
సాక్షి, జమ్మలమడుగు: ఒకవైపు అగ్ని ప్రమాదం చోటు చేసుకుని తగలబడిపోతుంటే చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడనే చందంగా వ్యవహరించారు చంద్రబాబు. తాను సభ కోసమే మాత్రమే వచ్చాను.. పక్కన ఏమి జరిగితే తనకెందుకు అనే విధంగా చంద్రబాబు రోడ్ షో సాగింది.
చంద్రబాబు బుధవారం చేపట్టిన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు రోడ్ షోలో భాగంగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెలుగు తమ్ముళ్ల ఓవరాక్షన్ చేసి తోపుడు బండి హోటల్ పై టపాకుల వర్షం కురిపించారు. దాంతో తోపుడు బండి హోటల్ పూర్తిగా దగ్ధమైంది. చంద్రబాబు స్పీచ్ ఇస్తుండగానే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒకవైపు చంద్రబాబు ప్రసంగ ఇస్తుంటే ఆ వెనుకే అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన దృశ్యాలు ఒకవైపు, చంద్రబాబు ప్రసంగం మరొకవైపు కనిపించడంతో ఇది చూసిన వారు ముక్కన వేలేసుకుంటున్నారు.
మీ సభలకు జనాలు రావడం లేదు కాబట్టి మీరే ఇలాంటి ప్రమాదాలు డిజైన్ చేసి ఉంటారేమో... లేదా మీ దరిద్రపు పాదం దెబ్బకు అప్పట్లో గోదావరి పుష్కరాల సమయంలో ఒక ప్రమాదం..మొన్న గుంటూరులో చీరల పంపిణీలో ఇంకోటి.. ఇంకా కందుకూరు లో మీ పాద మహిమకు నలిగిపోయిన ప్రాణాలు మాదిరి ఇది నిజంగానే ఇంకో ప్రమాదమా ?… https://t.co/OvGJCSnd6V
— YSR Congress Party (@YSRCParty) August 2, 2023