రామోజీ ఫిల్మ్‌సిటీపై దర్యాప్తు చేయించండి | Gone Prakash Rao Letter To Kcr Over Film City Assigned Lands | Sakshi
Sakshi News home page

రామోజీ ఫిల్మ్‌సిటీపై దర్యాప్తు చేయించండి

Published Mon, Jul 12 2021 3:48 AM | Last Updated on Mon, Jul 12 2021 1:33 PM

Gone Prakash Rao Letter To Kcr Over  Film City Assigned Lands - Sakshi

గోనె ప్రకాశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: అసైన్డ్‌ భూముల్లో రామోజీ ఫిల్మ్‌సిటీ నిర్మాణం, ప్రభుత్వ రహదారి ఆక్రమణ, పేదలకు కేటాయించిన భూముల్లోకి వారిని అనుమతించకపోవడంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆదివారం బహిరంగ లేఖ రాశారు.

ఆర్‌ఎఫ్‌సీ యాజమాన్యం అక్రమాలపై గత పదేళ్లుగా పోరాటం చేస్తున్న తాను, దర్యాప్తు సంస్థ ముందు హాజరై ఈ అక్రమాలన్నింటినీ నిరూపిస్తానని తెలిపారు. నిరూపించలేకపోతే దేశం విడిచి శాశ్వతంగా వెళ్లిపోతానని సవాల్‌ చేశారు. అసైన్డ్‌ భూములను కొనుగోలు చేస్తే సమస్య లు వస్తాయనే ఉద్దేశంతో స్థానిక రైతుల నుంచి ఆ భూములను 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నట్టు రాయించుకుని.. అటు రైతులను, ఇటు ప్రభుత్వాన్ని ఆర్‌ఎఫ్‌సీ యాజమాన్యం మోసగిస్తోందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement