Sleepwell
-
షీలా ఫోమ్ చేతికి కర్లాన్
న్యూఢిల్లీ: స్లీప్‌వెల్ పేరిట మ్యాట్రెస్‌లను తయారు చేసే షీలా ఫోమ్ తాజాగా కర్లాన్ ఎంటర్‌ప్రైజెస్‌లో 94.66% వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ.2,035 కోట్లు వెచి్చంచనుంది. అలాగే, ఆన్లైన్ ఫరి్నచర్ బ్రాండ్ ఫర్లెంకో మాతృ సంస్థ హౌస్ ఆఫ్ కిరాయా ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ. 300 కోట్లతో 35% వాటాలు కొనుగోలు చేయనుంది. దీనికి సంబంధించిన రెండు ప్రతిపాదనలకు జూలై 17న జరిగిన సమావేశంలో కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు షీలా ఫోమ్ తెలిపింది. ‘రూ. 2,150 కోట్ల ఈక్విటీ వేల్యుయేషన్‌తో కేఈఎల్ (కర్లాన్ ఎంటర్ప్రైజెస్)లో 94.66% వాటాను కొనుగోలు చేయబోతున్నాం‘ అని వెల్లడించింది. మ్యాట్రెస్లు, ఫోమ్ ఆధారిత ఉత్పత్తుల విభాగంలో తమ స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని షీలా ఫోమ్ తెలిపింది. కేఈఎల్లో 94.66% వాటా కొనుగోలు వ్యయం రూ.2,035 కోట్లుగా ఉండనున్నట్లు పేర్కొంది. దేశీయంగా ఆధునిక మ్యాట్రెస్‌ల విభాగంలో రెండింటి సంయుక్త మార్కెట్ వాటా దాదాపు 21 శాతంగా ఉంటుందని వివరించింది. దక్షిణాదికి చెందిన బిజినెస్ గ్రూప్ పాయ్ కుటుంబం 1962లో కర్ణాటక కాయిర్ ప్రోడక్ట్స్ (ప్రస్తుతం కేఈఎల్)ను ఏర్పాటు చేసింది. 1995లో దాని పేరు కర్లాన్ అని మారగా 2011లో కేఈఎల్ పేరిట అనుబంధ సంస్థ ఏర్పాటైంది. అటు పైన 2014లో వ్యాపారం కేఈఎల్కు బదిలీ అయింది. కంపెనీ ప్రస్తుతం ప్రధానంగా కర్లాన్ బ్రాండ్ కింద ఫోమ్, కాయిర్ ఆధారిత మ్యాట్రెస్లు మొదలైనవి తయారు చేస్తోంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.809 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. ఫరి్నచర్ రెంటల్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఫర్లెంకోలో పెట్టుబడులు ఉపయోగపడగలవని షీలా ఫోమ్ వివరించింది. -
‘ఎన్ఎస్ఓకు ఎలాంటి సంబంధం లేదు..పెగాసస్‌కు థ్యాంక్స్’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాపంగా ప్రకంపనలు రేపిన పెగాసస్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో సంస్థ స్పందించింది. లీకైన డేటా, ఫోన్ నెంబర్ల జాబితాకు ఎన్ఎస్ఓకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. అసలు స్నూపింగ్ లాంటి టెక్నాలజీని దేన్నీ వాడటం లేదనీ, ఫోన్ల డేటా ప్రాప్యత ఏదీ తమ క్లయింట్ల వద్ద లేదని తెలిపింది. వాస్తవానికి పెగాసస్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం కారణంగానే లక్షలాదిమంది ప్రజలు రాత్రిళ్లు నిశ్చింతగా నిద్రపోతున్నారని, వారంతా వీధుల్లో సురక్షితంగా సంచరిస్తున్నారని ఎన్ఎస్ఓ తెలిపింది. సురక్షితమైన ప్రపంచాన్ని సృష్టించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఎన్ఎస్ఓ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ నిఘా సాఫ్ట్వేర్ పెగాసస్‌పై తీవ్ర వివాదాల మధ్య, ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ ఈ వివావాదానికి తమకు ఎలాంటి సంబంధం లేదని తనను తాను సమర్థించుకుంది పెగాసస్ లాంటి టెక్నాలజీకి కృతజ్ఞతలు తెలిపాలనీ పేర్కొంది. ఎందుకంటే ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ యాప్స్‌తో ఒకే గొడుగు కింద పని చేస్తున్న నేరస్తులు, ఉగ్రవాదులు, పెడోఫిలియా రింగులను నివారించే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, చట్ట అమలు సంస్థల పరిశోధనకు ఇది సాయపడుతోందని ఎన్ఎస్ఓ ప్రతినిధి చెప్పారు. ప్రపంచంలోని అనేక ఇతర సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీలతో కలిసి, ప్రభుత్వాలకు సైబర్ ఇంటెలిజెన్స్ సాధనాలను అందిస్తామని ప్రకటించింది. అలాగే తన క్లయింట్లు సేకరించిన డేటా పూర్తిగా సురక్షితమని కూడా వాదించింది. ఇంటెలిజెన్స్, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు అందిస్తున్న టెక్నాలజీ కారణంగానే ప్రజలంతా సురక్షితంగా ఉన్నారని, సంతోషంగా నిద్రపోతు న్నారని పేర్కొంది కాగా భారతదేశం సహా పలు దేశాల్లోని జర్నలిస్టులు, మానవహక్కుల నేతలు, రాజకీయ నాయకులు, ఇతరులపై నిఘాకు పెగసాస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించిందన్న వివాదం పెద్ద దుమారాన్ని రేపింది. ఇజ్రాయెల్ సంస్థ వివిధ ప్రభుత్వాలకు విక్రయించిన ఫోన్ ట్యాపింగ్ సాప్ట్వేర్ ఆరోపణలతో గోప్యతకు సంబంధించిన సమస్యలపై అనే ఆందోళన రేకెత్తించింది. మరోవైపు లీకయిన నంబర్లు ఎన్ఎస్ఓ సాఫ్ట్వేర్ వినియోగిస్తున్న దేశాలకు సంబంధించినవేనని పలువురు నిపుణులు ఇప్పటికే తేల్చి చెప్పారు. అయితే ఈ విమర్శలను కొట్టిపారేసిన ఎన్ఎస్ఓ,పెగాసస్‌కు సంబంధించిన అన్ని ఆరోపణలపై దర్యాప్తు జరిపిస్తామని, తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఏపీ మార్కెట్లోకి స్లీప్‌వెల్ కంఫర్ట్‌సెల్ పరుపు
లబ్బీపేట(విజయవాడ తూర్పు): స్లీప్‌వెల్ సంస్థ తమ నూతన ఉత్పాదన కంఫర్ట్ సెల్ టెక్నాలజీ మ్యాట్రెసెస్(పరుపులు)ను శనివారం ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు. విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భూషన్ పాఠక్ సరికొత్త పరుపులను విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిగా కంఫర్ట్‌సెల్ మ్యాట్రస్ టెక్నాలజీని ప్రవేశ పెట్టినట్లు ప్రకటించారు. ఈ టెక్నాలజీ ద్వారా పరుపులు అత్యంత సౌకర్యాన్ని, ఆహ్లాదకర నిద్రను ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ పరుపులు నిద్రను పాడుచెయ్యకుండా పనిచేయడమే కాకుండా, మీ వెన్నును రాత్రంతా తన సహజసిద్ధ రీతిలో ఉండే విధంగా ఉంచుతుందన్నారు. ఈ కంఫర్ట్ సెల్ శ్రేణిలో నాలుగు ప్రీమియం మోడల్స్ కేవలం సౌకర్యవంతమైన అనుభూతిని ఇవ్వడమే కాకుండా, విలాసవంతమైన ఫ్యాబ్రిక్స్ వాడటం ద్వారా అంతర్జాతీయ సొగసులను కలిగి ఉంటుందని పేర్కొన్నారు. స్లీప్‌వెల్ సౌత్ ఇండియా జనరల్ మేనేజర్ శ్రీనివాస్ పాండిచ్చేరి మాట్లాడుతూ తమ సంస్థ మానవ శరీర నిర్మాణాన్ని లోతుగా అర్థం చేసుకుంటూ దానిని అత్యంత సౌకర్యవంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఉంటారని, గుర్తిస్తూ దానికి అనుగుణంగా ఈ బ్రాండ్ సౌకర్యానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చిందన్నారు. -
స్లీప్‌వెల్ ‘కంఫర్ట్ సెల్’ పరుపులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పరుపుల తయారీ దిగ్గజం స్లీప్‌వెల్... కంఫర్ట్ సెల్ టెక్నాలజీతో నూతన శ్రేణిని రూపొందించింది. అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా ఈ పరుపులను డిజైన్ చేశామని, కస్టమర్ల వ్యక్తిగత అభిరుచులకు తగ్గట్టుగా (కస్టమైజేషన్) వీటిని తయారు చేసి ఇస్తామని స్లీప్‌వెల్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న షీలా ఫోమ్ డైరెక్టర్ రాకేశ్ చహర్ సోమవారమిక్కడ తెలిపారు. కంపెనీ ప్రతినిధులు భూషన్ పాఠక్, శశిధర్ బాబుతో కలసి మీడియాతో మాట్లాడారు. కంఫర్ట్ సెల్ టెక్నాలజీకి పేటెంటుకు దరఖాస్తు చేశామని తెలియజేశారు. నాలుగు మోడళ్లను ప్రవేశపెట్టామని, వీటి ధరలు రూ.40,000 మొదలుకుని రూ.1 లక్ష వరకు ఉన్నాయని వివరించారు. కస్టమైజేషన్‌కు ఎటువంటి అదనపు చార్జీ లేకుండానే ప్రమోషన్లో భాగంగా ఆఫర్ చేస్తున్నట్టు చెప్పారు. 15 శాతంపైగా వృద్ధి.. స్లీప్వెల్కు భారత మార్కెట్ నుంచి గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,450 కోట్ల టర్నోవర్ సమకూరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతంపైగా వృద్ధి ఆశిస్తున్నట్టు రాకేశ్ చహర్ వెల్లడించారు. ‘సరైన పరుపు ఉంటేనే నిద్ర బాగా పడుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. అందుకే మా షోరూంల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. వినియోగదార్లకు అవసరమైన రీతిలో పరుపులను రూపొందించి సరఫరా చేస్తున్నాం. చిన్న పట్టణాల్లో మా ఔట్లెట్లు ఉన్నచోట రూ.20 వేల ఖరీదైన పరుపులూ కొంటున్నారు. దేశవ్యాప్తంగా స్లీప్‌వెల్ షోరూంలు 800, షాప్ ఇన్ షాప్స్ 1,200ల దాకా ఉన్నాయి. స్లీప్‌వెల్ ఆదాయంలో ఔట్లెట్ల నుంచి 45 శాతం సమకూరుతోంది’ అని వివరించారు. -
ఐపీవోకు వస్తున్న షీలా ఫోమ్
స్లీప్‌వెల్ బ్రాండుతో పరుపులను(మ్యాట్రెస్) అమ్ముతున్న షీలా ఫోమ్ ప్రెవేట్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ కి రానుంది. దీనికి సంబందించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఈ ఐపీవో ద్వారా సుమారు రూ. 510 కోట్ల సమీకరించాలని యోచిస్తోంది. 15 శాతం వాటాను విక్రయించాలని కంపెనీ భావిస్తున్న కంపెనీ దీనికి అనుమతించమనికోరుతూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకుంది. దీంతో కంపెనీ విలువ 40-50 కోట్ల డాలర్లకు చేరనుందని అంచనా . రూ. 5 ముఖవిలువగల షేర్లను అమ్మకానికి ఉంచనుంది. తదుపరి దశలో ఆఫర్ చేయనున్న షేర్ల సంఖ్యను వెల్లడించనుంది. ఎదెల్ వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్ నిర్వహిణలో ఐపీవోకు రానుంది. రాహుల్ గౌతమ్ నేతృత్వంలోని షీలా ఫోమ్ పాలీరెథాన్ ఫోమ్ ఆధారిత పరుపులను విక్రయిస్తుంది. స్లీప్ వెల్ ప్రధాన బ్రాండ్ కాగా పారిశ్రామిక కంపెనీలకు కూడా ఫోమ్ ను కూడా విక్రయిస్తుంది. కాగా 2015 ఆర్థికసంవత్సం పోలిస్తే 2016లో ఇప్పటివరకూ 10 సంస్థలు ఐపీవోకి వచ్చాయి. దీని ద్వారా 6, 743కోట్లమేరకు ఆర్జించాయి. ప్రేమ్ డేటా బేస్ ప్రకారం 2015లో 21 కంపెనీలు 13,600 కోట్లను ఆర్జించాయి.