lay foundation
-
సమీకృత గురుకు భవనాలకు నేడు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్/కొందుర్గు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల భవన నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో ఈ భవనాలకు ప్రభుత్వం శంకుస్థాపన చేయనుంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొందుర్గులో సమీకృత గురుకుల పాఠశాల భవన భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు.అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, జిల్లా ఇన్చార్జ్ మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. శంకుస్థాపన ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం సచివాలయం నుంచి ఆయా జిల్లా కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొందుర్గులో నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మధిర నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొంటారని సీఎస్ చెప్పారు. ఈ కార్యక్రమాలకు ఆయా జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులందరినీ ఆహ్వానించాలని సూచించారు.ఇప్పటికే సంబంధిత అధికారులు శంకుస్థాపన జరిగే ప్రాంతాన్ని పరిశీలించినట్లు కలెక్టర్లు సీఎస్‌కు వివరించారు. ప్రస్తుతం భూమి లభ్యత ఉన్న 28 నియోజకవర్గాల్లో శంకుస్థాపన నిర్వహిస్తున్నామని, రెండో దశలో ఇతర ప్రాంతాల్లో భూమిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని సీఎస్ చెప్పారు.మొదటి విడత కింద ఎంపిక చేసినవి..కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్లగొండ, హుజూర్నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, అందోల్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట్, స్టేషన్ ఘన్పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్‌నగర్, పరకాల, నారాయణ్ ఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూర్, నర్సంపేట నియోజకవర్గాలున్నాయి.కొందుర్గులో సీఎం సభరంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలో రూ.125 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడ నున్నారు. ఇందుకోసం కొందుర్గు శివారులోని 109 సర్వే నంబర్లో 20 ఎకరాలను కేటాయించారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శశాంక, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పనులను పర్యవేక్షించారు. -
కడప ఎయిర్‌పోర్టు కొత్త టెర్మినల్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప ఎయిర్‌పోర్టు కొత్త టెర్మినల్‌కు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.265 కోట్ల రూపాయల వ్యయంతో నూతన టర్మీనల్ భవన నిర్మాణం చేపట్టారు. ఢిల్లీ నుండి వర్చువల్ విధానంలో ప్రధాని పాల్గొన్నారు. కడప నుంచి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ, కడప ప్రజల కల నెరవేరుతున్న వేళ సంతోషంగా ఉందన్నారు. కడప విమానాశ్రయ అభివృద్ధి కోసం దివంగత మహానేత వైఎస్సార్ చేసిన కృషి అందరికి తెలిసిందే.. రూ. 75 కోట్ల రూపాయలతో స్థల సేకరణ పూర్తి చేశామని తెలిపారు. ఉడాన్ పథకం ద్వారా హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, చెన్నైకు తక్కువ ధరకు విమాన సర్వీసులు నడపడం జరిగిందన్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో నైట్ ల్యాండింగ్, రన్ వే పొడిగింపు, పెద్ద విమానాలు ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరావు సిందియా, ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇదీ చదవండి: స్నేహం కాదు, దాసోహం! -
తెలంగాణకు మోడీ వరాలు వరుస శంకుస్థాపనలు
-
రాజమండ్రి ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులకు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన
-
పరిశ్రమలకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్
-
పారిశ్రామిక రంగంపై స్పెషల్ ఫోకస్: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రూ1,072 కోట్ల విలువైన పరిశ్రమలకు క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్‌గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 21,079 మందికి ఉపాధి కలగనుంది. ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో రూ.402 కోట్లతో నెల్లూరు జిల్లాలో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్, విజయనగరంలో నువ్వుల ప్రాసెసింగ్ యూనిట్లను సీఎం ప్రారంభించారు. కాకినాడ ప్రింటింగ్ క్లస్టర్, కర్నూలులోని ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో సిగాచి ఇండస్ట్రీస్ గ్రీన్‌ఫీల్డ్ ఫార్మాస్యూటికల్స్, ధాన్యం ఆధారిత బయో-ఇథనాల్ తయారీ యూనిట్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెడుతోంది. కలెక్టర్లు కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలి, ఆ దిశగా అడుగులు వేయాలి. 386 ఎంఓయూలు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్‌లో చేసుకున్నాం. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు వేసుకున్నాం. 6 లక్షల ఉద్యోగాల దిశగా అడుగులు వేస్తున్నాం. ఇవన్నీ నెలకొల్పేలా ప్రతినెలా సమీక్ష చేస్తూ పురోగతికోసం చర్యలు తీసుకున్నాం. 33 యూనిట్లు ఇప్పటికే ఏర్పాటై ఉత్పత్తులు ప్రారంభించాయి. 94 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. మరికొన్ని ప్రారంభదశలో ఉన్నాయి. సీఎస్ గారి ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలకు చేయూతనిస్తున్నాం. నెలకు కనీసంగా రెండు సమీక్షా సమావేశాలు వీటిపై జరుగుతున్నాయి. వేగంగా కార్యరూపం దాలుస్తున్నాయి. ప్రతి అడుగులోనూ కలెక్టర్లు చేయిపట్టి నడిపించాలి. ఈనాలుగున్నర సంవత్సరాల్లో 130 భారీ, అతిభారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయగలిగాం. 69 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 86 వేలమందికి ఉద్యోగాలు ఇవ్వగలిగాం. ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఎప్పుడూ చూడని అడుగులు వేశాం. కోవిడ్ సమయంలోకూడా కుప్పకూలిపోకుండా వారికి చేయూత నిచ్చాం. 1.88 లక్షల ఎంఎస్ఎంఈలు కొత్తగా వచ్చాయి. 12.62 లక్షల ఉద్యోగాలు వీటిద్వారా వచ్చాయి. మనం అందరం కలిసికట్టుగా ఈ బాధ్యతను తీసుకున్నాం కాబట్టే ఇది సాకారం అయ్యింది. పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి కేవలం మనం ఫోన్‌కాల్‌దూరంలో ఉన్నాం. వారిపట్ల సానుకూలతతో ఇదే పద్ధతిలో ఉండాలి. దేవుడి దయతో మనం ఇవాళ మంచి కార్యక్రమాన్ని చేశాం. 9 ప్రాజెక్టుల్లో 3 ప్రారంభిస్తున్నాం, మిగతా ఆరు పనులు ప్రారంభిస్తున్నాం. దాదాపు 1100 కోట్ల పెట్టుబడి, 21 వేలమందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. పత్తికొండకు నేను వెళ్లినప్పుడు అక్కడ పరిశ్రమ ఏర్పాటుచేస్తామని చెప్పాం. ఈ మేరకు ఇవాళ ఫుడ్ ప్రాససింగ్ యూనిట్‌కు శంకుస్థాపనచేస్తున్నాం. అధికారులు మంచి కృషిచేశారు. అంతే వేగంగా అడుగులు ముందుకేయాలి. పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నవారందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఎంఎస్ఎంఈలకు ఫిబ్రవరిలో ప్రభుత్వం తరఫున ఇన్సెంటివ్‌లు అందించనున్నాం. చదవండి: క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించిన సీఎం జగన్ -
దుర్గగుడి అభివృద్ధి పనులకు 7న సీఎం జగన్ శంకుస్థాపన
పెంటపాడు: విజయవాడలోని శ్రీ కనకదుర్గ, మల్లేశ్వరస్వామివార్ల ఆలయ అభివృద్ధి పనులకు డిసెంబర్ 7న సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. గురువారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ దుర్గమ్మ గుడిని రూ.225 కోట్లతో సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. డిసెంబర్ 8న రూ.125 కోట్లతో శ్రీశైలం క్షేత్రంలో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతాయని వెల్లడించారు. రూ.60 కోట్లతో సింహాచల క్షేత్రం, రూ.80 కోట్లతో అన్నవరం క్షేత్రం, రూ.70 కోట్లతో ద్వారకాతిరుమల క్షేత్రంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. చదవండి: విశాఖ నుంచి పాలనకు కీలక అడుగు -
వరికపూడిసెల ప్రాజెక్టుకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన
-
ఇది ఆణిముత్యంలాంటి ప్రాజెక్టు: సీఎం జగన్
సాక్షి, విశాఖ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు(మంగళవారం)విశాఖ పర్యటన సందర్భంగా అక్కడ రూ.600 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రహేజా గ్రూప్స్ ఇనార్బిట్ మాల్‌కు భూమి పూజ చేశారు. విశాఖపట్నం కైలాసపురంలో నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు సీఎం జగన్. ఈ సందర్బంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఆణిముత్యంలాంటి ప్రాజెక్టు... దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఇక్కడ ప్రారంభమవుతుంది. విశాఖ అభివృద్ధికి మరింత దోహదం చేస్తూ... విశాఖపట్టణంలో ఆణిముత్యంగా నిల్చిపోయే మంచి ప్రాజెక్టుకు శంకుస్ధాపనతో శ్రీకారం చుట్టాం. 17 ఎకరాల స్ధలానికిగాను... 12–13 ఎకరాల పెద్ద విస్తీర్ణంలో మాల్ రావడం అన్నది కొన్ని చోట్లే ఉంటుంది. ఇదే రహేజా గ్రూపు హైదరాబాద్‌లో ఇనార్బిట్ మాల్‌ను 7–8 ఎకరాల్లోనే కడితే మనం 12–13 ఎకరాల విస్తీర్ణంతో పెద్ద మాల్‌కు ఇక్కడ శంకుస్ధాపన చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని సాధ్యమయ్యేలా చేసిన నీల్ రహేజాకు, సీఈఓ రజనీష్ మహాజన్‌కు, సీఓఓ శ్రావణ్ కుమార్‌తో పాటు మిగిలిన అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున, నా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. మారనున్న విశాఖ రూపురేఖలు.... ఈ రోజు ఇక్కడ కడుతున్న మాల్ నిర్మాణం ద్వారా విశాఖపట్నం రూపురేఖలు మారడమే కాకుండా... దక్షిణ భారతదేశంలోనే పెద్ద మాల్ కానుంది. రూ.600 కోట్ల పెట్టుబడితో ఇంత పెద్ద విస్తీర్ణంలో మాల్ నిర్మాణం వల్ల... 8వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. ఫేజ్ –2లో ఐటీ స్పేస్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్. 12 నుంచి 13 ఎకరాల్లో మాల్ నిర్మాణం పూర్తయిన తర్వాత.... మిగిలిన భూమిలో రాబోయే రోజుల్లో రెండో దశ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ రెండున్నర లక్షల ఎస్‌ఎప్‌టీతో ఐటీ స్పేస్ కూడా రాబోతుంది. అంతర్జాతీయ స్ధాయిలో ఒక కన్వెన్షన్ సెంటర్‌ను కూడా నిర్మించనున్నారు. వీటన్నింటి ద్వారా ఇంకా ఉద్యోగఅవకాశాలు మెరుగవుతాయి. 2.50 లక్షల ఎస్‌ఎఫ్‌టితో ఐటీ స్పేస్ రావడం వల్ల మరో 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా రానున్నాయి. ఇవన్నీ రాబోయో రోజుల్లో విశాఖపట్టణాన్ని అంతర్జాతీయ స్ధాయిలో నిలబెట్టే కార్యక్రమాలు. ఇంతకముందు వచ్చినప్పుడు ఆదానీ గ్రూపు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న డేటాపార్కు, ఐటీ స్పేస్‌కు శంకుస్ధాపన చేసుకున్నాం. అదే రోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులకు కూడా శంకుస్ధాపన చేశాం. అంతకన్నా ముందు శ్రీకాకుళంలో ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే విధంగా మూలపేటలో పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేసుకున్నాం. ఇవన్నీ ఉత్తరాంధ్రా అభివృద్ధి రూపురేఖలను మార్చే గొప్ప అడుగులు. ఇనార్బిట్ మాల్ కూడా అలాంటిదే. ఇవన్నీ విశాఖలో గొప్ప ప్రాజెక్టులుగా నిలుస్తాయి ఇవి కాకుండా రహేజా గ్రూపు దేశంలో పలుచోట్ల ఫైవ్ స్టార్ హోటళ్లు కట్టారు. అదే మాదిరిగా మన రాష్ట్రంలో రాజ్‌విలాస్ తరహాలో సూపర్ లగ్జరీ ఫైవ్‌స్టార్ ప్లస్, సెవెన్ స్టార్ హోటల్ కట్టబోతున్నారు. ఇప్పటికే ఒబెరాయ్, మేపెయిర్ హోటల్స్ గ్రూపు వాళ్లు కూడా కడుతున్నారు. ఆ తరహాలో రహేజా గ్రూపు కూడా సెవెన్ స్టార్ లగ్జరీ రిసార్ట్‌ల నిర్మాణంలో మూడో గ్రూపు కానుంది. ఇవన్నీ విశాఖలో గొప్ప ప్రాజెక్టులుగా నిలుస్తాయి. అదే విధంగా హిందూపూర్‌లో కూడా 350 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్, టెక్ట్స్‌టైల్స్‌కు సంబంధించిన పార్కు రాబోతుంది. దానివల్ల మరో 15వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆ ప్రాజెక్టుకు కూడా అడుగులు ముందుకు వేశాము... యుద్ధ ప్రాతిపదికన అది కూడా టేకప్ చేస్తామన్నారు. దానికి కూడా ప్రభుత్వం సపోర్టు చేస్తుంది. మేము మీకు ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటాం ఈ రోజు మీ అందరి ద్వారా రహేజా గ్రూపు అధ్యక్షుడు నీల్‌కు చెప్తున్నాను. మేము మీకు ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటాం. కేవలం ఒక్క ఫోన్‌కాల్ దూరంలోనే మీకు అందుబాటులో ఉంటాం. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని... పెట్టుబడులు పెట్టండి. మిగిలిన రాష్ట్రాల కంటే మిన్నగా... ఏపీలో పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా సహాయ, సహకారాలు అందిస్తామో మీరు కచ్చితంగా చూస్తారు. దేవుని దయవలన వీళ్లు మరింత బాగుపడి.. మన ప్రాంతంలో అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తున్నాను. దీని తర్వాత ఆంధ్రాయూనివర్సిటీలో రూ.130 కోట్లతో హై ఎండ్ ఇంక్యుబేషన్ సెంటర్‌తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో విశాఖ అభివృద్ధికి దోహదపడతాయి అని సీఎం ప్రసంగం ముగించారు. -
CM Jagan Vizag Tour Photos: విశాఖ ఇనార్బిట్ మాల్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ (ఫొటోలు)
-
దక్షిణాదిలోనే విశాఖ ఇనార్బిట్ మాల్ అతిపెద్దది
Updates: ► ఏయూ నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరిన సీఎం వైఎస్ జగన్. ► ఆంధ్ర యూనివర్సిటీలో నూతన భవనాలను ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. సుమారు రూ.100 కోట్ల వ్యయంతో వీటిని నిర్మించారు. ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజిని, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ప్రసాద్ ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే కన్నబాబు రాజు పాల్గొన్నారు. ►జీవీఎంసీ పరిధిలో రూ. 136 కోట్ల రూపాయలతో 50 అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభించారు.\ ఇనార్బిట్ మాల్తో 8 వేల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. 13 ఎకరాల్లో విశాలంగా ఇనార్బిట్ మాల్ తయారు కాబోతుందని తెలిపారు. దక్షిణాదిలోనే విశాఖ మాల్ అతిపెద్దదని... రెండున్నర ఎకరాలను ఐటీ కోసం కేటాయిస్తారని పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధికి ఈ మాల్ దోహదపడుతుందని.. మాల్ నిర్మాణంతో రాబోయే రోజుల్లో విశాఖ రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు. ►విశాఖలో ఒక ఆణిముత్యంగా నిలిచిపోయే ప్రాజెక్టు ఇనార్బిట్ మాల్: సీఎం జగన్ ► ఫైవ్ స్టార్ హోటల్ కూడా నిర్మించాలని రహేజా గ్రూప్ ఆసక్తిగా ఉంది. ► రహేజా గ్రూప్‌కు అన్ని విధాలుగా సపోర్టు ఇస్తాం. ► ఒక్క ఫోన్‌కాల్‌తో అందుబాటులో ఉంటాం. 👉విశాఖలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. కైలాసపురం వద్ద ఇనార్బిట్ మాల్‌కు భూమి పూజ చేశారు. రూ. 600 కోట్లతో 15 ఎకరాల స్థలంలో మాల్‌ను నిర్మిస్తున్నారు. జీవీఎంసీ చేపట్టిన రూ. 136 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. 👉విశాఖపట్నం చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు పూల వర్షంతో విశాఖ వాసులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ది పనులు చూసి ఆయనకు ధన్యవాదాలు తెలిపేందుకు మహిళలు భారీగా తరలి వచ్చారు. 👉 గన్నవరం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం బయలుదేరారు. మరికొద్దిసేపట్లో ఇనార్బిట్ మాల్ శంకుస్థాపన సహా పలు అభివృద్ధి కార్యక్రమాలలో సీఎం పాల్గొననున్నారు. సాక్షి, అమరావతి: దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్‌కు విశాఖ వేదిక కానుంది. 17 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మూడు దశల్లో కె.రహేజా గ్రూపు అభివృద్ధి చేయనున్న ఇనార్బిట్ మాల్ తొలి దశ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం భూమి పూజ నిర్వహించనున్నారు. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణం కానుంది. దీనికి అదనంగా పార్కింగ్ కోసం ఏకంగా నాలుగు లక్షల చదరపు అడుగులను అభివృద్ధి చేయనున్నారు. 2026 నాటికి దీన్ని అందుబాటులోకి తేవాలని రహేజా గ్రూపు నిర్దేశించుకుంది. 250కిపైగా అంతర్జాతీయ బ్రాండ్లకు వేదికగా మారనున్న ఈ మాల్ ద్వారా 8,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. మాల్ నిర్మాణం కోసం పోర్టు అథారిటీకి చెందిన 17 ఎకరాలను 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. రెండో దశలో ఐటీ క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తారు. 3,000 మంది పనిచేసే విధంగా సుమారు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను 2027 నాటికి అందుబాటులోకి తెస్తారు. మూడో దశలో ఫోర్ స్టార్ లేదా ఫైవ్ స్టార్ హోటల్‌ను 200 గదులు, బాంకెట్ హాళ్లతో నిర్మిస్తారు. పూర్తి పర్యావరణహితంగా భవనాన్ని నిరి్మంచనున్నట్లు రహేజా గ్రూపు వెల్లడించింది. నేడు ఏయూలో పలు ప్రారంభోత్సవాలు విశాఖ పర్యటన సందర్భంగా మొత్తం రూ.864.88 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు నిర్వహించనున్నారు. రూ.135.88 కోట్లతో జీవీఎంసీ చేపడుతున్న ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌లో పలు నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఏయూ క్యాంపస్‌లో సుమారు రూ.21 కోట్లతో స్టార్టప్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ హబ్ (ఏ హబ్)ను అభివృద్ధి చేశారు. 2025 నాటికి 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద ఇన్నొవేషన్ హబ్‌గా దీన్ని తీర్చిదిద్దనున్నారు. విభిన్న రంగాలకు చెందిన ఇంక్యుబేషన్ సెంటర్‌తోపాటు ఎనెక్స్ సెంటర్స్, ప్రోటోటైపింగ్/మేకర్స్ ల్యాబ్, స్టూడెంట్ ఐడియేషన్ సెంటర్లను అభివృద్ధి చేయనున్నారు. రూ.44 కోట్లతో ఫార్మా కంపెనీల కోసం 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఫార్మా ఇంక్యుబేషన్, బయోలాజికల్ మానిటరింగ్ హబ్‌ను సీఎం ప్రారంభిస్తారు. చదవండి: ఈనాడు బురద రాతలు.. వరద సహాయక చర్యలపైనా అక్కసు డిజిటల్ క్లాసులు, డిజిటల్ పరీక్షల కోసం రూ.35 కోట్లతో అల్గోరిథమ్ పేరుతో ఏయూ డిజిటల్ జోన్ అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ కాంప్లెక్స్‌ను నూతనంగా నిర్మించారు. అంతర్జాతీయ అనలిటిక్స్‌లో మాస్టర్ పోగ్రాములు నిర్వహించేలా ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ సెంటర్‌ను రూ.18 కోట్లతో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. మెరైన్ ఫార్మింగ్, ప్రాసెసింగ్ ప్యాకేజింగ్‌లో నైపుణ్య శిక్షణ కోసం అవంతి ఫుడ్స్‌తో కలిపి రూ.11 కోట్లతో ఏయూ అవంతి ఆక్వా కల్చర్ స్కిల్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ హబ్‌ను నెలకొల్పారు. వీటిని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించి విద్యార్థులతో సంభాషిస్తారు. నూతన భవనాల ద్వారా 2025 నాటికి ఆంధ్రా యూనివర్సిటీ దేశంలో విభిన్న రంగాలకు అతిపెద్ద ఇంక్యుబేటర్ హబ్‌గా తయారు అవుతుందని అంచనా వేస్తున్నారు. కనీసం 350కుపైగా స్టార్టప్స్‌తోపాటు 150కు పైగా పేటెంట్లు, ట్రేడ్ మార్క్స్‌ను నమోదు చేస్తుందని అంచనా. ఈ హబ్స్ ద్వారా కనీసం 2,000 మందికి ప్రత్యక్షంగా, 5,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించడమే కాకుండా ఎగుమతులు దిగుమతుల ద్వారా ఆరి్థక వ్యవస్థకు రూ.480 కోట్ల వరకు సమకూరనుంది. భారీ మానవహారంతో స్వాగతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం 10.45 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని రోడ్డుమార్గంలో సాలిగ్రామపురం వెళతారు. అక్కడ రూ.600 కోట్ల వ్యయంతో రహేజా గ్రూప్స్ ఇనార్బిట్ మాల్‌కు భూమి పూజ చేస్తారు. అనంతరం నగరంలో జీవీఎంసీ చేపడుతున్న మౌలిక సదుపాయాలు, రహదారులు, ముఖ్య కూడళ్ల అభివృద్ధి, స్మార్ట్ రోడ్డు, యూరోపియన్ తరహా ఈట్ స్ట్రీట్స్, అమృత్ 2.0లో భాగంగా చెరువుల అభివృద్ధి లాంటి రూ.135.88 కోట్ల విలువైన 50 పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. చదవండి: నారీ శక్తికి 'చేయూత' అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్ చేరుకొని విద్యార్థులకు కొత్త కోర్సులు, ఉపాధి అవకాశాలు, స్టార్టప్‌లకు చేయూతనందించేలా రూ.129 కోట్లతో నిరి్మంచిన ఐదు భవనాలను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1.20 గంటలకు బీచ్ రోడ్డు నుంచి బయలుదేరి 1.40కి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖ నుంచి తిరుగు పయనమవుతారు. విశాఖ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు ప్రజలు, పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఇనార్బిట్మాల్ను నిర్మించే సాలిగ్రామపురం వరకు దాదాపు 9 కిలోమీటర్ల పొడవునా రహదారికి ఇరువైపులా మానవహారంగా ఏర్పడి సీఎం జగన్‌కు స్వాగతం పలకనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను నెడ్‌క్యాప్ చైర్మన్, ఉత్తర నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేకే రాజు పర్యవేక్షిస్తున్నారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కృష్ణాయపాలెం లేఅవుట్ లో పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సీఎం వైఎస్ జగన్
-
ప్రజల వద్దకే పాలన అందిస్తోన్న ఏకైక నాయకుడు సీఎం జగన్
-
నెరవేరబోతోన్న ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల
-
మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన
-
కాసెపట్లో మూలపేట గ్రీన్ ఫిల్డ్ పోర్ట్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన
-
విజయ మెగా డెయిరీ లక్ష్యం.. 8 లక్షల లీటర్లు
తుక్కుగూడ: పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. కులవృత్తులకు చేయూత ఇచ్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాలలో తెలంగాణ పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన విజయ తెలంగాణ మెగా డెయిరీ నిర్మాణ పనులకు మంత్రి సబితారెడ్డితో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. 32 ఎకరాల విస్తీర్ణంలో రూ.246 కోట్ల వ్యయంతో మెగా డెయిరీని ఏర్పాటు చేస్తున్నామని తలసాని చెప్పారు. దీన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. గతంలో ఈ డెయిరీ ద్వారా రోజూ లక్ష లీటర్ల పాలను మాత్రమే సేకరించేవారని, ప్రస్తుతం 4 లక్షల లీటర్లకు పెరిగిందని చెప్పారు. మెగా డెయిరీ పూర్తయితే రోజుకు 8 లక్షల లీటర్ల పాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. విజయ డెయిరీకి 2014లో రూ.300 కోట్ల ఆదాయం ఉండగా.. ఇప్పుడు రూ.750 కోట్లకు పెరిగిందన్నారు. విజయ డెయిరీ దేశంలో మొదటి స్థానంలో ఉందని చెప్పారు. 15 రోజుల్లో బీమా పరిహారం చెల్లిస్తాం పాడి రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రతి లీటర్‌పై రూ.4 బోనస్ ప్రకటించారని తలసాని గుర్తు చేశారు. బోనస్‌రాని రైతులకు తమ శాఖ ఆధ్వర్యంలో త్వరలో చెల్లిస్తామన్నారు. మంత్రి సబితారెడ్డి సూచన మేరకు రంగారెడ్డి జిల్లాను పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టి రైతులకు సబ్సిడీపై పశువులను పంపిణీ చేస్తామని వెల్లడించారు. బీమా ఉండి మరణించిన పశువులు, గేదెలకు 15 రోజుల్లో పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ‘విజయ డెయిరీ కేవలం పాల ఉత్పత్తులే కాకుండా నెయ్యి, పెరుగు, బటర్ మిల్క్, లస్సీ, ఫ్లేవర్డ్ మిల్క్ ఇలా 28 రకాలను ఉత్పత్తి చేస్తోంది. ఇవి తెలంగాణలోనే కాకుండా ఏపీ, ఢిల్లీ, ముంబైలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఏడాది పొడవునా రైతుల నుంచి పాలను సేకరిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 200 అవుట్లెట్లు, 600 పార్లర్లు ఉన్నాయి. రాష్ట్రంలో 2 లక్షల 13 వేల మంది రైతులు సహకార సంఘంలో సభ్యులుగా ఉన్నారు. గొల్లకుర్మలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రూ.11 వేల కోట్లతో గొర్రెలను పంపిణీ చేశాం’అని తలసాని చెప్పారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. రావిర్యాలలో మెగా డెయిరీని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దీని ద్వారా స్థానికులకు ఉపాధి లభిస్తుం దని చెప్పారు. ప్రైవేట్ రంగానికి దీటుగా విజయ డెయిరీ పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ లోక భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దక్షిణ భారత తొలి ప్రాంతీయ రాజకీయ పార్టీగా టీఆర్ఎస్..!
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశ రాజధాని హస్తినలో పార్టీ కార్యాలయ భవన నిర్మాణం చేసుకోనున్న దక్షిణ భారత తొలి ప్రాంతీయ రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ నేడు నూతన అధ్యాయానికి తెరలేపనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు గురువారం ఢిల్లీలో పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. కార్యాలయం కోసం ఢిల్లీ వసంత్ విహార్‌లో కేంద్రప్రభుత్వం లీజు ప్రాతిపదికన 1,100 చదరపు మీటర్ల స్థలం కేటాయించింది. మధ్యాహ్నం 1:48 గంటలకు జరిగే భూమిపూజ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం సాయంత్రం 5:45 గంటలకు సీఎం కేసీఆర్ సతీసమేతంగా ఢిల్లీ చేరుకున్నారు. సీఎం వెంట వచ్చిన వారిలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు. అంతకుముందు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఢిల్లీ వచ్చారు. ప్రజలందరికీ గర్వకారణం: ప్రశాంత్‌రెడ్డి రెండు రోజుల నుంచి భూమిపూజ జరిగే స్థలం వద్ద రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఏర్పాట్లను సమీక్షించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్ధత కారణంగానే ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటుకానున్నదని, ఇది తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికే దిక్సూచిగా మారాయని, ఇలాంటి సమయంలో ఢిల్లీ గడ్డపై పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. పార్టీ కార్యాలయ నిర్మాణంలో తనకు భాగస్వామ్యం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అయితే పార్టీ కార్యాలయ నిర్మాణ నమూనాలకు ఇంకా ఆమోదముద్ర పడలేదని చెప్పారు. కొత్త భవనంలో అధ్యక్షుల చాంబర్‌తోపాటు కాన్ఫరెన్స్ హాలు, లైబ్రరీ, ఆడియో విజువల్ గది ఉండాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏడాదిలోగా భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, కవిత, బండ ప్రకాశ్, కేఆర్ సురేశ్‌రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేశ్ సహా పలువురు నాయకులు భూమిపూజ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎంకు నామా విందు ఢిల్లీకి వచ్చిన సీఎం కేసీఆర్, మంత్రులు, ఇతర నాయకులకు పార్టీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు విందు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం శంకుస్థాపన ఏర్పాట్ల గురించి మంత్రి కేటీఆర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీకి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీ ముఖ్య నేతలను సీఎం పేరుపేరున పలకరించారు. నేడు జెండా పండుగ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం గురువారం రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఉదయం 9 గంటలకు టీఆర్ఎస్ సీనియర్ నేత పర్యాద కృష్ణమూర్తి పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లోనూ టీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు స్థాయిలో సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియనూ పార్టీ నేతలు ప్రారంభిస్తారు. ఈ నెల 12లోగా గ్రామ, వార్డు కమిటీల ఏర్పాటును పూర్తి చేసేలా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదివరకే షెడ్యూల్‌ను ప్రకటించారు. -
21న భూమిపూజ: ఓరుగల్లు ఒడిలో అత్యాధునిక వైద్యం..
హైదరాబాద్ నుంచి కూడా రోగులు వైద్యం కోసం వరంగల్‌కు వెళ్లే పరిస్థితి ఉండేలా ఈ ఆస్పత్రిలో ఏర్పాట్లు చేయనున్నారు. సీజనల్ వ్యాధుల కాలంలో ఖమ్మం, వరంగల్ జిల్లాలు, పక్క రాష్ట్రాల గిరిజన ప్రాంతాలు, ఇతరచోట్ల నుంచి ఎయిర్ అంబులెన్సుల్లో రోగులను ఇక్కడకు తరలించేలా హెలీప్యాడ్ ఏర్పాటు ఎలాంటి వైరస్లు వచ్చినా వాటికి దీటుగా చికిత్స అందించేలా, పరీక్షలు నిర్వహించేలా సదుపాయాలు సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా, ఎయిమ్స్ ఆస్పత్రులను సైతం తలదన్నేలా.. వరంగల్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి భూమిపూజ చేయనున్నారు. దీనిని తన కలల ప్రాజెక్టుగా భావిస్తున్న సీఎం.. ఉత్తర తెలంగాణకే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఈ ఆస్పత్రిని తీర్చిదిద్దాలని యోచిస్తున్నారు. దీని కోసం ఏకంగా 24 అంతస్తుల భవనం నిర్మించాలని, చివరి అంతస్తు పైభాగంలో హెలీప్యాడ్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఇలాంటి ఆసుపత్రి దేశంలో ఎక్కడా లేదని, కెనడాలో ఉన్న ఒక ఆసుపత్రిని మోడల్‌గా తీసుకొని దీన్ని తీర్చిదిద్దాలని సీఎం అధికారులను ఆదేశించారు. కెనడా వెళ్లి ఆ ఆసుపత్రిని పరిశీలించి రావాలని సూచించారు. ముఖ్యమంత్రే వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలు చూస్తున్నందున ఈ ప్రాజెక్టు శరవేగంగా రూపుదిద్దుకుంటుందని అధికారులు అంటున్నారు. మొత్తం ఈ ఆసుపత్రి నిర్మాణానికి, అందులో అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుకు దాదాపు రూ.1,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. పది సూపర్ స్పెషాలిటీ విభాగాలు వరంగల్‌లోని సెంట్రల్ జైలు స్థానంలో, 59 ఎకరాల విస్తీర్ణంలో ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తారు. రెండు వేల పడకల సామర్థ్యంతో తీర్చిదిద్దనున్నారు. ఇందులో సుమారు 34 వరకు విభాగాలు ఉంటాయి. దాదాపు 500 మంది వరకు వైద్యులు, వెయ్యి మంది వరకు నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది పనిచేస్తారు. మొత్తం పది సూపర్ స్పెషాలిటీ విభాగాలు రోగులకు సేవలందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఎండోక్రై నాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వంటి మొత్తం పది సూపర్ స్పెషాలిటీ విభాగాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు దాదాపు ఐదు అంతస్తుల్లో ప్రత్యేకంగా అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాట్లు చేస్తారు. ఆక్సిజన్, వెంటిటేటర్ సౌకర్యం ఏర్పాటు చేస్తారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా విదేశాల నుంచి వైద్య పరికరాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తిగా పర్యావరణ హితంగా నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆసుపత్రిలో రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా, ప్రతి అంతస్తులోనూ బాగా గాలీ వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
రేపు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గవాసుల చిరకాల స్వప్నం నెరవేరబోతుంది. రూ.125 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రేపు(బుధవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మంగళవారం సాయంత్రం ఏర్పాట్లను మంత్రులు పేర్నినాని, కొడాలి నాని పరిశీలించారు. మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయతకు రిటైనింగ్‌వాల్ నిర్మాణం మరో నిదర్శనమని పేర్కొన్నారు. నిర్వాసితులను ఇబ్బందిపెట్టకుండా రిటైనింగ్‌వాల్ నిర్మాణం జరగబోతోందన్నారు. కృష్ణలంకకు ఇక వరద కష్టం ఉండకూడదన్నదే సీఎం జగన్ ఉద్దేశమని పేర్ని నాని పేర్కొన్నారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన మాజీ సీఎస్ నీలం సాహ్ని కోవిడ్ సమస్యకు పరిష్కారం వ్యాక్సినేషనే: సీఎం జగన్ -
న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్‌కు ప్రధాని మోదీ భూమి పూజ
-
నూతన పార్లమెంట్‌కు ప్రధాని మోదీ భూమి పూజ
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ వెంకటేశ్ జోషీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణసింగ్ తదితరులు హాజరయ్యారు. మొత్తం 200 మంది అతిథులు హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్ మార్గ్‌లో మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ నూతన పార్లమెంట్ భవన నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుత భవనానికి వందేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంలోనే ఈ కొత్త భవన నిర్మాణానికి సంకల్పించినట్లు కేంద్రం తెలిపింది. చదవండి: నాలుగు అంతస్తుల్లో కొత్త పార్లమెంట్ శంకుస్థాపన చేసిన ఈ కొత్త భవనం నిర్మాణాన్ని 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న 2022 ఆగస్టు 15 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నాలుగు అంతస్తుల కొత్త పార్లమెంట్ భవనాన్ని రూ.971 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించారు. త్రిభుజకారంలో ఉండే ఈ భవనాన్ని పర్యావరణ హిత విధానాలను పెద్దపీట వేస్తూ, భూకంపాలను కూడా తట్టుకునేలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్నారు. ఈ భవనంలో 888 మంది లోక్‌సభ సభ్యులు, 384 మంది రాజ్యసభ సభ్యులకు చోటు ఉండేలా నిర్మాణం చేయనున్నారు. -
నెరవేరనున్న సీఎం జగన్ మరో ఎన్నికల హామీ..
సాక్షి, అనంతపురం: మరో ఎన్నికల హామీ నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్నద్ధమవుతున్నారు. అనంతపురం జిల్లాలో రేపు(బుధవారం) 3 రిజర్వాయర్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లిలో పైలాన్ ఏర్పాటు చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్లు నిర్మాణం కానున్నాయి. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యాంకు నీటి తరలింపు కోసం ప్రణాళికలు సిద్ధమయ్యాయి. (చదవండి: బీసీల కార్పొరేషన్ల ఏర్పాటు ఓ చారిత్రక నిర్ణయం) రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది. ఏడు మండలాల్లోని 35 గ్రామాలకు లబ్ధి చేకూరనుంది. మొత్తం నాలుగు రిజర్వాయర్లు, ప్రధాన కాలువ కోసం రూ.800 కోట్లను ఏపీ ప్రభుత్వం వెచ్చిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజన్ ఉన్న నాయకుడని, రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు లక్ష ఎకరాలకు నీరిస్తానన్న హామీని నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. తమకు రైతు ప్రయోజనాలే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. (చదవండి: ఆ రాతలపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్) -
సీఎం సంకల్పం.. వారి కల సాకారం
సాక్షి, అమరావతి: ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మత్స్యకారులకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు సమకూర్చే బృహత్తర ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (శనివారం) శంకుస్థాపన చేయనున్నారు. తీర ప్రాంతంలో తొలి దశలో నిర్మించనున్న 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేయనున్నారు. త్వరలో మిగిలిన నాలుగు చోట్ల కూడా పనులు మొదలుపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. సుదీర్ఘ పాదయాత్ర సమయంలో క్షేత్రస్థాయిలో మత్స్యకారుల ఇబ్బందులను స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి, వారికి మెరుగైన మౌలిక వసతులను కల్పించడంకోసం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. (చదవండి: సీఎం జగన్‌కు ధన్యవాదాలు: మాబున్నీసా) తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వల దిన్నె, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ గుంటూరు జిల్లా నిజాంపట్నం కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్‌కు ముఖ్యమంత్రి రేపు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేస్తారు. ఈ 4 ఫిషింగ్ హార్బర్లకోసం సుమారు రూ. 1510 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే వీటికోసం టెండర్లను ఆహ్వానించారు. డిసెంబర్ రెండో వారంలో వీటిని ఖరారు చేస్తారు. (చదవండి: తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్) జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రూ. 289 కోట్లు, నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రూ. 451 కోట్లు, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రూ. 348 కోట్లు, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రూ. 422 కోట్ల రూపాయలు, మొత్తంగా రూ.1510 కోట్లు తొలిదశ ప్రాజెక్టు వ్యయంగా నిర్ణయించారు. దీని తర్వాత త్వరలో మరో 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రభుత్వం చురుగ్గా అడుగులు వేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్ల పాలెం, విశాఖపట్నం జిల్లా పూడిమడక పశ్చిమగోదావరి జిల్లా బియ్యపు తిప్ప, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి సుమారు రూ.3వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. దీంతోపాటు రాష్ట్రంలో అవసరమైన అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక ఆక్వాహబ్ చొప్పున నిర్మించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనికోసం రూ. 225 కోట్లు ఖర్చు చేయనున్నారు. తొలిదశలో భాగంగా 25 ఆక్వాహబ్‌ల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. వినియోగదారులకు నాణ్యమైన చేపలు, రొయ్యలు, ఇతర మత్స్య ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకు వచ్చి దేశీయంగా వినియోగం పెంచడంకోసం, పౌష్టికాహార భద్రత కల్పించడంకోసం ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. లైవ్ ఫిష్, తాజా చేపలు, డ్రై చేసిన చేపలు, ప్రాసస్ చేసిన చేపలు, రొయ్యలు, పీతలు ఇతర మత్స్య ఉత్పత్తులు ఇందులో లభిస్తాయి. మత్స్య, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ఈ హబ్‌లను జనతాబజార్లతో అనుసంధానం చేయనున్నారు. ఆక్వా రైతుల సొసైటీలు ఈ హబ్‌లను నిర్వహిస్తాయి. సమీప ప్రాంతంలో రైతులు, మత్స్యకారుల నుండి చేపలు, రొయ్యలు సేకరించి హబ్‌లకు, తద్వారా జనతాబజార్లకు సరఫరా చేస్తారు. -
ఇందిరాపార్క్నుంచి వీఎస్టీ వరకు స్టీల్ ఫ్లె ఓవర్ శంకుస్థాపన