లబ్బీపేట(విజయవాడ తూర్పు): స్లీప్‌వెల్ సంస్థ తమ నూతన ఉత్పాదన కంఫర్ట్ సెల్ టెక్నాలజీ మ్యాట్రెసెస్(పరుపులు)ను శనివారం ఆంధ్రప్రదేశ్ మార్కెట్‌లోకి లాంఛనంగా విడుదల చేశారు. విజయవాడలోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భూషన్ పాఠక్ సరికొత్త పరుపులను విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిగా కంఫర్ట్‌సెల్ మ్యాట్రస్ టెక్నాలజీని ప్రవేశ పెట్టినట్లు ప్రకటించారు. ఈ టెక్నాలజీ ద్వారా పరుపులు అత్యంత సౌకర్యాన్ని, ఆహ్లాదకర నిద్రను ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.
ఈ పరుపులు నిద్రను పాడుచెయ్యకుండా పనిచేయడమే కాకుండా, మీ వెన్నును రాత్రంతా తన సహజసిద్ధ రీతిలో ఉండే విధంగా ఉంచుతుందన్నారు. ఈ కంఫర్ట్ సెల్ శ్రేణిలో నాలుగు ప్రీమియం మోడల్స్ కేవలం సౌకర్యవంతమైన అనుభూతిని ఇవ్వడమే కాకుండా, విలాసవంతమైన ఫ్యాబ్రిక్స్ వాడటం ద్వారా అంతర్జాతీయ సొగసులను కలిగి ఉంటుందని పేర్కొన్నారు. స్లీప్‌వెల్ సౌత్ ఇండియా జనరల్ మేనేజర్ శ్రీనివాస్ పాండిచ్చేరి మాట్లాడుతూ తమ సంస్థ మానవ శరీర నిర్మాణాన్ని లోతుగా అర్థం చేసుకుంటూ దానిని అత్యంత సౌకర్యవంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఉంటారని, గుర్తిస్తూ దానికి అనుగుణంగా ఈ బ్రాండ్ సౌకర్యానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చిందన్నారు.
ఏపీ మార్కెట్‌లోకి స్లీప్‌వెల్ కంఫర్ట్‌సెల్ పరుపు
Published Sun, Feb 4 2018 1:23 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM
Advertisement
Advertisement