కేసీఆర్ తనకు ఫోన్ చేసినట్టు రుజువు చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రుజువు చేయకపోతే లేదంటే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. అసెంబ్లీలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ... దొంగతనం చేస్తూ పట్టుబడి పట్టువారిదే తప్పన్నట్టుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసును రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరించారని ధ్వజమెత్తారు. ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్ చంద్రబాబుది అవునో, కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని పంపింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో సమాధానం చెప్పకుండా చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నారని అన్నారు. ఈ అంశంపై తప్పుదోవ పట్టించేందుకు సభను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.
Published Fri, Sep 4 2015 10:27 AM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM
Advertisement
Advertisement
Advertisement