విశాఖలో పార్టీ కార్యాలయంలో జరిగిన వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలో దివంగత సీఎం వైఎస్సార్, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాల వద్ద నివాళులర్పిస్తున్న నేతలు
సాక్షి నెట్‌వర్క్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలే ఊపిరిగా.. రాజన్న రాజ్యం తీసుకు రావ డమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సారథ్యంలో ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భం గా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పండుగలా కార్యక్రమాలు జరిపారు. అన్నిచోట్లా వైఎస్సార్ విగ్రహాలను శుభ్రం చేసి, పూలమాలలతో అలంకరించారు. వైఎస్సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి పార్టీ జెండా ను ఎగురవేశారు. పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు జరిగాయి.
వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘన నివాళులర్పించి..
అనంతపురంలో మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, శమంతకమణి కేక్ కట్‌చేశారు. గుంతకల్లులో ఎమ్మెల్యే వై.వెంకట్రా మిరెడ్డి, రాయదుర్గంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, శింగనమలలో ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మావతి, ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామిని బాల తదితరులు వైఎస్సార్ విగ్రహాల వద్ద నివాళులర్పించారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన రాజకీయ చతురతతో సుపరిపాలన అందిస్తు న్నారని, ఆయన సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేయడం ఖాయమన్నారు.
విజయవాడ కంట్రోల్ రూమ్ సమీపంలోని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, బొప్పన భవకుమార్, గౌతమ్‌రెడ్డి తదితరులు
చిత్తూరులో ఎమ్మెల్యే శ్రీనివాసులు, తవణంపల్లిలో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, నారాయణవనంలో ఎమ్మెల్యే ఆదిమూలం ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. కడపలో డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజాద్‌బాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. రాయచోటి నియోజకవర్గంలో ప్రభు త్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రైల్వేకోడూరు లో విప్ కొరముట్ల శ్రీనివాసులు, మైదుకూరు, ప్రొద్దుటూరు, రాజంపేట, కమలాపురంలలో ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, పి.రవీంద్ర నాథ్‌రెడ్డి, బద్వేలు, రాయచోటిలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కర్నూలులో ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్, పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య వైఎస్సార్‌కు నివాళులర్పించారు. గూడూరు మండలం కె.నాగలాపురంలో ఎమ్మెల్యే సుధాకర్, గడివేములలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. గుంటూరు జిల్లాలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరి తదితరులు పాల్గొన్నారు.
ఎక్కడ చూసినా పతాకాల రెపరెపలే
ప్రకాశం జిల్లా దోర్నాల, పెద్దారవీడుల్లో మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, కందుకూరు, దర్శి, కనిగిరి, మద్దిపాడు, పొదిలిల్లో ఎమ్మెల్యేలు మాను గుంట మహీధరరెడ్డి, మద్దిశెట్టి వేణుగోపాల్, బుర్రా మధుసూదన్‌యాదవ్, టీజేఆర్ సుధాకర్‌బాబు, పొదిలిలో కుందురు నాగార్జునరెడ్డి, కావూరివారి పాలెంలో ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీ జెండాను ఎగురవేశారు. కృష్ణాజిల్లాలో ఎమ్మెల్యేలు, నాయకు లు వైఎస్సార్‌సీపీ పతాకాలను ఆవిష్కరించి కేక్‌లు కట్ చేశారు. విజయవాడలో మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పెనమలూరులో ఎమ్మెల్యే కె.పార్థసారథి కేక్ కట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఎమ్మెల్యేలు పుప్పాల వాసుబాబు, అబ్బయ్యచౌదరి ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి.
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో వైఎస్సార్ విగ్రహానికి మంత్రి పినిపే విశ్వరూప్, పార్టీ పీఏసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, వాకలపూడిలో మంత్రి కురసాల కన్నబాబు వైఎస్సార్‌కు నివాళులర్పించారు. రామచంద్రపురంలో మంత్రి వేణుగోపాలకృష్ణ పార్టీ జెండా ఆవిష్క రించారు. విజయనగరం జిల్లా కురుపాంలో డిప్యూ టీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, చీపురుపల్లిలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పార్టీ పతాకాల్ని ఆవిష్క రించారు. ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, శంబంగి వెంకటచినఅప్పలనాయుడు, పీడిక రాజన్న దొర, బొత్స అప్పలనర్సయ్య, కడుబండి శ్రీనివాస రావు, బడ్డుకొండ అప్పలనాయుడు, కోలగట్ల వీర భద్రస్వామి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. శ్రీకాకుళంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు, మిగిలిన చోట్ల ఎమ్మెల్యేలు, నేతల ఆధ్వర్యంలో పార్టీ ఆవి ర్భావ వేడుకలు జరిగాయి. విశాఖ జిల్లాలో ఎమ్మె ల్యే అదీప్‌రాజు, మాజీ మంత్రి బాలరాజు, ఎంపీ సత్యవతి, ఎంపీ మాధవి తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. నెల్లూరులో ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యేలు వెలగపల్లి వరప్రసాద్ రావు, కిలివేటి సంజీవయ్య, మేకపాటి చంద్ర శేఖరరెడ్డి ఆధ్వర్యలో కార్యక్రమాలు జరిగాయి.
బంగారంతో చిన్ని ‘ఫ్యాన్’
కాశీబుగ్గ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పార్టీ అభిమాని బంగారం వినియోగించి చిన్న సైజు ఫ్యాన్‌ను తయారు చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు చెందిన సూక్ష్మ కళాకారుడు కొత్తపల్లి రమేష్‌ఆచారి నాలుగు గంటలు కష్టపడి ఈ ఫ్యాన్‌ను తయారు చేశారు. దీని తయారీకి 91.6 కేడీఎం బంగారం వినియోగించడం విశేషం. ఈ ఫ్యాన్ 1 సెంటీమీటర్ పొడవు, 0.150 మిల్లీగ్రామల బరువు ఉంది. పార్టీ జెండా ఆవిష్కరణకు ఇక్కడకు వచ్చిన మంత్రి అప్పలరాజుకు ఆ ఫ్యాన్‌ను చూపారు. ఆ ఫ్యాన్‌ను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందించాలని ఆశ పడుతున్నట్లు రమేష్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment