jammala madugu
-
బాబూ.. నీ వెనుక తగలబడుతోంది చూడు!
సాక్షి, జమ్మలమడుగు: ఒకవైపు అగ్ని ప్రమాదం చోటు చేసుకుని తగలబడిపోతుంటే చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడనే చందంగా వ్యవహరించారు చంద్రబాబు. తాను సభ కోసమే మాత్రమే వచ్చాను.. పక్కన ఏమి జరిగితే తనకెందుకు అనే విధంగా చంద్రబాబు రోడ్ షో సాగింది. చంద్రబాబు బుధవారం చేపట్టిన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు రోడ్ షోలో భాగంగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెలుగు తమ్ముళ్ల ఓవరాక్షన్ చేసి తోపుడు బండి హోటల్ పై టపాకుల వర్షం కురిపించారు. దాంతో తోపుడు బండి హోటల్ పూర్తిగా దగ్ధమైంది. చంద్రబాబు స్పీచ్ ఇస్తుండగానే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒకవైపు చంద్రబాబు ప్రసంగ ఇస్తుంటే ఆ వెనుకే అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన దృశ్యాలు ఒకవైపు, చంద్రబాబు ప్రసంగం మరొకవైపు కనిపించడంతో ఇది చూసిన వారు ముక్కన వేలేసుకుంటున్నారు. మీ సభలకు జనాలు రావడం లేదు కాబట్టి మీరే ఇలాంటి ప్రమాదాలు డిజైన్ చేసి ఉంటారేమో... లేదా మీ దరిద్రపు పాదం దెబ్బకు అప్పట్లో గోదావరి పుష్కరాల సమయంలో ఒక ప్రమాదం..మొన్న గుంటూరులో చీరల పంపిణీలో ఇంకోటి.. ఇంకా కందుకూరు లో మీ పాద మహిమకు నలిగిపోయిన ప్రాణాలు మాదిరి ఇది నిజంగానే ఇంకో ప్రమాదమా ?… https://t.co/OvGJCSnd6V — YSR Congress Party (@YSRCParty) August 2, 2023 చదవండి: అదీ బాబు గ్యాంగ్ అంటే.. ఆ విధంగా తుస్సుమన్నారు -
దర్గాలో దివ్యసమాధి కదలిందట!
జమ్మలమడుగు రూరల్: వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు పట్టణంలో వింత చోటుచేసుకుందని ప్రచారం సాగుతోంది. 500 ఏళ్ల చరిత్ర కలిగి పెన్నానది ఒడ్డున ఉన్న గూడు మస్తాన్‌వలీ దర్గాలోని దివ్యసమాధిలో మనిషి ఊపిరి పీల్చుకున్నట్లుగా శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కదలిక కనిపించిందట. ఈ విషయమై తీసినట్లుగా చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో దర్గా పీఠాధిపతులు, భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాగా, ప్రతి ఏడాది ఇక్కడ వైభవంగా ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తారు. -
పేకాడుతూ పట్టుబడ్డ టీడీపీ ఎమ్మెల్సీ!
సాక్షి, వైఎస్సార్ జిల్లా : టీడీపీ ఎమ్మెల్సీ దేవగుడి శివనాథ్‌రెడ్డి పేకాట ఆడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.15,700 స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో టీడీపీ ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి కూడా ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. అలాగే మరో రెండు చోట్ల కూడా దాడులు నిర్వహించామని పోలీసులు తెలిపారు. ఒక చోట ఐదుగురిని, మరో చోట ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారి వద్ద నుంచి రూ. 3500, రూ.5000 చొప్పున స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
జమ్మలమడుగులో వైఎస్సార్ రైతు దినోత్సవం
-
శనగ రైతుకు సాయం
సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో అన్నదాతలకు ఇచ్చిన హామీకి కట్టుబడుతూ శనగ రైతులకు క్వింటాల్‌కు రూ.1,500 చొప్పున నగదు సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఒక్కో శనగ రైతుకు గరిష్టంగా రూ.45 వేల వరకు నగదు సాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇందుకోసం రూ.333 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిర్ణయంతో దాదాపు 75 వేల మంది రైతులకు మేలు చేకూరనుంది. సోమవారం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో రైతు దినోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో శనగ రైతులకు నగదు అందచేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రుణాలు చెల్లించాలంటూ రైతులకు బ్యాంకుల నోటీసులు రాయలసీమలోని కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాలతోపాటు దక్షిణ కోస్తాలోని ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రైతులు ప్రధానంగా శనగ సాగు చేస్తున్నారు. టీడీపీ హయాంలో కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఈ పంట సాగువైపు మొగ్గు చూశారు. దీంతో సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2016–17లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం నాలుగు లక్షల హెక్టార్లు కాగా 2018–19లో 4.78 లక్షల హెక్టార్లకు పెరిగింది. రబీలో పండించే శనగలకు కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.4,620 చొప్పున కనీస మద్దతు ధర ప్రకటించింది. అయితే ఇది గిట్టుబాటు కాకపోవడంతో పలువురు రైతులు పంటను కోల్డు స్టోరేజీల్లో నిల్వ చేసుకుని బ్యాంకు రుణం తీసుకున్నారు. అయితే గిరాకీ లేదంటూ వ్యాపారులు పంట కొనుగోలు చేసేందుకు ముందుకు రావట్లేదు. మరోవైపు రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్లు రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం కోసం శనగ రైతులు నెల రోజుల నుంచి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయాన్ని ప్రకటించడం పట్ల అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. రూ.333 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు 59 లక్షల క్వింటాళ్ల శనగలు కోల్డు స్టోరేజీల్లో, 10 లక్షల క్వింటాళ్లు రైతుల వద్ద నిల్వ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నిల్వలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం రూ.333 కోట్లను విడుదల చేసింది. నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు క్వింటాల్‌కు రూ.1,500 చొప్పున నగదు అందచేయనుంది. ఒక్కో రైతుకు ఎకరాకు గరిష్టంగా 6 క్వింటాళ్ల చొప్పున ఐదు ఎకరాల వరకు లేదా 30 క్వింటాళ్లకు ఈ నగదును ఆందచేస్తారు. ఫలితంగా ఒక్కో రైతుకు రూ.45 వేలు చొప్పున లబ్ధి చేకూరనుంది. ఈ–క్రాపింగ్ ద్వారా రైతుల వివరాల సేకరణ కోల్టు స్టోరేజీ ప్లాంట్లలో నిల్వ చేసిన రైతులు 75 వేల మంది వరకు ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం నుంచి ఆర్ధికసాయం అందనుంది. రైతు దినోత్సవం సందర్భంగా ఈనెల 8వ తేదీన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో శనగ రైతులకు నగదు చెల్లింపు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రైతులందరికీ నగదు అందించేలా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు ఏర్పాట్లు ప్రారంభించాయి. గిడ్డంగుల్లో పంట నిల్వ చేసిన రైతుల వివరాలు, పంట సాగు చేసిన అన్నదాతల వివరాలను ఈ–క్రాపింగ్ ద్వారా గుర్తించి నగదు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూధనరెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొందరు ఇక్కడి రైతుల నుంచి శనగలు కొనుగోలు చేసి వారి పేరుతో కోల్డు స్టోరేజీల్లో నిల్వ చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని, అనర్హులకు నగదు సాయం అందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు అన్ని రకాలుగా భరోసా కల్పిస్తాం. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంట నష్టపోయిన వారిని ఆదుకుంటాం. ఆరుగాలం శ్రమించి పంట పండించిన అన్నదాతలను ధరల స్ధిరీకరణ నిధితో ఆదుకుంటాం – ఎన్నికల సమయంలో రైతులకు వైఎస్ జగన్ హామీ -
ఆ ముగ్గురు నుంచి నాకు భద్రత కల్పించాలి
ఎర్రగుంట్ల : టీడీపీ నేతలైన మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల నుంచి తనకు ప్రమాదం లేకుండా భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే అని వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ ఎం. సుధీర్‌రెడ్డి అన్నారు. తన వద్ద ఉన్న అనుమతిగల షార్టు గన్(ఆయుధం) గురువారం ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో సీఐ వెంకటరమణకు సరెండర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ప్రధాన పార్టీ అయిన వైఎస్సార్ సీపీ అభ్యర్థినని , తనకు పోటీగా ఉన్న ప్రత్యర్థులు మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు ఫ్యాక్షనిస్టులు, హత్యలు కుట్రలు, కుతంత్రాలు చేసే వారని అందుకే తనకు భద్రత కల్పించాలని కోరారు. ప్రస్తుతం రాత్రి సమయంలో ఎప్పుడు పడితే అప్పుడు గ్రామాలకు ప్రచారానికి వెళుతుంటానని, తనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు. తనకు రాజకీయంగా ప్రమాదం ఉందనే పోలీసులు తనకు షార్టు గన్ ఇచ్చారని, నేడు పోలీసులు అడిగిన మేరకు షార్టు గన్ను అప్పగించినట్లు తెలిపారు. ప్రస్తుతం తనకు ఎలాంటి వ్యక్తిగత భద్రత లేదన్నారు. తనకు భద్రత కల్పించాలని ఇది వరకే జమ్మలమడుగు డీఎస్పీకి విన్నవించానని, జిల్లా ఎస్పీ ని కూడా కలిసి విన్నవిస్తానన్నారు. -
‘దమ్ము, ధైర్యం ఉంటే వారు పోటీ చేసి గెలవాలి’
సాక్షి, వైఎస్సార్ కడప : దమ్ము, ధైర్యం ఉంటే జమ్మల మడుగు అసెంబ్లీ స్థానం నుంచి .. రామ సుబ్బారెడ్డి, ఆది నారాయణ రెడ్డిలు పోటీ చేసి గెలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ రెడ్డి సవాల్ విసిరారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఇద్దరు నేతలు కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారని విమర్శించారు. వారు వృద్ధాప్యంలో ఉన్నారని, విశ్రాంతి తీసుకోవాలని హితపు పలికారు. గత ఎన్నికల్లో ఏడువందల హామీలిచ్చిన చంద్రబాబు ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికలకు మూడు నెలల ముందు ఓట్లను డబ్బులతో కొంటామని చంద్రబాబు ప్రగల్బాలు పలుకుతున్నారని మండిపడ్డారు. డెబ్బై ఏళ్ల చంద్రబాబు కంటే వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనే ప్రజల ఆదరాభిమానులున్నాయని, ఈసారి వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందన్నారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ టికెట్ తమకే కేటాయించాలంటూ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టుకున్న సంగతి తెలిసిందే. -
ఎమ్మెల్యే టిక్కెట్ పీఆర్కే!
సాక్షి ప్రతినిధి కడప : ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జమ్మలమడుగు పంచాయతీకి తెరపడినట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు అసెంబ్లీ టిక్కెట్ నాకు కావాలంటే నాకు కావాలంటూ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పట్టుపట్టారు. దీంతో పంచాయతీ అధిష్టానం వద్దకు చేరింది. ఇద్దరితో మాట్లాడాలని మధ్యవర్తిగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ఇద్దరికి మూడురోజులు గడుపు ఇచ్చి పంపారు. మూడు రోజులు పూర్తికావడంతో శుక్రవారం తిరిగి విజయవాడలో సీఎంతో భేటీ అయ్యేందుకు నాయకులు గురువారం రాత్రి వెళ్లారు. ఒకదశలో తమకే అసెంబ్లీ టిక్కెట్ కావాలని భీష్మించుకున్నారు. చివరకు సీఎం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిపైనే మొగ్గుచూపినట్లు తెలిసింది. దీంతో మంత్రి వర్గీయులు డైలమాలో పడ్డారు. దశాబ్దాలుగా కడప పార్లమెంట్ స్థానం వైఎస్ కుటుంబీకులకే జిల్లావాసులు కట్టబెడుతూ వస్తున్నారు.వారిని ఢీకొనేందుకు మంత్రి ఆది ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డిని, ఆయన కుమారుడు భూపేష్‌రెడ్డిలను ఎంపీ స్థానానికి పోటీ చేయాలంటూ కోరారు. ఓడిపోయే స్థానంలో తాము పోటీ చేయలేమంటూ నిర్మొహమాటంగా చెప్పడంతో మంత్రి డైలమాలో పడ్డారు. ప్రొద్దుటూరు టిక్కెట్ తనకుమారుడు సుధీర్‌రెడ్డికి ఇవ్వాలంటూ ముఖ్యమంత్రిని అడిగినట్లు తెలుస్తోంది. డైలమాలో మంత్రి ఆది అనుచరులు... ఇంతకాలం దేవగుడి కుటుంబాన్ని నమ్ముకుంటూ వచ్చిన మంత్రి అనుచరులు ఇప్పుడు డైలమాలో పడ్డారు. వైఎస్సార్సీపీని వదిలి టీడీపీలోకి వెళ్లిన మంత్రి బాటలోనే నాయకులు, కార్యకర్తలు నడిచారు.ప్రస్తుతం భిన్నపరిస్థితులు తలెత్తాయి. ఎమ్మెల్యే అభ్యర్థిగా రామసుబ్బారెడ్డిని గెలిపించాలంటూ ఎలా ప్రచారం చేయాలని మదనపడుతున్నారు. ఇలా అయితే భవిష్యత్తులో తమ ఉనికి కొల్పోవాల్సి వస్తుందని నాయకులు చర్చించుకుంటున్నట్లు సమాచారం. -
మంత్రి కోటకు బీటలు వారతాయనే భయంతోనే
-
మైలవరం జలాశయం నుంచి నీళ్లు విడుదల
వైఎస్సార్ జిల్లా మైలవరం జలాశయం నుంచి ఉత్తర కాలువకు ఆదివారం నీళ్లు వదిలారు. ఉత్తర కాలువ కింద వేసిన పంటలు ఎండిపోతుండడంతో ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఇరిగేషన్ అధికారులు నీటిని వదిలారు. రోజుకు 150 క్యూసెక్కుల చొప్పున 13 రోజులపాటు నీటిని విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. -
వాహనం ఢీకొని యువకుడి మృతి
కడప: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అమర్నాథ్ రెడ్డి(30) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని బ్రాహ్మణీ ఉక్కు కర్మాగారం సమీపంలో గురువారం చోటు చేసుకుంది. అమర్నాథ్ రెడ్డి తన స్వగ్రామం ముద్దునూరు నుంచి జమ్మలమడుగుకు కోర్టు పనుల కోసం ద్విచక్రవాహనంపై వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో సంఘటనా స్థలంలోనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేస దర్యాప్తు ప్రారంభించారు. (జమ్మలమడుగు)