
సాక్షి, హైదరాబాద్ : దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నేటితో ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదో వసంతంలోకి అడుగుపెట్టింది. రాజన్న ఆశీస్సులతో వైఎస్ జగన్ 12 మార్చి, 2011న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజానేతగా ఎదిగారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ జనబాహుళ్యం మెచ్చిన నేతగా మన్ననలందుకున్నారు.
(నేడు వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం)
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లోని పార్టీ కార్యకర్తలు వేడుకలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మహానేత ఆశయాలను, పథకాలను సజీవంగా ఉంచేందుకు వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భవించి నేటికి తొమ్మిదేళ్లు. గత ఎనిమిదేళ్లుగా ప్రజా జీవితంలో సవాళ్లు, కష్టాలు, నష్టాలకు ఎదురొడ్డి ఈ పార్టీని భుజస్కందాలమీద మోసిన ప్రతి కుటుంబ సభ్యుడికి శుభాకాంక్షలు, వందనాలు’ అంటూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment