సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాపంగా ప్రకంపనలు రేపిన పెగాసస్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో సంస్థ స్పందించింది. లీకైన డేటా, ఫోన్ నెంబర్ల జాబితాకు ఎన్ఎస్ఓకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. అసలు స్నూపింగ్ లాంటి టెక్నాలజీని దేన్నీ వాడటం లేదనీ, ఫోన్ల డేటా ప్రాప్యత ఏదీ తమ క్లయింట్ల వద్ద లేదని తెలిపింది. వాస్తవానికి పెగాసస్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం కారణంగానే లక్షలాదిమంది ప్రజలు రాత్రిళ్లు నిశ్చింతగా నిద్రపోతున్నారని, వారంతా వీధుల్లో సురక్షితంగా సంచరిస్తున్నారని ఎన్ఎస్ఓ తెలిపింది. సురక్షితమైన ప్రపంచాన్ని సృష్టించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఎన్‌ఎస్‌ఓ స్పష్టం చేసింది.
ఇజ్రాయెల్ నిఘా సాఫ్ట్‌వేర్ పెగాసస్‌పై తీవ్ర వివాదాల మధ్య, ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ ఈ వివావాదానికి తమకు ఎలాంటి సంబంధం లేదని తనను తాను సమర్థించుకుంది పెగాసస్ లాంటి టెక్నాలజీకి కృతజ్ఞతలు తెలిపాలనీ పేర్కొంది. ఎందుకంటే ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ యాప్స్‌తో ఒకే గొడుగు కింద పని చేస్తున్న నేరస్తులు, ఉగ్రవాదులు, పెడోఫిలియా రింగులను నివారించే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, చట్ట అమలు సంస్థల పరిశోధనకు ఇది సాయపడుతోందని ఎన్ఎస్ఓ ప్రతినిధి చెప్పారు.
ప్రపంచంలోని అనేక ఇతర సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీలతో కలిసి, ప్రభుత్వాలకు సైబర్ ఇంటెలిజెన్స్ సాధనాలను అందిస్తామని ప్రకటించింది. అలాగే తన క్లయింట్లు సేకరించిన డేటా పూర్తిగా సురక్షితమని కూడా వాదించింది. ఇంటెలిజెన్స్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు అందిస్తున్న టెక్నాలజీ కారణంగానే ప్రజలంతా సురక్షితంగా ఉన్నారని, సంతోషంగా నిద్రపోతు న్నారని పేర్కొంది
కాగా భారతదేశం సహా పలు దేశాల్లోని జర్నలిస్టులు, మానవహక్కుల నేతలు, రాజకీయ నాయకులు, ఇతరులపై నిఘాకు పెగసాస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించిందన్న వివాదం పెద్ద దుమారాన్ని రేపింది. ఇజ్రాయెల్ సంస్థ వివిధ ప్రభుత్వాలకు విక్రయించిన ఫోన్ ట్యాపింగ్ సాప్ట్‌వేర్ ఆరోపణలతో గోప్యతకు సంబంధించిన సమస్యలపై అనే ఆందోళన రేకెత్తించింది. మరోవైపు లీకయిన నంబర్లు ఎన్ఎస్ఓ సాఫ్ట్‌వేర్ వినియోగిస్తున్న దేశాలకు సంబంధించినవేనని పలువురు నిపుణులు ఇప్పటికే తేల్చి చెప్పారు. అయితే ఈ విమర్శలను కొట్టిపారేసిన ఎన్ఎస్ఓ,పెగాసస్‌కు సంబంధించిన అన్ని ఆరోపణలపై దర్యాప్తు జరిపిస్తామని, తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment