safely
-
బీపీ ఉంటే ఆవేశపడరు..ఆవేశ పడటం వల్లే అది..
రక్తపోటు ముప్పు తప్పుతుంది ఇలా...నేటి ఆధునిక జీవన శైలి కారణంగా న్నపిల్లలనుం పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉరుకులు, పరుగులు... ఏవేవో టెన్షన్లు, ఒత్తిడులు, ఆవేశాలు, ఆవేదనలు, ఆందోళనలే. ఫలితంగా వయసుతో నిమిత్త లేకుండా రక్తపోటు పెరిగిపోతుంటుంది. హై బీపీ అనేక రోగాలకు ఆలవాలం. వచ్చాక బాధపడే కంటే రాకుండా నివారించుకోవడం మేలు. అందువల్ల అధిక రక్తపోటును ఎలా నివారించుకోవచ్చో తెలుసుకుందాం...చాలామంది అపొహ ఏమిటంటే ఎవరైనా ఇతరులమీద ఆవేశ పడుతుంటే, కేకలు వేస్తుంటే అదంతా బీపీ వల్ల అనుకుంటారు. అయితే అది తప్పు. బీపీ ఉండటం వల్ల ఆవేశపడరు. ఆవేశపడటం వల్ల బీపీ పెరుగుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. ముందుగా ఆహారపదార్థాలలో రక్తాన్ని ఉద్రేకపరిచే పదార్థాలను నిషేధించాలి. ఆహారంలో వాడే ప్చమిర్చి బదులు ఎండుమిర్చిని... క్రమంగా దాని బదులు కారపు రుచికోసం మిరియాలను ఉపయోగించాలి. అంటే మిరియాల చారు, మిరియాల కారం ఇలాంటివన్నమాట. మనం వాడే రాళ్ల ఉప్పు గాని, షాపుల్లో దొరికే (అయోడైజ్డ్ సాల్ట్‌తో సహా) ఇతర ఉప్పుల బదులు సైంధవ లవణం వాడటం మంది. అదేవిధంగా పులుపు కోసం కొత్త చింతపండుకు బదులు పాతచింతపండు లేదా దేశవాళీ టమాటాలు ఉపయోగించడం శ్రేయస్కరం. గడ్డ పెరుగుకు బదులు పలుచని మజ్జిగ మంచిది. ఎందుకంటే, ఆయుర్వేదం ప్రకారం మజ్జిగ పేగుల్లో విషపదార్థాలు లేకుండా ఉదరంలో పిత్తరసం ప్రకోపించకుండా రక్తపోటు పెరగకుండా కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. షాపుల్లో దొరికే స్వీట్లకు బదులు ఇంట్లో పాతబెల్లంతో చేసుకున్న తీపిని వాడుతుంటే ఎలాంటి ప్రమాదం రాదు. కూరల తయారీలో వెల్లుల్లి, కరివేపాకు, పుదీనా, అల్లం, జీలకర్ర, ధనియాలు, మిరియాలను ఉపయోగించడం ఆరోగ్యకరం. ఉదయం 9.30 గంటల లోపు, రాత్రి 7.30 గంటలలోపు తినడం ముగించాలి. రాత్రిపూట కప్పు నీటిలో చెంచా మెంతులు వేసి మూత పెట్టి ఉదయం బ్రష్ చేసుకోగానే ఆ నానబెట్టిన మెంతులను నమిలి తినాలి. మెంతులు నానబెట్టిన ఆ నీటిని కూడా తాగాలి. ఒక పచ్చి ఉల్లిపాయను ముక్కలుగా తరిగి కూరన్నంతో, మజ్జిగన్నంతోనూ కలిపి తింటుంటే క్రమంగా రక్తపోటు అదుపులోకి వస్తుంది. (చదవండి: 'రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా'.. ఊపిరి సలపని పనుల్లో మహిళా శాస్త్రవేత్తలు) -
‘ఎన్ఎస్ఓకు ఎలాంటి సంబంధం లేదు..పెగాసస్‌కు థ్యాంక్స్’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాపంగా ప్రకంపనలు రేపిన పెగాసస్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో సంస్థ స్పందించింది. లీకైన డేటా, ఫోన్ నెంబర్ల జాబితాకు ఎన్ఎస్ఓకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. అసలు స్నూపింగ్ లాంటి టెక్నాలజీని దేన్నీ వాడటం లేదనీ, ఫోన్ల డేటా ప్రాప్యత ఏదీ తమ క్లయింట్ల వద్ద లేదని తెలిపింది. వాస్తవానికి పెగాసస్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం కారణంగానే లక్షలాదిమంది ప్రజలు రాత్రిళ్లు నిశ్చింతగా నిద్రపోతున్నారని, వారంతా వీధుల్లో సురక్షితంగా సంచరిస్తున్నారని ఎన్ఎస్ఓ తెలిపింది. సురక్షితమైన ప్రపంచాన్ని సృష్టించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఎన్ఎస్ఓ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ నిఘా సాఫ్ట్వేర్ పెగాసస్‌పై తీవ్ర వివాదాల మధ్య, ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ ఈ వివావాదానికి తమకు ఎలాంటి సంబంధం లేదని తనను తాను సమర్థించుకుంది పెగాసస్ లాంటి టెక్నాలజీకి కృతజ్ఞతలు తెలిపాలనీ పేర్కొంది. ఎందుకంటే ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ యాప్స్‌తో ఒకే గొడుగు కింద పని చేస్తున్న నేరస్తులు, ఉగ్రవాదులు, పెడోఫిలియా రింగులను నివారించే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, చట్ట అమలు సంస్థల పరిశోధనకు ఇది సాయపడుతోందని ఎన్ఎస్ఓ ప్రతినిధి చెప్పారు. ప్రపంచంలోని అనేక ఇతర సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీలతో కలిసి, ప్రభుత్వాలకు సైబర్ ఇంటెలిజెన్స్ సాధనాలను అందిస్తామని ప్రకటించింది. అలాగే తన క్లయింట్లు సేకరించిన డేటా పూర్తిగా సురక్షితమని కూడా వాదించింది. ఇంటెలిజెన్స్, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు అందిస్తున్న టెక్నాలజీ కారణంగానే ప్రజలంతా సురక్షితంగా ఉన్నారని, సంతోషంగా నిద్రపోతు న్నారని పేర్కొంది కాగా భారతదేశం సహా పలు దేశాల్లోని జర్నలిస్టులు, మానవహక్కుల నేతలు, రాజకీయ నాయకులు, ఇతరులపై నిఘాకు పెగసాస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించిందన్న వివాదం పెద్ద దుమారాన్ని రేపింది. ఇజ్రాయెల్ సంస్థ వివిధ ప్రభుత్వాలకు విక్రయించిన ఫోన్ ట్యాపింగ్ సాప్ట్వేర్ ఆరోపణలతో గోప్యతకు సంబంధించిన సమస్యలపై అనే ఆందోళన రేకెత్తించింది. మరోవైపు లీకయిన నంబర్లు ఎన్ఎస్ఓ సాఫ్ట్వేర్ వినియోగిస్తున్న దేశాలకు సంబంధించినవేనని పలువురు నిపుణులు ఇప్పటికే తేల్చి చెప్పారు. అయితే ఈ విమర్శలను కొట్టిపారేసిన ఎన్ఎస్ఓ,పెగాసస్‌కు సంబంధించిన అన్ని ఆరోపణలపై దర్యాప్తు జరిపిస్తామని, తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఎర్రకాలువలో తిరగబడిన ఫెడల్ బోట్
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయంలో ప్రారంభమైన బోటింగ్ షికారు పర్యటనలో భాగంగా ఆదివారం జలాశయంలోకి షికారుకు వెళ్లిన ఫెడల్ బోట్ బోల్తాపడింది. ఇద్దరు పర్యాటకులు ఫెడలింగ్ చేసుకుంటూ జలాశయంలోకి వెళ్లారు. జలాశయంలో నీరు ఉద్ధృతంగా అలలు వేయడంతో వీరు ప్రయాణిస్తున్న ఫెడల్ బోట్ బోల్తా కొట్టింది. అయితే వీరు భద్రతా జాకెట్లు ధరించి ఉండటంతో ప్రమాదం తప్పింది. సిబ్బంది వీరిని వేరొక రెడ్చిల్లి బోటింగ్లోకి ఎక్కించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అలలు ఎక్కువ ఉన్న సమయంలో ఫెడల్బోట్ పై షికారుకు అనుమతి ఇవ్వడం సరికాదని పర్యాటకులు పేర్కొంటున్నారు. -
బాలుడి కిడ్నాప్ కేసులో నలుగురి అరెస్ట్
-
మృత్యుంజయుడు
-
విశాఖ హార్బర్‌కు చేరిన 17 బోట్లు
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లాలో తీరప్రాంత మండలాల్లో గత వారం చేపల వేటకు వెళ్లి గల్లంతైన 17బోట్లు సోమవారం విశాఖ హార్బర్ కు చేరుకున్నాయి. 12 మంది మత్య్స కారులు క్షేమంగా తిరిగొచ్చారు. వారంతా తొండంగి మండలం ఎస్.పెరుమాళ్లపురం గ్రామానికి చెందినవారు. 22 బోట్లలో గతవారం మత్స్యకారులు వేటకు వెళ్లారు. అయితే భారీ వర్షం కారణంగా సముద్రంలో వాతావరణం అల్లకల్లోలంగా ఉండటంతో వీరంతా దారి తప్పారు. చివరకు విశాఖలో 3, కాకినాడలో 3 ఉప్పాడలో 7 తొండంగిలో3 శ్రీకాకుళంలో ఒక బోటు ఒడ్డుకు చేరుకున్నాయి. మరో ఐదు బోట్ల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఓ మత్స్యకారుడు గల్లంతు అయినట్లు సమాచారం. గల్లంతైన బోట్ల కోసం నావీ అధికారులు గాలిస్తున్నారు. -
రెండు బోట్ల ఆచూకీలభ్యం
-
రెండు బోట్ల ఆచూకీ లభ్యం
తూర్పుగోదావరి జిల్లా: వేటకు వెళ్లి ఆచూకీ గల్లంతైన దుమ్ములు పేటకు చెందిన 2 బోట్లు సురక్షితంగా తీరానికి చేరుకున్నాయి. ఒక బోటు విశాఖపట్నం, మరో బోటు విశాఖ జిల్లా చింతపల్లి తీరానికి చేరుకున్నట్లు స్థానిక మత్స్యకారులు తెలిపారు. గల్లంతైన వాటిలో కాకినాడకు చెందిన 20 బోట్లు, తొండంగి మండలానికి చెందిన 4 బోట్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. -
క్షేమంగా చేరిన భూకంపబాధితులు
-
ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలు