
సాక్షి, వైఎస్సార్ జిల్లా : టీడీపీ ఎమ్మెల్సీ దేవగుడి శివనాథ్‌రెడ్డి పేకాట ఆడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.15,700 స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో టీడీపీ ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి కూడా ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. అలాగే మరో రెండు చోట్ల కూడా దాడులు నిర్వహించామని పోలీసులు తెలిపారు. ఒక చోట ఐదుగురిని, మరో చోట ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారి వద్ద నుంచి రూ. 3500, రూ.5000 చొప్పున స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment