సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చేరుకున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆమె వెంట భర్త, అనిల్, సోదరుడు కేటీఆర్ ఉన్నారు. ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్‌కు కవిత వచ్చారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఐదున్నర నెలలు తిహార్ జైలులో ఉన్న ఆమె మంగళవారం బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.
ఎయిర్‌పోర్ట్, కవిత ఇంటి వద్ద బీఆర్‌ఎస్ నేతల కోలాహలం నెలకొంది. కవితకు స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విమానాశ్రయం నుంచి నేరుగా బంజారాహిల్స్ నందినగర్‌లోని తన నివాసానికి కవిత చేరుకున్నారు. కవితకు దిష్టి తీసి ఇంట్లోకి కుటుంబ సభ్యులు ఆహ్వానం పలికారు. ఆమె బంధువులు, అభిమానులు పూలవర్షం కురిపించారు.
కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటకు వస్తా..
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందన్నారు. ‘‘నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి.. కచ్చితంగా ఒక రోజు న్యాయం గెలుస్తుంది. కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటకు వస్తా’’ అని కవిత పేర్కొన్నారు.
నోటీసులు, అరెస్టు నుంచి విడుదల దాకా..
⇒ 08–03–2023న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కవితకు సమన్లు జారీ చేసింది
⇒ 11–03–2023న ఢిల్లీలో ఈడీ విచారణకు కవిత హాజరు ⇒ 15–03–2023న ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత
⇒ 21–03–2023న తన ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత ⇒ 14–09–2023న కవితకు మళ్లీ నోటీసులు జారీ చేసిన ఈడీ
⇒ 15–09–2023న సమన్ల జారీని పదిరోజులు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
⇒ 15–03–2024న లిక్కర్ స్కామ్‌లో కవితను అరెస్టు చేసిన ఈడీ
⇒ 16–03–2024న ఢిల్లీలోని కోర్టులో హాజరు, రిమాండ్
⇒ 05–04–2024న కవి తను విచారించేందుకు సీబీఐ పిటిషన్
⇒ 08–04–2024న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన ట్రయల్ కోర్టు
⇒ 11–04–2024న తీహార్ జైల్లో కవితను అరెస్టు చేసిన సీబీఐ
⇒ 12–04–2024న సీబీఐ కోర్టును ఆశ్రయించిన కవిత.. ఆ పిటిషన్‌పై తీర్పు రిజర్వు
⇒ 15–04–2024న కవితకు 9 రోజులు జ్యుడీషియల్ కస్టడీ
⇒ 16–04–2024న బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
⇒ 23–04–2024న మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
⇒ 14–05–2024న జ్యుడీషియల్ కస్టడీ మే 20 వరకు పొడిగింపు
⇒ 03–06–2024న జూలై 3 వరకు రిమాండ్ కొనసాగింపునకు ఆదేశం
⇒ 01–07–2024న కవిత బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు
⇒ 03–07–2024న జ్యుడీషియల్ కస్టడీ జూలై 25 వరకు పొడిగింపు
⇒ 22–07–2024న బెయిల్ పిటిషన్‌పై ట్రయల్ కోర్టు విచారణ వాయిదా
⇒ 05–08–2024న బెయిల్ పిటిషన్‌పై ట్రయల్ కోర్టు విచారణ మళ్లీ వాయిదా
⇒ 07–08–2024న సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత
⇒ 12–08–2024న బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ వాయిదా
⇒ 20–08–2024న బెయిల్ పిటిషన్ వి చారణ మళ్లీ వాయిదా
⇒ 22–08–2024న కవితకు అస్వస్థత.. తీహార్ జైలు నుంచి ఆస్పత్రికి తరలింపు
⇒ 27–08–2024న కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.
Comments
Please login to add a commentAdd a comment