
సాక్షి, అనంతపురం: మరో ఎన్నికల హామీ నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సన్నద్ధమవుతున్నారు. అనంతపురం జిల్లాలో రేపు(బుధవారం) 3 రిజర్వాయర్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లిలో పైలాన్ ఏర్పాటు చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్లు నిర్మాణం కానున్నాయి. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యాంకు నీటి తరలింపు కోసం ప్రణాళికలు సిద్ధమయ్యాయి. (చదవండి: బీసీల కార్పొరేషన్ల ఏర్పాటు ఓ చారిత్రక నిర్ణయం)
రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది. ఏడు మండలాల్లోని 35 గ్రామాలకు లబ్ధి చేకూరనుంది. మొత్తం నాలుగు రిజర్వాయర్లు, ప్రధాన కాలువ కోసం రూ.800 కోట్లను ఏపీ ప్రభుత్వం వెచ్చిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజన్ ఉన్న నాయకుడని, రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు లక్ష ఎకరాలకు నీరిస్తానన్న హామీని నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. తమకు రైతు ప్రయోజనాలే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. (చదవండి: ఆ రాతలపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్)