విజయవాడ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు స్టే | high court stays vijayawada court orders on phone tapping row | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 30 2015 5:19 PM | Last Updated on Wed, Mar 20 2024 1:04 PM

ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ సరికొత్త మలుపు తిరిగింది. ఫోన్ ట్యాపింగ్ రికార్డులను తమకు ఇవ్వాలని అడిగే హక్కు విజయవాడ కోర్టుకు లేదంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ 4 వారాలకు వాయిదా పడింది. కాగా, ఈ విషయంలో ఇంతకుముందు విజయవాడ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. కాగా, ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన కాల్ డేటాను హైకోర్టు రిజిస్ట్రార్కు అందించాలని కోర్టు ఆదేశించింది. సర్వీస్ ప్రొవైడర్లు తమ కాల్ డేటా వివరాలను సీల్డ్ కవర్లో విజయవాడ కోర్టుకు సమర్పించాలని, ఆ సీల్డ్ కవర్ను హైకోర్టు రిజిస్ట్రార్కు యథాతథంగా అందజేయాలని తెలిపింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement