సాక్షి, ఢిల్లీ: ఈనాడు అధినేత రామోజీరావు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన ప్రకటన చేశారు. ఫిలిం సిటీ ప్రాంతంలో గాలిబ్ జంగ్ రాజవంశానికి చెందిన 1700 ఎకరాల భూమిని రామోజీరావు ఆక్రమించుకున్నారని ప్రకాశ్ రావు ఆరోపించారు.
కాగా, మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రావు తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘రామోజీ ఫిలిం సిటీలో ప్రభుత్వ భూములున్నాయి. రామోజీరావు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు. ఫిలిం సిటీలో రాజ వంశీకుల భూములు, అసైన్డ్, రహదారి భూములు ఉన్నాయి. గాలిబ్ జంగ్ రాజ వంశానికి సంబంధించిన 1700 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. అనాజ్‌పూర్-ఇబ్రహీంపట్నం ప్రజా రహదారిని కూడా ఆక్రమించారు. ఈ విషయంలో ప్రజలు ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు.
ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆక్రమణలపై దృష్టి పెట్టాలి. రాజుల వంశంలోని నాటి మైనర్లకు సంబంధించిన భూములు అవి. మైనర్లు కావడం వల్ల ఆ భూములు కోర్టు ఆఫ్ వార్డ్స్ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. కానీ, ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తులు ఆ భూములన్నింటినీ ఆక్రమించుకున్నారు. రాష్ట్రంలో పత్రికాధిపతి చేతిలో ఈ భూములు ఉన్నాయి. అలాగే ఓ రియల్టర్, పారిశ్రామికవేత్త కూడా ఈ భూములను ఆక్రమించారు. ఈ అంశాలపై చర్యలు తీసుకోవాలని త్వరలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కూడా కలుస్తాను. ఈ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment