ఏపీ అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఛాంబర్‌లో సీఆర్‌డీఎ అధికారులు బుధవారం తనిఖీలు జరిపారు. మంగళవారం కురిసిన చిన్నపాటి వర్షానికే వైఎస్ జగన్ చాంబర్‌లోకి వర్షపు నీళ్లు వచ్చిచేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఛాంబర్‌లోకి నీళ్లు ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు అధికారులు పరిశీలన జరిపారు. నీళ్లు రావడంపై అసెంబ్లీ సిబ్బందిని, పారిశుద్ధ్య కార్మికులను ప్రశ్నించారు. ఛాంబర్‌లోకి నీళ్లు ఎలా వచ్చాయంటూ ఫైర్ ఇంజిన్‌తో తనిఖీలు జరిపిన అధికారులు.. లీకేజీ వల్లే వచ్చాయని నిర్ధారణకు వచ్చారు.