యాప్తు చేయించండి
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ భూముల్లో రామోజీ ఫిల్మ్‌సిటీ నిర్మాణం, ప్రభుత్వ రహదారి ఆక్రమణ, పేదలకు కేటాయించిన భూముల్లోకి వారిని అనుమతించకపోవడంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఆర్ఎఫ్సీ యాజమాన్యం అక్రమాలపై గత పదేళ్లుగా పోరాటం చేస్తున్న తాను, దర్యాప్తు సంస్థ ముందు హాజరై ఈ అక్రమాలన్నింటినీ నిరూపిస్తానని తెలిపారు. నిరూపించలేకపోతే దేశం విడిచి శాశ్వతంగా వెళ్లిపోతానని సవాల్ చేశారు. అసైన్డ్ భూములను కొనుగోలు చేస్తే సమస్య లు వస్తాయనే ఉద్దేశంతో స్థానిక రైతుల నుంచి ఆ భూములను 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నట్టు రాయించుకుని.. అటు రైతులను, ఇటు ప్రభుత్వాన్ని ఆర్ఎఫ్సీ యాజమాన్యం మోసగిస్తోందని తెలిపారు. -
తెలంగాణ.. కల్వకుంట్ల సామ్రాజ్యమా?
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమని కాంగ్రెస్ నేత కుసుం కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమా లేక కల్వకుంట్ల సామ్రాజ్యామా అంటూ ప్రశ్నించారు. తాలీబన్ వ్యవస్థలా తెలంగాణను పాలిస్తున్నారని సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుసుమ కుమార్ పాల్గొన్నారు. పోలింగ్ బూతుల్లో టీఆర్ఎస్కు ఏజెంట్లు అవసరం ఉండకపోవచ్చని.. అధికారులనే పోలింగ్ ఏజెంట్లుగా టీఆర్ఎస్ వాడుకునే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ చేతుల్లో తోలుబొమ్మల్లా ఉండొద్దని పోలీసులను హెచ్చరించారు. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల్లో గెలవకుంటే జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావ్ జోస్యం చెప్పారు. మంగళవారం ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. సహారా సంస్థ ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్) నిధులు వాడుకునేందుకూ అప్పటి కేంద్ర మంత్రి కేసీఆర్ అనుమతిచ్చారని.. దీంతో సహారా సంస్థ మూతపడిన తర్వాత పదకొండు లక్షల ఉద్యోగులు రోడ్డునపడ్డారని ధ్వజమెత్తారు. దీనిపై ఇప్పటికే కేసీఆర్‌ను సీబీఐ రెండు సార్లు విచారించిందన్నారు. ఈ కేసుకు భయపడే ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ సరెండర్ అయ్యారని విమర్శించారు. సీబీఐ కేసులో లేనని కేసీఆర్ నిరూపిస్తే.. ఆయన ఫామ్‌హౌస్ ముందు కాపలా కుక్కలా ఉంటానని సవాల్ విసిరారు. తెలంగాణలో ప్రజాకూటమి రావడం ఖాయమని, కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడబోతోందని జోస్యం చెప్పారు. -
'వైఎస్ హయాంలో ఫిరాయింపులు లేవు'
► ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలెవరూ కాంగ్రెస్‌లో చేరలేదని, కాంగ్రెస్‌పార్టీ కండువాలను వైఎస్ ఏనాడూ వారికి కప్పలేదని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో టీఆర్ఎస్ను వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు ఎవరూ గాంధీభవన్‌కు రాలేదని, సీఎల్పీ సమావేశాలకు హాజరుకాలేదని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, వైఎస్ కాంగ్రెస్‌లో చేర్చుకున్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ నేతలు అబద్ధాలు మాట్లాడటం, వైఎస్‌పై అభాండాలు వేయడం సరికాదని అన్నారు. వైఎస్ ఏనాడూ ఫిరాయింపులను ప్రోత్సహించలేదన్నారు. కానీ, కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో బహిరంగంగానే ఫిరాయింపులు ఉన్నాయన్నారు. టీఆర్ఎస్లో చేరినట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముగ్గురు, టీడీపీ ఎమ్మెల్యేలు 12 మంది, కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే చెబుతున్నారని అన్నారు. వారిని చేర్చుకున్నట్టుగా టీఆర్ఎస్నేతలు కూడా చెబుతుంటే ఫిరాయింపుల చట్టం ఏమైందని ఆయన ప్రశ్నించారు. -
మాజీ ఎమ్మెల్యే,ఆర్టీసీ మాజీఛైర్మన్,గోనె ప్రకాశరావుతో సాక్షి వేదిక