health alert
-
నిలకడగా ఏచూరి ఆరోగ్యం: సీపీఎం
న్యూఢిల్లీ: సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి(72) ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నారని ఆ పార్టీ తెలిపింది. ఈ మేరకు సీపీఎం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో కామ్రెడ్ సీతారాం ఏచూరి చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల తీవ్ర ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయనకు చికిత్స అందుతోంది. సానుకూల స్పందన కనిపిస్తోంది. కామ్రెడ్ సీతారాం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది’అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఛాతీలో న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్ సోకడంతో ఆగస్ట్ 19వ తేదీన ఆన ఎయిమ్స్‌లో చేరారు. -
World Health Day: ఏయే వయసుల్లో.. ఏయే వ్యాక్సిన్లు! ఏయే వైద్య పరీక్షలు..?
ఆరోగ్య సమస్య ఏమైనా వస్తే చికిత్స తప్ప ప్రత్యామ్నాయం లేదు. కానీ సమస్య రాకుండా ముందే నివారించుకుంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదు. చికిత్స కంటే నివారణే మేలు అనే సూక్తి మేరకు వ్యాధుల నివారణకు ఉపయోగపడే అంశాల్లో మొట్టమొదటి అంశం టీకాలు (వ్యాక్సిన్లు). రెండో అంశం.. లక్షణాలు కనిపించగానే చేయించాల్సిన వైద్యపరీక్షలు. నేడు ‘వరల్డ్ హెల్త్ డే’. ఈ సందర్భంగా ఏ వయసులో. వారు ఏయే వ్యాక్సిన్లు తీసుకోవాలన్న అంశంపై అవగాహన కోసం ఈ కథనం. టీకాలు.. చిన్నారి పుట్టిన వెంటనే.. ఓపీవీ, బీసీజీలతో పాటు హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాత 6, 10, 14 వారాల్లో ఇస్తారు). ఆరు వారాలప్పుడు: డీ–ట్యాప్ (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) / డీపీటీ టీకా ఫస్ట్ డోస్ హెచ్ఐబీ (హిబ్) (హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి) టీకా ఫస్ట్ డోస్ ఐపీవీ (ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్)/ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) టీకా ఫస్ట్ డోస్ పీసీవీ 13 (న్యూమోకోకల్ కాంజుగేట్ టీకా) ఫస్ట్ డోస్ రొటావైరస్ టీకా మొదటి డోస్ (ఇది నోటిద్వారా ఇస్తారు) హెపటైటిస్–బి వ్యాక్సిన్ రెండో డోస్. పది వారాలప్పుడు: డీ–ట్యాప్ (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) / డీపీటీ టీకా రెండో మోతాదు హెచ్ఐబీ (హిబ్) (హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి) టీకా రెండో మోతాదు ఐపీవీ / ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) టీకా రెండోడోస్ పీసీవీ 13 రెండో మోతాదు నోటిద్వారా ఇచ్చే రొటావైరస్ టీకా రెండో డోస్ హెపటైటిస్–బి మూడో డోస్. పద్నాలుగు వారాలప్పుడు: డీ–ట్యాప్ (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) / డీపీటీ టీకా మూడో మోతాదు హెచ్ఐబీ (హిబ్) (హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి) టీకా మూడోమోతాదు ఐపీవీ (ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్)/ ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) టీకా మూడో మోతాదు పీసీవీ 13 (న్యూమోకోకల్ కాంజుగేట్ టీకా) మూడో మోతాదు రొటావైరస్ టీకా మూడో డోస్ (ఇది నోటిద్వారా ఇచ్చే డోస్) హెపటైటిస్–బి వ్యాక్సిన్ నాలుగో మోతాదు. ఆరు నెలల వయసప్పుడు: ఇన్ఫ్లుయెంజా టీకా మొదటి మోతాదు ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) మొదటి మోతాదు ఏడు నెలల వయసప్పుడు: ఇన్ఫ్లుయెంజా టీకా రెండో మోతాదు తొమ్మిది నెలల వయసప్పుడు: ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) రెండో మోతాదు ఎమ్ఎమ్ఆర్ (తట్టు, గవదబిళ్లలు, రుబెల్లా) టీకా ఫస్ట్ డోస్ టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ ఇస్తారు. పన్నెండు నుంచి 15 నెలల వయసప్పుడు: ఎమ్ఎమ్ఆర్ (తట్టు, గవదబిళ్లలు, రుబెల్లా) టీకా రెండో మోతాదు వారిసెల్లా (చికెన్‌పాక్స్) టీకా మొదటి మోతాదు హెపటైటిస్–ఏ టీకా మొదటి మోతాదు (దీని రెండో డోస్ సాధారణంగా 18 నెలలప్పుడు ఇస్తారు) పీసీవీ (ప్యాక్డ్ సెల్ వాల్యూమ్) బూస్టర్. పద్దెనిమిది నెలల వయసప్పుడు: డీట్యాప్ టీకా మొదటి బూస్టర్ డోస్ హెచ్ఐబీ (హిబ్) టీకా మొదటి బూస్టర్ డోస్ ఐపీవీ లేదా ఓపీవీ టీకా హెపటైటిస్–ఏ రెండో డోస్. మూడేళ్ల వయసప్పుడు: వారిసెల్లా వ్యాక్సిన్ రెండో డోస్ టీకా. ఐదేళ్లప్పుడు: డీ–ట్యాప్ టీకా రెండో బూస్టర్ ఐపీవీ టీకా ∙ఎమ్ఎమ్ఆర్ టీకా మూడో డోస్. పది నుంచి పన్నెండేళ్ల వయసప్పుడు: హెచ్‌పీవీ టీకా మొదటి డోస్ (దీని రెండు, మూడు డోసులు 9 నుంచి 18 ఏళ్ల వయసప్పుడు) టీడ్యాప్ టీకా బూస్టర్ డోస్ ∙మెనింగోకోకల్ కాంజుగేట్ టీకా మొదటి డోస్ (దీని బూస్టర్ 16 ఏళ్ల వయసప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది). పదిహేను నుంచి 16 ఏళ్ల వయసప్పుడు: మెనింగోకోకల్ కాంజుగేట్ టీకా బూస్టర్ డోస్ టీడీ / డీటీ టీకా. 18 నుంచి 65 ఏళ్ల వరకు: ఈ వయసులో ఎవరికైనా మంచి వ్యాధి నిరోధకత ఉంటుంది. గతం లో ఏదైనా వ్యాక్సిన్ తీసుకోకపోతే... డాక్టర్ సలహా మేరకు తీసుకోవచ్చు. వ్యాక్సిన్ తీసుకున్నదీ లేనిదీ గుర్తులేనప్పుడు డాక్టర్‌కు ఆ విషయం చెబితే... వారు కొన్ని పరీక్షల ద్వారా వ్యాక్సిన్ తీసుకున్నదీ లేనిదీ నిర్ధారించి అవసరమైతే ఇస్తారు. 65 ఏళ్లు పైబడిన వారికి: ఈ వయసు దాటాక కొన్ని వ్యాక్సిన్లు తప్పనిసరిగాను, మరికొన్ని అవసరాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. పీసీవీ–13 అండ్ పీపీఎస్వీ 23 అనే వ్యాక్సిన్లను సాధారణంగా 65 ఏళ్లు దాటినవారికి ఇస్తుంటారు. ఇవి నిమోనియాను నివారించే నిమోకోకల్ వ్యాక్సిన్స్‌లు. ఇందులో తొలుత పీసీవీ–13 ఇస్తారు. ఆ తర్వాత రెండు నెలలకు పీపీఎస్వీ–23 ఇస్తారు టీ–డ్యాప్ వ్యాక్సిన్: చిన్నప్పుడు తీసుకున్న టెటనస్, డిఫ్తీరియా, పెర్టుసిస్ వ్యాధులను నివారించే వ్యాక్సిన్ తాలూకు బూస్టర్ డోసులను 65 ఏళ్లు పైబడ్డ తర్వాత ప్రతి పదేళ్లకోమారు తీసుకుంటూ ఉండాలి. - డాక్టర్ బీవీఎస్ అపూర్వ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. పరీక్షలు.. ముందుగానే కొన్ని వైద్య పరీక్షలు చేయించడం వల్ల కొన్ని వ్యాధుల్ని కనుగొని సంపూర్ణంగా నయం చేసుకోవచ్చు. ఉదాహరణకు సర్వైకల్ క్యాన్సర్ అనే వ్యాధికి సుదీర్ఘమైన ముందస్తు వ్యవధి ఉంటుంది. అంటే అసలు వ్యాధి రావడానికి పదేళ్ల ముందునుంచే ‘ప్రీ–సర్వైకల్ పీరియడ్’ ఉంటుంది. పాప్ స్మియర్ అనే పరీక్ష ద్వారా వ్యాధి రాబోయే దశాబ్దకాలం ముందుగానే దాన్ని కనుగొనవచ్చు. క్యాన్సర్ ను ఎంత త్వరగా కనుగొంటే అంత తేలికగా నయమవుతుంది. ఆరోగ్యంగా ఉండటం కోసం ముందస్తుగా ఏయే వయసుల్లో ఏయే వైద్యపరీక్షలు ఉపకరిస్తాయో తెలుసుకుందాం. 0 – 10 ఏళ్ల వయసులో: ఈ వయసులో అవసరం అయితే తప్ప పెద్దగా వైద్యపరీక్షలు అవసరం లేదు. 11 – 20 ఏళ్లు: ఇది యుక్తవయసులోకి మారే దశ. నిర్దిష్టంగా ఏవైనా వైద్యసమస్యలు ఉండటం లేదా లక్షణాలు కనిపించడం వంటి సమయాల్లో తప్ప... ఈ వయసులోనూ పెద్దగా వైద్యపరీక్షలు అవసరం పడవు. 20 – 30 ఏళ్లు: ఈ వయసులో కొన్ని లైంగిక సాంక్రమిక వ్యాధులు (ఎస్టీఐ’స్) కోసం మరీ ముఖ్యంగా హెపటైటిస్–బీ నిర్ధారణ పరీక్షలు చేయించి హెచ్‌బీఐజీ వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే అమ్మాయిలైతే పాప్‌స్మియర్ వంటి గైనిక్ పరీక్ష లు చేయించుకుని, 12 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్యకాలంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ప్రయోజనకరం. 30 నుంచి 40 ఏళ్లు: ఈ వయసు నుంచి డయాబెటిస్ కోసం హెచ్‌బీఏ1సీ అనే రక్తపరీక్షలు, రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలి. ఏవైనా తేడాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి ఈసీజీ, టూ డీ ఎకో, అవసరాన్ని బట్టి ట్రెడ్మిల్ వంటి పరీక్షలు చేయించాలి. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలూ మంచిదే. మహిళలైతే డాక్టర్ సలహా మేరకు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మామోగ్రామ్ పరీక్ష చేయించాలి. 40 – 50 ఏళ్లు: ఈ వయసు నుంచి దేహంలో కొన్ని మార్పులు మొదలవుతాయి. అందుకే ఈ వయసులో పరీక్షలు తరచూ చేయిస్తుండటం మేలు. రక్తపోటును తెలుసుకోవడం కోసం సిస్టోల్, డయాస్టోల్ ప్రెషర్స్, రక్తలో చక్కెర మోతాదుల కోసం హెచ్‌బీఏ1సీతో పాటు అవసరమైతే గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ (జీటీటీ), పొద్దున్నే పరగడుపున, ఏదైనా తిన్న తర్వాత చేసే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ్రపాండియల్ వైద్య పరీక్షలతోపాటు అవసరాన్ని బట్టి కొన్నిరకాల క్యాన్సర్ పరీక్షలు చేయించడం మంచిది. అలాగే మహిళలైతే ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ కోసం బోన్ డెన్సిటీ పరీక్ష చేయించాలి. దాంతోపాటు మామోగ్రామ్, పాప్ స్మియర్ పరీక్షలను డాక్టర్ చెప్పిన వ్యవధుల్లో చేయించాలి. ఇక పురుషులైతే ఈ వయసు నుంచి ్రపోస్టేట్ స్పెసిఫిక్ ఏంటీజెన్... సంక్షిప్తంగా పీఎస్ఏ అనే పరీక్షను డాక్టర్లు చెప్పిన వ్యవధుల్లో చేయించుకుంటూ ఉండాలి. 50 – 60 ఏళ్లు: చాలామంది 50 ఏళ్ల వరకు ఎలాంటి పరీక్షలు చేయించకపోవచ్చు. అయితే అలాంటివాళ్లంతా ఈ 50 – 60 ఏళ్ల మధ్యవయసులో తప్పక వైద్యపరీక్షలు చేయించాల్సిన అవసరం తప్పక వస్తుంది. ముందు నుంచి పరీక్షలు చేయించని వాళ్లతోపాటు ఈ వయసులోని అందరూ ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ కోసం బోన్ స్కాన్, కోలన్ క్యాన్సర్ నిర్ధారణ కోసం కొలనోస్కోపీ, గుండె జబ్బుల కోసం తరచూ ఈసీజీ, టూ డీ ఎకో, ట్రెడ్మిల్ పరీక్షలతో పాటు లక్షణాలను బట్టి ఇతర వైద్యపరీక్షలు చేయిస్తుండాలి. మహిళలకు 50 ఏళ్ల వయసు తర్వాత మెనోపాజ్ రావడంతో గుండెకు ఉండే ఒక సహజ రక్షణ తొలగిపోతుంది. అందువల్ల గతంలో చేయించినా, చేయించక పోయినా ఈ వయసు నుంచి మహిళలు గుండెకు సంబంధించిన అన్ని స్క్రీనింగ్ పరీక్షలు అంటే ఈసీజీ, టూడీ ఎకో, ట్రెడ్మిల్ వంటి పరీక్షలు చేయించాలి. 60 నుంచి 70 ఏళ్లు: ఈ వయసులో వాళ్లనే సీనియర్ సిటిజెన్‌గా పరిగణిస్తుంటారు. పురుషులూ మహిళలు అన్న తేడాలేకుండా... ఈ వయసు నుంచి అందరూ... ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ కోసం బోన్ స్కాన్, కోలన్ క్యాన్సర్ నిర్ధారణ కోసం కొలనోస్కోపీ, గుండెజబ్బుల కోసం తరచూ ఈసీజీ, టూ డీ ఎకో, ట్రెడ్మిల్ పరీక్షలతోపాటు లక్షణాలను బట్టి మరికొన్ని ప్రత్యేకమైన పరీక్షలు అవసరమవుతాయి. 70+ పైబడ్డాక.. ఆపైన కూడా.. ఈ వయసు నుంచి లక్షణాలను బట్టి ఓ వ్యక్తి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండేందుకు పైన పేర్కొన్న వైద్యపరీక్షలతో పాటు కొన్ని వ్యాక్సిన్లు, మరికొన్ని మందులు తీసుకోవాలి. ఒకవేళ పోషకాహార లోపం ఉంటే, తగిన ఆహారం తీసుకోవాలి. దాంతోపాటు అవసరం అయితే మరికొన్ని హెల్త్ సప్లిమెంట్స్ వంటివి తీసుకోవాల్సి ఉంటుంది. - డాక్టర్ హరికిషన్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్. ఇవి చదవండి: మన తెలుగువాడి బయోపిక్ -
హెల్త్: గుటక వేయడం కష్టమవుతోందా? అయితే ఇలా చేయండి..
నోట్లో ఉన్న ఆహారాన్ని నమిలాక మింగివేసే ప్రక్రియ చాలా సులువుగా జరుగుతున్నట్లు అనిపిస్తుందిగానీ, నిజానికి ఇదొక సంక్లిష్ట ప్రక్రియ. ఇందులో నోరు, జీర్ణవ్యవస్థ తాలూకు కండరాలూ, నరాలు ఇవన్నీ పాలుపంచుకుంటాయి. కొన్నిసార్లు కొన్ని అంతరాయాలూ, అవాంతరాలతో గుటక వేసే ఈ ప్రక్రియ కష్టమవుతుంది. ఇలా మింగడం కష్టమయ్యే కండిషన్‌ను ‘డిస్ఫేజియా’ అంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది, దానికి పరిష్కారాలేమిటి అనే అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. గుటక వేసే ప్రక్రియ ప్రధానంగా మూడు దశల్లో జరుగుతుంది. అవి.. ఓరల్ ఫేజ్.. ఓరల్ ఫేజ్‌లో నోట్లో ఆహారాన్ని నమలడం లేదా చప్పరించడం జరుగుతుంది. అలా ఆహారాన్ని గొంతులోకి పంపడానికి సిద్ధం చేసే దశ వరకు ఓరల్ ఫేజ్ అంటారు. ఇందులో నోరు, నాలుక, పెదవులు, దంతాలు పాలుపంచుకుంటాయి. ∙ఇక ఫ్యారింజియల్ ఫేజ్ అంటే... తిన్నది కాస్తా గొంతు దగ్గర్నుంచి ఆహార నాళంలోకి చేరే దశగా చెప్పవచ్చు. ఈ సమయంలో ఎపిగ్లాటిస్ పొర విండ్ పైప్‌ను మూసుకుపోవడం వల్ల ఆహారం శ్వాసనాళంలోకి వెళ్లకుండా ఆహారనాళంలోకే వెళ్తుంది. ∙ఈసోఫేజియల్ ఫేజ్ దశలో ఆహారం ఈసోఫేగస్ అనే పైప్ ద్వారా ఆహారనాళంలోకి చేరుతుంది. అక్కడి నుంచి కడుపులోకి వెళ్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో మింగడం అనేది చాలా సులువుగా మన ప్రమేయం లేనట్టుగా జరిగినట్లు అనిపించినా, నిజానికి మింగడం అన్నది మన సంకల్పంతోనే జరుగుతుంది. గుటక వేయడంలో సమస్యలూ... కారణాలు ఫ్యారింజియల్ ఫేజ్.. గుటక వేసే దశలైన ఓరల్, ఫ్యారింజియల్, ఈసోఫేజియల్ దశల్లో ఎక్కడ ఏ అవాంతరం వచ్చినా మింగడంలో సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘డిస్ఫేజియా’ అంటారు. ఒక్కోసారి జీర్ణ వ్యవస్థను నియంత్రించే నరాల సమస్య వల్ల కూడా గుటక వేయడం సాధ్యం కాకపోవచ్చు. గుటక వేయలేకపోడానికి మరికొన్ని కారణాలు.. ఈసోఫేజియల్ ఫేజ్.. మరీ చిన్న పిల్లల్లో... తల్లిపాలు తాగడంలో ఇబ్బందులు, మరికాస్త పెద్ద పిల్లలు ఆహారం తీసుకునే సమయంలో శరీరాన్ని బిగబట్టడం; నమలలేకపోవడం, తినడానికి ఎక్కువ సమయం తీసుకోవడం. తినే సమయంలో దగ్గు రావడం లేదా పొలమారడం ∙తరచూ వాంతులు చేసుకోవడం ∙నోటి నుంచి ముక్కు నుంచి చొల్లు కారడం ∙గాలి తీసుకోవడానికీ, తినడానికి మధ్య సరైన సమన్వయం లేకపోవడం తరచూ నెమ్ము లేదా శ్వాస సంబంధింత సమస్యలతో బాధపడటం ∙గొంతు గరుకుగా మారడం లేదా గొంతులోంచి గాలి రావడం ఇక పెద్దవయసువారిలో.. తల, మెడ, ఆహార వ్యవస్థ, శ్వాసకోశవ్యవస్థలో కండరాలూ, వాటిని నియంత్రించే నరాల సమస్యతో మింగడం కష్టం కావచ్చు. ఇందుకు దారితీసే పరిస్థితుల్లో కొన్ని.. గొంతు లేదా తల భాగంలో దెబ్బ తగలడం మెదడువాపు, పక్షవాతం వంటి జబ్బులు వెన్నుపూసకు గాయం కావడం అల్జైమర్స్ మతిమరపుతో గుటకవేయలేకపోవడం మల్టిపుల్ స్కి›్లరోసిస్, పార్కిన్సన్స్ డిసీజ్, వయసు పైబడటంతో వచ్చే సమస్యలు గొంతు లేదా తలకు సంబంధించిన క్యాన్సర్‌తో మింగలేకపోవడం కొన్ని రకాల అనారోగ్యాలకు శస్త్రచికిత్స చేయడం వల్ల మింగలేకపోవడం కారణమేదైనప్పటికీ గుటక వేయలేని పరిస్థితితో పాటు నోటి నుంచి అదేపనిగా చొల్లు కారడం, తినేటప్పుడు విపరీతంగా దగ్గురావడం, గొంతు మారడం వంటి లక్షణాలు కనిపిస్తే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు.. బాధితుల లక్షణాలను బట్టి.. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన పరీక్షలు; నోటి పరీక్షలు, స్వరపేటికకు సంబంధించిన పరీక్షలు; నరాలకు సంబంధించిన లోపాలను తెలుసుకోడానికి సీటీ స్కాన్, ఎమ్మారై బ్రెయిన్, ఎమ్మారై హెడ్ అండ్ నెక్ వంటి పరీక్షలు అవసరం. వీటితో పాటు మాడిఫైడ్ బేరియమ్ స్వాలో టెస్ట్; వీడియో ఫ్లోరోస్కోపీ, ఫైబర్ ఆప్టిక్ ఎండోస్కోపిక్ ఎవాల్యుయేషన్ ఆఫ్ స్వాలోయింగ్ (ఫీస్) / ట్యూబ్ ఇవాల్యుయేషన్ వంటివి అవసరాన్ని బట్టి చేయించాల్సి రావచ్చు. చికిత్స.. సమస్య ఏ కారణంతో వచ్చిందనే అంశంపై చికిత్స ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పక్షవాతం లేదా యాక్సిడెంట్ వంటి కేసుల్లో సర్జరీతో పరిస్థితిని చక్కదిద్దాల్సి రావచ్చు. (ఇలాంటి పరిస్థితుల్లో బాధితులు ఆహారం గుటకవేయలేని పరిస్థితి ఉంటే రైల్స్ ట్యూబ్ ద్వారా బాధితులకు ఆహారాన్ని అందిస్తారు). ఈసోఫేజియల్ దశలో వచ్చే సమస్యలకు ఈసోఫేజియల్ డయలేషన్, స్టెంట్ ప్లేస్మెంట్ చికిత్సలు చేయాల్సి రావచ్చు. ఓరల్, ఫ్యారింజియల్ దశల్లో వచ్చే సమస్యలను స్వాలోయింగ్ థెరపీ వంటి చికిత్స అవసరం పడవచ్చు. క్యాన్సర్, గ్యాస్ట్రిక్ సమస్యల్లో దాని తీవ్రతను బట్టి శస్త్రచికిత్స, మందులతో చికిత్స వంటి రకరకాల చికిత్స ప్రక్రియలు అవసరం కావచ్చు. — డాక్టర్ ఈ.సీ. వినయకుమార్, సీనియర్ ఈఎన్టీ సర్జన్. -
మీకు తెలుసా..! మీ ఆరోగ్యం మీ ఆలోచనలతోనేనని..
'సాటివారిపట్ల ప్రేమ, అనురాగం, అభిమానం, ఆప్యాయత వంటి గుణాలు కలిగున్న మనిషి ఆరోగ్యంగా ఉంటాడని మనస్తత్వ శాస్త్రవేత్తలతో పాటు వైద్యులు కూడా చెబుతున్నారు. అలాగే.. సానుకూలమైన అనుభూతులతో ఉన్న మనిషిలో తెల్ల రక్తకణాలు వృద్ధి చెంది, వ్యాధికారక క్రిముల పెరగకుండా నిరోధిస్తాయి. తద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కోపం, ద్వేషం, దుఃఖం, విచారం, అసూయ వంటి ప్రతికూల భావోద్వేగాలు మనిషిని మానసికంగా ఒత్తిళ్లు, ఆందోళనలకు గురిచేసి తెల్ల రక్తకణాలను తగ్గిస్తాయి. ఫలితంగా మనిషి అనారోగ్యానికి గురవుతాడు. అందుకే మంచి ఆలోచనలు ఉంటే ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తాయి.' ఒంటరితనం వద్దు ఒంటరిగా ఉన్న మనిషిలో ప్రతికూల ఆలోచనలు ఎక్కువ. ఫలితంగా మనిషిలో తెల్ల రక్త కణాలు తక్కువవుతుంటాయి. ఎన్నో శారీరక సమస్యలు మొదలవుతాయి. ఆహార విహారాలపై అవగాహన లోపిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు. మనసు ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. ఆ కారణంగా జ్ఞాపకశక్తి తగ్గుతూ అల్జీమర్స్ వంటి ఆరోగ్య సమస్యలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఒంటరిగా ఉన్నవారు ఏదో ఒక పనిలో నిమగ్నమైనప్పుడు మెదడు నిర్మాణాత్మకంగా పనిచేస్తూ, సానుకూల ఆలోచనలకు తెరలేపుతుందన్నది చికాగోలోని రష్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ శాస్త్రజ్ఞుల సూచన. సానుకూల ఆలోచనల కోసం మెదడుకు తగు తర్ఫీదు ఇవ్వాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు సానుకూల శబ్దాలు మాత్రమే ఉపయోగించే అలవాటు చేసుకోవాలి.. ఎవరికి వారు సానుకూల స్వయం సలహాలు ఇచ్చుకుంటుండాలి. ఆత్మవిశ్వాసంతో కూడిన మాటలు, చేతలకు మాత్రమే ప్రాధాన్యతనివ్వాలి. ఇతరుల పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. తప్పులు జరిగినప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వైఫల్యాలు ఎదురైనప్పుడు కృంగిసోకుండా గతంలో సాధించిన విజయాలను గుర్తుచేసుకుని, ప్రస్తుతం జరిగిన వాటిని విశ్లేషించుకోవాలి. విజయాల బాటలో నడిచిన వారిని చూసి అసూయ చెందకుండా వారి నుంచి ప్రేరణ పొందడం అలవాటు చేసుకోవాలి. ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు.. వాటిని సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. పెదవుల మీద చిరునవ్వు చెదరనీయకూడదు. మంచి జరగబోతోందని ఊహించుకోవాలి. ఉట్టిపుణ్యానికి బద్ధకంతో పనులు వాయిదా వేసే అలవాటు మానుకోవాలి. సెల్ఫ్ రిలాక్సేషన్ పద్ధతి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇతరులతో ప్రేమగా వ్యవహరించడం.. నవ్వుతూ.. నవ్విస్తూ ఉండడం వల్ల ఎంత పెద్ద జబ్బునైనా నయంచేసుకోవచ్చన్న నిపుణుల సలహాను పరిగణనలోకి తీసుకోవాలి. తీసుకునే ఆహారంతోనే ఆలోచనా విధానం ముడిపడి ఉందని అంటున్నారు నిపుణులు. తాజా పండ్లను, కూరగాయలను తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోవడం అన్ని విధాలా మంచిది. ప్రతికూల ఆలోచనలు వద్దు నెగెటివ్ ఆలోచనల వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఎదుటివాళ్లకి మనమీద నమ్మకం లేకుండా చేస్తాయి. ఇలాంటి ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ఓ పుస్తకంలో రాసుకోవాలి. అవి మనం తీసుకొనే నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలి. అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయో కనుక్కోవాలి. వాటినుంచి బయట పడాలనే బలమైన తపన ఉండాలి. భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం వల్ల ఫలితం ఉండదు. భవిష్యత్తు గురించి అసలు ఆలోచన చేయకుండా ఉండటం ఎంత తప్పో, భవిష్యత్తులో అలా జరుగుతుందేమో.. ఇలా జరుగుతుందేమో అని అతిగా ఆలోచించడ కూడా అంతే తప్పు. దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది. అందువల్ల అంతా మంచే జరుగుతుందనే ఆలోచన మంచిది. ఎప్పుడైతే మనమీద మనకు నమ్మకం లేదో అప్పుడు ప్రతికూల ఆలోచనలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి అయేలా చేస్తాయి. అందువల్ల మనమీద మనకు ఇష్టం, గౌరవం, నమ్మకం ఉండేలా చూసుకోవడం అత్యవసరం. గతంలో సంభవించిన అపజయాలు, ఎదురైన చేదు అనుభవాల వల్ల ప్రతికూల ఆలోచనలు రావడం సహజం. అలాంటప్పుడు గతాన్ని మర్చిపోవాలి. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనం ఏడాదంతా కాదు.. ఎప్పటికీ ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం. ఇవి చదవండి: ఎవరీమె? ఆమె స్పీచ్‌కి..పార్లమెంటే దద్దరిల్లింది! -
వింటర్లో సెల్యులైటిస్తో సమస్యా..? అయితే ఇలా చేయండి!
'సెల్యులైటిస్ అనేది ఓ చర్మవ్యాధి. కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో చర్మంపై పగుళ్లు రావడం, ఎర్రబారడం, కొద్దిపాటి వాపు మంట వంటి లక్షణాలతో బాధించే ఈ వ్యాధి తాలూకు బాధలు చలికాలంలో ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా ఉన్నప్పుడు మరింత ఎక్కువవుతాయి. అసలు సెల్యులైటిస్ రావడానికి ఏయే అంశాలు కారణమవుతాయి, లక్షణాలేమిటి, చలికాలంలో ఇది ఎందుకిలా మరింత ఎక్కువగా బాధిస్తుంది వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.' చర్మం పగుళ్లుబారినట్లుగా కనిపిస్తూ, కొద్దిపాటి వాపు, ఎర్రబారడం వంటి వాటితో వ్యక్తమయ్యే ఈ వ్యాధి స్ట్రెప్టోకాకస్, స్టెఫాలోకాకస్ వంటి బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. చర్మంపై ఒకచోట వస్తే మిగతా చోట్లకు పాకుతుంది. అయితే ఇది అంటువ్యాధి కాదు. ఒకరినుంచి మరొకరికి వ్యాపించదు. ప్రేరేపించే అంశాలు.. స్ట్రెప్టోకాకస్, స్టెఫాలోకాకస్ వంటి బ్యాక్టీరియా వల్ల వచ్చినప్పటికీ... కొన్ని అంశాలు దీన్ని తీవ్రతరం చేస్తాయి. అవి.. కాళ్లు, చేతుల్లోని రక్తనాళాల్లో ఏమైనా సమస్యలతో రక్తసరఫరాలో తేడాలు, ఊబకాయం, కాళ్లవాపులు, డయాబెటిస్, మద్యం తాగే అలవాటు కారణాలతో పాటు వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనం కావడం. లక్షణాలు.. ఈ ఆరోగ్య సమస్యలో కనిపించే ఓ కీలకమైన అంశం ఏమిటంటే.. సాధారణంగా సెల్యులైటిస్ దేహంలోని ఒకవైపునే కనిపిస్తుండటం విశేషం. ఈ వ్యాధి ఉన్నవారిలో కనిపించే సాధారణ లక్షణాలివి.. ఈ వ్యాధి సోకిన ప్రాంతంలో చర్మం దురద పెడుతుండటంతో పాటు ఈ దురదలు క్రమంగా పక్కలకు వ్యాపిస్తూ ఉంటాయి. వ్యాధిసోకిన చర్మపు ప్రాంతంలో వాపు, ముట్టుకోనివ్వకపోవడం (టెండర్నెస్) నొప్పి, వేడిగా అనిపించడం జ్వరంతో పాటు అది కొందరిలో చలిజ్వరంగా వ్యక్తం కావడం సెల్యులైటిస్ వచ్చిన ప్రాంతాల్లో మచ్చలతో పాటు నీటి పొక్కుల్లా (బ్లిస్టర్స్) రావడం. కొందరిలో చర్మంపై గుంటల్లా పడుతూ, చర్మం వదులైన తోలు మాదిరిగా కనిపించడం (స్కిన్ డింప్లింగ్) చలికాలంలో బాధలు ఎందుకు పెరుగుతాయంటే.. సెల్యులైటిస్ లక్షణాలతో వచ్చే బాధలు చలికాలంలో పెరగడానికి, ఈ సీజన్లో చర్మంపై కనిపించే కొన్ని అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు.. చర్మం పొడిబారడం (డ్రైస్కిన్): ఈ సీజన్లో తేమ తగ్గడంతో చర్మం బాగా పొడిబారిపోతూ ఉండటం చాలామందికి అనుభవంలో వచ్చే విషయమే. పైగా చలిగాలులకు వెళ్లినప్పుడు మరింతగా పెరుగుతుంది. ఇలా పొడిబారిన చర్మం బ్యాక్టీరియా చేరడానికి అనువుగా ఉంటుంది. దాంతో సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఈ సీజన్లో మాయిశ్చరైజర్లతో చర్మాన్ని తేమగా ఉంచుకుంటే ఇలా పగుళ్లుబారడంతో పాటు సెల్యులైటిస్నూ నివారించవచ్చు. వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనపడటం / వ్యాధినిరోధక శక్తి తగ్గడం: చలికాలంలో మామూలుగానే వ్యాధినిరోధక వ్యవస్థ పనితీరు కాస్త మందగించే అవకాశముంది. దీనికి తోడు డయాబెటిస్ ఉండటం, మద్యం అలవాట్ల వంటివి ఉంటే అది వ్యాధి నిరోధక వ్యవస్థను మరింత మందకొడిగా మార్చవచ్చు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో సమతులాహారం తీసుకోకపోవడం, ఆహారంలో విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు తక్కువగా ఉండటం లాంటి అంశాలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే అవకాశముంది. సెల్యులైటిస్ నివారణ ఇలా... చర్మాన్ని శుభ్రంగా, తేటగా ఉంచుకోవాలి. ఘాటైన రసాయనాలతో కూడిన వాసన సబ్బులు కాకుండా, మైల్డ్ సోప్ వాడాలి. మిగతా చర్మంతో పోలిస్తే.. మేనిపై పొడిగా ఉండే భాగాలైన మోచేతులు, మోకాళ్లు వంటి చోట్ల మాయిశ్చరైజర్ వంటివి రాసి, తేమగా ఉండేలా చూసుకోవడం మంచిది. చర్మం పగుళ్లు బారి, తోలు రేగిన ప్రాంతాల్లో వాటిని గిల్లడం, లాగడం చేయకూడదు. గోళ్లు, చర్మంతో గోళ్లు ముడిపడే భాగాల్ని శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే అక్కడి నుంచి బ్యాక్టీరియా చర్మంపై దాడి చేసే అవకాశాలుంటాయి. చలికాలంలో చర్మానికి మంచి రక్షణ కలిగేలా, ఒళ్లంతా కప్పి ఉంచేలాంటి దుస్తులు వాడటం మేలు. చలిగాలులు వేగంగా తాకకుండా ఉండేలా దుస్తులు ఉండాలి. తమ వ్యక్తిగత దుస్తులు, సామగ్రిని ఇతరులతో పంచుకోకూడదు. ఇల్లు శుభ్రం చేసుకోవడం, తోటపని వంటి మన రోజువారీ కార్యక్రమాల్లో చర్మానికి ఎలాంటి గాయాలు కాకుండా జాగ్రత్తపడాలి. ఎక్కడైనా చర్మం తెగినా, గాయపడ్డా డాక్టర్ సలహా మేరకు తగిన యాంటీబయాటిక్ క్రీమ్స్ వంటివి రాస్తూ, గాయాలు వేగంగా తగ్గేలా జాగ్రత్త తీసుకోవాలి. పాదాల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా బాగా పొడిబారి పగుళ్లకు అవకాశం ఉండే మడమలు, అలాగే వేళ మధ్యభాగాలు తేమతో, ఆరోగ్యంగా ఉంచుకునేలా జాగ్రత్త వహించాలి. రోజూ తగినన్ని నీళ్లు తాగాలి. వ్యాధినిరోధక వ్యవస్థ చురుగ్గా ఉండేందుకు అన్ని పోషకాలూ, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన మంచి ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకుంటూ ఉండాలి. డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, తమ జబ్బులను అదుపులో పెట్టుకునేలా క్రమం తప్పకుండా మందులు వాడటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఆరోగ్యపరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. చివరగా.. చలికాలంతో కొన్ని సౌకర్యాలున్నప్పటికీ.. దాంతోపాటు మరికొన్ని ఆరోగ్యసమస్యలనూ తీవ్రం చేసే సీజన్ అది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చర్మాన్నీ, దేహాన్నీ ఆరోగ్యంగా ఉంచుకుంటే ఈ సీజన్ నిరపాయకరంగా గడిచిపొతుంది. ఇవి చదవండి: వింటర్లో ముఖం తేటగా ఉండాలంటే వెంటనే ఇలా చేయండి! -
రక్తహీనతతో బాధ పడుతున్నారా.. అయితే ఇవి తీసుకోండి!
'మన శరీరంలో పోషకాలు, ఆక్సిజన్ ప్రతి కణానికి సరిగ్గా అందడంలో రక్తం పాత్ర ముఖ్యమైనది. సరైన ఆరోగ్యం కోసం తగినంత రక్తం శరీరంలో ఉండాల్సిన అవసరం ఉంది. శరీరంలో రక్తం లోపించిన పరిస్థితిని అనీమియా అంటారు. రక్తం సరిగ్గా ఉండటానికి సరైన ఆహారాలు తినటం ఎంత ముఖ్యమో ప్రాసెస్డ్ ఆహారాలు, కృత్రిమ షుగర్స్ గల ఆహారాలు తగ్గించడం కూడా అంతే ముఖ్యం.' ఐరన్ అనేది ఎర్ర రక్త కణాలలోని హిమోగ్లోబిన్ లో కనిపించే ఒక ఖనిజం. హిమోగ్లోబిన్ ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు చేరవేస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఉన్నప్పుడు, ఎర్ర రక్త కణాలు సరిగా ఉత్పత్తి కావు, గుడ్లు, మాంసం, చేపలు, టోఫు, పప్పులు, చిక్కుళ్ళు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఐరన్ లోపం తలెత్తకుండా ఉంటుంది. విటమిన్ బి 12 అనేది ఒక విటమిన్, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరం. విటమిన్ బి12 లోపం ఉన్నప్పుడు, ఎర్ర రక్తకణాలు సరిగా పనిచేయలేవు. అందువల్ల ఆహారంలెఓ విటమిన్–బి 12 లభించే మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ అనేది ఒక విటమిన్, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా అవసరం. ఫోలిక్ యాసిడ్ లోపం ఉన్నప్పుడు, ఎర్ర రక్త కణాలు సరిగా పెరగలేవు, అందువల్ల ఫోలిక్ యాసిడ్ ఉండే గుడ్లు, మాంసం, చేపలు, ఆకుకూరలు, బీన్స్, చిక్కుళ్ళు తీసుకోవాలి. ప్రోటీన్లు అనేవి శరీరం యొక్క నిర్మాణాత్మక భాగాలు. ప్రోటీన్లు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా అవసరం. ప్రోటీన్ల–మూలం మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, పప్పులు, చిక్కుళ్ళు, ధాన్యాలు, ఆకుకూరలు, తోటకూర, పాలకూర, గోంగూర వంటి ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఈ ఐరన్ మన రక్తం లోని హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో ముఖ్యమైనది. ఆకు కూరల్లాంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ తినడం వల్ల రక్తం పెరిగి అనీమియా వంటి సమస్య రాకుండా ఉంటుంది. చిక్కుళ్ళు, పప్పు దినుసులు చిక్కుళ్ళు, పప్పు దినుసుల్లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉన్న ప్లాంట్ బేస్డ్ ఐరన్ రక్తవృద్ధికి సహాయపడాలంటే వీటితో పాటు విటమిన్ సి అధికంగా ఉన్న ఫుడ్స్ కూడా తీసుకోవాలి. అలాగే వీటిలో ఫోలియేట్, విటమిన్ బి 6 కూడా ఉండటం వల్ల రక్తం తయారవ్వటానికి ఇవి బాగా దోహదం చేస్తాయి. నట్స్, సీడ్స్ బాదం, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ గింజలు వంటి నట్స్, సీడ్స్ లో ఫోలియేట్, ఐరన్, విటమిన్ ఇ ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ ఎర్ర రక్తకణాలు నష్టపోకుండా కాపాడుతుంది. బీట్ రూట్ బీట్ రూట్స్ లో ఐరన్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. అందుకని మన శరీరం లో బ్లడ్ లెవల్స్ పెరగడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఈ బీట్రూట్స్ లో ఉండే నైట్రేట్స్ రక్త ప్రసరణ సవ్యంగా జరగడానికి అలాగే రక్తంలో ఆక్సిజన్ సరిగ్గా ఉండటానికి సహాయపడతాయి. సిట్రస్ పండ్లు నారింజ పళ్ళు, ద్రాక్ష, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి అనేది మన శరీరంలో రక్తం పెరగడానికి అవసరం అయ్యే ఐరన్ గ్రహించడానికి సహాయపడుతుంది. అందుకనే ఐరన్ రిచ్ ఫుడ్స్ తో పాటు ఈ సిట్రస్ పండ్లు కూడా తీసుకోవటం మంచిది. ఇవి కూడా చదవండి: ఆస్తమా 'దమ్ముందా'? ఇలా చేసి చూడండి! వెంటనే.. -
‘మెఫ్తాల్’ ఔషధ రియాక్షన్లతో జాగ్రత్త
న్యూఢిల్లీ: నెలసరి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ సందర్భాల్లో సాధారణంగా వినియోగించే మెఫ్తాల్ ఔషధానికి సంబంధించిన ప్రతికూల ప్రభావా(రియాక్షన్)లను గమనించి, అప్రమత్తమవ్వాలని ఆరోగ్యరంగ వృత్తి నిపుణులు, వ్యాధిగ్రస్తులకు కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30వ తేదీన ఒక అడ్వైజరీని జారీ చేసింది. సాధారణంగా రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్, ఆస్టియో ఆర్ర్థరైటిస్, మహిళల్లో నెలసరి సమయంలో సంభవించే డిస్మెనోరోయియా, నొప్పి, వాపు, జ్వరం, దంతాల నొప్పి వంటి చికిత్సలో మెఫేనమిక్ యాసిడ్ పెయిన్ కిల్లర్‌ను వినియోగిస్తుంటారు. ఈ పెయిన్ కిల్లర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్(ఐపీసీ) తాజాగా ఔషధ భద్రత హెచ్చరికను జారీ చేసింది. ఫార్మకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా(పీవీపీఐ) వారి డేటాబేస్‌ను ప్రాథమికంగా విశ్లేíÙంచగా కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఈ ఔషధాన్ని వినియోగించిన సందర్భాల్లో ఇసినోఫిలియా, సిస్టెమిక్ సింప్టమ్స్(డ్రెస్) సిండ్రోమ్ వంటి డ్రగ్ రియాక్షన్లు కనిపించాయి. పెయిన్ కిల్లర్‌ను వాడిన సమయంలో ఏమైనా దుష్ప్రభావాలు కనబడితే వెంటనే పీవీపీఐ అధికారిక ఠీఠీఠీ. జీpఛి.జౌఠి.జీn వెబ్సైట్ లేదా హెల్ప్‌లైన్ నంబర్ 1800–180–3024ను సంప్రదించవచ్చు. -
ఇంద్రకీలాద్రిపై సమ్మర్ ప్రేత్యేక ఏర్పాట్లు
-
ఈ వ్యాధి పిల్లలో అరుదుగా వస్తోంది జాగ్రత్తగా ఉండండి
-
‘భవిత’తో భరోసా
పెందుర్తి(విశాఖపట్నం): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా..ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘ప్రత్యేకావస రాల’ పిల్లల భవిష్యత్‌కు భరోసా కలుగుతోంది. భవిత కేంద్రాల్లో ఆయా పిల్లలకు ప్రత్యేక శిక్షణ, చికిత్స ద్వారా వారి సహజసిద్ధమైన నైపుణ్యాలను మెరుగుపరుస్తున్నారు. వారి పనులు వారే చేసుకునేలా తీర్చిదిద్దుతున్నారు. అయితే లోపాలు ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం..భవిత కేంద్రాలు ఉన్నట్లు తగిన ప్రచారం చేయకపోవడం వలన పిల్లలను తీర్చిదిద్దే అవకాశాలు చేజారుతున్నాయి. ఒక్క పెందుర్తిలోనే దాదాపు 200 మందికి పైగా లోపాలు కలిగిన పిల్లలు ఉండగా నియోజకవర్గంలో ఆ సంఖ్య వెయ్యికి పైమాటే..కానీ భవిత కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న పిల్లల సంఖ్య కేవలం 70 మంది మాత్రమే. ప్రత్యేకావసరాల పిల్లలను భవిత కేంద్రాల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ప్రస్తుతం ఆయా కేంద్రాల్లో సంప్రదించవచ్చు. లోపాలు ఇవీ..శిక్షణ ఇలా.. ముందుగా కేంద్రంలో చేరిన చిన్నారులను కొద్దిరోజుల పాటు నిపుణులు ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా పరిశీలించి వారి లోపాలను గుర్తిస్తారు. దృష్టిలోపం ఉన్నవారికి దృష్టి ప్రేరణ, బ్రెయిలీ లిపిపై అవగాహన కలిగిస్తారు. వినికిడి సమస్య ఉన్నవారికి నాలుక అంగుడికి మధ్య ప్రేరణ కలిగేలా తర్ఫీదు ఇస్తారు. కొవ్వొత్తులు ఊదించడం..బెలూన్లు ఊదడం..ఐస్ క్రీం తినిపించడం వంటివి ఇందులో భాగం. దీంతోపాటు ప్రత్యేక పరికరం ద్వారా వారి వినికిడి సమస్యను పరిష్కరించేందుకు చికిత్స అందిస్తారు. మానసిక సమస్యలు ఉన్న పిల్లలను ఏదైనా ఓ పని మీద ఆసక్తి కలిగేలా చేస్తారు. ఈ పిల్లల్లో త్వరగా మరిచిపోయే లక్షణం ఉంటుంది కనుక ఆ పని మీద ఆసక్తిని కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. తరచూ ఆటలను మారుస్తూ మానసిక స్థితిని కేంద్రీకృతం చేసేందుకు ప్రయత్నం చేస్తారు. లోపాలు గుర్తించి పిల్లలకు కేంద్రంలోనే శిక్షణ కాకుండా ఇంటి దగ్గర కూడా సాధన చేసే విదంగా భోదన చేస్తారు. తల్లిదండ్రులకు కూడా మెళకువలు నేర్పిస్తారు. పిల్లల లోపాలను బట్టి భవిత కేంద్రంలో కనీసం మూడు నెలలు గరిష్టంగా రెండేళ్లపాటు శిక్షణ, చికిత్స అందిస్తారు. పరిస్థితి మెరుగైనట్టు ఉంటే పిల్లలకు అందుబాటులో ఉండే పాఠశాలలో చేర్పించి సహిత విద్య అందించే ప్రయత్నం చేస్తారు. ‘భవిత’లో ఇలా చేర్పించండి సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో పెందుర్తి, సబ్బవరం, పరవాడల్లో భవిత కేంద్రాలు నడుస్తున్నాయి. ఒక్కో కేంద్రంలో 20 మంది చొప్పున ప్రవేశాలు కల్పిస్తారు. నెలల చిన్నారి నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు అర్హులు. మిత వైకల్యం, అతి తక్కువ ఉన్న పిల్లలకు కేంద్రంలో ప్రతీరోజు శిక్షణ అందిస్తారు. తీవ్ర, అతి తీవ్ర వైకల్యం ఉన్నవారికి ఇంటి దగ్గరే తర్ఫీదు ఇస్తారు. లోపాలు ఉన్న పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్, గైడెన్స్ ఇస్తారు. తద్వారా ఇంటి నిపుణులు లేని సమయంలో కూడా పిల్లలకు తల్లిదండ్రులు శిక్షణ ఇచ్చుకునే అవకాశం ఉంటుందని నిర్వాహకుల భావన. అడ్మిషన్లు ఇస్తున్నాం భవిత కేంద్రాల్లో పిల్లల పరిస్థితికి అనుగుణంగా శిక్షణ, చికిత్స అందిస్తున్నాం. పిల్లలందరూ చక్కాగా స్పందిస్తున్నారు. కనీసం వారి పనులు వారు చేసుకునేలా తీర్చిదిద్దడమే మా కర్తవ్యం. అయితే చాలామంది తల్లిదండ్రులు ఇక్కడి కేంద్రంపై అవగాహన లేక బయట ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ చేరే పిల్లలకు నిబంధనల ప్రకారం స్కాలర్షిప్/పింఛన్‌తో పాటు గార్డియన్‌కు బస్‌పాస్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. తమ పిల్లలను చేర్పించాలనుకునే వారు ఫోన్: 99122 39821 నంబర్లో సంప్రదించినా..కేంద్రానికి వచ్చినా అడ్మిషన్ ఇస్తాం. –ఎస్.శారద, భవిత కేంద్రం నిర్వాహకురాలు -
బూస్టర్ డోస్‌పై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదు!
గుంటూరు మెడికల్: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. విదేశాల నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టింది. గతంలో అనుసరించిన ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానాన్నే అవలంబిస్తోంది. విదేశాల నుంచి జిల్లాకు 864 మంది విదేశాల నుంచి వచ్చిన వారి గురించి అధికారులు ప్రాంతాల వారీగా జల్లెడపడుతున్నారు. ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది ద్వారా ట్రేస్ చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారితోపాటు వారిని ఇటీవల కలిసిన వారికీ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. వైరస్ సోకినట్టు నిర్ధారణైతే తక్షణం వైద్యం అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు మొదలైనప్పటి నుంచి జిల్లాకు పలు దేశాల నుంచి 864 మంది వచ్చారు. వీరంతా ఎక్కడెక్కడ ఉంటున్నారో వారి పాస్‌పోర్టు ఆధారంగా వైద్యసిబ్బంది గుర్తించారు. వారిని కలిసిన వారితోపాటు ఇప్పటివరకూ 1,109 మందికిపైగా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. అదృష్టవశాత్తూ ఎవరికీ పాజిటివ్ రిపోర్టు రాలేదు. నిత్యం సర్వే విదేశాల నుంచి వస్తున్న వారి సమాచారాన్ని జిల్లా రెవెన్యూ అధికారుల వద్ద నుంచి సేకరించిన వైద్య అధికారులు ప్రతిరోజూ ఆయా ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బందికి చేరవేసి సర్వే చేయిస్తున్నారు. దీనికోసం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రత్యేకంగా వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ముందస్తు కట్టడే వ్యూహం ఒమిక్రాన్‌ను ముందుగానే కట్టడి చేయాలనే వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ తెలిపారు. యాంటీబాడీస్‌పై శ్రద్ధ యాంటీ బాడీస్ పరీక్షపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం ఈ పరీక్ష చేయించుకునేందుకు ఎక్కువ మంది ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. శరీరంలోని యాంటీబాడీస్ కరోనా వైరస్ సోకకుండా రక్షణ కల్పిస్తాయి కాబట్టి.. అవి ఉన్నాయా లేదా అనే సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఫలితంగా ప్రైవేటు ల్యాబ్‌లు కిటకిటలాడుతున్నాయి. ఒమిక్రాన్ భయంతో రెండు డోసులు టీకా వేసుకున్న వారూ యాంటీబాడీస్ టెస్టు చేయించుకుంటున్నారు. అవసరమైతే మూడో డోస్ వేయించుకునేందుకు యత్నిస్తున్నారు. అనుమతులు రాలేదు ఎలాంటి వైరస్ సోకినా శరీరంలో కొంత వరకు యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయి. బూస్టర్ డోస్‌పై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదు. చాలామంది యాంటీబాడీస్ టెస్టుల కోసం, మూడో డోస్ వేయించుకోవాలా లేదా అనే సందేహాలతో వైద్యసిబ్బందిని, అధికారులను సంప్రదిస్తున్నట్టు సమాచారం ఉంది. రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన వారు కోవిడ్–19 నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి భయం లేకుండా ఉండొచ్చు. – డీఎంహెచ్ఓ డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ -
కరోనా రెండో దశ: పెరుగుతున్న గుండె కుడివైపు వైఫల్య సమస్యలు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి రెండుదశల దాడి ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలు, సమస్యల నుంచి ప్రజలు పూర్తిగా తేరుకునేందుకు సుదీర్ఘ కాలమే పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శరీరంలోని ప్రధాన అవయవమైన గుండె ఎప్పుడు, ఏ రూపంలో, ఎన్ని రకాలుగా ప్రభావితం అవుతుందనేది అంతు చిక్కడం లేదు. కోవిడ్ సోకాక కోలుకునే క్రమంలో, ఆ తర్వాతా ఇలా ఏ సందర్భంలోనైనా వైరస్ కారణంగా గుండె ప్రభావితమయ్యే అవకాశాలున్నట్టు తాజాగా వైద్యులు తేల్చారు. గతేడాది మొదటి దశలోనే కరోనా నుంచి కోలుకున్నాక గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నట్టు నిపుణులు గుర్తించారు. అయితే సెకండ్‌వేవ్‌లో మాత్రం వివిధ రూపాల్లో సమస్యలు బయటపడుతున్నట్లు చెబుతున్నారు. గుండె లయలు తక్కువగా ఉండడం లేదా ఎక్కువగా ఉండడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీలో అసౌకర్యంగా అనిపించడం, రక్తప్రసరణ అధికం కావడం వంటి లక్షణాల ద్వారా సమస్య గుర్తించొచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఈ వైరస్ గుండెను ప్రభావితం చేస్తోందంటున్నారు. అందువల్ల కోలుకున్నాక గుండె పరీక్ష చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. కాళ్ల రక్తనాళాల్లో గడ్డలతో ప్రమాదం ‘శరీరంలోని చాలావరకు కాళ్ల లోపలి ఒకటి లేదా ఎక్కువ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’కు దారితీస్తుంది. కాళ్ల వాపు లేదా నొప్పికి ఇది కారణం అవుతుంది. కాళ్ల రక్తనాళాల్లో ఏర్పడిన గడ్డలు ఊపిరితిత్తులకు చేరుకున్నప్పుడు వాటిలోని ఏదైనా ధమనిలో రక్త ప్రసరణను అడ్డుకుంటాయి. దీనిని పల్మనరీ ఎంబాలిజం అంటారు. ఇలా జరిగినప్పుడు గుండె కుడివైపు వైఫల్యమయ్యే అవకాశాలు పెరుగుతాయి. కోవిడ్ పేషెంట్లలో లెఫ్ట్ హార్ట్ (గుండె ఎడమ భాగం) ఫెయిల్యూర్ల కంటే రైట్ హార్ట్ (గుండె కుడిభాగం) ఫెయిల్యూర్లు ఎక్కువగా ఉంటున్నట్టుగా వెల్లడైంది..’ అని డాక్టర్ విక్రమ్‌రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త లేదా దాని బారిన పడ్డాక చికిత్సలో భాగంగా తీసుకున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ వంటి మందులు కొందరిపై దుష్ప్రభావాలు చూపిస్తున్నట్లు తెలుస్తోందని చెప్పారు. -
కడుపులో క్రిములా?
వేమన చెప్పినట్టు... మేడిపండులోనే కాదు... కొందరి పొట్టలోనూ పురుగులుంటాయి. చాలామంది పిల్లలకు... ఆ మాటకొస్తే కొందరు పెద్దల్లో కూడా తరచూ కడుపునొప్పి, పొట్టలో ఇబ్బందిగా ఉండటం వంటి లక్షణాలతో ఈ పురుగుల ఉనికి బయటపడుతుంది. ఇంకొందరిలో అయితే... టాయిలెట్లో విసర్జన తర్వాత నులిపురుగుల వంటివి మలంలో కనిపిస్తూనే ఉంటాయి. ఇలా జరిగితే జీర్ణవ్యవస్థలో క్రిములున్న మాట తేటతెల్లంగా కనిపిస్తుంది. కానీ ఒక్కోసారి కడుపులో ఉండే క్రిముల సంగతి మనకు తెలియనే తెలియదు. కడుపులోని క్రిములు పోతేనే అలాంటి లక్షణాలూ మాయమవుతాయి. సాధారణంగా మనందరిలోనూ, ప్రధానంగా పిల్లల కడుపుల్లో ఉండే పురుగులు / క్రిములు / సూక్ష్మజీవుల గురించి అవగాహన, అవి ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు, వాటి నివారణ, చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. కడుపులో పురుగులు ఉన్నాయంటే అవి సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా మొదలుకొని, ఏకకణ జీవులైన ప్రోటోజోవా నుంచి బద్దెపురుగులూ (ఫ్లాటీహెల్మెంథిస్), వానపాముల జాతికి చెందిన నిమటోడ్స్ వరకు ఎన్నెన్నో రకాలైనవి ఉండవచ్చు. వాటిలో తరచూ కనిపించేవాటిని ఇక్కడ చూద్దాం. కడుపులోకి చేరి బాధించే ఏకకణజీవులైన ప్రోటోజోవా వర్గానికీ, ఆ తర్వాతి స్థానాల్లో ఉండే హెల్మింథిస్ (ఫ్లాటీ అండ్ నిమటీ హెల్మెంథిస్) వర్గానికి చెందిన పరాన్నజీవులివి. ► ప్రోటోజోవాకి చెందిన జియార్డియా ఇది జీర్ణవ్యవస్థలోని చిన్న పేగుల్లో (డియోడినమ్ అనే భాగంలో) ఉండే పరాన్నజీవి. ఇది ఏకకణ జీవి. మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు చిత్రంగా పెద్దపెద్ద కళ్లలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. చిన్నపేగుల్లో జీవిస్తుంది కాబట్టి దీన్ని జియార్డియా ఇంటెస్టినాలిస్ అని కూడా అంటారు. డియోడినమ్‌లో ఉండే దాన్ని జియార్డియా డియోడినాలిస్ అంటారు. కలుషితమైన ఆహారం తినేవారిలో ప్రధానంగా పరిశుభ్రత పాటించని హాస్టళ్లు, హోటళ్లలో తినేవారిలో ఇది ఉంటుంది. ఇది కడుపులో పడ్డవారిలో నీళ్ల విరేచనాలు, కడుపునొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కడుపులోని క్రిములను నిర్మూలించాకే ఆ ల„ý ణాలు దూరం అవుతాయి. ► ఎంటమీబా హిస్టొలిటికా ఇది కూడా ప్రోటోజోవాకే చెందిన ఏకకణ సూక్ష్మజీవి. ఇది అపరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల వ్యాపిస్తుంది. దీని వల్ల అమీబియాసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల... నీళ్ళ విరేచనాలు, కడుపులో నొప్పి, వాంతులు, కడుపు ఉబ్బరం, విరేచనాలలో రక్తం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో అప్పుడప్పుడు ఆకస్మికంగా జ్వరం రావచ్చు. ఇంకొందరిలో దగ్గు, కాలేయానికి సంబంధించిన వ్యాధులు, అనీమియాకు గురికావడం లాంటి లక్షణాలూ ఉంటాయి. అరుదుగా కొన్ని సందర్భాలలో పురుగులకు సంబంధించిన లార్వాలు మెదడులోకి వెళ్ళడం వల్ల మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ► ఫ్లాట్ వార్మ్ (టీనియా సోలియమ్, టీనియా సాజినెటా): ఇవి మూడు మీటర్ల కంటే పెద్దగా ఉంటుంవి. ఇవి పొడవులను కొలిచే టేప్‌లా ఫ్లాట్‌గా ఉండటంతో టేప్ వార్మ్స్ అనీ, ఫ్లాట్ వార్మ్స్ అని కూడా అంటుంటారు. మనం తినే ఆహారాలు పూర్తిగా సరిగా ఉడికేలా జాగ్రత్త పడాలి. సాధారణంగా మనలో కొందరికి పోర్క్, ఇంకొందరికి బీఫ్ తినడం అలవాటు. అలాంటి వారిలో కచ్చాపచ్చాగా ఉడికించి వండిన పోర్క్ తినడం వల్ల టీనియో సోలియమ్ జీవులు పెరుగుతాయి. అలాగే సరిగా ఉడికించని బీఫ్ తినేవారిలో టీనియా సాజినేటా జీవులు వృద్ధి చెందుతాయి. ఈ జీవుల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ను టేప్‌వార్మ్/ఫ్లాట్‌వార్మ్ ఇన్ఫెక్షన్ అని వ్యవహరిస్తుంటారు. ► నులి పురుగు/ ఆస్కారిస్ వార్మ్స్: ఇవి చిన్నపేగుల్లో తమ ఆవాసం ఏర్పరచుకుంటాయి. వీటి కారణంగా కడుపునొప్పి, డయేరియా వంటి లక్షణాలు ఉంటాయి. ఈ నులిపురుగులు 5 నుంచి 10 సెం.మీల పొడవు ఉంటాయి. అపరిశుభ్రమైన ఆహారం, నీటి వల్ల ఇవి కడుపులోకి చేరుకుంటాయి. ► పిన్ వార్మ్ / త్రెడ్ వార్మ్ / సీట్ వార్మ్: ఈ క్రిమి కారణంగా మలద్వారం వద్ద విపరీతమైన దురద వస్తుంది. సాధారణంగా చిన్న పిల్లలు మట్టిలో ఆడుకుంటుంటారు. వారు ఆటల సమయంలో తమ పిరుదులు, కింది భాగంలో గీరుకోవడం, తర్వాత ఆ వేళ్లను నోటిలో పెట్టుకోవడం వల్ల ఈ క్రిములు శరీరంలోకి చేరుతాయి. అక్కడి నుంచి జీర్ణవ్యవస్థలోకి ప్రవేశిస్తాయి. ఈ క్రిములు దాదాపు 2 నుంచి 3 మి.మీ పొడవుంటాయి. ► హుక్ వార్మ్ (ఎన్‌కైలోస్టోమా, సిస్టోజోమా): ఇవి చర్మం ద్వారా శరీరంలోకి చొచ్చుకుని వెళ్లి రక్తనాళాల్లోకి వెళ్లి రక్తప్రవాహంలో కలుస్తాయి. అలా రక్తం ద్వారా అవి కాలేయం, మూత్రాశయం వంటి భాగాలలోకి చేరుకుని అక్కడ వృద్ధి చెందుతాయి. ఇవి 1 మి.మీ కంటే తక్కువ పరిమాణంలో ఉండటం వల్ల ఇది కంటికి కనిపించవు. అపరిశుభ్రమైన పరిసరాల వల్ల ఇవి ఒకరి నుంచి మరొకరి వ్యాపిస్తాయి. కడుపులో పురుగుల నివారణకూ / బయటపడటానికీ ఆహారనియమాలివి బాగా పుష్కలంగా తినాల్సినవి : ► పురుగులు పేగుల్లో నుంచి బయటపడాలంటే మన దేహంలో కదలికలు చురుగ్గానూ, బాగా ఉండాలి. శారీరకంగా మంచి కదలికలు, శ్రమ ఉండేవారిలో పేగుల కదలికలు కూడా చురుగ్గా ఉండి, మలవిసర్జన సాఫీగా అవుతుంది. అలాంటప్పుడే విరేచనం ద్వారా పురుగులు బయటకు వస్తాయి. కాబట్టి మనం శారీరక శ్రమ / వ్యాయామం చేస్తూ ఉండాలి. అలాగే రోజూ పుష్కలంగా నీళ్లు తాగడంతో పాటు విరేచనం సాఫీగా జరగడానికి తోడ్పడేందుకు ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆకుకూరలూ / కాయగూరలను ఎక్కువగా తీసుకోవాలి. ► మనం తినే టిఫిన్లు, ఉపాహారాలలో దేహానికి ఉపయోగపడే బ్యాక్టీరియా పుష్కలంగా ఉండే ఇడ్లీ, దోస వంటివి తినాలి. అలాగే ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉండే తియ్యటి పెరుగు, మజ్జిగ వంటివి తీసుకోవాలి. పులిసిన పెరుగు/మజ్జిగ వంటివి మళ్లీ యాసిడ్‌ను పెంచి కడుపులో మరింత ఇబ్బందికి కారణమవుతాయి. ► ఆహారం సరిగా జీర్ణం కావడానికి తోడ్పడే ఎంజైమ్‌ల వల్ల చిన్నపేగు ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఎంజైమ్‌లు వృద్ధి చెందాలంటే విటమిన్–సి, జింక్ వంటివి ఎక్కువగా ఉండే ఎక్కువగా ఉండే ఆహరం తీసుకోవాలి. తీసుకోకూడనివి లేదా పరిమితంగా మాత్రమే తీసుకోవాల్సినవి ► కార్బోహైడ్రేట్స్, చక్కెరతో కూడిన ఆహారం, పళ్ళ రసాలు, పాల ఉత్తత్తులు, కొవ్వుపదార్థలు, నూనెలు వంటివి తగ్గించడం మంచిది. చికిత్స ► కడుపులో పురుగులు పడ్డాయని అనుమానించినప్పుడు డాక్టర్లు మల పరీక్షల వంటి కొన్ని పరీక్షల ద్వారా వీటిని నిర్ధారణ చేసి... కడుపులో ఉన్న క్రిములను బట్టి మిబెండజోల్ వంటి కొన్ని సాధారణ మందుల ద్వారానే వీటిని నిర్మూలించేలా చికిత్స చేస్తారు. కడుపులోకి క్రిములు / పురుగులు చేరేదెలాగంటే... ► కడుపులోకి క్రిములు / పురుగులు చేరడానికి ముఖ్య కారణం అపరిశుభ్రమైన నీరు, ఆహారాన్ని తీసుకోవడం. అలాగే సరిగ్గా ఉడికించని మాంసాహారాలతోనూ టేప్‌వార్మ్ వంటి జీవులు చేరతాయి. అలాగే మనం రోజూ తినే ఆకుకూరలు, కూరగాయలు సరిగ్గా శుభ్రపరచకుండా తీసుకోవడం వల్ల కూడా క్రిములు పెరిగే అవకాశముంది. ► కాళ్లకు చెప్పుల వంటి రక్షణ ఏదీ లేకుండా మట్టిలో అపరిశుభ్రమైన పరిసరాలలో తిరిగే వాళ్లలో హుక్ వార్మ్వంటి పురుగులు కడుపులోకి చేరి, అక్కడ వ్యాప్తి చెందుతాయి. ఆటో ఇన్ఫెక్షన్స్ : కొందరు చిన్న పిల్లలు మర్మాంగాల వద్ద, పృష్ట భాగంలో గీరుకుంటూ... అవే వేళ్లను నోటిలో పెట్టుకోవడం వల్ల వారి నుంచి వారికే పురుగులు వ్యాపిస్తాయి. నివారణ ► కడుపులో పురుగులు రాకుండా, క్రిములు చేరకుండా ఉండాలంటే మొట్టమొదటి సాధారణ సూత్రం పరిశుభ్రమైన నీళ్లు తాగాలి. కలుషితమైన చోట్ల తాగాల్సి వస్తే తప్పక కాచి చల్లార్చి, వడపోసిన నీటిని మాత్రమే తాగాలి. ► పిల్లలను అపరిశుభ్రమైన పరిసరాల్లో ఆటలాడనివ్వకూడదు. శుభ్రంగా ఉన్నచోటే ఆడనివ్వడంతోపాటు, మట్టిలో ఆడితే వెంటనే స్నానం చేయించాలి. పిల్లలు ఆటలాడి వచ్చిన ప్రతిసారీ వారి చేతులను సబ్బుతో బాగా కడుక్కునేలా అలవాటు చేయాలి. ► పిల్లలూ, పెద్దలు నేల మీద నడిచేటప్పుడు తప్పకుండా పాదరక్షలు ధరించాలి. ► పరిసరాలు, తాగునీటిని పట్టుకునే ప్రదేశాలు శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడప్పుడూ ఆ పరిసరాలను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. డాక్టర్ నితేష్ ప్రతాప్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ -
ఆ సమయాలలో గ్రీన్‌టీ చాలా డేంజర్..
న్యూఢిల్లీ: గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికి తెలిసిందే. కాగా వారానికి మూడు సార్లు గ్రీన్ టీ తాగితే మనిషి జీవితకాలం పెరగడంతో పాటు గుండెపోటు, స్ర్టోక్ ముప్పులను నివారించవచ్చని ఎన్నో అధ్యయాలు స్పష్టం చేశాయి. కాగా గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌తో హృదయం పదిలంగా ఉండటంతో పాటు ఎక్కువకాలం ఆరోగ్యకరంగా జీవించేందుకు దోహదపడుతుందని పరిశోధకులు తేల్చారు. కానీ గ్రీన్ టీ ఏ సమయంలో తీసుకోవాలో కూడా చాలా ముఖ్యమని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. కొన్ని సమయాలలో గ్రీన్ టీని తీసుకోవద్దని నిపుణులు పేర్కొంటున్నారు. రాత్రి పడుకునే ముందు: మీరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా, అయితే గ్రీన్‌టీ తీసుకునే సమయంలో జాగ్రత్త వహించాలి. రాత్రి పడుకునే ముందు గ్రీన్ టీని సేవిస్తే నిద్రలేమి సమస్యలు ఎదురు కావచ్చు. గ్రీన్ టీలోకెఫిన్ ఉండడం వల్ల నిద్ర ప్రేరిపిత మెలటోనిన్ విడుదలను అడ్డుకుంటుంది. ఉదయాన్నె గ్రీన్ టీ విషయంలో జాగ్రత్త: ఉదయాన్నే లేచిన వెంటనే ఖాళీ కడుపుతో గ్రీన్ టీని సేవించడం అనారోగ్యమని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, పాలీఫినాల్స్ గ్యాస్ట్రిక్ యాసిడ్లను ప్రేరేపించి, జీర్ణక్రియ సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. అందుకే ఉదయాన టిఫిన్ చేశాక గ్రీన్‌టీని సేవించడం ఆరోగ్యకరం. గ్రీన్‌టీతో మందులు వేసుకుంటే అంతే.. ఏదయినా వ్యాధితో బాధపడుతున్నట్లయితే కొందరు ఓ కప్పు గ్రీన్‌టీతో మందులు వేసుకుంటారు. కానీ అలా మందులు వేసుకోవడం ఆరోగ్యానికి హానికరం, మందులలో ఉండే కెమికల్స్ గ్రీన్ టీతో కలిసిన క్రమంలో అసిడిటీ సమస్యలు తలెత్తె అవకాశముంది. భోజన సమయంలో జాగ్రత్త: సాధారణంగా గ్రీన్ టీ సేవిస్తే జీర్ణకక్రియ సమస్యలకు ఎంతో ఉపయోగం. కానీ మధ్యాహ్న భోజనం తరువాత గ్రీన్‌టీ సేవిస్తే భోజనం నుంచి లభించే పోషక వలువలు తగ్గి, పోషకాహార లోప సమస్యలు తలెత్తె అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు -
కరోనాపై ‘కంటికి కనిపించని యుద్ధం’
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ కష్ట సమయంలో త్రివిధ దళాలను, వ్యూహాత్మక సంపత్తిని కాపాడుకునేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటంలో చురుగ్గా పాలుపంచుకుంటున్న భద్రతా బలగాలు.. మరో వైపు సరిహద్దుల రక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదని తెలిపారు. ఆదివారం ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. కరోనాపై పోరాటాన్ని దేశం చేస్తున్న ‘అతిపెద్ద అదృశ్య యుద్ధం’గా ఆయన అభివర్ణించారు. ‘కోవిడ్–19పై సాగిస్తున్న పోరు అతిపెద్ద అదృశ్య యుద్ధం. మానవత్వంపై జరుగుతున్న యుద్ధం. దేశ ఆర్థిక భద్రత, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే యుద్ధం’అని ఆయన అన్నారు. ఉగ్ర శిబిరాలపై దాడులు యథాతథం జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా సైన్యం దాడులు కొనసాగుతాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. పాక్ చొరబాటుదారులు సరిహద్దులు దాటి దేశంలోకి రాకముందే వారిని సైన్యం అడ్డుకుంటుందని తెలిపారు. కోవిడ్–19 నుంచి కాపాడుకునే విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం, ఆరోగ్య శాఖ, వైద్య సంస్థల సూచనలను త్రివిధ దళాలు పాటిస్తున్నాయన్నారు. నేవీ సిబ్బందికి కరోనా సోకిందన్న వార్తలు, కరోనా ప్రభావం సైనిక బలగాలపై పడుతుందన్న అనుమానాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
తూ.గో.జిల్లాలో మూడోవిడత హెల్త్ సర్వే
-
కరోనా నుంచి తప్పించుకోండిలా..
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలు జారీచేసింది. తరచూ సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలని, ఒకసారి వాడిన మాస్క్‌లను తిరిగి ఉపయోగించరాదని పేర్కొంది. మరిన్ని వివరాలకు భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూం నెంబర్ 91-11-23978046 ను, ncov2019@gmail.com ను సంప్రదించాలని తెలిపింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ⇒ చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి ⇒ సమూహాల్లో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ⇒ మీ కళ్లు, ముక్కు, నోటిని టచ్ చేయడం విరమించాలి ⇒ దగ్గు, తుమ్ములు వస్తే ముక్కు, నోటికి చేతులు అడ్డుపెట్టుకోవాలి ⇒ జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి ⇒ మాస్క్‌ను ధరించే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ⇒ ఒకసారి వాడిన మాస్క్‌లను తిరిగి వాడరాదు ⇒మాస్క్ ముందు భాగం ముట్టుకోకుండా వెనుకనుంచి తొలగించాలి ⇒ మాస్క్‌ను తీసిన వెంటనే డస్ట్‌బిన్‌లో పడవేయాలి చదవండి : హైదరాబాద్‌లో తొలికేసు: కరోనా అలర్ట్ -
చిక్కంతా టీలో లేదు.. టీ బ్యాగులోనే!
రోజుకొక్కసారైనా టీ తాగకుండా ఉండలేకపోతున్నారా? కార్పొరేట్ ఆఫీసుల్లో టెన్షన్ ఫ్రీ అవడానికి అంటూ కప్పుల మీద కప్పులు టీ తాగుతున్నారా? అయితే మీ ఆరోగ్యం మీ చేతుల్లో లేదు. ఒక్కసారి టీ తాగేవారు కూడా ఇందుకు మినహాయింపు కాదు. టీలో ఎన్నిరకాలున్న టీ బ్యాగు ఒకటే కాబట్టి ఎలాంటి టీ తాగినా మీరు అనారోగ్యం బారిన పడక తప్పదు. చిక్కంతా టీలో లేదు.. టీ బ్యాగులోనే ఉంది. మీరు వాడే టీ బ్యాగును విషకరమైన ప్లాస్టిక్‌ను ఉపయోగించి తయారు చేస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా హెల్త్ జర్నల్ తాజా అధ్యయనంలో ప్రచురించింది. బయటపడింది ఇలా.. నటలీ టుఫెంక్జీ అనే మహిళ తన ఆఫీసుకు దగ్గర్లోని కెఫేకు వెళ్లి టీ ఆర్డర్ చేసింది. వేడివేడిగా పొగలు కక్కుతున్న టీ కప్‌ను తన చేతిలోకి తీసుకుంది. ఇంతలో తన కళ్లు టీ బ్యాగ్ మీద పడ్డాయి. అది ప్లాస్టిక్‌తో తయారు చేసారేమోనన్న అనుమానం మొదలైంది. అదేంటో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో పరిశోధన మొదలుపెట్టింది. వేర్వేరు దుకాణాల నుంచి టీ బ్యాగులను తీసుకువచ్చి పరీక్షించింది. అందులో భాగంగా ఒక టీబ్యాగును తీసుకుని వేడినీటిలో పెట్టగానే ప్లాస్టిక్ రేణువులు విడుదల అవుతున్నాయి. వీటి సంఖ్య 11 బిలియన్ల మైక్రోప్లాస్టిక్, 3 మిలియన్ల నానోప్లాస్టిక్ కణాలకు పైగా ఉంది. టుఫెంక్జీ ఈ అధ్యయనం గురించి మాట్లాడుతూ కేవలం టీ బ్యాగుల నుంచి ప్లాస్టిక్ వస్తోందే తప్ప టీ నుంచి కాదని చెప్పుకొచ్చింది. టీ తాగడం ద్వారా మనకు తెలీకుండానే బిలియన్ల ప్లాస్టిక్ కణాలను మనం శరీరంలోకి పంపుతున్నామని ఆందోళన వ్యక్తం చేసింది. అవి విడుదల చేసే ప్లాస్టిక్ రేణువులు మానవ కణంలోకి చొచ్చుకుపోయేంత చిన్న పరిమాణంలో ఉన్నాయంది. ఇది ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుందని ఆమె హెచ్చరించింది. కాగా డజన్ల కొద్ది సర్వేలు ఈ విషయంపై ఇప్పటికే ఆందోళన చెందుతున్నాయి. మనం తాగే నీటిలో, తినే ఆహారంలో ప్లాస్టిక్ కలుస్తోందని చెప్తూనే ఉన్నాయి. -
వైరల్ నరకం!
బేగంపేటకు చెందిన హర్షవర్థన్‌కు సోమవారం అర్ధరాత్రి ఉన్నట్టుండి తీవ్ర జ్వరం వచ్చింది. జ్వరం చూస్తే 100 డిగ్రీలు దాటింది.. భరించలేని ఒంటి నొప్పులు. మంచంపై నుంచి లేచి కనీసం నాలుగు అడుగులు కూడా వేయలేని పరిస్థితి.. డాక్టర్ దగ్గరికెళ్తే.. చికెన్ గున్యాగా అనుమానించి.. పరీక్షలు చేయించారు. తీరా చూస్తే.. వైరల్ ఫీవర్ అని తేలింది. నాగోల్‌కు చెందిన రాజేశ్వరి వారం రోజుల నుంచి తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతోంది. మంచంపై నుంచి లేవలేని పరిస్థితి. ఇంట్లోని బంధువులు ఆమెను చేయిపట్టి లేపేందుకు యత్నిస్తే.. నొప్పిని భరించలేక విలవిల్లాడింది. చికిత్స కోసం వైద్యుడి వద్దకు తీసుకెళ్తే.. డెంగీ లక్షణాలు ఉన్నాయని చెప్పి.. పరీక్షలు చేయించారు. ఇక్కడా అదే.. సాధారణ వైరల్ ఫీవర్. సాక్షి, హైదరాబాద్ : హర్షవర్థన్, రాజేశ్వరి మాత్రమే కాదు.. గ్రేటర్లో వేలాది మందికి ఇదే తరహాలో తీవ్రమైన జ్వరం, భరించలేని ఒంటినొప్పులతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. నిజానికి ఈ సీజన్లో జలుబు, తలనొప్పి, జ్వరంతోపాటు కొద్దిపాటి ఒళ్లునొప్పులు సాధారణమే. అయితే, ఆస్పత్రులకు వస్తున్న బాధితుల్లో జలుబు, తలనొప్పి, జ్వరంతో పాటు విపరీతమైన ఒళ్లు నొప్పులు (కంబైన్డ్ ఫీవర్స్) ఉన్నాయని చెబుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రి ఓపీకి వస్తున్నవారిలో 30 శాతం మంది జ్వరంతోపాటు తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్నవారే. ఈ లక్షణాలను చూసి.. డెంగీ, చికెన్ గున్యా, మలేరియాగా అనుమానించి, వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయిస్తున్నారు. తీరా రిపోర్టుల్లో నెగెటివ్ రావడం.. వైరల్ ఫీవర్ అని తేలడం అయోమయాన్ని కలిగిస్తోంది. డెంగీ, చికున్‌గున్యాలో కన్పించే లక్షణాలే సాధారణ వైరల్ ఫీవర్ లోనూ కనిపించడంతో రోగు ల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. నగరంలో కాలుష్య తీవ్రత ఎక్కువ. జీవనశైలి కూడా భిన్నంగా ఉంటుంది. రాత్రి పొద్దుపోయే వరకు పని చేసి ఉదయం 10 గంటల వరకు నిద్రపోతుంటారు. తెల్లవారుజామున విడుదలయ్యే సూర్యకిరణాల్లో విటమిన్–డి పుష్కలంగా లభిస్తుంది. కానీ ఈ సమయంలో మనం ఇంట్లో ఉండటంతో ఈ విటమిన్ లోపం కన్పిస్తోంది. దీనికి తోడు మధుమేహ బాధితులు కూడా ఎక్కువ. ఇతరులతో పోలిస్తే... వీరి ఆరోగ్యం కొంత సున్నితంగా ఉంటుంది. మద్యం, మాంసాహారాలను అతిగా తీసుకోవడంతో రక్తంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సమతుల ఆహార లోపంతో పాటు శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడంతో శరీరం పటుత్వాన్ని కోల్పోయి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. సాధారణ జ్వర పీడితులతో పోలిస్తే... విటమిన్ డి లోపం ఉన్న బాధితుల్లో జ్వరం వస్తే నొప్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కొందరు నడవలేక కిందపడి పోతుంటారు. -డాక్టర్ నవోదయ, జనరల్ ఫిజీషియన్, కేర్ ఆస్పత్రి ప్రస్తుతం ఆస్పత్రుల్లో నమోదవుతున్న సాధారణ జ్వరపీడితుల్లోనూ డెంగీ, చికున్‌గున్యా లక్షణాలు కన్పిస్తున్నాయి. వ్యాధినిర్ధారణ కోసం వైద్యులు వారి నుంచి నమూనాలు సేకరించి ఐపీఎంకు పంపుతున్నారు. తీరా రిపోర్ట్ చూస్తే.. సాధారణ వైరల్ ఫీవర్‌గా తేలుతుంది. నగరంలో కొత్త వైరస్ అంటూ ఏమీ లేదు. కానీ విటమిన్ లోపంతో బాధపడుతున్న బాధితుల్లో జ్వరం ఉన్నప్పుడు ఒంటినొప్పులు కొంత ఎక్కువగా ఉండటం సహజమే. -డాక్టర్ శంకర్, డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ -
ధూమపానం, కాయిల్స్‌తో క్యాన్సర్ రాదట!
సాక్షి, న్యూఢిల్లీ : ధూమపానం వల్ల, దోమలను పారదోలేందుకు కాయిల్స్ కాల్చడం వల్ల క్యాన్సర్ వస్తుందని ఇంతకాలం నమ్ముతూ వస్తున్నాం. అది పొరపాటు అభిప్రాయమని, వాటిల్లో క్యాన్సర్ కారకాలు అంతగా లేవని తాజా పరిశోధనలో వెల్లడయింది. కాకపోతే వీటి వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తేలింది. తలుపులు భిగించిన గదుల్లో సిగరెట్లను, దోమల కాయిల్స్‌ను విడివిడిగా వెలిగించినప్పుడు, అవి కాలుతున్నప్పుడు, కాల్చిన తర్వాత ఆయా గదుల వాతావరణంలోకి ఎలాంటి ఖనిజాలు వెలువడ్డాయో పరిశోధకులు అధ్యయనం జరిపారు. అల్యూమినియం, కాపర్, జింక్, కాడిమియం, క్రోమియం, మాంగనీసు, నికిల్, లెడ్, వనడియం, సెలినియం, స్కాండియం తదితర ఖనిజాలు ఉన్నట్లు కనుగొన్నారు. రెండు రకాల శాంపుల్స్ తీసుకొని వాటిలో ఈ ఖనిజాలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా పరిశీలించారు. రెండింట్లోనూ అల్యూమినియం, కాపర్, జింక్, మాంగనీస్ ఖనిజాలు ఎక్కువగా ఉన్నట్లు, కాడిమియం, వాలియం, సెలెనియం తక్కువగా ఉన్నట్లు తేలింది. క్రోమియం, లెడ్, నికిల్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎంతుందన్న విషయంపై కూడా తాము అధ్యయనం జరిపామని, క్యాన్సర్ వచ్చే అవకాశం కన్నా అవి తక్కువ స్థాయిలోనే ఉన్నట్లు తేలిందని అధ్యయనానికి అక్షరరూపం ఇచ్చిన ఆగ్రాలోని బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ రసాయన శాస్త్ర విభాగం అధిపతి అజయ్ తనేజా తెలిపారు. ఆయన అధ్యయన వ్యాసాన్ని ‘ఎస్ఎన్ అప్లైడ్ సైన్సెస్’ జర్నల్ ప్రచురించింది. తాము ప్రస్తుతానికి సిగరెట్, వివిధ రకాల మస్కిటో కాయల్స్ నుంచి వెలువడుతున్న ఖనిజాలపైనే అధ్యయనం జరిపామని, వీటి నుంచి దాదపు నాలుగువేల రసాయనాలు కూడా వెలువడుతాయని, వాటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? అన్న కోణంలో ఇంకా అధ్యయనం జరపాల్సి ఉందని తనేజా పేర్కొన్నారు. దోమల కాయల్స్లో కన్నా సెగరెట్లలోనే కాపర్, జింక్, మాంగనీస్, నికిల్, లెడ్ ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే క్యాన్సర్ వచ్చే స్థాయిల్లో మాత్రం లేదని, ధూమపాన ప్రియలు ఇళ్లలో, గాలి బయటకు పోని గదుల్లో పొగ తాగకపోవడమే మంచిదని ఆయన సూచించారు. ముఖ్యంగా ఇంట్లో దోమలను చంపేందుకు లేదా పారదోలేందుకు కాయిల్స్‌ను కాల్చడం వల్ల ఎక్కువ మందిలో శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తనేజా చెప్పారు. ఎక్కువ కాలం వీటికి ఎక్స్పోజ్ అయితేనే వ్యాధులు వస్తాయని అన్నారు. ఎవరికి, ఎంతకాలంలో వస్తుందన్నది అంచనా వేయలేమని, వారి వారి శరీర తత్వం, ఆరోగ్య పరిస్థితి బట్టి ఈ శ్వాసకోశ వ్యాధులు సంక్రమిస్తాయని ఆయన వివరించారు. కొందరికి శరీరంపై దద్దులు, ఇతర ఎలర్జీలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. దోమలను పారదోలే ‘ఆల్ అవుట్’ లాంటి ద్రవరూపక ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ప్రత్యామ్నాయం కాదని, వాటి ద్వారా కూడా సేంద్రియ రసాయనాలు వెలువడతాయని ఆయన హెచ్చరించారు. శ్వాసకోస వ్యాధులు కూడా దీర్ఘకాలంలో మరణానికి దారితీస్తాయని, ఈ మరణాలను కూడా వాయు కాలుష్య మరణాల కింద లెక్కించాల్సి ఉంటుందని తనేజా తెలిపారు. వాయు కాలుష్యం కారణంగా ఒక్క 2017లోనే భారత్‌లో 12 లక్షల మంది మరణించినట్లు ‘ది లాన్సెట్’ జర్నల్ 2018, డిసెంబర్లో ప్రచురించిన ఓ అధ్యయనం తెలియజేస్తోంది. ఇటీవల భారత్‌లోని పలు నగరాల్లో వాయు కాలుష్యం పెద్ద సమస్యగా మారిన విషయం తెల్సిందే. బయటి కాలుష్యం ఎంత ప్రమాదకరమో ఇళ్లలోని వాయు కాలుష్యం కూడా అంతే ప్రమాదకరమని తనేజా హెచ్చరిస్తున్నారు. -
హుహు..హూ! రాత్రిపూట పడిపోతున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, పాలమూరు: వారం రోజులుగా వాతావరణం లో చోటుచేసుకున్న మార్పుల కారణంగా జిల్లా లో చలివిపరీతంగా పెరిగింది. రాత్రి వేళ ఉష్ణో గ్రతలు పడిపోతుండటంతో ప్రజలు బయటికి రావాలంటే వెనకాడుతున్నారు. ఆరురోజుల నుంచి సాయంత్రం కాగానే ఆకా శంలో మేఘా లు కమ్ముకోవడం, చల్లని గాలు లు వీస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నా రు. ఉదయం 9 గంటల వరకు పొగమంచు కమ్మేస్తుండటంతో ప్రయాణానికి ఆటంకం కలుగుతోంది. జాగ్రత్తలు తప్పనిసరి.. చలికాలంలో వృద్ధులు, చిన్న పిల్లలపట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు వైద్యులు. పగటి ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటున్నా సాయంత్రం తర్వాత పెరుగుతుండటంతో ప్రజలు చలిని తట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలతోపాటు ఉన్ని దుస్తులు అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఏ గ్రామంలో చూసినా జలజ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలతో ప్రజలు ఆస్పత్రులకు చేరుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు ఆహారపు అలవాట్లలో స్వల్ప మార్పులు చేసుకుంటే శరీరాన్ని కాపాడుకోవచ్చని సలహా ఇస్తున్నారు. హైపథెరమితో ముప్పు చలి తీవ్రతను కొందరు వృద్ధుల్లో చేతులు వంకర పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే ప్రాస్ట్బైట్ అంటారు. వృద్ధుల శరీరానికి కావాల్సిన ఉష్ణోగ్రతలు ఉత్పత్తి కాకపోవడంతో మరణాలు సంభవిస్తాయి. దీన్ని వైద్య పరిభాషలో హైపోథెరమి అంటారు. శరీరంలోని రక్తనాళాల్లో రక్తం సరఫరాలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ కాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. జలుబు వల్ల ముక్కులోని నాళాల్లో సున్నితత్వం పెరుగుతుంది. ఇది ఆస్తామా బాధితులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పొడి చర్మం కలిగిన వారిలో దురదలు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. గొంతు ఇన్ఫెక్షన్, కీళ్ల నొప్పులు పెరుగుతాయి. గతంలో కీళ్ల నొప్పులు ఉన్న వారికి సమస్య అధికమవుతుంది. కొందరిలో తలనొప్పి వస్తుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలీమార్పస్లైట్తో సమస్య కొంత మందిలో చలి కాలంలో కూడా పొక్కులు వస్తాయి. దీన్ని పాలీమార్పస్లైట్ ఎరప్షన్ అంటారు. మహిళలు బట్టలు ఉతకడం, గిన్నెలను తోమడం వంటి పనులను ఎక్కువగా చేస్తుంటారు. చలికాలంలో ఎక్కువ సమయం నీళ్లలో చేతులు ఉంచి పనులు చేయడం వల్ల చేతిపై ఉండే నూనె పొర తొలగిపోతుంది. సబ్బులు, డిటర్జెంట్లను ఉపయోగించడం వల్ల నూనె పొర తొలిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా చర్మం పొడిబారి చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. శీతల గాలులు చర్మాన్ని ఇబ్బంది పెడతాయి. శరీరాన్ని రక్షించే క్రమంలో చర్మమే చలికి ప్రభావితమవుతుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ గాలిలో తేమశాతం తక్కువగా ఉంటుంది. శరీరంలోని తేమ బయటికి పోవడంతో చర్మం పొడిబారుతుంది. నూనె పొరను కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. ఈ కాలంలో ఎండ తీక్షణంగా లేకపోయినా సూర్యకాంతి నుంచి అతినీలలోహిత కిరణాలు వెలువడతాయి. వ్యాయామానికి వెళ్లే ముందు ఎక్కువ మంది వ్యాయామం అంటే ఉదయపు నడకకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. మహిళలు, మధ్య వయసు ఉన్నవారు, వృద్ధులు ఎక్కువగా వెళ్తుంటారు. మిగితాకాలంలో పోల్చితే శీతాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 6నుంచి 8గంటల మధ్య పొగ మంచులో కాలుష్యం కలిసి ఉంటుంది. బాగా ఎండ వచ్చే వరకు అదే పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో మార్నింగ్ రన్నింగ్ చేసే వాళ్లు దాన్ని పీల్చేవారు శ్వాసకోశ వ్యాధులు బారినపడే ప్రమాదం ఉంటుంది. ఈ మూడు నెలలు ఉదయం ఏడు గంటలు దాటిన తర్వాత వాకింగ్ చేయడం ఉత్తమం. కుదరకపోతే సాయంత్రం వేళలో చేసుకోవాలి. తప్పదని అనుకునేవారు ముఖం, ముక్కు, చెవులు కప్పి ఉంచే టోపీలు, దుస్తులు, స్వెటర్లు ధరించాలి. -
ఇంత చిన్న పాపకు గురకా?
మా పాపకు ఏడునెలల వయసు. పుట్టిన రెండో వారం నుంచి గురక వస్తోంది. ఇటీవలి కాలంలో ఈ శబ్దం మరీ ఎక్కువగా ఉంటోది. తరచూ వాంతులు కూడా చేసుకుంటోంది. డాక్టర్‌కు చూపిస్తే ‘కొద్దిరోజుల్లో తగ్గుతుంది’ అని చెప్పారు. పాప గురించి మాకు ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీ పాపకు ‘లారింగో మలేసియా’ సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. అంటే... శ్వాస తీసుకునే నాళంలోని ఒక భాగం బలహీనంగా ఉండటం. కొద్దిమంది పిల్లల్లో శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం రావడం... మరీ ముఖ్యంగా ఆ శబ్దం... చిన్నారులు మెలకువగా ఉన్నప్పుడు, ఇతరతా ఇన్ఫెక్షన్లు (దగ్గు, జలుబు వంటివి) ఉన్నప్పుడు, ఆహారం తీసుకుంటునప్పుడు ఎక్కువ కావచ్చు. ఇలా ఎక్కువగా శబ్దం రావడాన్ని వైద్యపరిభాషలో స్ట్రయిడర్ అంటారు. పిల్లల్లో 60 శాతం మందిలో స్ట్రయిడర్ రావడానికి కారణం లారింగో మలేసియానే. ఇటువంటి పిల్లల్లో శ్వాససంబంధమైన సమస్యలు పుట్టిన రెండో వారం నుంచే మొదలై... ఆర్నెల్ల వయసప్పటికి తీవ్రతరం కావచ్చు.చాలామందిలో ఇది క్రమేణా తగ్గుముఖం పట్టడం, పరిస్థితుల్లో మెరుగుదల కనిపించడం జరుగుతుంది. ఈ మెరుగుదల ఎప్పుడైనా మొదలు కావచ్చు. అయితే కొద్దిమంది పిల్లల్లో లారింగో మలేసియాతో పాటు దగ్గు, వాంతులు కనిపించే లారింగో ఫ్యారింజియల్ రిఫ్లక్స్ అనే కండిషన్‌తో సమస్య తన తీవ్రతను చూపించవచ్చు. ఇలాంటి పిల్లల్లో కొన్నిసార్లు నీలంగా మారడం (సైనోసిస్), దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలను ఎదుర్కోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొన్నిసార్లు మరికొన్ని ఇతర రకాల సమస్యలైన... సబ్‌గ్లాటిక్ స్టెనోసిస్, లారింజియల్ వెబ్స్, ట్రాకియో బ్రాంకియో మలేసియా... మొదలైన కండిషన్లలోనూ మీరు చెప్పిన లక్షణాలే కనిపిస్తుంటాయి. పై అంశాలను బట్టి విశ్లేషిస్తే మీ పాపకు లారింగో మలేసియాతో పాటు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ కండిషన్ ఉన్నట్లు అనిపిస్తోంది. దీన్ని నిర్ధారణ చేయడానికి ఫ్లెక్సిబుల్ లారింగోస్కోపీ, బ్రాంకోస్కోపీ, రేడియోగ్రాఫిక్ స్టడీస్ చేయించాల్సి ఉంటుంది. ఈ సమస్యకు చికిత్స అన్నది పిల్లల్లో కనిపించే లక్షణాల తీవ్రత, శ్వాసతీసుకునే సమయంలో ఇబ్బందిని ఏ మేరకు భరిస్తున్నారు, పిల్లల్లో ఉన్న ఇతరత్రా వైద్య సమస్యలు, ఇన్వెస్టిగేషన్ డేటా, అన్నిటి కంటే ముఖ్యంగా ఈ జబ్బు కారణంగా కుటుంబంపై పడుతున్న మానసిక ఒత్తిడి తాలూకు తీవ్రత వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాపకు ఉన్నది చాలా తీవ్రమైన లారింగో మలేసియా అని నిర్ధారణ అయితే శస్త్రచికిత్స ద్వారా దీన్ని సరిచేయవచ్చు. కాబట్టి... మీరు మీ పిల్లల వైద్యుడిని, పీడియాట్రిక్ ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించి, ఫాలోఅప్‌లో ఉండండి. మా పాపకు ఐదున్నర ఏళ్లు. ఇటీవల మూడు నాలుగు సార్లు ఒంటి మీద దద్దుర్లలా వచ్చాయి. ఒక రోజు ఉండి మళ్లీ తగ్గుతున్నాయి. పాప చాలా చాలా ఇబ్బందిపడుతోంది. ఈ సమస్యకు మందులు కూడా వాడాం. అయితే తగ్గినట్లే తగ్గి మళ్లీ మళ్లీ వస్తున్నాయి. మీ పాపకు ఇలా జరగడానికి కారణం ఏమిటి? దయచేసి పరిష్కారం చూపండి. మీ పాపకు ఉన్న సమస్యను అర్టికేరియా అంటారు. ఈ సమస్యలో చర్మం పైభాగం (సూపర్ఫీషియల్ డర్మిస్) ఎర్రబడి కాస్త ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఇది శరీరంలోని ఏ భాగంలోనైనా రావచ్చు. ఇది చిన్న ఎర్రటి మచ్చలా మొదలై శరీరమంతటా అనేక చోట్ల కనిపించవచ్చు.మనలోని 20 శాతం మందిలో జీవితకాలంలో కనీసం ఒకసారైనా కనిపించే అతి సాధారణ సమస్య ఇది. ఆర్టికేరియాలో అక్యూట్ అని, క్రానిక్ అని రెండురకాలు ఉంటాయి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు అక్యూట్ అర్టికేరియా అని చెప్పవచ్చు. ఆర్టికేరియాకు కారణాలు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆహారం వల్ల (అంటే... గుడ్డు, గోధుమ, వేరుసెనగ (పల్లీ)లు, సముద్రపు చేపలు, కొందరిలో స్ట్రాబెర్రీస్); మందులు, ఏదైనా పురుగు కుట్టడం (అంటే... తేనెటీగలు లేదా చీమల వంటివి); ఇన్ఫెక్షన్లు(అంటేబ్యాక్టీరియల్ లేదా వైరల్); కాంటాక్ట్ అలర్జీలు (అంటే లేటెక్స్/రబ్బరు, పుప్పొడి వంటివి); గొంగళిపురుగులు, కొన్ని జంతువుల లాలాజలం తగలడం వల్ల; రక్తం, రక్తానికి సంబంధించిన ఉత్పాదనల వల్ల... మీరు చెబుతున్న అక్యూట్ అర్టికేరియా రావచ్చు.ఇక దీర్ఘకాలికంగా కనిపించే క్రానిక్ అర్టికేరియాలో 80 శాతం కేసుల్లో కారణం ఇదీ అని చెప్పడం కష్టం. కాకపోతే కొన్నిసార్లు చాలా వేడి, చల్లటి, ఒత్తిడితో కూడిన, కంపనాలతో ఉండే పరిసరాల వల్ల, థైరాయిడ్, రక్తానికి సంబంధించిన రుగ్మతల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్) అర్టికేరియా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అక్యూట్ అర్టికేరియాకు నట్స్‌తో కూడిన ఆహారం, ఆహారంలో వేసే కృత్రిమ రంగులు, పుప్పొడి, ఏదైనా పురుగు కుట్టడం, కడుపులో నులిపురుగులు, సింథటిక్ దుస్తులు, సీఫుడ్ వంటి వాటిని సాధారణ కారణాలుగా గుర్తించారు. కాబట్టి మీ పాప విషయంలో చికిత్సలో భాగంగా మొదట పైన పేర్కొన్న అంశాలలో మీ పాప అర్టికేరియాకు ఏది కారణం కావచ్చో దాన్ని గుర్తించి, దాని నుంచి కొన్నాళ్లు మీ పాపను దూరంగా ఉంచడం చాలా ముఖ్యం.ఇక మందుల విషయానికి వస్తే యాంటీహిస్టమైన్స్, హెచ్2 బ్లాకర్స్ వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఇక లక్షణాలు తీవ్రంగా కనిపించే వారిలో ఇమ్యూనో మాడ్యులేషన్ మెడిసిన్స్ కూడా వాడవచ్చు. మీ పాప విషయంలో పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటూ యాంటీహిస్టమైన్స్‌లో హైడ్రాక్సిజీన్, సిట్రజీన్ వంటి మందులు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. ఈ సమస్య పదే పదే తిరగబెడుతూ, తీవ్రంగా కనిపిస్తుంటే కొన్ని ఇమ్యూనలాజికల్ పరీక్షలు కూడా చేయించాల్సి ఉంటుంది. కాబట్టి తీవ్రతను బట్టి మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణుణ్ణి లేదా మీ పీడియాట్రీషియన్‌తో చర్చించి, తగిన చికిత్స తీసుకోండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
వ్యాధుల్ని పసిగట్టే యాప్
న్యూయార్క్ : రాబోయే రోజుల్లో స్మార్ట్ఫోన్ల్లోని మైక్రోఫోన్ నుంచే యూజర్ల ఆరోగ్యంపై వైద్యులకు సంకేతాలు వెళతాయి. యుద్ధరంగంలో సైనికుడి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే కొత్త యాప్‌ను పెంటగాన్ అభివృద్ధి చేస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ల్లో నిక్షిప్తమయ్యే సాఫ్ట్వేర్ కెమేరాలు, లైట్ సెన్సర్లు, పెడోమీటర్లు, ఫింగర్‌ప్రింట్ సెన్సర్లు, ఇతర సెన్సర్ల ద్వారా యూజర్ల ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తుంది. పెంటగాన్ నిధులతో అభివృద్ధి చేస్తున్న ఈ టెక్నాలజీ కొన్ని సంవత్సరాల్లోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. వర్జీనియాకు చెందిన సైబర్‌సెక్యూరిటీ సంస్థ క్రిప్టోవైర్కు ఈ యాప్‌ను అభివృద్ధి చేసేందుకు దాదాపు రూ 3 కోట్ల కాంట్రాక్ట్‌ను అప్పగించారు. సైనికుడి ఆరోగ్యాన్ని రియల్‌టైమ్‌లో పర్యవేక్షించేందుకు ఈ యాప్ స్మార్ట్‌ఫోన్ సెన్సర్ డేటాను విశ్లేషిస్తుంది. వ్యాధులను ముందుగానే పసిగట్టేందుకు బయోమార్కర్లను గుర్తిస్తుంది. వ్యాధి లక్షణాలు ముదిరేలోగా వైద్యుడు, నర్సింగ్ సేవలు అందేలోగా వైద్య పరమైన అవసరాలనూ అధిగమించేలా యాప్‌ను డిజైన్ చేస్తున్నారు. అయితే యాండ్రాయిడ్, ఐఓఎస్‌లపై రూపొందే ఈ యాప్ వల్ల యూజర్ గోప్యత, భద్రతా పర్యవసానాలపై నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. -
బర్డ్‌ఫ్లూపై కేంద్రం అప్రమత్తం
న్యూఢిల్లీ: దేశంలోని కొన్నిప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ(ఏహెచ్5ఎన్8 వైరస్) కలకలం రేపుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రాలకు సూచనలు జారీచేసింది. ఢిల్లీ, గ్వాలియర్(మధ్యప్రదేశ్), కేరళలోని కొన్ని పక్షులకు ఈ వైరస్ సోకినట్లు తేలింది. ఏహెచ్5ఎన్8 వైరస్ మనుషులకు అంటుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అయినప్పటికీ కేంద్రం ముందుజాగ్రత్తగా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సూచనలు జారీచేసిందని ఆరోగ్య శాఖ కార్యదర్శి సీకే మిశ్రా చెప్పారు. చనిపోయిన, గాయాలైన పక్షుల విషయంలో సంబంధిత వ్యక్తులు రక్షణాత్మక చర్యలు తీసుకోవాలన్నారు.