విశాఖ హార్బర్కు చేరిన 17 బోట్లు
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లాలో తీరప్రాంత మండలాల్లో గత వారం చేపల వేటకు వెళ్లి గల్లంతైన 17బోట్లు సోమవారం విశాఖ హార్బర్ కు చేరుకున్నాయి. 12 మంది మత్య్స కారులు క్షేమంగా తిరిగొచ్చారు. వారంతా తొండంగి మండలం ఎస్.పెరుమాళ్లపురం గ్రామానికి చెందినవారు. 22 బోట్లలో గతవారం మత్స్యకారులు వేటకు వెళ్లారు. అయితే భారీ వర్షం కారణంగా సముద్రంలో వాతావరణం అల్లకల్లోలంగా ఉండటంతో వీరంతా దారి తప్పారు. చివరకు విశాఖలో 3, కాకినాడలో 3 ఉప్పాడలో 7 తొండంగిలో3 శ్రీకాకుళంలో ఒక బోటు ఒడ్డుకు చేరుకున్నాయి. మరో ఐదు బోట్ల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఓ మత్స్యకారుడు గల్లంతు అయినట్లు సమాచారం. గల్లంతైన బోట్ల కోసం నావీ అధికారులు గాలిస్తున్నారు.