స్లీప్‌వెల్ బ్రాండుతో పరుపులను(మ్యాట్రెస్) అమ్ముతున్న షీలా ఫోమ్ ప్రెవేట్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ కి రానుంది. దీనికి సంబందించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఈ ఐపీవో ద్వారా సుమారు రూ. 510 కోట్ల సమీకరించాలని యోచిస్తోంది. 15 శాతం వాటాను విక్రయించాలని కంపెనీ భావిస్తున్న కంపెనీ దీనికి అనుమతించమనికోరుతూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకుంది. దీంతో కంపెనీ విలువ 40-50 కోట్ల డాలర్లకు చేరనుందని అంచనా . రూ. 5 ముఖవిలువగల షేర్లను అమ్మకానికి ఉంచనుంది. తదుపరి దశలో ఆఫర్ చేయనున్న షేర్ల సంఖ్యను వెల్లడించనుంది. ఎదెల్ వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్ నిర్వహిణలో ఐపీవోకు రానుంది.
రాహుల్ గౌతమ్ నేతృత్వంలోని షీలా ఫోమ్ పాలీరెథాన్ ఫోమ్ ఆధారిత పరుపులను విక్రయిస్తుంది. స్లీప్ వెల్ ప్రధాన బ్రాండ్ కాగా పారిశ్రామిక కంపెనీలకు కూడా ఫోమ్ ను కూడా విక్రయిస్తుంది. కాగా 2015 ఆర్థికసంవత్సం పోలిస్తే 2016లో ఇప్పటివరకూ 10 సంస్థలు ఐపీవోకి వచ్చాయి. దీని ద్వారా 6, 743కోట్లమేరకు ఆర్జించాయి. ప్రేమ్ డేటా బేస్ ప్రకారం 2015లో 21 కంపెనీలు 13,600 కోట్లను ఆర్జించాయి.
ఐపీవోకు వస్తున్న షీలా ఫోమ్
Published Mon, Aug 1 2016 5:45 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
Advertisement
Advertisement