రక్తహీనతతో బాధ ప‌డుతున్నారా.. అయితే ఇవి తీసుకోండి! | Take These Anemia Will Not Come | Sakshi
Sakshi News home page

రక్తహీనతతో బాధ ప‌డుతున్నారా.. అయితే ఇవి తీసుకోండి!

Published Sat, Dec 23 2023 12:08 PM | Last Updated on Sat, Dec 23 2023 12:08 PM

Take These Anemia Will Not Come - Sakshi

'మన శరీరంలో పోషకాలు, ఆక్సిజన్‌ ప్రతి కణానికి సరిగ్గా అందడంలో రక్తం పాత్ర ముఖ్యమైనది. సరైన ఆరోగ్యం కోసం తగినంత రక్తం శరీరంలో ఉండాల్సిన అవసరం ఉంది. శరీరంలో రక్తం లోపించిన పరిస్థితిని అనీమియా అంటారు. రక్తం సరిగ్గా ఉండటానికి సరైన ఆహారాలు తినటం ఎంత ముఖ్యమో ప్రాసెస్డ్‌ ఆహారాలు, కృత్రిమ షుగర్స్‌ గల ఆహారాలు తగ్గించడం కూడా అంతే ముఖ్యం.' 

  • ఐరన్‌ అనేది ఎర్ర రక్త కణాలలోని హిమోగ్లోబిన్‌ లో కనిపించే ఒక ఖనిజం. హిమోగ్లోబిన్‌ ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు చేరవేస్తుంది. శరీరంలో ఐరన్‌ లోపం ఉన్నప్పుడు, ఎర్ర రక్త కణాలు సరిగా ఉత్పత్తి కావు, గుడ్లు, మాంసం, చేపలు, టోఫు, పప్పులు, చిక్కుళ్ళు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఐరన్‌ లోపం తలెత్తకుండా ఉంటుంది.
  • విటమిన్‌ బి 12 అనేది ఒక విటమిన్, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరం. విటమిన్‌ బి12 లోపం ఉన్నప్పుడు, ఎర్ర రక్తకణాలు సరిగా పనిచేయలేవు. అందువల్ల ఆహారంలెఓ విటమిన్‌–బి 12 లభించే మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు తీసుకోవాలి.
  • ఫోలిక్‌ యాసిడ్‌ అనేది ఒక విటమిన్, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా అవసరం. ఫోలిక్‌ యాసిడ్‌ లోపం ఉన్నప్పుడు, ఎర్ర రక్త కణాలు సరిగా పెరగలేవు, అందువల్ల ఫోలిక్‌ యాసిడ్‌ ఉండే గుడ్లు, మాంసం, చేపలు, ఆకుకూరలు, బీన్స్‌, చిక్కుళ్ళు తీసుకోవాలి.

ప్రోటీన్లు అనేవి శరీరం యొక్క నిర్మాణాత్మక భాగాలు. ప్రోటీన్లు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా అవసరం. ప్రోటీన్ల–మూలం మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, పప్పులు, చిక్కుళ్ళు, ధాన్యాలు, ఆకుకూరలు, తోటకూర, పాలకూర, గోంగూర వంటి ఆకుకూరల్లో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది, ఈ ఐరన్‌ మన రక్తం లోని హిమోగ్లోబిన్‌ ఉత్పత్తిలో ముఖ్యమైనది. ఆకు కూరల్లాంటి ఐరన్‌ రిచ్‌ ఫుడ్స్‌ తినడం వల్ల రక్తం పెరిగి అనీమియా వంటి సమస్య రాకుండా ఉంటుంది.

చిక్కుళ్ళు, పప్పు దినుసులు
చిక్కుళ్ళు, పప్పు దినుసుల్లో కూడా ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉన్న ప్లాంట్‌ బేస్డ్‌ ఐరన్‌ రక్తవృద్ధికి సహాయపడాలంటే వీటితో పాటు విటమిన్‌ సి అధికంగా ఉన్న ఫుడ్స్‌ కూడా తీసుకోవాలి. అలాగే వీటిలో ఫోలియేట్, విటమిన్‌ బి 6 కూడా ఉండటం వల్ల రక్తం తయారవ్వటానికి ఇవి బాగా దోహదం చేస్తాయి.

నట్స్, సీడ్స్‌
బాదం, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్‌ గింజలు వంటి నట్స్, సీడ్స్‌ లో ఫోలియేట్, ఐరన్, విటమిన్‌ ఇ ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్‌ ఇ ఎర్ర రక్తకణాలు నష్టపోకుండా కాపాడుతుంది.

బీట్‌ రూట్‌
బీట్‌ రూట్స్‌ లో ఐరన్, విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటాయి. అందుకని మన శరీరం లో బ్లడ్‌ లెవల్స్‌ పెరగడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఈ బీట్‌రూట్స్‌ లో ఉండే నైట్రేట్స్‌ రక్త ప్రసరణ సవ్యంగా జరగడానికి అలాగే రక్తంలో ఆక్సిజన్‌ సరిగ్గా ఉండటానికి సహాయపడతాయి.

సిట్రస్‌ పండ్లు
నారింజ పళ్ళు, ద్రాక్ష, నిమ్మకాయలు వంటి సిట్రస్‌ పండ్లలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్‌ సి అనేది మన శరీరంలో రక్తం పెరగడానికి అవసరం అయ్యే ఐరన్‌ గ్రహించడానికి సహాయపడుతుంది. అందుకనే ఐరన్‌ రిచ్‌ ఫుడ్స్‌ తో పాటు ఈ సిట్రస్‌ పండ్లు కూడా తీసుకోవటం మంచిది.
ఇవి కూడా చ‌ద‌వండి: ఆస్తమా 'దమ్ముందా'? ఇలా చేసి చూడండి! వెంట‌నే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement