
సాక్షి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గవాసుల చిరకాల స్వప్నం నెరవేరబోతుంది. రూ.125 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రేపు(బుధవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మంగళవారం సాయంత్రం ఏర్పాట్లను మంత్రులు పేర్నినాని, కొడాలి నాని పరిశీలించారు. మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయతకు రిటైనింగ్‌వాల్ నిర్మాణం మరో నిదర్శనమని పేర్కొన్నారు. నిర్వాసితులను ఇబ్బందిపెట్టకుండా రిటైనింగ్‌వాల్ నిర్మాణం జరగబోతోందన్నారు. కృష్ణలంకకు ఇక వరద కష్టం ఉండకూడదన్నదే సీఎం జగన్ ఉద్దేశమని పేర్ని నాని పేర్కొన్నారు.
చదవండి:
సీఎం జగన్‌ను కలిసిన మాజీ సీఎస్ నీలం సాహ్ని
కోవిడ్ సమస్యకు పరిష్కారం వ్యాక్సినేషనే: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment