Dargah
-
అయ్యప్ప మాలలో చరణ్.. కానీ దర్గాకు ఎందుకు వెళ్లాడంటే?
మెగాహీరో రామ్ చరణ్ సోమవారం రాత్రి కడప వెళ్లారు. పెద్ద దర్గాను సందర్శించుకున్నారు. సాధారణంగా అయితే ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ ప్రస్తుతం చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నారు. అయినా సరే పెద్ద దర్గాను దర్శించుకోవడం వెనక ఓ కారణముంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఇలా చేసినట్లు స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు.రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఇది సంక్రాంతికి రిలీజ్ కానుంది. దీని తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ప్రస్తుతం మ్యూజిక్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఈయన మూడు నెలల క్రితం రామ్ చరణ్‌ని పెద్ద దర్గాను సందర్శించాలని కోరారు. ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నా సరే చరణ్.. రెహమాన్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.(ఇదీ చదవండి: అక్కినేని వారి పెళ్లిసందడి.. మూడుముళ్లు వేసే టైమ్ వచ్చేసింది)కడప దర్గాలో 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్ జరిగింది. ఈ దర్గాకు రెహమాన్.. ప్రతి ఏడాది తప్పనిసరిగా వస్తుంటారు. ఈ సంవత్సరం జరిగే ముషైరా గజల్ ఈవెంట్‌కు చరణ్‌ని తీసుకొస్తానని అక్కడి వాళ్లకు మాటిచ్చారట. అలా ఏఆర్ రెహమాన్ ఆహ్వానం మేరకు ఓ వైపు బిజీ షెడ్యూల్, మరోవైపు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. 'ఏఆర్ రెహమాన్.. ఈ దర్గాలో జరిగే కార్యక్రమానికి హాజరవ్వాలని మూడు నెలల ముందే చెప్పారు. వస్తానని ఆయనతో అన్నాను. ఆయనకు ఇచ్చిన మాట కోసం, మాలలో ఉన్నా కూడా ఈ దర్గాకు వచ్చాను' అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. చరణ్‌తోపాటు దర్శకుడు బుచ్చిబాబు కూడా ఇక్కడికి వచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కు 'శంకర్' షాక్.. ఆ సినిమా రీషూట్ కోసం రూ. 100 కోట్లు)#ARRahman గారు ఈ దర్గాలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలంటూ మూడు నెలల ముందే ఆహ్వానించారు. వస్తానని ఆయనతో అన్నాను. ఆయనకు ఇచ్చిన మాట కోసం, మాలలో ఉన్నా కూడా ఈ దర్గాకు వచ్చాను. - @AlwaysRamCharan pic.twitter.com/4l7CSysAtq— Rajesh Manne (@rajeshmanne1) November 18, 2024 -
ఉత్తరప్రదేశ్: దర్గాలో తొక్కిసలాట.. వృద్ధుని మృతి
జలేసర్: ఉత్తరప్రదేశ్‌లోని జలేసర్‌లో బడే మియా- చోటే మియా దర్గాలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆషాఢమాసంలోని మూడో శనివారం ఇక్కడ శని జాతర నిర్వహిస్తుంటారు. ప్రతీసారి మాదిరిగానే ఈసారి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా జనం ఇక్కడికి తరలివచ్చారు. వీధుల్లో ఎక్కడ చూసినా విపరీతమైన జనం ఉన్నారు. కనీసం నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితులు నెలకొన్నాయి.దర్గాకు వచ్చిన ఫిరోజాబాద్ జిల్లా ఫరీహా పోలీస్ స్టేషన్‌లోని మీట్‌పురా గ్రామానికి చెందిన బదన్ సింగ్(70) తన కుటుంబం నుండి విడిపోయాడు. జనం మధ్య తిరుగుతూ, విపరీతమైన వేడి, జనం తాకిడి కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. దీంతో స్థానికులు అతనిని ఇక్కడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు పంపగా, అక్కడి వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. అనంతరం బదన్ సింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.దర్గాకు వచ్చిన వారిలో మహిళలు, చిన్నారులు ఎండ తీవ్రతకు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూజలు చేసేందుకు అక్కడకు వచ్చినవారంతా పోటీ పడ్డారు. దీంతో తోపులాటలు జరిగాయి. అయితే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. -
ఇదో అదృష్టం
సాక్షి ప్రతినిధి, కడప: మత సామరస్యానికి ప్రతీకగా, మహిమాన్విత సూఫీగా వెలుగొందుతున్న కడప అమీన్‌పీర్ దర్గాను సందర్శించడంతో తన జన్మ చరితార్థం అయిందని, ఇది తన అదృష్టం, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్ గురువారం మధ్యాహ్నం కడప అమీన్‌పీర్ (పెద్ద దర్గా) దర్గాను సందర్శించి ప్రభుత్వ లాంఛనాలతో పూల చాదర్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్‌బాషా, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేయర్ కె.సురేష్‌బాబు, జిల్లా కలెక్టర్ వి.విజయ్‌రామరాజు, జాయింట్ కలెక్టర్ గణేష్‌కుమార్, కడప నగర పాలక సంస్థ కమిషనర్ జీఎస్ఎస్ ప్రవీణ్‌చంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఐకమత్యతతో దర్గా ఖ్యాతి, మహిమలు, ప్రపంచవ్యాప్తంగా పరిమళిస్తున్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. తాను పుట్టి పెరిగిన జిల్లాలో ఇంత మహత్తరమైన, మహిమాన్వితమైన దర్గా ఉండడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అమీన్‌పీర్ దర్గాను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆదరిస్తున్న జిల్లా ప్రజలు ఎంతో అదృష్టవంతులన్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులతో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలను అందివ్వగలుగుతున్నామన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకుంటూ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా మైనారిటీల సేవలో తరిస్తున్న మిత్రుడు ఎస్బీ అంజద్‌బాషాకు అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. సంప్రదాయ పేటా, షేలా ధరించి.. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన అమీన్‌పీర్ దర్గా ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు దర్గా ప్రతినిధులు సంప్రదాయ లాంఛనాలతో ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రిని ముందుగా పెద్ద దర్గా ప్రధాన మందిరంలోకి పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేని, దర్గా కమిటీ సభ్యులు సాదరంగా ఆహా్వనించారు. దర్గా సేవలో నిరంతరం నిమగ్నమైన ముజావర్లు, కమిటీ సభ్యులు, చౌదరీ కలీఫాలను దర్గా పీఠాధిపతులు హజరత్ ఖాజా సయ్యద్ షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. దర్గా పీఠాధిపతులచే ‘సూఫీ సర్మాస్త్ సానీ షిలాక్‘ సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రికి తలపాగా (పేటా) అలంకరించి మెడలో షేలా (కండువా), ఇలాచి (దండ) ధరింపజేశారు. అనంతరం పీఠాధిపతులతో కలిసి ముఖ్యమంత్రి జగన్ అమీన్‌పీర్ దర్గా గుమ్మం వద్దకు చేరుకుని నారికేళి రాతిపై కొబ్బరికాయ కొట్టి స్వామివారికి సమర్పించుకున్నారు. ముజావర్లు అందించిన పూలు, వస్త్ర చాదర్, సుగంధ పరిమళాల అత్తరుతో కూడిన తట్టను ముఖ్యమంత్రి తలపై పెట్టుకుని భక్తి పారవశ్యంతో ప్రధాన దర్గా లోపలికి ప్రవేశించారు. అక్కడ పీరుల్లా మాలిక్ జీవ సమాధి వద్ద చాదర్, పూలమాల, అత్తరు సమర్పించిన అనంతరం ఫాతెహ నిర్వహించి ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి నేరుగా అరీఫుల్లా మాలిక్, అమీన్ స్వామి మొదలైన 16 మంది పూర్వపు పీఠాధిపతుల మజార్ల వద్దకు చేరుకుని గంధం, చాదర్, పూలు సమర్పించారు. పూర్వ పీఠాధిపతుల మజార్లకు పూలు సమర్పించి గురువులతో ప్రార్థనలు చేశారు. అమీన్‌పీర్ దర్గా గ్రంథాలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి దర్గా విశిష్టత, ప్రాశస్త్యాన్ని, చారిత్రక వైభవాన్ని పీఠాధిపతి వివరించారు. దర్గా మేనేజర్ ఎస్ఎండీ అలీఖాన్, ముజూవర్ అమీర్, దర్గా కో ఆర్డినేటర్ కుతుబుద్దీన్, హజ్ హౌస్ చైర్మన్ గౌసుల్లాజం, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్, వేర్‌హౌస్ కార్పొరేషన్ ఛైర్మన్ కరీముల్లా, స్టేట్ మైనారిటీ కమిషన్ మెంబర్ హిదయతుల్లా, వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్ సోహేల్, అఫ్జల్ఖాన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆధ్వర్యంలో అమీన్‌పీర్ దర్గా ప్రాంగణం వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఘన స్వాగతం పెద్దదర్గాను దర్శించుకునేందుకు నంద్యాల నుంచి కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌కు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కలెక్టర్ వి.విజయ్‌రామరాజు, ఎస్పీ సిద్దార్్థకౌశల్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, మేయర్ కె.సురేష్‌బాబు, శాసన మండలి వైస్ చైర్మన్ జకియాఖానం, ఎమ్మెల్సీలు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, సి.రామచంద్రయ్య, ఎం.రామచంద్రారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యేలు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, దాసరి సుధ, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేడా వెంకట మల్లికార్జునరెడ్డి, మూలే సుదీర్‌రెడ్డి, నవాజ్‌బాషా తదితరులు స్వాగతం పలికారు. సీఎం జగన్ వెంట ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజాద్‌బాషా, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హెలికాఫ్టర్‌లో కడప చేరుకున్నారు. -
ఉద్రిక్తతలకు దారితీసిన దర్గా కూల్చివేత.. పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు..
గుజరాత్:గుజరాత్‌లోని జునాగఢ్‌లో అక్రమంగా నిర్మించిన దర్గా కూల్చివేత వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీసింది. దర్గా కూల్చివేత నోటీసులు జారీ చేయడానికి వెళ్లిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులపై అందోళనకారులు రాళ్లు రువ్వారు. ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు. ఈ అల్లర్లలో ఓ వ్యక్తి మృతి చెందగా..పలువురు పోలీసులు గాయపడ్డారు. దర్గాను అక్రమంగా నిర్మించారని జునాగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్తించింది. ఈ క్రమంలో అధికారులు దర్గాపై కూల్చివేతకు సంబంధించిన నోటీసులను జారీ చేయడానికి వెళ్లగా.. ఆందోళనకారులు అధికారులను అడ్డగించారు. అనంతరం అధికారులపై దాడులకు పాల్పడ్డారు. పోలీసు పోస్టును కూల్చివేశారు. దాదాపు 300 మంది నిరసనకారులు దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయు గోళాలను ఉపయోగించారు. ఈ అల్లర్లలో ఓ వ్యక్తి మరణించాడు. ముగ్గురు పోలీసులతో సహా ఓ డీఎస్పీ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో 174 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి:Cyclone Biparjoy: బలహీనపడిన బిపర్జోయ్.. గుజరాత్ నుంచి రాజస్తాన్ వైపు పయనం -
దర్గాలో దివ్యసమాధి కదలిందట!
జమ్మలమడుగు రూరల్: వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు పట్టణంలో వింత చోటుచేసుకుందని ప్రచారం సాగుతోంది. 500 ఏళ్ల చరిత్ర కలిగి పెన్నానది ఒడ్డున ఉన్న గూడు మస్తాన్‌వలీ దర్గాలోని దివ్యసమాధిలో మనిషి ఊపిరి పీల్చుకున్నట్లుగా శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కదలిక కనిపించిందట. ఈ విషయమై తీసినట్లుగా చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో దర్గా పీఠాధిపతులు, భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాగా, ప్రతి ఏడాది ఇక్కడ వైభవంగా ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తారు. -
Photo Feature: సినిమా చూపిస్త మామా!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ఫిల్మ్‌నగర్ నుంచి దర్గా మార్గంలో ప్రయాణించే వారికి శుక్రవారం నుంచి కొత్తందాలు కనిపిస్తున్నాయి. దాదాపు అరకిలోమీటరు పొడవునా నాలుగు మీటర్ల వెడల్పయిన సెంట్రల్ మీడియన్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతోపాటు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లేలా వాక్‌వే సైతం ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆ మార్గంలోని నాలుగు సర్కిళ్లలో ఏర్పాటు చేసిన శిల్పాలు, వాటి చుట్టూ పెంచిన పూలమొక్కలతో ప్రత్యేకతను సంతరించుకుంది. సినీ ప్రపంచం తలపించేలా.. ఫిల్మ్‌నగర్ అంటేనే సినీమయం కావడంతో సినీప్రపంచాన్ని తలపించేలా సినీ కెమెరా.. సినిమాలో మాదిరిగా ఇద్దరి నడుమ కత్తియుద్ధం శిల్పాలతోపాటు ‘హ్యుమానిటీ’ ‘యూనిక్ లైట్ పోల్’ థీమ్స్‌తో కొలువుదీరిన మరో రెండు శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఏర్పాటు చేసిన ఈ నాలుగు శిల్పాల తెరలను శుక్రవారం తొలగించడంతో ఆ మార్గంలో వెళ్లే వారిని ఆకట్టుకుంటున్నాయి. ఈ కళాకృతుల కోసం మొత్తం రూ. 30 లక్షలు ఖర్చయింది. పచ్చందాలు.. ఫౌంటెన్లకు మరమ్మతులు మరోవైపు త్వరలో చేపట్టనున్న పట్టణప్రగతిలో భాగంగా ఖాలీగా ఉన్న అన్ని ప్రదేశాల్లోనూ మొక్కలు పెంచి పచ్చదనం పరిచేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. ఫ్లై ఓవర్ల కింద స్తంభాల పైనా, రహదారుల వెంబడి ఉండే గోడలపైనా గ్రీన్ కర్టెన్స్ (వేలాడే తీగలు) తదితరమైన వాటితో పచ్చదనం పరిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పాడైపోయిన ఫౌంటెన్లకు సైతం మరమ్మతులు చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దే యోచనలో అధికారులున్నారు. -
ఆంధ్ర గోల్కొండగా పిలిచే ప్రాంతమేదో తెలుసా?
యడ్లపాడు(గుంటూరు): కొండవీడు అంటే రెడ్డిరాజుల సుదీర్ఘ పాలన గుర్తొస్తుంది. కాని శత్రుదుర్భద్యమైన ఈ రాజ్యాన్ని మరెందరో రాజులు, రారాజులు పరిపాలించారు. అందుకే ఇక్కడ గుట్టను తాకినా, ఏ కొండరాయిని కదిలించిన గత చరిత్ర వైభవాలను ఆనావాళ్లుగా చూపించి ఆకట్టుకుంటాయి. గుంటూరు జిల్లా కేంద్రానికి అత్యంత సమీపాన ఉన్న ఈ కొండవీడును పర్యాటక ప్రేమికులు ఆంధ్ర గోల్కొండగా పిలుచుకుంటారు. బాగ్దాద్ నుంచి భారతదేశానికి ఆధ్యాత్మిక పరిమళాలను పంచేందుకు వచ్చిన ఓ మహనీయుని చరిత్ర ఇది. కొండవీడులోని దాదాపీర్ దర్గా దాదాపీర్ అసలు పేరు... ఫిరంగిపురం నుంచి వస్తుండగా గ్రామ ప్రారంభంలో కొండవీడు కొండల పక్కనే కనిపించే దర్గా ఇది. ‘హజ్రత్ సయ్యద్ ఖుదాదే ఫకీర్షా ఔలియా’ అన్నది దర్గా అసలు పేరు. స్థానికులు వాడుకలో పిలుచుకునే పదం ‘దాదాపీర్’ దర్గా. సృష్టికర్త అల్లాహ్ గొప్పతనాన్ని, ఆయన్నూ ఆరాధించే విధానాన్ని చైతన్యం చేయాలని ఆధ్యాత్మిక గురువులకు గురువైన మహబూబ్ సుభాని సంకల్పించారట. దీంతో బాగ్దాద్‌కు చెందిన బీబీహాజీర దంపతులు సుమారు నాలుగు శతాబ్ధాల క్రితం భారతదేశానికి వచ్చారట. (చదవండి: పోణంగిలో అశ్లీల నృత్యాలు ) చివరి మజీలి కొండవీడు.. తొలుత ఉత్తరభారత్‌లో ప్రారంభమైన బాబావారి ఆధ్యాత్మిక బోధనలు.. క్రమేణ దక్షిణప్రాంతాలకు విస్తరించాయి. దాదాపీర్ వారి చివరి మజీలిగా కొండవీడును ఎంచుకున్నట్లు ఇక్కడి పెద్దలు చెబుతారు. అనంత కరుణామయుడు అల్లాహ్ ఆజ్ఞలను అందరికీ తెలపడం కోసమే దాదాపీర్ జీవితాన్ని గడిపారు. ఖురాన్లో సందేశాలను పాటిస్తూ అందరిని అదేమార్గంలో నడిపించడంతో ఆయన్నూ దైవదూతగా భావించారు. కొండవీడులోని దాదాపీర్ దర్గా అత్తరు విక్రయాలతో జీవనం.. కొండవీడు పరిపర ప్రాంతాల్లో లభించే పుష్పాలు, మూలికలతో వివిధ రకాల అత్తరు పరిమళాలను దాదాపీర్ దంపతులు తయారు చేసేవారు. దాదాపీర్ వద్ద నిత్యం అత్తరు సువాసనలు గుభాళిస్తాయట. తాము తయారు చేసిన పరిమళాలను సమీప గ్రామాల్లో విక్రయిస్తూ జీవనాన్ని కొనసాగించారట. కేవలం ఒక్కరూపాయికే అత్తరును ఇచ్చేవారట? ప్రకృతి అంటే బాబావారికి ఎంతో ప్రీతి. ఆయన చివరి మజీలిగా పచ్చగా పరిఢవిల్లే కొండవీడును ఎంచుకున్నరని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. కొండవీడులోని దాదాపీర్ దర్గా దాపరికంతో జరిగే అనర్థాలు.. పవిత్ర ఖురాన్, నమాజ్, దువా, బయాన్ తదితర అంశాల గురించి నిత్యం వివరించడంలోనే ఎక్కువ సమయాన్ని గడిపేవారట. రేపటికి (మరణం తర్వాత) మనిషికి అవసరమైంది పుణ్యమేగాని, సంపాదన కాదని చెప్పెవారట. దాచుకోవడం వల్ల దోచుకోవడం అలవరుతుందని, తద్వార స్వార్ధం, సోమరితనం ఏర్పడతాయని బోధించేవారు. మనిషి ఎక్కువగా సంపాదించుకోవాల్సింది దైవంపై విశ్వాసం మాత్రమే అంటూ వివరించేవారు. శతాబ్ధాల కిందటి మసీదులో నేటికీ నమాజులు... ఈ ప్రాంతంలో ముస్లిం రాజుల కాలం నాటి అతి పురాతన రెండు మసీదులు ఉన్నాయి. శతాబ్ధాల క్రితం నిర్మించిన ఈ మసీదుల్లో ఒకటి కొండవీడు కొండలపై ఉండగా, రెండోది కొండ దిగువన కొండవీడు గ్రామంలో ఉంది. అయితే కొండపై ఉన్న మసీదును ముస్లింరాజు నిర్మించారు. అందులో గుప్తనిధుల కోసం దుండగుల మసీదును కొంతభాగం ధ్వంసం చేయగా, కొండకింద దర్గా ప్రాంగణంలో ఉన్న మసీదు నేటికీ చెక్కుచెదరలేదు. ఇప్పటికి దర్గాకు వచ్చిన వారంతా ఆ మసీదులోనే నమాజ్, ఖురాన్ పఠనం చేయడం విశేషం. (చదవండి: ‘అమూల్’ ఒప్పందంతో మీకేంటి నష్టం?) దర్గా ప్రాంగణంలో దాదాపీర్ నిర్మించిన చెక్కుచెదరని మసీదు ముస్లిం రాజు నిర్మించిన దాదాపీర్ దర్గా దాదాపీర్ నిర్మించిన ఆ మసీదును అంతా భారీ కొండబండరాళ్లతో నిర్మితమైంది. ఏనుగులు సైతం మోయలేని ఆ బండరాళ్లను సునాయాసంగా తెచ్చి మసీదు నిర్మాణం చేస్తున్న దాదాపీర్ మహిమను కొండవీడును పాలించే అప్పటి రాజు పఠాన్మథాన్ఖాన్ కళ్లారా చూశాడట. ఎవరి సాయం లేకుండా స్వయంగా ఆయనే మసీదు నిర్మించడాన్ని చూసి ఆనందపరవశుడై నాటి నుంచి ఆయన భక్తునిగా మారిపోయాడు. అంతేకాదు కొన్నాళ్లకు స్వర్గస్తులైన ఆ దంపతుల సమాధులకు 4.5 ఎకరాల విస్తీర్ణంలో దర్గా నిర్మించారు. దర్గా ఉత్సవాలకు నిర్వహణకు మరో 91 ఎకరాల భూమిని వంశీయులకు ఈనాంగా ఇచ్చినట్లు చరిత్ర చెబుతుంది. బక్రీద్ పండుగ నాడు ఉరుసు ఉత్సవాలు.. ప్రతియేటా బక్రీద్ పండుగనాడు ఈ దర్గా ఉరుసు మహోత్సవ వేడుకలను వస్తాయి. నాలుగు శతాబ్ధాల కాలం నుంచి బాబావారి వంశీయులు, గ్రామ ముజావర్ల ఆధ్వర్యంలో ఈ వేడుకలను మూడు రోజులపాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు సుదూర ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు ఇక్కడకు వచ్చి దాదాపీర్ దర్గాను సందర్శిస్తారు. ప్రస్తుతం దాదాపీర్ వంశీయులైన నౌషద్ నేతృత్వంలో ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. (చదవండి: కర్నూల్లో సింగర్ సునీత సందడి) -
దర్గా దగ్ధం దొంగల పనే
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా నాగిరెడ్డిపల్లిలోని దర్గా దగ్ధం ఘటన దొంగల పనేనని, దీనివెనుక ఎటువంటి మత విద్వేషాలకు తావు లేదని దర్గా నిర్వాహకుడు జిలానీ బాషా స్పష్టం చేశారు. ఈ ఘటనను పురస్కరించుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో ఆలయాలకు రక్షణ లేదని, దర్గాలనూ వదలడం లేదని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో జిలానీ బాషా సెల్ఫీ వీడియో ద్వారా గట్టి బదులిచ్చినట్టయ్యింది. ఈ ఘటనపై జిలానీ ఆ వీడియోలో ఏమన్నారంటే.. ‘నా పేరు జిలానీ బాషా. మా నాన్న పేరు అల్లాబక్షు. 30 ఏళ్ల క్రితం మా నాన్న ఒక దర్గా నిర్మించారు. అప్పటినుంచి అక్కడ హిందూ ముస్లింలు ఎటువంటి మత విభేదాలకు తావు లేకుండా మత సామరస్యంతో సద్భావంతో ఉరుసు ఉత్సవం జరుపుకుంటున్నారు. ఇక్కడి ప్రజలంతా మత సామరస్యం కలిగినవారే. విలువైన వస్తువులు, హుండీలోని డబ్బుల కోసం ఈ నెల 16 రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి దర్గాలోకి ప్రవేశించారు. ఎటువంటి విలువైన వస్తువులు దొరక్కపోవడంతో కోపంతో అక్కడ ఉన్న పాత చద్దర్లను తగులబెట్టారు. దీనిపై నేను గంగవరం పీఎస్‌లో ఫిర్యాదు చేశాను. దీనికి బాధ్యులైన వారిని పోలీసులు తొందర్లోనే పట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ ఎలాంటి మత విభేదాలూ లేవని మరొక్కసారి చెబుతున్నాను’ అని స్పష్టం చేశారు. మూడు ప్రత్యేక బృందాల ఏర్పాటు నాగిరెడ్డిపల్లి దర్గా ఘటనకు కారణమైన నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చిత్తూరు జిల్లా ఎస్పీ ఎస్.సెంథిల్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ సోమవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. 16వ తేదీన రాత్రి జిలానీ బాబా దర్గాలోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి దర్గాలోని మజార్‌పై నుంచి తీసేసిన చద్దర్లను, కొన్ని పాత వస్తువులు కాల్చారన్నారు. దర్గా నిర్వాహకుడు జిలాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇటువంటి సమయాల్లో ప్రజలు సంయమనం పాటించాలని, సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో నిజానిజాలను ప్రభుత్వ వెబ్సైట్ factcheck.ap.gov.in ద్వారా తెలుసుకోవాలని సూచించారు. ప్రార్థనా స్థలాలు, ఆలయాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు కన్పించినా, విద్రోహ చర్యలకు పాల్పడే ప్రయత్నం చేసినా అటువంటి వారి సమాచారాన్ని డయల్ 100కు గానీ, పోలీస్ వాట్సాప్ నంబర్ 94409 00005కు గాని తెలియజేయాలని ఎస్పీ కోరారు. -
ఢిల్లీ నిజాముద్దీన్ దర్గా కలకలం
-
త్యాగానికి ప్రతీక మొహరం
కడప సెవెన్‌రోడ్స్/చిన్నమండెం/ కడప కల్చరల్ : మొహరం నెలతో ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. శాంతి, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం 14 శతాబ్దాల క్రితం జరిగిన చారిత్రాత్మక పోరాటంలో అసువులు బాసిన అమరుల సంస్మరణే మొహరం. అందుకే దీన్ని ‘షహీద్’ మాసంగా పేర్కొంటారు. వాస్తవానికి ఇవి విషాద రోజులైనప్పటికీ తెలుగు నేలలో పీర్ల పండుగగా పిలుస్తారు. మండల కేంద్రమైన చిన్నమండెంలో పీర్ల పండుగ అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తారు. ఇది రాయలసీమలోనే ప్రసిద్ధి గాంచింది. మూడు మకాన్లు ఉన్నప్పటికీ ప్రధానమైనది శ్రీ హజరత్ గంధం పీరు మకాన్. అన్ని కార్యక్రమాలకు కేంద్ర బిందువు ఈ మకాన్. మొహరం నెలలో మూడవ రోజు శ్రీ హజరత్ గంధం పీరు కొలువు తీర్చారు. వివిధ రకాల పుష్పమాలలతో అలంకరించారు. మకాన్ వద్ద అలంకరించిన రంగురంగుల విద్యుద్దీపాలు రాత్రి వేళ నక్షత్ర తోరణాల్ని తలపిస్తున్నాయి. మతాలకు అతీతంగా ప్రజలు శ్రీ హజరత్ గంధం పీరును దర్శించుకుంటున్నారు. ముజావర్లు చదివింపులు నిర్వహిస్తున్నారు. మకాన్ ఎదుట అగ్నిగుండాలు ఏర్పాటు చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడే పదేళ్లలోపు పిల్లలకు ఆటీలు (తాయత్తులు) కడతారు. ఇందువల్ల అనారోగ్యం బారి నుంచి పిల్లలు బయటపడతారని ఇక్కడి ప్రజల విశ్వాసం. మొహరంలో 9, చివరిదైన పదవరోజు కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవి. బాషికం సమర్పణ, గంధం పీరు మెరవణి తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అమీన్‌పీర్ దర్గాలో... కడప నగరంలో రెండు, మూడుచోట్ల మొహరంను ఘనంగా నిర్వహిస్తారు. స్థానిక అమీన్‌పీర్ దర్గాలో పీర్ల చావిడి ఉంది. మొహరం నాడు ఈ దర్గాలో హజరత్ సయ్యద్‌షా పీరుల్లామాలిక్ సాహెబ్ ఉరుసుగా నిర్వహిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక ధార్మిక కార్యక్రమాలు, ఫాతెహా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా హజరత్ పీరుల్లామాలిక్ మజార్ ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా ప్రత్యేకంగా తెప్పించే పూలతో అలంకరిస్తారు. నేడు గంధం పీరు మెరవణి.. మొహరం కార్యక్రమాల్లో చివరిదైన మంగళవారం సాయంత్రం పీర్లను జల్దికి తీసుకు వెళతారు. రాత్రి 10 గంటలకు శ్రీ హజరత్ గంధం పీరు మెరవణి ప్రారంభమవుతుంది. ప్రజలు పెద్ద ఎత్తున కొబ్బరి దివిటీలను వెలిగిస్తారు. కాలిన కొబ్బెరను ప్రసాదంగా భావించి ఇళ్లకు తీసుకు వెళతారు. కొబ్బెర ప్రసాదాన్ని తింటే దీర్ఘకాలిక వ్యాధులు నయం కావడంతోపాటు ఇంటిల్లిపాదికి మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం. తెల్లవారుజాము వరకు సాగే ఈ మెరవణి కార్యక్రమం ఆద్యంతం కొబ్బరి దివిటీల వెలుగులోనే కొనసాగుతుంది. ముంబయి, చెన్నై, బెంగుళూరు, హైదరాబాదు వంటి ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఈ కార్యక్రమానికి తరలి వస్తుంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. బాషికంపై నిర్ణయం మరుసటి సంవత్సరం మొహరంలో గంధం పీరుకు బాషికం ఎవరు సమర్పించాలో ముందే నిర్ణయిస్తారు. ఉత్సవాల్లో పదవ రోజు గంధం పీరు మెరవణి తెల్లవారుజాముకు ముగుస్తుంది. పీరు మకాన్లోకి ప్రవేశించే సమయానికి, వచ్చే ఏడు బాషికం సమర్పించుకోవాలని భావించే వారంతా అక్కడ గుమికూడతారు. వచ్చే ఏడు బాషికం ఎవరు సమర్పించాలో గంధం పీరును మోస్తున్న వ్యక్తి నిర్ణయిస్తారు. కడప పెద్దదర్గా పీఠాధిపతులు చిన్నమండెంలో నిర్వహించే మొహరం కార్యక్రమాల్లో ప్రధానమైన బాషిక సమర్పణకు వస్తున్నారని మకాన్ కమిటీ సభ్యులు సాక్షికి వివరించారు. పీఠాధిపతి తన శిష్య బృందంతో కలిసి గంధం పీరుకు చదివింపులు నిర్వహిస్తారు. బాషికం ఊరేగింపు కార్యక్రమాన్ని తిలకించేందుకు రాయలసీమ జిల్లాలతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. కడపలో మట్టి పెద్దపులి.. కడప నగరం రెడ్‌క్రాస్ భవనం ఎదురుగా నాలుగు రోడ్ల కూడలిలో గల మట్టిపెద్దపులి విగ్రహానికి ఓ చరిత్ర ఉంది. నగర వాసులు ఈ మట్టి పెద్దపులి విగ్రహాన్ని తరుచూ చూస్తూనే ఉంటారు గానీ దాన్ని అక్కడ ఎందుకు ఏర్పాటు చేస్తారో పెద్దల్లో కొద్దిమందికి మాత్రమే తెలుసు. దీనికి పీర్ల పండుగకు చిన్న సంబంధం ఉంది గనుక ఈ సందర్భంగా దాని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మట్టి పెద్దపులి విగ్రహం ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు తాలింఖానాలను నిర్వహించేవారు. ఆ చుట్టుపక్కల గల తాలింఖానాలలో ముస్లిం యువకులతోపాటు హిందు యువకులు కూడా వ్యాయామం చేస్తూ కుస్తీలు పట్టడం నేర్చుకునేవారు. వీధులలోగానీ, గ్రామానికి గానీ అరాచక శక్తుల వల్ల ఏదైనా ఆటంకాలు ఎదురైతే తాలింఖానా నిర్వాహకుల సూచనతో యువకులు వెళ్లి అవసరమైతే శారీరక బలం చూపి ఆ సమస్యను పరిష్కరించేవారు. పులులు లాంటి యువకులు, వారు వ్యాయామం చేసే తాలింఖానాలు ఉండే ప్రదేశం గనుక ఆ రోడ్ల కూడలిలో సాహస యువకులకు గుర్తుగా మట్టితో పెద్ద పులి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అది రోడ్డు విస్తరణలో దెబ్బతినడంతో సిమెంటుతో పులి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల దాన్ని కూడా రోడ్డు విస్తరణలో తొలగించగా, కొద్దిపాటి మరమ్మతులు చేసి గౌస్‌నగర్ వద్ద డివైడర్‌లో దాన్ని ఏర్పాటు చేశారు. పాత దాని స్థానంలో కొత్తగా సిమెంటు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాలింఖానాలోని యువకుల ఆధ్వర్యంలో అప్పట్లో పీర్ల పండుగను ఘనంగా నిర్వహించేవారు. మకాన్ల వద్ద నుంచి పీర్లను ఊరేగింపుగా తీసుకెళ్లి తిరిగి వాటిని శుభ్రం చేసి తిరిగి మకాన్లకు చేర్చేవారు. ఊరేగింపులో తాలింఖానాల యువకుల సాహస కృత్యాల ప్రదర్శనలే ప్రధాన ఆకర్శణగా ఉండేవి. -
దర్గాలో సమాధి కదులుతోంది..!
సాక్షి, పొదలకూరు (నెల్లూరు): పొదలకూరుకు సమీపంలోని లింగంపల్లి వద్ద మాసుంసా వలీ దర్గా సమాధి కదులుతోందనే పుకార్లతో వందల సంఖ్యలో జనాలు బుధవారం రాత్రి దర్గా వద్దకు చేరుకున్నారు. అక్కడే గంటల తరబడి వేచి ఉన్న భక్తులు సమాధి నిజంగానే కదులుతోందని చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న బంధువులు, స్నేహితులకు ఫోన్లు చేసి చెప్పడంతో ఈ విషయం దావానలంగా వ్యాపించింది. రెండు రోజుల క్రితం ఇక్కడి దర్గాలో భక్తులు వైభవంగా గంధమహోత్సవం నిర్వహించారు. లింగంపల్లి, పొదలకూరు తదితర గ్రామాల భక్తులు గంధమహోత్సవంలో పాల్గొన్నారు. గంధమహోత్సవం పూర్తయిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడంతో మహిమతోనే సమాధి కదులుతున్నట్టు భక్తులు అభిప్రాయపడుతున్నారు. సాయంత్రం వేళ పెద్దగా అరుపులు వినపడినట్టు కొం దరు తెలిపారు. అయితే సమాధిపై పరచిన బట్టల కిందకు పురుగులు లేదా విషకీటకాలు చేరి కదులుతున్నాయనే అనుమానాన్ని కొందరు యువకులు వ్యక్తం చేశారు. -
ఉద్రిక్తం.. దర్గా స్వాధీన యత్నం
భవానీపురం: దర్గాను స్వాధీనం చేసుకునేందుకు వక్ఫ్ బోర్డు అధికారులు చేసిన ప్రయత్నాలను స్థానికులు అడ్డుకున్న ఘటన శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే భవానీపురంలో జాతీయ రహదారి పక్కనేగల హజరత్ సయ్యద్ గాలీబ్ షహీద్ వక్ఫ్‌బోర్డ్ అసిస్టెంట్ సెక్రటరీలు అబ్దుల్ ఖుద్దూస్, షంషుద్దీన్, ఆదాం షఫీ, డెప్యూటీ సెక్రటరీ షెకామత్ సాహెబ్, ఇనస్పెక్టర్లు అలీం, యుహూ అలీషాలు భవానీపురం తహసీల్దార్ ఇంతియాజ్ పాషా, పోలీసులను వెంటబెట్టుకుని వచ్చారు. తొలుత దర్గా బయట ఉన్న దర్గా మేనేజ్మెంట్ కమిటీ ఆఫీస్‌కు తాళాలు వేసేందుకు యత్నించారు. దీంతో దర్గా ముజావర్ల కమిటీ సభ్యులు, స్థానిక ముస్లింలు వారిని అడ్డుకున్నారు. పోలీసులు వారిని వారించినా ఆఫీస్‌కు తాళాలు వెయ్యటానికి వీల్లేదంటూ పెద్దఎత్తున నిరసన తెలిపారు. మహిళలు ఆఫీస్‌కు అడ్డంగా నిలబడ్డారు. ముస్లింలందరూ గుమిగూడి ఆందోళన వ్యక్తం చేయటంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. తహసీల్దార్ ఇంతియాజ్ పాషా, వక్ఫ్‌బోర్డ్ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో భవానీపురం సీఐ డీకేఎన్ మోహన్‌రెడ్డి ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. ఇప్పటికిప్పుడు వచ్చి స్వాధీనం చేసుకుంటామంటే తాము చూస్తూ ఊరుకోమని కమిటీ సభ్యులు తేల్చిచెప్పారు. ముఖ్యంగా తాము ఆరాధించే బాబా సమాధిగల గదికి తాళాలు వేసేందుకు ప్రాణాలు పోయినా ఒప్పుకునేది లేదని ఖరాఖండిగా చెప్పారు. సుధీర్ఘ చర్చల అనంతరం తమకు ఐదు రోజుల గడువు కావాలని కమిటీ కోరింది. దీంతో వక్ఫ్‌బోర్డ్ ఆదేశాలను అమలు చేయటమే తన డ్యూటీ అని, గడువు విషయం అధికారులు నిర్ణయించుకోవాలని తహసీల్దార్ ఇంతియాజ్ పాషా చెప్పారు. దీనిపై అధికారులు తర్జనభర్జనపడి చివరికి చేసేది లేక వెనుదిరిగారు. ఒకదశలో స్థానిక ముస్లింలు అధికారులను ఘోరావ్ చేశారు. పోలీసులు వారికి రక్షణగా నిలబడి పంపించివేశారు. జలీల్‌ఖాన్ ఆదేశాల మేరకే.. ! భవానీపురం: స్థానిక హజరత్ సయ్యద్ గాలీబ్ షహీద్ దర్గా ఆదాయంలో 30 శాతం వక్ఫ్‌బోర్డుకు ఇవ్వాలని వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ జలీల్‌ఖాన్ దర్గా ముజావర్ల కమిటీకి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దానికి కమిటీ సభ్యులు ఒప్పుకోనందునే శనివారం వక్ఫ్‌బోర్డు అధికారులను దర్గాపైకి పంపారని సమాచారం. వాస్తవానికి దర్గా భూములపై వచ్చే ఆదాయంలో 7 శాతం వక్ఫ్‌బోర్డ్‌కు ట్యాక్స్ కింద చెల్లించాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా జలీల్‌ఖాన్ 30 శాతాన్ని డిమాండ్ చేయటం వెనుక ఉన్న మతలబు ఏమిటంటే 7 శాతాన్ని వక్ఫ్‌బోర్డుకు చెల్లించి మిగిలిన 23 శాతాన్ని తన జేబులోకి వేసుకునేందుకేనని దర్గా కమిటీ సభ్యులు కొందరు తెలిపారు. దర్గా భూములలో సోమా కంపెనీకి ఇచ్చిన లీజు కింద దాదాపు రూ.3 కోట్లు త్వరలో రానున్న నేపథ్యంలోనే 30 శాతం తమకు ఇవ్వాలని జలీల్‌ఖాన్ ఇటీవల తెరమీదకు తెచ్చినట్లు తెలిసింది. దర్గా కమిటీని దారిలోకి తెచ్చుకునేందుకే కమిటీని రద్దు చేసేశామని చెప్పటం, ఆ క్రమంలోనే శనివారం అధికారులను పంపించి హడావుడి చేశారని సమాచారం. జలీల్‌ఖాన్‌కు అక్షింతలు ! దర్గా వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్న తరుణంలో టీడీపీ నాయకులు ఫతావుల్లా, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్ అక్కడి వచ్చి కమిటీకి మద్దతు పలికారు. దర్గా వద్ద హడావుడి తగ్గిన తరువాత కమిటీ సభ్యులు, స్థానికులు ఎంపీ కేశినేని శ్రీనివాస్ దగ్గరకు వెళ్లారు. వారితోపాటు టీడీపీ నాయకులుకూడా వెళ్లారు. సమస్య విన్న కేశినేని శ్రీనివాస్ సానుకూలంగా స్పందించి ముస్లిలకు వ్యతిరేకంగా ఏమీ చేయమని, ముఖ్యమంత్రి దృష్టికికూడా తీసుకువెళతానని హామీ ఇచ్చారని కమిటీ సభ్యులు చెప్పారు. కాగా కేశినేని ఈ విషయాన్ని ఎమ్మెల్సీ తొండెపు జనార్ధన్‌కు చెప్పటంతో ఆయన జలీల్‌ఖాన్‌పై సీరియసై అక్షింతలు వేసినట్లు సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఈ పిచ్చి పనులేమిటని తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. వక్ప్‌బోర్డ్ కుట్ర ఇది... వక్ప్బోర్డ్ను అడ్డంపెట్టుకుని దర్గాకు చెందిన ఆస్తులను కాజేయటానికి చైర్మన్ జలీల్‌ఖాన్, డైరెక్టర్లు కుట్ర పన్నారని దర్గా ముజావర్ల కమిటీ అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ ఆరోపించారు. వన్‌టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ వద్దగల జుమా మసీదుకు చెందిన స్థలాన్ని ఒక వస్త్ర దుకాణ సంస్థకు అప్పగించి జలీల్‌ఖాన్, డైరెక్టర్లు లబ్ధి పొందుదామనుకున్నారని, అయితే అదికాస్తా బెడిసికొట్టేసరికి దర్గాపై కన్నేశారన్నారు. -
దర్గాలో వైఎస్సార్సీపీ నేతల ప్రత్యేక పూజలు
-
పేదల పాలిట పెన్నిధి మియామిష్క్
జియాగూడ : పురానాపూల్ వంతెన వద్దగల చారిత్రాత్మకమైన మియామిష్క్ మసీదు, దర్గా ఎంతో ఖ్యాతిగాంచింది. నాటి నుంచి నేటికి యాత్రికులకు బస, విద్యార్థులకు గదులు, మదర్సా ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. చారిత్రాత్మకమైన మియామిష్క్ మసీదు, దర్గాను 400 సంవత్సరాల క్రితం నిర్మించారు. గోల్కొండను పాలించిన అబ్దుల్లా ఇబ్రహీం కులీకుతుబ్‌షా పాలనలో సైనిక కమాండర్‌గా సేవలందించిన మియామిష్క్ నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేవాడు. పాతబస్తీలోని గగన్‌పహాడ్ గుట్ట ప్రాంతం నుంచి తెప్పించిన రాయి పురానాపూల్ వంతెనకు, మియామిష్క్ మసీదు, దర్గాలకు ఉపయోగించా. ప్రస్తుతం మియామిష్క్ దర్గా, మసీదు ఆర్కియాలజీ, వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయి. రాతితో మసీదు నిర్మాణం.. ఇక్కడి మసీదు నిర్మాణం రాతితో చేపట్టింది. మసీదు చుట్టూ యాత్రికులు, వ్యాపారులు బస చేసేందుకు గదులు నిర్మించారు. అప్పట్లో గోల్కొండ పక్కనే ఉన్న కార్వాన్ వ్యాపార కేంద్రానికి వచ్చేవారు మసీదులోని ఈ గదుల్లో బస చేసేవారు. మసీదులో వ్యాధులను నయం చేసేందుకు ఓ రకమైన మసాజ్ చేసేవారు. ఇందుకోసం ప్రత్యేకంగా వేడినీళ్లతో హౌజ్‌ను నిర్మించారు. హైదరాబాద్ చివరి నిజాం హయాంలో ఉన ప్రధాన కార్యదర్శి కిషన్ పర్షాద్ మహరాజ్ ఏదో వ్యాధి నిమ్తితం ఇక్కడే చికిత్స పొందాడు. మసీదు, దర్గాల మినార్లు చార్మినార్ నిర్మాణ శైలి డిజైన్‌ను పోలి ఉంటుంది. అలాగే విద్యార్థుల వసతి కోసం సుమారు 35 కు పైగా రెండేసి గదుల ఇండ్లను నిర్మించారు. అప్పట్లోనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు ఇందులో ఉంటూ ఉన్నత చదువులను కొనసాగించే వారు. ఇక ప్రత్యేకంగా చిన్నారుల కోసం మదర్సాను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ఖురాన్, అరబ్బీ బాషలను నేర్పించేవారు. వరద బాధితులకు సేవలందించిన మసీదు.. 1908లో మూసీకి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఎన్నో ఇళ్లను వరదలు ముంచెత్తగా పల్లపు ప్రాంతంలో ఉన్న మియామిష్క్ మసీదు బాధితులకు రక్షణ కల్పించింది. నీటి పరవళ్లు తగ్గే వరకు మియామిష్క్ మసీదులో వందలాది మంది ప్రజలు ఆశ్రయం పొందారు. అలాగే వరద బాధితుల కోసం కూడా ఎన్నో సేవలందించిన ఘనత ఈ మసీదుకే దక్కుతుంది. పట్టించుకోని అధికారులు.. ఎంతో చారిత్రాత్మకమైన మియామిష్క్ మసీదు, దర్గా, మదర్సా, వసతి గృహాల అభివృద్ధి కోసం పురావస్తు శాఖ విభాగం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికే మసీదు పరిసర కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. పలుచోట్ల మసీదు కట్టడాలు పెళ్లలు, పెచ్చులూడాయి. ఎంపీ నిధులతో మరమ్మతు పనులు.. ప్రభుత్వం మసీదు పరిరక్షణకు ఎలాంటి నిధులు, రక్షణ, భద్రత కల్పించక పోయినా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రత్యేకంగా రూ.10 లక్షలు మంజూరు చేయడంతో చిన్నపాటి మరమ్మతులు చేపడుతున్నాం. అలాగే మైనార్టీ వెల్ఫేర్ ద్వారా బాబా డాకిలా ప్రధాన ద్వారాం అభివృద్ధి, మరమ్మతుల కోసం రూ.20 లక్షలు నిధులు మంజూరయ్యాయి. త్వరలో ఆ పనులు కూడా చేపడతాం. – సమద్ వార్సి, మియామిష్క్ మసీదు అధ్యక్షుడు -
కొల్చారం.. రండి చూసొద్దాం
కొల్చారం(నర్సాపూర్) : కొల్చారం మండల పరిసర ప్రాంతాలు పురాతన కట్టడాలకు, ప్రకృతి రమణీయతకు పేరుగాంచాయి. ఇక్కడ భూమిలో ఎక్కడ తవ్వినా.. కట్టడాలు, విగ్రహాలే దర్శనమిస్తాయి.ప్రస్తుతం కొల్చారంలో దర్శనీయ స్థలాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కొల్చారం పూర్వపు నామం కోలాచలం. కోలాచలం కాస్త కొలిచెలిమగా మారి రానురాను అది కొల్చారంగా రూపుదిద్దుకుంది. ఇక్కడి చరిత్రను తెలుసుకోవాలంటే తప్పనిసరిగా కొల్చారంను దర్శించాల్సిందే. కాకతీయుల ఆనవాళ్లు.. మండల కేంద్రానికి పురాతనమైన చరిత్ర ఉంది. ఎన్నో రాజవంశాలు ఈ నేలను పరిపాలించాయి. కొ ల్చారం గ్రామం చుట్టూ భవన నిర్మాణాల కోసం ఎక్క డ తవ్వినా ఏదో ఒక దేవత విగ్రహం, కట్టడాలకు సం బంధించిన ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. కాకతీయు ల కాలం మొదలుకుని నిజాం కాలం వరకు ఇక్కడి విగ్రహాలు, శాసనాలు నాటి చరిత్రను తెలియజేస్తున్నాయి. ప్రకృతి రమణీయతకు నిలయం.. చూడదగ్గ మరో ప్రదేశం తిరుమలయ్యగుట్ట. కొల్చారం నుంచి వరిగుంతానికి వెళ్లే ఎడమవైపు ఈ గుట్ట దర్శనమిస్తుంది. పచ్చని ప్రకృతి రమణీయతను చాటుతూ గుట్టపైకి వెళ్తే తిరుమలేశుని దర్శించుకోవచ్చు. ఈ గుట్టకూ ఓ ప్రత్యేకత ఉంది. క్లిష్టమైన వ్యాఖ్యాన ప్రక్రియకు ప్రాణం పోసి కాళిదాసు రచించిన పంచకావ్యాలకు వ్యాఖ్యానం చేసిన సాహితీ వేత్త కోలిచాల మల్లినాథసూరి జ్ఞానసముపార్జన పొందిన స్థలం ఈ గుట్ట. ఇంతటి చరిత్రను తనలో ఉంచుకున్న కొల్చారంను దర్శించడం తప్పనిసరి. మరి ఆలస్యం ఎందుకు నేడే దర్శించుకునేందుకు బయలుదేరండి మరీ. మతసామరస్యానికి ప్రతీక.. ఇక్కడ పురాతనమైన దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడ ముస్లింల పరిపాలన కొనసాగిందనడానికి షేక్షాబొద్దిన్ దర్గా నిదర్శనం. ఇక్కడ వారంలో ఆరు రోజులు పెద్ద ఎత్తున భక్తులు మతాలకు అతీతంగా వచ్చి దర్శించుకుంటారు. తొమ్మిదిన్నర అడుగుల ఏకశిలా విగ్రహం.. 1984లో వీరభద్రస్వామి ఆలయం పక్కన ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టగా శెల్యరాతితో చెక్కిన ఏకశిలతో దిగంబరంగా తలపై ఏడు సర్పాలు పడగకప్పి ఉన్న విగ్రహం బయటపడింది. తొమ్మిదిన్నర అడుగులున్న ఈ విగ్రహం 11వ శతాబ్దానికి చెందిన కళ్యాణి చాళుక్యుల కాలం నాటిదిగా గుర్తించారు. ఆనాటి రాజైన త్రిభువన ఈ శిలావిగ్రహాన్ని చెక్కించినట్లుగా, ఇది జైన గురువైన 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడి విగ్రహంగా చరిత్రకారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ విగ్రహాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన జైన ఆలయంలో ప్రతిష్ఠించారు. దేశంలో శ్రావణబెలగొళలోని గోమటేశ్వరుని విగ్రహం తర్వాతి స్థానాన్ని ఈ ఏకశిలా విగ్రహం దక్కించుకుంది. పూర్తి ప్రకృతి రమణీయత ప్రతిబింబించేలా ప్రశాంత వాతావరణంలో దేవాలయం నిర్మించడంతో చాలామంది పర్యాటకులు ఈ దేవాలయాన్ని దర్శించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. -
కేసీఆర్ పర్యటనలో అపశృతి
సాక్షి, కొత్తూరు : తెలంగాణ సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ శుక్రవారం జిల్లాలోని కొత్తూరు మండలంలో ఉన్న జహంగీర్‌పీర్ దర్గాను దర్శించుకోవడానికి బయలుదేరారు. ఈ సమయంలో సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లోని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వాహనం ఢీకొని ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధిత కానిస్టేబుల్‌ను హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన కానిస్టేబుల్ కీసర పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రవి కిరణ్‌గా గుర్తించినట్లు సమాచారం. కాగా, జహంగీర్‌పీర్ దర్గాను దర్శించిన ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, మొక్కు చెల్లించుకున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దర్గాను సందర్శించి, మొక్కు చెల్లించుకుంటానని గతంలో మొక్కుకున్న కేసీఆర్.. ఈ క్రమంలోనే నేడు జహంగీర్ పీర్ దర్గాను సందర్శించి మొక్కులు చెల్లించుకుని, చాదర్‌ను సమర్పించారు. -
జహంగీర్ పీర్ దర్గా సందర్శించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ సమీపంలోని జహంగీర్ పీర్ దర్గాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, మొక్కు చెల్లించుకున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దర్గాకు వచ్చి దర్గాను సందర్శించి, మొక్కు చెల్లించుకుంటానని కేసీఆర్ మొక్కుకున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ జహంగీర్ పీర్ దర్గాను సందర్శించారు. కేసీఆర్ వెంట డిప్యూటీ సీఎం మహముద్ అలీ ఉన్నారు. -
కడప దర్గాలో ప్రత్యేక పూజలు చేసిన ప్రభుదేవా
-
బెజవాడలో ఆలయం, దర్గా కూల్చివేత
సాక్షి, విజయవాడ: పుష్కరాలకు అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ప్రార్థనాలయాలను కూల్చివేస్తోంది. ప్రజల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్డుపక్కగా ఉన్నవాటిని అర్ధరాత్రి సమయంలో పడగొట్టేస్తోంది. తాజాగా బుధవారం అర్ధరాత్రి దుర్గగుడి గోశాల వెనుక భాగంలోని శంకరమఠాన్ని పూర్తిగా కనుమరుగుచేసింది. గాయత్రిదేవి, శివాలయంతో, ఆంజనేయస్వామి గుడులతో పాటు మరికొ న్ని ఆలయాలను తొలగించారు. మొదటి అంతస్తులో ఉన్న ప్రవచనా మందిరాన్ని పూర్తిగా తొలగించగా, కింద అంతస్తులో ఉన్న ఆలయాలను తొలగించేందుకు గడువు ఇచ్చారు. లాగే దుర్గగుడికి వెళ్లే అర్జున వీధి మొదట్లో ఉండే హజరత్ సయ్యద్ షా ఖాద్రీ దర్గా ప్రాంగణాన్ని బుధవారం అర్ధరాత్రి కూల్చివేశారు. దర్గా మరమ్మతులు పూర్తయి కనీసం ప్రారంభోత్సవం కూడా జరుపుకోకుండానే ఇలా ధ్వంసం చేయడంపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యథావిధిగా కూల్చివేతల కొనసాగింపు.. గతంలో 30 దేవాలయాలను కూల్చివేసినందుకు నిరసనగా పీఠాధిపతులు, మఠాధిపతులు విజయవాడలో పెద్ద సభ నిర్వహించారు. ఆ సందర్భంగా ఇక నుంచి ఏ దేవాలయం, ప్రార్థనాలయం తొలగించాలన్నా ఆయా ప్రార్థనామందిరాల పెద్దలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. తొలగించిన దేవాలయాలను నిర్మించేందుకు ఐదుగురు మంత్రులతో కూడిన కమిటీని వేసింది. అయితే వీటిన్నంటినీ పక్కన పెట్టి యథావిధిగా దేవాలయాలు, దర్గాల కూల్చివేతను ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఆలయాల కూల్చివేతలు ఇక లేవంటూ ప్రకటిస్తూనే మరో వైపు ప్రభుత్వం తన వైఖరిని కొనసాగించడం సరికాదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కటాక్షించే కడప దర్గా
ఈ నెల 27 వరకు ఉరుసు ఉత్సవాలు ఆ దర్గాలో కూర్చొని కళ్లు మూసుకుని మౌనంగా కొద్ది నిమిషాలు ధ్యానిస్తే అంతులేని శాంతి లభిస్తుంది. ఏది కావాలని అర్థిస్తే ఆ పని జరిగి తీరుతుంది. మనసంతా ఏదో తెలియని కొత్త శక్తి... ఆధ్యాత్మికంగా ఎనలేని సంతృప్తి... మరికొన్నాళ్లకు సరిపడ ఆత్మశక్తి ఇనుమడిస్త్తుంది. అందుకే అది దేశంలోనే ఓ ప్రముఖ ఆధ్యాత్మిక శిఖరంగా వెలుగొందుతోంది. ప్రఖ్యాతి చెందిన కడప పెద్దదర్గాలో సంవత్సరానికి మొత్తం 11 ఉరుసులు నిర్వహిస్తారు. ఇందులో ప్రస్తుతం జరుగుతున్న పెద్ద ఉరుసు ప్రధానమైనది. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. వైఎస్సార్‌జిల్లా కడప నగరంలోని అస్థానా-ఏ-మగ్దూమ్ ఇలాహీ (అమీన్‌పీర్ దర్గా) దేశంలోని గొప్ప దర్గాలలో ఒకటి. ‘దక్షిణ భారత అజ్మీర్’ గా పేరుగాంచిన ఈ దర్గాను నిరుపేదల నుంచి కోటీశ్వరుల వరకు నిత్యం వందలాది మంది భక్తులు సేవిస్తుంటారు. దర్గాలో అడుగిడిన ప్రతి ఒక్కరూ తొలుత ప్రధాన గురువులైన హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా పీరుల్లా మాలిక్ సాహెబ్ మజార్‌ను దర్శించుకుంటారు. అనంతరం అదే ప్రాంగణంలోని హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ మజార్‌తోపాటు ఆ వంశానికి చెందిన ఇతర గురువులందరి మజార్లను దర్శించుకుంటారు. సంపూర్ణ భక్తివిశ్వాసాలతో పూల చాదర్ సమర్పించి ప్రార్థనలు చేస్తుంటారు. గురువుల ఆగమనం 16వ శతాబ్దంలో కర్ణాటకలోని బీదర్ ప్రాంతం నుంచి ఖ్వాజా సయ్యద్‌షా పీరుల్లా మాలిక్ సాహెబ్ తన సతీమణి, ఇరువురు కుమారులు (హజరత్ ఆరీఫుల్లా హుసేనీ, హజరత్ అహ్మద్ హుసేనీ సాహెబ్), ఫకీర్లు, ఖలీఫాలతో కలిసి ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారు. అప్పట్లో సిద్ధవటం నవాబైన నేక్‌నామ్‌ఖాన్ ఈ గురువుల మహిమల గురించి విని స్వయంగా దర్శించుకుని ప్రియ భక్తునిగా మారారు. గురువుల సన్నిధిలో స్థానం లభించిన తర్వాత ఆయనకు ప్రతి విషయంలోనూ విజయాలే లభించాయి. దీంతో ఆయన కోరికపై గురువులు ఈ ప్రాంతంలోనే ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ స్థిరపడ్డారు. జీవ సమాధి ఆధ్యాత్మిక బోధనలతోపాటు హజరత్ పీరుల్లా మాలిక్ ఎన్నో మహిమలు చూపేవారు. దాంతో భక్తుల సంఖ్య నానాటికీ పెరగడంతో గిట్టనివారు ఇంకా గొప్ప మహిమలు చూపాలంటూ కోరారు. సజీవంగా సమాధి కావాలని, మూడవరోజు మజార్ నుంచి బయటికి వచ్చి కనిపించాలని సవాలు విసిరారు. దాన్ని ఆయన చిరునవ్వుతో స్వీకరించి మొహర్రం 10వ రోజు (షహదత్) తన పెద్దకుమారుడు హజరత్ ఆరీఫుల్లా హుసేనీకి బాధ్యతలు అప్పగించి వందలాది మంది భక్తుల సమక్షంలో నేలను చీలమని ఆదేశించి సజీవ సమాధి అయ్యారు. మూడవరోజు ఆయన మజార్‌కు ఓవైపున నమాజు చేస్తూ కనిపించడంతో అందరూ ఆ అద్భుతాన్ని తిలకించి ఆనంద పరవశులయ్యారు. గిట్టనివారు సైతం ఆయన శిష్యులుగా మారారు. అనంతరం దర్గా ఆయన పెద్ద కుమారుడు హజరత్ ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ నిర్వహణలో సాగింది. చిన్న కుమారుడు హజరత్ అహ్మద్ హుసేనీ సాహెబ్ నందలూరు కేంద్రంగా బోధనలు సాగించారు. మహా తపస్వి దర్గా వ్యవస్థాపకులు హజరత్ సయ్యద్‌షా పీరుల్లా మాలిక్ అయినా ఇక్కడ జరిగే పెద్ద ఉరుసు మాత్రం ఆరీఫుల్లా హుసేనీ పేరిటే జరుగుతుంది. ఈయన 40 సంవత్సరాలపాటు తాడిపత్రి అడవుల్లో, తర్వాత కడప ప్రాంతంలోని శేషాచల అడవుల్లో (వాటర్ గండి ప్రాంతంలో) 23 సంవత్సరాలు కఠోర తపస్సు చేశారు. ఆయన తపశ్శక్తికి ప్రతీకగానే దర్గాలోని ఆయన మజార్ మిగతా అన్నిటికంటే ఎత్తుగా ఏర్పాటు చేశారు. దర్గాకు వచ్చే భక్తులు ప్రధాన గురువులైన హజరత్ పీరుల్లా మాలిక్ సాహెబ్‌ను దర్శించుకున్న అనంతరం హజరత్ ఆరీఫుల్లాహుసేనీ సాహెబ్ దర్గాను కూడా దర్శించుకుంటారు. సేవా-ప్రజ్ఞల ప్రతిరూపం ప్రస్తుత పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ బాల్యంలో సకల మతగ్రంథాలను అధ్యయనం చేశారు. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా దర్గా కేంద్రంగా అమీన్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ద్వారా పలు సేవా కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. తమ ఖర్చులతోనే పేద వర్గాలకు సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నారు. దర్గా శిష్యులందరికీ అక్కడే లంగర్ ద్వారా మూడు పూటల భోజనం, వసతి కల్పిస్తున్నారు. ప్రతివారం వందలాది మంది రోగులకు ఉచితంగా వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. జోధా అక్బర్ సినిమాలో ‘ఖ్వాజా-రే-ఖ్వాజా’ పాటను వినే ఉంటారు కదూ! దీన్ని రాసింది ఏ సినిమా రచయితో అనుకుంటున్నారా? అదేం కాదు.. ఖాసిఫ్ కలం పేరుతో కడప పెద్దదర్గా ప్రస్తుత పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ఆ పాటను రచించారు. ఆ పాట సూపర్‌హిట్ అయి భారతదేశాన్ని ఉర్రూతలూగించింది. ‘అల్ రిసాలా’ హిందీ సినిమాలో కూడా ఆయన ‘మర్హబా...యా ముస్తఫా...’ గీతాన్ని రాశారు. అదికూడా పెద్ద విజయం సాధించింది. ఎవరి నుంచి ఎలాంటి చందాలు స్వీకరించని వీరు... గీత రచన వంటి వాటిపై వచ్చే ఆదాయంతోనే సువిశాలమైన దర్గా సంస్థానాన్ని ఒంటిచేత్తో నడిపిస్తున్నారు. మత సామరస్యం ఈ దర్గాను మత సామరస్యానికి ప్రతీకగా పేర్కొంటారు. ఇక్కడ జరిగే ఉరుసు ఉత్సవాలకు దాదాపు సగం మంది ముస్లిమేతరులు హాజరవుతారు. ప్రతిరోజు దర్గాను దర్శించుకునే భక్తుల్లో 30 శాతం మంది ముస్లిమేతరులు ఉంటారు. జిల్లాలో ఇలాంటి గొప్ప దర్గా ఉన్నందుకు వైఎస్సార్ జిల్లా వాసులు ఎంతో గొప్పగా భావిస్తుంటారు. ఈ దర్గాలోని పెద్ద ఉరుసు నిర్వహణకు అన్ని ప్రభుత్వ శాఖలు తమ వంతుగా సేవలందిస్తున్నాయి. - పంతుల పవన్‌కుమార్, కడప, వైఎస్సార్ జిల్లా ఇది నా భాగ్యం దాదాపు మూడు తరాలుగా ఈ దర్గా నిర్వహణ భాగ్యం నాకు లభించింది. దర్గా గురువులపై అచంచల భక్తి విశ్వాసాలతో నా బాధ్యతలను నెరవేరుస్తున్నాను. ఈ సన్నిధిలో సేవలందించడంతో నా జన్మ ధన్యమైందని ఆనందంగా ఉంది. - లియాఖత్ అలీఖాన్ (బైజు), పెద్దదర్గా మేనేజర్ పూర్వజన్మ సుకృతం ప్రస్తుత గురువుల సేవలు చేసే అవకాశం నాకు లభించడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. నిత్యం ఆయనకు సన్నిహితంగా మెలుగుతూ సేవలందించడంలో ఎంతో తృప్తి పొందుతున్నాను. నా జన్మంతా గురువుల సేవకే అంకితం చేస్తున్నా! - నయీమ్, కార్యదర్శి, పెద్దదర్గా దర్గా సన్నిధి నా పెన్నిధి దర్గాలోని అందరూ గురువుల మజార్ల వద్ద నిత్యం ఎన్నోసార్లు ప్రార్థనలు చేసే అవకాశం నాకే లభించడాన్ని ఈ జన్మలో నేను ఊహించలేదు. వచ్చే ప్రముఖులందరికీ గురువుల మహిమలు, చరిత్ర వివరిస్తూ వారిచే ప్రార్థనలు చేయిం చడంతో నా జన్మధన్యమైంది. - అమీర్, ముజావర్, పెద్దదర్గా ప్రముఖులెందరో... ఈ దర్గాను హిందీ, తెలుగు, తమిళ సినీ ప్రముఖులందరూ తరచు దర్శించుకుంటుంటారు. అమితాబ్ కుటుంబ సభ్యులతోపాటు అమీర్‌ఖాన్, అక్షయ్‌కుమార్, అనిల్‌కపూర్ తమిళ సినీ నటులు సూర్య, విజయ్, దర్శకుడు మురగదాస్, లారెన్స్ తదితరులు, తెలుగు సినీ రంగానికి చెందిన దాదాపు అందరూ దర్గా గురువుల దర్శనం చేసుకుంటుంటారు. ప్రముఖ రాజకీయ నాయకులు కూడా దర్గాను దర్శించుకుని ఆశీస్సులు పొందు తుంటారు. ‘ఆస్కార్’ గ్రహీత, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్గాలో జరిగే 11 గంధం ఉత్సవాలకు తప్పక హాజరవుతూ ఉంటారు. ఈ దర్గా గురువుల దయతోనే తాను ఈ స్థాయికి వచ్చానని ఆయనకు ప్రగాఢ విశ్వాసం. -
దర్గాలో చోరీ
గాజువాక (విశాఖపట్నం) : గాజువాకలోని బీసీ రోడ్డులో గల దర్గాలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు దర్గాలోని హుండీ పగులగొట్టి అందులోని సొత్తుతో ఉడాయించారు. సోమవారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి రూ.40 వేలు చోరీకి గురైనట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కడప పెద్దదర్గాను దర్శించుకున్న విక్టరీ వెంకటేశ్
వైఎస్సార్ జిల్లా : కడప నగరంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం పెద్ద దర్గాను సినీ హీరో విక్టరీ వెంకటేశ్ శుక్రవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చాదర్ సమర్పించనున్నారు. 18వ శతాబ్ధంలో వెలసిన ఈ దర్గాను అమీన్పూర్ దర్గా అని కూడా అంటారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నుంచే గాక దేశ వ్యాప్తంగా పలువురు భక్తులు, ప్రముఖులు ఈ దర్గాకు వచ్చి చాదర్ సమర్పిస్తుంటారు. -
రంజాన్‌కు ముమ్మర ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నగరంలోని మసీదులు, దర్గాల వద్ద ముమ్మర ఏర్పాట్లు చేశారు. బుధవారం నెలవంక కన్పించక పోవడంతో గురువారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్నట్లు రుహయిత్-ఇ-హిలాల్ కమిటీ ప్రకటించింది. నెలవంక కన్పించిన వెంటనే మసీదుల్లో తరాబీ నమాజ్‌తో రంజాన్ మాసం ప్రారంభం అవుతుంది. శుక్రవారం నుంచి ఉపవాసదీక్షలు ప్రారంభం అవుతాయి. ఇప్పటికే ప్రభుత్వం తరపున మక్కామసీదు, రాయల్ మసీదుల్లో ఏర్పాట్లు పూర్తిచేశారు. నమాజ్ వేళల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఒక గంట ముందే విధులను విరమించుకోవచ్చని తెలిపింది. జూన్ 18 నుంచి జూలై 17 వరకు ఇది వర్తిస్తుందని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. -
పెద్దదర్గాలో ఘనంగా ఉరుసు ఉత్సవం
కడప కల్చరల్ : అస్థానె మగ్దూమ్ ఇల్లాహిలోని హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా అమీనుల్లా హుసేనీ చిష్ఠివుల్ ఖాద్రీ సాహెబ్ ఉరుసు ఉత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ గురువుల మజార్ వద్ద ప్రత్యేకంగా ఫాతెహా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు పీఠాధిపతి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు. దర్గా ప్రాంగణంలోని దుకాణాల వద్ద మహిళలు కిటకిటలాడారు. ఉదయం నుంచి రాత్రి వరకు దర్గా ఆధ్వర్యంలోని లంగర్‌ఖానాలో వేలాది మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించారు. -
చివరి రోజూ అదే కోలాహలం
నెల్లూరు (బాలాజీనగర్): రొట్టెల పండగలో చివరి రోజూ భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. బారాషహీద్‌లో ఈ నెల నాల్గో తేదీ ప్రారంభమైన రొట్టెల పండగ శుక్రవారం ఘనంగా ముగిసింది. భక్తులు దర్గాను దర్శించుకని కోర్కెలు తీర్చుకునేందుకు రొట్టెలు పంచుకున్నారు. ఈ నాలుగు రోజుల్లో సుమారు 10 లక్షల నుంచి 12 లక్షల వరకు భక్తులు పాల్గొని ఉంటారని అధికారుల అంచనా. చివరి రోజు కూడా భక్తుల జోరు తగ్గలేదు. దర్గా ప్రాంగణం ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు, కమిటీ సభ్యులు, పోలీసులు చేసిన కృషి ఫలితాన్నిచ్చింది. దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఘనంగా తహలీల్ ఫాతెహా గంధమహోత్సవం చివరి ఘట్టాన్ని తహలీల్ ఫాతెహా అంటారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు దర్గా ముజావర్ రఫీఅహ్మద్, వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ హుస్సేనిలు కలిసి దర్గాలోని 12 గుమ్మత్లకు గంధలేపనం చేసి ఫాతెహా చదివారు. అనంతరం ముర్షద్లు 12 మంది షహీద్‌లకు సలాం పలికారు. దీంతో రొట్టెల పండగ పూర్తయైంది. అందరికీ కృతజ్ఞతలు రొట్టెల పండగను ఘనంగా నిర్వహించడంలో అందరి సహకారం మరవలేనిది. ఉత్సవాలను చక్కటి ప్రణాళికతో నిర్వహించడంలో అన్నిశాఖల అధికారులు సహకారం అందించారు. ముఖ్యంగా దర్గా కమిటీ సభ్యులు అహోరాత్రులు కష్టించినందుకు ఫలితం దక్కింది. - సయ్యద్ ఫయాజుద్దీన్ అహ్మద్,దర్గా కమిటీ చైర్మన్