సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప ఎయిర్‌పోర్టు కొత్త టెర్మినల్‌కు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.265 కోట్ల రూపాయల వ్యయంతో నూతన టర్మీనల్ భవన నిర్మాణం చేపట్టారు. ఢిల్లీ నుండి వర్చువల్ విధానంలో ప్రధాని పాల్గొన్నారు. కడప నుంచి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ, కడప ప్రజల కల నెరవేరుతున్న వేళ సంతోషంగా ఉందన్నారు. కడప విమానాశ్రయ అభివృద్ధి కోసం దివంగత మహానేత వైఎస్సార్ చేసిన కృషి అందరికి తెలిసిందే.. రూ. 75 కోట్ల రూపాయలతో స్థల సేకరణ పూర్తి చేశామని తెలిపారు.
ఉడాన్ పథకం ద్వారా హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, చెన్నైకు తక్కువ ధరకు విమాన సర్వీసులు నడపడం జరిగిందన్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో నైట్ ల్యాండింగ్, రన్ వే పొడిగింపు, పెద్ద విమానాలు ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరావు సిందియా, ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: స్నేహం కాదు, దాసోహం!
Comments
Please login to add a commentAdd a comment