రక్తపోటు ముప్పు తప్పుతుంది ఇలా...నేటి ఆధునిక జీవన శైలి కారణంగా న్నపిల్లలనుం పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉరుకులు, పరుగులు... ఏవేవో టెన్షన్లు, ఒత్తిడులు, ఆవేశాలు, ఆవేదనలు, ఆందోళనలే. ఫలితంగా వయసుతో నిమిత్త లేకుండా రక్తపోటు పెరిగిపోతుంటుంది. హై బీపీ అనేక రోగాలకు ఆలవాలం. వచ్చాక బాధపడే కంటే రాకుండా నివారించుకోవడం మేలు. అందువల్ల అధిక రక్తపోటును ఎలా నివారించుకోవచ్చో తెలుసుకుందాం...చాలామంది అపొహ ఏమిటంటే ఎవరైనా ఇతరులమీద ఆవేశ పడుతుంటే, కేకలు వేస్తుంటే అదంతా బీపీ వల్ల అనుకుంటారు. అయితే అది తప్పు. బీపీ ఉండటం వల్ల ఆవేశపడరు. ఆవేశపడటం వల్ల బీపీ పెరుగుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.
- ముందుగా ఆహారపదార్థాలలో రక్తాన్ని ఉద్రేకపరిచే పదార్థాలను నిషేధించాలి.
- ఆహారంలో వాడే ప్చమిర్చి బదులు ఎండుమిర్చిని... క్రమంగా దాని బదులు కారపు రుచికోసం మిరియాలను ఉపయోగించాలి. అంటే మిరియాల చారు, మిరియాల కారం ఇలాంటివన్నమాట.
- మనం వాడే రాళ్ల ఉప్పు గాని, షాపుల్లో దొరికే (అయోడైజ్‌డ్ సాల్ట్‌తో సహా) ఇతర ఉప్పుల బదులు సైంధవ లవణం వాడటం మంది.
- అదేవిధంగా పులుపు కోసం కొత్త చింతపండుకు బదులు పాతచింతపండు లేదా దేశవాళీ టమాటాలు ఉపయోగించడం శ్రేయస్కరం.
- గడ్డ పెరుగుకు బదులు పలుచని మజ్జిగ మంచిది. ఎందుకంటే, ఆయుర్వేదం ప్రకారం మజ్జిగ పేగుల్లో విషపదార్థాలు లేకుండా ఉదరంలో పిత్తరసం ప్రకోపించకుండా రక్తపోటు పెరగకుండా కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
- షాపుల్లో దొరికే స్వీట్లకు బదులు ఇంట్లో పాతబెల్లంతో చేసుకున్న తీపిని వాడుతుంటే ఎలాంటి ప్రమాదం రాదు. కూరల తయారీలో వెల్లుల్లి, కరివేపాకు, పుదీనా, అల్లం, జీలకర్ర, ధనియాలు, మిరియాలను ఉపయోగించడం ఆరోగ్యకరం.
- ఉదయం 9.30 గంటల లోపు, రాత్రి 7.30 గంటలలోపు తినడం ముగించాలి.
- రాత్రిపూట కప్పు నీటిలో చెంచా మెంతులు వేసి మూత పెట్టి ఉదయం బ్రష్ చేసుకోగానే ఆ నానబెట్టిన మెంతులను నమిలి తినాలి. మెంతులు నానబెట్టిన ఆ నీటిని కూడా తాగాలి.
- ఒక పచ్చి ఉల్లిపాయను ముక్కలుగా తరిగి కూరన్నంతో, మజ్జిగన్నంతోనూ కలిపి తింటుంటే క్రమంగా రక్తపోటు అదుపులోకి వస్తుంది.
(చదవండి: 'రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా'.. ఊపిరి సలపని పనుల్లో మహిళా శాస్త్రవేత్తలు)
Comments
Please login to add a commentAdd a comment