'వైఎస్‌ హయాంలో ఫిరాయింపులు లేవు' | Gone Prakash rao slams TRS Leaders over Party Shifting MLAs | Sakshi
Sakshi News home page

'వైఎస్‌ హయాంలో ఫిరాయింపులు లేవు'

Published Tue, Jan 3 2017 3:52 AM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM

'వైఎస్‌ హయాంలో ఫిరాయింపులు లేవు' - Sakshi

'వైఎస్‌ హయాంలో ఫిరాయింపులు లేవు'

ఆర్టీసీ మాజీ చైర్మన్‌ గోనె ప్రకాశరావు  

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రిగా వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేలెవరూ కాంగ్రెస్‌లో చేరలేదని, కాంగ్రెస్‌పార్టీ కండువాలను వైఎస్‌ ఏనాడూ వారికి కప్పలేదని ఆర్టీసీ మాజీ చైర్మన్‌ గోనె ప్రకాశరావు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో టీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు ఎవరూ గాంధీభవన్‌కు రాలేదని, సీఎల్పీ సమావేశాలకు హాజరుకాలేదని అన్నారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను, వైఎస్‌ కాంగ్రెస్‌లో చేర్చుకున్నట్టుగా టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు అబద్ధాలు మాట్లాడటం, వైఎస్‌పై అభాండాలు వేయడం సరికాదని అన్నారు. వైఎస్‌ ఏనాడూ ఫిరాయింపులను ప్రోత్సహించలేదన్నారు. కానీ, కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో బహిరంగంగానే ఫిరాయింపులు ఉన్నాయన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరినట్టుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ముగ్గురు, టీడీపీ ఎమ్మెల్యేలు 12 మంది, కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బహిరంగంగానే చెబుతున్నారని అన్నారు. వారిని చేర్చుకున్నట్టుగా టీఆర్‌ఎస్‌నేతలు కూడా చెబుతుంటే ఫిరాయింపుల చట్టం ఏమైందని ఆయన ప్రశ్నించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement