ఉత్తరప్రదేశ్‌: దర్గాలో తొక్కిసలాట.. వృద్ధుని మృతి | Huge Crowd Reached Bade Miyan Dargah For Offer Pray In UP, Old Man Died | Sakshi
Sakshi News home page

ఉత్తరప్రదేశ్‌: దర్గాలో తొక్కిసలాట.. వృద్ధుని మృతి

Published Sun, Jul 14 2024 12:28 PM | Last Updated on Sun, Jul 14 2024 1:34 PM

Huge Crowd Reached Dargah

జలేసర్: ఉత్తరప్రదేశ్‌లోని జలేసర్‌లో బడే మియా- చోటే మియా దర్గాలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆషాఢమాసంలోని మూడో శనివారం ఇక్కడ శని జాతర నిర్వహిస్తుంటారు. ప్రతీసారి మాదిరిగానే ఈసారి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా జనం ఇక్కడికి తరలివచ్చారు. వీధుల్లో  ఎక్కడ చూసినా విపరీతమైన జనం ఉన్నారు. కనీసం నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితులు నెలకొన్నాయి.

దర్గాకు వచ్చిన ఫిరోజాబాద్ జిల్లా ఫరీహా పోలీస్ స్టేషన్‌లోని మీట్‌పురా గ్రామానికి చెందిన బదన్ సింగ్(70) తన కుటుంబం నుండి విడిపోయాడు. జనం మధ్య తిరుగుతూ, విపరీతమైన వేడి, జనం తాకిడి కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. దీంతో స్థానికులు అతనిని ఇ‍క్కడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు పంపగా, అక్కడి వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. అనంతరం బదన్‌ సింగ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా  ఆస్పత్రికి తరలించారు.

దర్గాకు వచ్చిన వారిలో మహిళలు, చిన్నారులు ఎండ తీవ్రతకు పలు ఇబ్బందులు  ఎదుర్కొన్నారు. పూజలు చేసేందుకు అక్కడకు వచ్చినవారంతా పోటీ పడ్డారు. దీంతో తోపులాటలు జరిగాయి. అయితే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement