
ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి గూడుమస్తాన్‌వలీ దర్గాకు వచ్చిన భక్తులు
జమ్మలమడుగు రూరల్: వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు పట్టణంలో వింత చోటుచేసుకుందని ప్రచారం సాగుతోంది. 500 ఏళ్ల చరిత్ర కలిగి పెన్నానది ఒడ్డున ఉన్న గూడు మస్తాన్‌వలీ దర్గాలోని దివ్యసమాధిలో మనిషి ఊపిరి పీల్చుకున్నట్లుగా శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కదలిక కనిపించిందట.
ఈ విషయమై తీసినట్లుగా చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో దర్గా పీఠాధిపతులు, భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాగా, ప్రతి ఏడాది ఇక్కడ వైభవంగా ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తారు.