kadapa airport
-
రూ.266 కోట్లతో కడప విమానాశ్రయం అభివృద్ధి
కడప కోటిరెడ్డిసర్కిల్/కడప కార్పొరేషన్: వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని విమానాశ్రయంలో రూ.266 కోట్లతో నిర్మించనున్న నూతన టెర్మినల్ భవనానికి ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ విమానాశ్రయం 25 లక్షల మంది ప్రయాణికుల వార్షిక సామర్థ్యం మేరకు ఆధునిక సొబగులద్దుకుంటోంది. ఇక్కడి రన్‌వేని 45 మీటర్ల వెడల్పున 2,515 మీటర్ల పొడవున విస్తరించనున్నారు. పనులు పూర్తయిన తరువాత ఈ విమానాశ్రయం పీక్ అవర్ సరి్వంగ్ కెపాసిటీ 1,800 మంది ప్రయాణికులుగా ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషితో విమానాశ్రయం విస్తరణకు రూ.75 కోట్లతో స్థలం సేకరించారు. దీంతో రన్‌వే పొడిగిస్తున్న నేపథ్యంలో విమానాల నైట్ ల్యాండింగ్‌కు కూడా అవకాశం లభిస్తుంది. ఇప్పటికే ఇక్కడి నుంచి నిరంతరాయ సర్విసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కూడా భరించింది. 2015లో ప్రారంభమైన ఈ విమానాశ్రయం నుంచి 2017లో ట్రూ జెట్ సంస్థ ఉడాన్ స్కీమ్ కింద ఆర్సీఎస్ (రీజినల్ కనెక్టివిటీ స్కీమ్) అమలు చేసింది. 2021లో ఆ సంస్థ తన విమానాలను ఉపసంహరించుకుంది. 2022 మార్చి నుంచి ఇండిగోసంస్థ విమానాలను ప్రారంభించింది. ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజద్‌బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ విమానాశ్రయంలో అభివృద్ధి పనులతోపాటు టెర్మినల్ నిర్మాణంతో రూపురేఖలు మారిపోయి మహర్దశ పట్టనుందని చెప్పారు. ఈ విమానాశ్రయం ఏర్పాటుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కృషిచేయగా, ఎయిర్‌పోర్టు అభివృద్ధికి ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు సుందరీకరణలోను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. ఎయిర్‌పోర్టుకు అతి సమీపంలో అటవీప్రాంతం ఉండడంతో అటవీశాఖ అనుమతులు తీసుకుని భూసేకరణ చేసినట్లు తెలిపారు. ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులు చేపట్టిన ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర విమానయానశాఖ మంత్రి జ్యోతిరావు సిందియాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయరామరాజు, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ సుజిత్‌కుమార్ పోదార్, ›ప్రొటోకాల్ ఆఫీసర్ సురేష్‌బాబు, టెర్మినల్ మేనేజర్ జోసెఫ్ పాల్గొన్నారు. ముసుగు తొలగించారంతే: ఎంపీ అవినాశ్‌రెడ్డి అనంతరం ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎప్పటినుంచో పొత్తులో ఉన్న టీడీపీ, పవన్‌కళ్యాణ్, బీజేపీ ఇప్పుడు ముసుగు తొలగించారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పొత్తులు కొత్తేమీ కాదని, ఎన్నికలు వచ్చాయంటే ఆయనకు పొత్తులు గుర్తొస్తాయని చెప్పారు. 2019లో టీడీపీ ఓటమి పాలుకాగానే చంద్రబాబు తన అనుచరులైన సుజనాచౌదరి, సీఎం రమేశ్‌లను బీజేపీలోకి పంపారని గుర్తుచేశారు. అప్పటి నుంచి ప్రత్యక్షంగా పొత్తులో ఉన్న టీడీపీ, వవన్‌కళ్యాణ్, బీజేపీ.. పరోక్షంగా కాంగ్రెస్, ఇతర పార్టీలతో కూడా కలిసే ఉన్నట్లు చెప్పారు. ఎంతమంది కలిసొచి్చనా, ఎల్లో మీడియా వారికి ఎంత మద్దతు ఇచ్చినా గెలిచేది వైఎస్సార్సీపీయేనని ఆయన తెలిపారు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీతో పొత్తుకోసం టీడీపీ వెంపర్లాడిందని ఎద్దేవా చేశారు. సింహం సింగిల్‌గానే వస్తుందని, జగన్ సింగిల్‌గా పోటీచేసి మళ్లీ సీఎం కావడం తథ్యమని చెప్పారు. -
కడప ఎయిర్‌పోర్టు కొత్త టెర్మినల్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప ఎయిర్‌పోర్టు కొత్త టెర్మినల్‌కు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.265 కోట్ల రూపాయల వ్యయంతో నూతన టర్మీనల్ భవన నిర్మాణం చేపట్టారు. ఢిల్లీ నుండి వర్చువల్ విధానంలో ప్రధాని పాల్గొన్నారు. కడప నుంచి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ, కడప ప్రజల కల నెరవేరుతున్న వేళ సంతోషంగా ఉందన్నారు. కడప విమానాశ్రయ అభివృద్ధి కోసం దివంగత మహానేత వైఎస్సార్ చేసిన కృషి అందరికి తెలిసిందే.. రూ. 75 కోట్ల రూపాయలతో స్థల సేకరణ పూర్తి చేశామని తెలిపారు. ఉడాన్ పథకం ద్వారా హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, చెన్నైకు తక్కువ ధరకు విమాన సర్వీసులు నడపడం జరిగిందన్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో నైట్ ల్యాండింగ్, రన్ వే పొడిగింపు, పెద్ద విమానాలు ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరావు సిందియా, ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇదీ చదవండి: స్నేహం కాదు, దాసోహం! -
ఎయిర్‌పోర్టుపై గాలి వార్తలు
కడప సిటీ : ఎల్లో మీడియా కడప ఎయిర్‌పోర్టుపై తప్పుడు రాతలు రాసుకుంటూ.. రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నంలో ముందు వరుసలో ఉంది. ఉన్న వాస్తవాలను వక్రీకరించి విమాన ప్రయాణికులను ఆందోళనకు గురిచేసే విధంగా వార్తలను ప్రచురిస్తున్నారు. విమానయాన సంస్థ ఇండిగో ఆదివారం నుంచి కడప–హైదరాబాదు విమాన సర్వీసులను నిలిపి వేసిందని, ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల వల్లనే నిలిచిపోయాయని చెప్పుకొచ్చారు. వాస్తవ పరిస్థితి చూస్తే.. నెట్వర్క్ ప్లానింగ్‌లో భాగంగా విమాన రాకపోకల షెడ్యూల్ మారుతుంటుందని ఇండిగో సంస్థ ప్రతినిధి ‘సాక్షి’కి తెలిపారు. మార్చి 31వ తేది నుంచి యథావిధిగా ఈ సర్వీసు ఉంటుందని తెలియజేశారు. అంతవరకు కనెక్టింగ్ ఫైట్ల ద్వారా కడప నుంచి హైదరాబాదుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు. సర్వసాధారణంగా ప్రతి ఫ్లైట్ సర్వీసు మార్చే క్రమంలో ఇలాంటి పరిస్థితి ఉంటుందని వివరించారు. వక్రీకరించి... పరిస్థితి ఇలా ఉంటే అందుకు భిన్నంగా ఎల్లో మీడియా వక్రీకరించి విషయాన్ని తప్పుదోవ పట్టించి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసింది. ఉన్న విషయాన్ని ప్రయాణికులకు చెప్పకుండా ఎయిర్‌పోర్టు ఉంటుందో? లేదోనన్న అపోహాను కలిగించే విధంగా ప్రయత్నం చేశారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని, అందువల్లనే ఈ సర్వీసు రద్దు చేశారని రాసుకొచ్చారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంటే మొత్తం అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తారు గానీ.. కేవలం ఒకే ఒక సర్వీసును ఎలా రద్దు చేస్తారని పలువురు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని సెప్టెంబరు 15 వరకు విమానాలు నడుస్తాయని, ఆ తర్వాత బుకింగ్ ఉండదని రాశారు. కలెక్టర్ జోక్యంతో సెప్టెంబరు చివరి వరకు రాకపోకలు కొనసాగిస్తారని, అందులో వారే చెప్పారు. కానీ విమానాల రాకపోకలు ఆగిపోయింది లేదు.. ప్రయాణికులు ఇబ్బంది పడింది లేదు. నిరంతరాయంగా బుకింగ్ చేసుకుంటున్నారు. విమాన సర్వీసులు కొనసాగుతూనే ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే కేవలం ప్రభుత్వంపై చెడ్డపేరు తీసుకొచ్చి ప్రజల్లో ఒక విధమైన భావన కలిగించేలా చేసే ప్రయత్నమేనని పలువురు మండిపడుతున్నారు. -
కడప ఎయిర్‌పోర్టు అభివృద్ధికి రూ. 224.05 కోట్ల నిధులు
కడప సిటీ : కడప విమానాశ్రయ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. రూ. 224.05 కోట్లతో న్యూ డొమెస్టిక్ బిల్డింగ్ నిర్మాణం, ఇతర పనులకు శ్రీకారం చుట్టేందుకు టెండర్లను కూడా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా పిలిచింది. మరో మూడు నెలల్లో టెండర్లు పూర్తయి రెండేళ్ల కాలంలో అంటే మార్చి 2026కు పనులు పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.ఇప్పటికే నైట్ ల్యాండింగ్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. అత్యాధునిక సౌకర్యాలతో ఎయిర్‌పోర్టును తీర్చిదిద్దనున్నారు. రూ. 224.05 కోట్లతో పనులు ఇటీవల ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కడప ఎయిర్‌పోర్టు అభివృద్ధికి రూ. 224.05 కోట్ల నిధులు కేటాయించింది. ఈ మొత్తంతో 12,900 చదరపు మీటర్లలో న్యూ డొమెస్టిక్ టెర్మినల్ భవన నిర్మాణాన్ని అత్యాధునిక సౌకర్యాలతో చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి టెండర్లను పిలిచారు. తిరుపతి, విజయవాడ, రాజమండ్రి తరహాలో ఈ ఎయిర్‌పోర్టును సర్వాంగ సుందరంగా మార్చనున్నారు. మూడు ఏరో బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఇవి పూర్తయితే టెర్మినల్ భవనం నుంచి నేరుగా విమానంలోకి చేరుకునే అవకాశం ఉంటుంది. వర్షం వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు విమానం వద్దకు చేరుకోవచ్చు. ప్రస్తుతం బస్సు ద్వారా అక్కడికి చేరుకుంటారు. పెద్ద విమానాలు వచ్చేందుకు అవకాశం కడప విమానాశ్రయంలో పెద్ద విమానాలు రాకపోకలు సాగించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నైట్ ల్యాండింగ్‌కు సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతి వచ్చిన తర్వాత పనులన్నీ పూర్తయ్యాయి. రన్‌వే పెంపుతోపాటు రన్‌వే లైటింగ్, అప్రోచ్ లైటింగ్, పార్కింగ్ బే లైటింగ్, 2.5 కిలోమీటర్ల రన్‌వే, సెక్యూరిటీ, పెరిమీటర్ లైటింగ్, పెరిమీటరు రోడ్డు తదితర పనులు పూర్తయ్యాయి. దీంతో నైట్ ల్యాండింగ్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా విమానాలు దిగేందుకు అవకాశం ఉంటుంది. 8కొత్త టెర్మినల్ లో 700 మంది ప్రయాణికుల సౌకర్యం ప్రస్తుతం ఉన్న టెర్మినల్ భవనంలో 40+40 (80) మందికి మాత్రమే అవకాశం ఉంది. కొత్త టెరి్మనల్ పూర్తయితే మొత్తం 700 మందికి రాకపోకలు సాగించే అవకాశాలు ఉంటాయి. ఏడు విమానాలు పార్కింగ్ చేసేందుకు ఇక్కడ అవకాశం ఉంది. అభివృద్ది పనులు పూర్తయితే ఏ–320 (180మంది) ప్రయాణికులు ప్రయాణించే పెద్ద విమానాలు ఇక్కడి నుంచి నడిపేందుకు వీలు ఉంటుంది. 8పైలెట్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు కడప విమానాశ్రయంలో పైలెట్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా పైలెట్ శిక్షణా కేంద్రం లేదు. ప్రప్రథమంగా కడప విమానాశ్రయంలో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చేనెల 25, 26 తేదీల్లో ఇందుకు సంబంధించి ప్రణాళిక ఖరారు కానుంది. తర్వాత ఈ శిక్షణా కేంద్రం పనులు చేపట్టే అవకాశం ఉంది. -
కడప ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌కు ఘన స్వాగతం
సాక్షి, కడప: నేటి నుంచి రెండు రోజులపాటు పులివెందుల నియోజకవర్గం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మధ్యాహ్నం కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కడప ఎయిర్పోర్ట్ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 4.20 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకున్నారు సీఎం జగన్. కడపఎయిర్‌పోర్టు, ఇడుపులపాయలో సీఎం వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం లభించింది. ఇడుపులపాయ వైఎస్సార్ ఎస్టేట్ చేరుకున్న అనంతరం 4.50 గంటల వరకు పార్టీ నేతలతో మాట్లాడారు. 5.00 గంటలకు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు. కడప ఎయిర్పోర్ట్ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 4.20 గంటలకు ఇడుపులపాయ వైయఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకున్న సీఎం వైయస్ జగన్‌కు ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు స్వాగతం పలికారు. చదవండి: ఇక సొంత ఊరే.. వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ -
విజయవాడకు రోజూ విమాన సర్వీసులు
సాక్షి కడప : కడప ఎయిర్ పోర్టు నుంచి తిరిగే విమాన ప్రయాణ రోజులలో మార్పులు చేశారు. ఎప్పటికప్పుడు సీజన్ల వారీగా అధికారులు మార్పులు చేర్పులు చేస్తుంటారు. కరోనా వైరస్ నేపథ్యంలో దాదాపు రెండు నెలలపాటు విమానాలు నిలిపివేశాక మే 25 నుంచి పునః ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకు రోజుల వారీగా విమానాలు తిరుగుతున్నాయి., ప్రస్తుతానికి అధికారులు కొంత మార్పులు, చేర్పులు చేశారు. గతంలో మంగళవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం హైదరాబాదు–కడప మధ్య సర్వీసు నడుస్తుండగా....ఇప్పుడు సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ప్రయాణం చేసేలా మార్చారు. చెన్నైకి గతంలో సోమ, బుధ, గురువారాల్లో నడుస్తుండగా మార్పులు, చేర్పులు చేసి మంగళ, గురు, శనివారాల్లో తిరిగేలా షెడ్యూల్ రూపొందించారు. ఈ షెడ్యూల్ ఈనెల 14నుంచి అమలులోకి వచ్చి 31 వరకు అమలు చేయనున్నారు. తర్వాత విమాన షెడ్యూల్‌ను ఇదేవిధంగా నడపవచ్చు లేదా మార్పులు, చేర్పులు చేసే విషయంలో అధికారులు నిర్ణయం తీసుకుంటారు. -
ఫలించిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కృషి
కడప కార్పొరేషన్: కడప విమానాశ్రయంలో రాత్రి వేళ విమానాలు రాత్రి దిగేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇందుకు సంబంధించి లైట్ల ఏర్పాటుకు అటవీ శాఖ అనుమతించింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కడప విమానాశ్రయంలో రాత్రి వేళలో విమానాలు దిగడానికి ఉన్న అనుకూలతలను పరిశీలించాలని కడప పార్లమెంటు సభ్యులు ఎయిర్ పోర్టు అడ్వయిజరీ కమిటీ చైర్మన్ వైఎస్ అవినాష్‌రెడ్డి సూచించారు. 2019 అక్టోబర్ 18వ తేదిన నిర్వహించిన ఏఏసీ మీటింగ్‌లో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సభ్యుల ముందు ఉంచారు. రాత్రి వేళలో విమానాలు దిగాలంటే పైలెట్లు గుర్తించడానికి కొండల పైభాగంలో అబ్స్టాకిల్ లైట్లు ఏర్పాటు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకు అటవీ శాఖ అనుమతులు అవసరమని తీర్మానించి కేంద్రానికి పంపారు. ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సర్వే బృందం సూచించిన నాలుగు ప్రాంతాల్లో ఈ అబ్స్టాకిల్ లైట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో రెండు ప్రాంతాలు కడప ఫారెస్ట్ డివిజన్లోని శ్రీ లంక మల్లేశ్వర అభయారణ్యంలో, మరో రెండు ప్రొద్దుటూరు ఫారెస్ట్ డివిజన్లోని నాగార్జున సాగర్– శ్రీశైలం పులుల సంరక్షణ ప్రాంతంలో ఉన్నాయి. ప్రస్తుతం వీటికి అనుమతిలిస్తూ నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అప్రోచ్ భాగం పూర్తి కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి కృషి వల్లే అబ్స్టాకిల్ లైటింగ్‌కు అటవీ శాఖ అనుమతులు ఇచ్చిందని ఎయిర్ పోర్టు డైరెక్టర్ పి. శివప్రసాద్ తెలిపారు. సాధారణంగా ఇలాంటి వాటికి అటవీ శాఖ అనుమతులు రావడం చాలా కష్టమని చెప్పారు. ఎయిర్ పోర్టు అడ్వయిజరీ కమిటీ సమావేశానంతరం ఎంపీ పలుసార్లు ఢిల్లీలో అటవీ శాఖ అధికారులను కలిసి అనుమతులు వచ్చేలా చేశారన్నారు. ఎయిర్ పోర్టులో ప్రస్తుతం అప్రోచ్ పార్ట్ పనులు పూర్తయ్యాయని, పారామీటర్, రన్ పనులు వేగంగా పూర్తవుతాయన్నారు. ఈ పనులన్నీ పూర్తయితే నైట్ ల్యాండింగ్ సులభతరమవుతుందని తెలిపారు. -
విమానం దిగింది.. ఎగిరింది..!
సాక్షి కడప : కడప ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆ దివారం కడప ఎయిర్‌పోర్టు మీదుగా మరో సర్వీసు ప్రారంభమైంది. బెల్గాం నుంచి ఉదయం 9.40 కి బయలుదేరిన విమానం సరిగ్గా 11.10 గంటల ప్రాంతంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. మొదటి విడతలో భాగంగా వచ్చిన ప్రయాణికులందరికి ఎయిర్‌పోర్టు అధికారులు సంస్థ ఆధ్వర్యంలో స్వీట్లు, రోజా పూలు అందించి ఘన స్వాగతం పలికారు. తొలుత కడప నుంచి విమానం హైదరాబాదుకు బయలుదేరి వెళ్లింది. ఆ తర్వాత తిరిగి కడపకు వచ్చి బెల్గాం బయలుదేరి వెళ్లింది. బెల్గాం నుంచి çకడపకు వస్తున్న సమయంలో విమానంలో 50 మంది ప్రయాణికులు ఉండగా.. కడప నుంచి బెల్గాంకు వెళుతున్న సమయంలో దాదాపు 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి 2017లో విమాన సర్వీసులు ప్రారంభం కాగా.. ఇది నాలుగవ సరీ్వసు. ఉడాన్ స్కీమ్ ద్వారా ప్రసుత్తం ఈ సరీ్వసులు నడుస్తున్నాయి. సరీ్వసు ప్రాం¿ోత్సవం సందర్భంగా ఎయిర్‌పోర్టు డైరెక్టర్ పూసర్ల శివప్రసాద్, ట్రూజెట్ సంస్థ మేనేజర్ భవ్యన్‌కుమార్ ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు. విమానం రాకపోకల వివరాలు ► బెల్గాం నుంచి కడపకు బయలుదేరు సమయం - ఉదయం 09.40 ► కడపకు చేరుకునే సమయం - ఉదయం 11.10 ► కడప నుంచి హైదరాబాదుకు బయలుదేరు సమయం-ఉదయం 11.30 ► హైదరాబాదు చేరుకునే సమయం-మధ్యాహ్నం 12.45 ► హైదరాబాదు నుంచి కడపకు బయలుదేరు సమయం-మధ్యాహ్నం 03.05 ► కడపకు చేరుకునే సమయం-సాయంత్రం 04.10 ► కడప నుంచి బెల్గాంకు బయలుదేరే సమయం-సాయంత్రం 04.30 ► బెల్గాంకు చేరుకునే సమయం-సాయంత్రం 06.00 -
ట్రూజెట్ విమనానికి తప్పిన ప్రమాదం!
సాక్షి, కడప : కడప నుంచి విజయవాడ బయల్దేరిన విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. పైలెట్ అప్రమత్తం కావడం..ఏటీసీ అధికారులకు సమాచారం అందించడం..విమానాన్ని కడప ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చి సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన ట్రూ జెట్ విమానంలో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో విమానం బయలుదేరగా 10–15 నిమిషాల వ్యవధిలో పక్షి తగిలింది. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన పైలెట్ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. నేరుగా విమానాన్ని కడప ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చి దింపారు. ఇందులో ప్రయాణిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు మిగిలిన ప్రయాణికులను క్షేమంగా ఎయిర్‌పోర్టులో దింపేసి ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అయితే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా మరో విమానంలో హైదరాబాదుకు బయలుదేరి వెళ్లారు. క్షేమంగా దిగడంతో అందరిలోనూ సంతోషం వెల్లివిరిసింది. ప్రమాదం దృష్ట్యా విజయవాడ వెళ్లాల్సిన విమాన సర్వీసు, చెన్నై వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేశారు. కడప ఎయిర్‌పోర్టులో ఆగిన విమానం ప్రమాద నేపథ్యంలో విమానం కడప ఎయిర్‌పోర్టుకు చేరింది. దానిని ఎయిర్‌పోర్టు అధికారులు పరీక్షల నిమిత్తం కడపలోనే ఉంచారు. ఈ విమానాన్ని గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం పలువురు అధికారులు పరిశీలిస్తారు.అన్ని పరీక్షలను నిర్వహించాక విమానం బయలుదేరనుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అధికారులు కడప నుంచి విజయవాడకు బయలుదేరిన విమానానికి ప్రమాదం ఎదురు కావడంతో అత్యవసరంగా పైలెట్ విమానాన్ని కడప ఎయిర్‌పోర్టుకు సురక్షితంగా తీసుకొచ్చారు. ప్రయాణికులు తిరిగి వెళ్లడానికి ట్రూ జెట్ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కొందరికి వాహనాలు సమకూర్చింది. మరికొందరికి బస్సు లు, మరో విమానంలో అవకాశం కల్పించారు. అయితే చెన్నై విమాన సర్వీసును రద్దు చేయడంతో టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య నేపథ్యంలో ట్రూజెట్ అధికా>రులు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. -
నిద్రిస్తున్న యువకుడిపై ఇసుక అన్లోడ్
సాక్షి, వల్లూరు(కడప) : మండల పరిధిలోని కడప ఎయిర్ పోర్ట్ ఆవరణంలో యువకుడు కుమార్ బోయ (19) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా డోన్ పట్టణ పరిధిలోని చానుగొండ్ల గ్రామానికి చెందిన కుమార్ బోయ గత కొంత కాలంగా తమ గ్రామస్తులతో కలసి ఎయిర్ పోర్ట్‌లో కాంక్రీట్ పనులు చేస్తున్నాడు. ఆదివారం కాంక్రీట్ కలిపేందుకు వినియోగించే ఇసుక జల్లెడ పై పడుకున్నాడు. అయితే ఇసుక లోడుతో వచ్చిన టిప్పర్ డ్రైవర్ ఇసుకను జల్లెడ పై అన్లోడ్ చేశాడు. నిద్రలో ఉన్న కుమార్‌పై ఇసుక ఒక్కసారిగా మీద పడటంతో ఊపిరి ఆడక మృతి చెందాడు. కొద్ది సేపు తర్వాత సహచరులు కుమార్ కనిపించలేదని వెతక సాగారు. అయితే అక్కడే ఉన్న ఒక బాలుడు జల్లెడ పై పడుకొని ఉండటం తాను చూశానని చెప్పాడు. దీంతో ఇసుక తొలగించి చూడగా కుమార్ బోయ విగత జీవిగా పడి ఉన్నాడు. మృతుని సహచరుడు రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వల్లూరు ఎస్ఐ మధు మల్లేశ్వర్ రెడ్డి తెలిపారు. -
వైఎస్ జగన్‌కు చెక్కు ఇచ్చిన అభిమాని
-
వైఎస్ జగన్‌కు చెక్కు ఇచ్చిన అభిమాని
సాక్షి, కడప: ఎన్నికల వేళ జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభిమానులు కొండంత అండగా నిలుస్తున్నారు. నీకు మేమున్నామంటూ రాజన్న బిడ్డకు తోడుగా వస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన వైఎస్ జగన్‌ను కడప విమానాశ్రయంలో లింగాల మండలం పెద్ద కూడలకు చెందిన అనిల్ అనే అభిమాని కలిశారు. 5 లక్షల రూపాయల చెక్కును అందించి అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాను ఇచ్చిన విరాళం చాలా చిన్నదని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పేదల కష్టాల తీరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని, దుర్మార్గపు చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తథ్యమని పేర్కొన్నారు. కాగా, విశాఖపట్నం జిల్లా నర్సిపట్నం నుంచి ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ జగన్ ప్రారంభించారు. -
మార్చి 1న విడుదల
సాక్షి, కడప : ఎన్నో ఏళ్ల క్రితం బ్రిటీషు హయాంలో నెలకొల్పిన కడప ఎయిర్‌పోర్టుకు కేంద్రం పుణ్యమా అని కొత్త కళ వస్తోంది. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఎయిర్‌పోర్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎయిర్‌పోర్టు అద్భుతంగా ఉన్నా విమాన రాకపోకలు మాత్రం అప్పుడప్పుడు మాత్రమే సాగేవి. అయితే ఇటీవల కేంద్రప్రభుత్వం రీజినల్ కనెక్టివిటీ స్కీం ద్వారా చిన్నచిన్న స్టేషన్లను కలుపుతూ అందరికీ విమానయోగం కల్పించాలన్న సంకల్పంతో ప్రధాని పలు విమాన సర్వీసులను ప్రారంభించారు. అప్పటి నుంచి కేంద్రం ప్రయాణికులతో సంబంధం లేకుండా విమాన యాజమాన్యాలకు సీట్ల అనుగుణంగా డబ్బులు చెల్లిస్తూ వస్తోంది. తద్వారా కడప లాంటి ఎయిర్‌పోర్టులకు కూడా మహర్దశ వస్తోంది. ప్రతిరోజు రెండు విమాన సర్వీసులు కడప మీదుగా నడవనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్, చెన్నై సర్వీసులు హైదరాబాద్ నుంచి ట్రూజెట్‌కు చెందిన విమానం రాకపోకలు సాగిస్తోంది. ప్రతిరోజు హైదరాబాద్ నుంచి ఉదయం కడపకు రావడం, అనంతరం కడప నుంచి హైదరాబాద్‌కు తిరిగి వెళ్లేది. ఈ సర్వీసును 2017 ఏప్రిల్ 27వ తేదీన ప్రధాని మోదీ రిమోట్ ద్వారా ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నిరంతరాయంగా సాగుతోంది. కడప నుంచి చెన్నైకి కూడా గత ఏడాది నవంబర్ 16 నుంచి విమాన సర్వీస్‌ను ప్రారంభమైంది. ప్రస్తుతం కడప–హైదరాబాద్, కడప–చెన్నైల మధ్య సర్వీస్‌లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన ఉంది. మార్చి 1నుంచి విజయవాడకు సర్వీస్ కడప నుంచి రాజధానికి సర్వీస్ నడిపేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మార్చి 1 నుంచి కడప–విజయవాడ సర్వీస్ ప్రారంభం కానుంది. అవసరమైన అన్ని అనుమతులు లభించాయి. దీంతో రాజధాని ప్రాంతానికి కడప నుంచి వెళ్లడానికి విమాన సర్వీస్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు ప్రయాణికులు కూడా టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. WWW.TQUJET.COM టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రయాణికులకు ట్రూజెట్ ఆఫర్ కడప నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ప్రస్తుతం కడప నుంచి రైళ్లు, ఏసీ బస్సుల్లో ప్రయాణ టిక్కెట్ కంటే కూడా విమానంలో తక్కువ చార్జీ అంటే ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. ఎందుకంటే ట్రూజెట్ సంస్థ కడప నుంచి విజయవాడ విమాన సర్వీసు ప్రారంభాన్ని పురస్కరించుకుని బంపర్ ఆఫర్ ఇచ్చింది. కేవలం రూ.798 ప్రారంభ ధరగా నిర్ణయించారు. త్వరపడిన వారికే లిమిటెడ్ సీట్ల మేరకు అవకాశం లభిస్తుంది. సద్వినియోగం చేసుకోవాలి కడప నుంచి హైదరాబాద్, చెన్నై, విజయవాడలకు విమాన సర్వీసులు నడుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కడప ఎయిర్‌పోర్టు డైరెక్టర్ పూసర్ల శివప్రసాద్ పిలుపునిచ్చారు. విజయవాడ–కడప మధ్య నడుస్తున్న విమాన సర్వీసులకు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుంటే టిక్కెట్ ధర తగ్గుతుందన్న విషయాన్ని ప్రయాణికులు గమనించాలన్నారు. కడప నుంచి హైదరాబాద్, విజయవాడ, చెన్నైలకు సర్వీస్‌లు ఉన్న నేపథ్యంలో జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. -
పల్లె పండుగకు రెక్కలు కట్టుకుని
సాక్షి కడప : సంక్రాంతి పండుగ సమీపించే కొద్ది సొంతూర్లకు వచ్చేందుకు ఎ్కడ అవకాశాలు ఉంటే అక్కడికి ప్రయాణికులు పరుగులు పెడుతున్నారు.ఇప్పటికే రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ప్రత్యేక వాహనాల్లో వెళ్లేందుకు అగచాట్లు పడుతున్న వీరు ప్రస్తుతం విమానాల వేటలో పడ్డారు..ఏది దొరికినా సొంతూరికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏయిర్పోర్టులలో కొత్త సందడి జిల్లా కేంద్రమైన కడప నుంచి ఇటీవలే పలు విమానాలు ప్రారంభించిన నేపథ్యంలో వాటికి ప్రస్తుతం డిమాండ్ ఏర్పడింది.కడప నుంచి హైదరాబాద్‌తో పాటు చెన్నై, తదితర ప్రాంతాలకు వెళ్లేవారు.. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవారితో కడప ఎయిర్‌పోర్టు జనంతో కిటకిటలాడుతోంది పెరిగిన ప్రయాణికులు సంక్రాంతి పండుగ ఘనంగా నిర్వహించుకునేందుకు సొంతూర్లకు తరలి వస్తున్నారు. బిజినెస్, ఉద్యోగాలు, చదువుకునే నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు మొదటగా బస్సులు, రైళ్లలో ప్రయత్నించినా ఎక్కడ చూసినా పూర్తి స్థాయిలో రద్దీగా నెలకొంది. దీంతో విమానాల వైపు తరలుతున్నారు. ఇంతకుముందు 70 శాతం ప్రయాణికులతో నడుస్తున్న ట్రూజెట్ విమాన సర్వీసులు ప్రస్తుతం 90 నుంచి 95 శాతం ప్రయాణికులతో రద్దీగా ఉంటున్నాయి. హైదరాబాదు నుంచి విమానం కడపకు రావడం, ఇక్కడి నుంచి చెన్నైకి వెళ్లడం...అక్కడి నుంచి మైసూరు వెళ్లి తర్వాత మళ్లీ కడప మీదుగానే హైదరాబాదు సర్వీసు నడుస్తోంది. రెండు రోజులుగా ఎక్కువగా ప్రయాణం పండుగ సమీపించంతో విమానాల్లో వెళ్లే ప్రయాణీకుల సంఖ్య రెండురోజులుగా పెరిగింది. సాధారణ రోజుల్లో కంటే ప్రస్తుతం పండుగ పరిస్థితులతో 15 నుంచి 20 శాతం మంది విమానంలో ప్రయాణిస్తున్నారు. సర్వీసుకు సంబంధించి అటునుంచి బాగానే వస్తున్నారు. ఇక్కడి నుంచి కూడా వెళ్లేవారి సంఖ్య అధికంగానే ఉంది. – భవ్యన్, ట్రూజెట్ మేనేజర్, కడప. ఎయిర్‌పోర్టులో పండుగ కళ సంక్రాంతి పండుగతో ఎయిర్‌పోర్టు జనంతో కళకళలాడుతోంది. వచ్చేవారు, పోయేవారితో ఎప్పుడూ రద్దీగా కనిపిస్తోంది. – పూసర్ల శివప్రసాద్, డైరెక్టర్, కడప ఎయిర్‌పోర్టు -
మూన్నాళ్ల ముచ్చటే..
► నెరవేరని సీఎం హామీలు ► వీఐపీల విమానాలకే ఎయిర్‌పోర్టు ► ఇక్కడి నుంచి సాగని రాకపోకలు ► ప్రతిసారి రద్దవుతున్న విమానాలు ► పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు కడప ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తున్నాం.. ఇక్కడి నుంచి తొలుత బెంగళూరుకు ఎయిర్ పెగాసిస్ సంస్థ విమాన సర్వీసులు వారంలో మూడుసార్లు తిరుగుతాయి...భవిష్యత్తులో ఇక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు విమానాలు నడిచేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం.అవసరమైన సబ్సిడీలు అందించి ప్రోత్సహిస్తాం..ఇవి 2016లో సీఎం చంద్రబాబు అన్న మాటలు.. అయితే నేటికీ ఇవేవి నెరవేరలేదు. సాక్షి, కడప: ఎంతో చరిత్ర కలిగిన కడప విమానాశ్రయం బోసిపోతోంది. దీనిని బ్రిటీషు వారి హయాంలో నెలకొల్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. అద్భుతంగా తీర్చిదిద్దినా కడప నుంచి విమానాల రాకపోకలు లేకపోవడంతోనే కళా విహీనంగా మారుతోంది. ప్రస్తుతం వీఐపీలు, వీవీఐపీల రాకపోకలకు సంబంధించిన విమాన సర్వీసులు మాత్రమే అప్పుడప్పుడు అలా కనిపించి వెళ్లిపోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కీలక నేతల ప్రయాణాల నేపథ్యంలో ప్రత్యేక విమానాలు ఆగేం దుకు.. గాలిలోకి ఎగిరేందుకు ఉపయోగపడిందనే చర్చ సాగుతోంది.ఈ క్రమంలో విమానాశ్రయం భవిష్యత్తు ఎలా ఉండబోతోందనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. అధికారులు చర్యలు తీసుకోవాలి: కడప విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ఎప్పుడు చూసినా మూన్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. 2016 లో తొలుత కడప-బెంగళూరు సర్వీసును ప్రారంభించగా, కొద్దిరోజులకే ప్రయాణికులు లేరన్న సాకుతో రద్దు చేశారు.అనంతరం కడప-విజయవాడ, కడప-హైదరాబాదు సర్వీసులను ప్రారంభించినా అవి కూడా కొద్దిరోజులే కొనసాగాయి. తర్వాత కారణమేదైనా ఒక్కొక్క సర్వీసును రద్దు చేస్తుండడం కడప ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. విమాన రాకపోకలకు సంబంధించి ఎక్కువ ప్రచారం చేసి ఉంటే ఇక్కడి నుంచి విజయవాడ, హైదరాబాదుకు ప్రయాణికుల రద్దీ బాగా ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కడప నుంచి విమానాలు మళ్లీ ఎప్పుడు తిరుగుతాయోనని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కనీసం కొన్ని సర్వీసులైనా తిరిగేలా చూడాలని, ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి విమానాలు నడపండి కడప కార్పొరేషన్: కడప విమానాశ్రయం నుంచి పూర్తి స్థాయిలో సర్వీసులు నడపాలని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. గురువారం ఆయన ఢిల్లీలో కేంద్ర విమానయానశాఖామంత్రి అశోక్ గజపతిరాజుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ 1953 నుంచి కడపలో ఎయిర్‌పోర్టు ఉన్నా దీనిని గురించి ఎవరూ పట్టించుకోలేదన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.33కోట్లు మంజూరు చేసి టెర్మినల్ బిల్డింగ్, 6000 అడుగుల రన్ వే నిర్మించారన్నారు. 2012 నాటికి డిపార్ట్మెంటల్ వర్క్స్ పూర్తయ్యాయని తెలిపారు. గత ఏడాది కడప ఎయిర్‌పోర్టును ప్రారంభించడంతో జిల్లా ప్రజలు ఎంతో సంతోషించారన్నారు. ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదని, కొంత కాలానికే కడప ఎయిర్‌పోర్టుకు విమాన సర్వీసులన్నీ ఆగిపోయాయని చెప్పారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ లాంటి వీవీఐపీలకే ఇది ఉపయోగపడుతోందన్నారు. రాయలసీమ జిల్లాలకు మధ్యలో ఉన్న కడప నుంచి చెన్నై, విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్, విశాఖ పట్నంలకు విమాన సర్వీసులు నడిపితే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. ఈ విషయమై త్వరగా నిర్ణయం తీసుకొని రాయలసీమ జిల్లాల ప్రజలకు మేలు చేకూర్చాలని కోరారు. -
ఎగిరినట్టే ఎగిరి ఆగిపోయిన విమానాలు
-
విమానం ఎగిరింది
సాక్షి, కడప : జిల్లా వాసుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయం నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ వచ్చిన కడప విమానాశ్రయాన్ని ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించగా, అనంతరం కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు, సైన్స్ అండ్టెక్నాలజీశాఖ మంత్రి సుజనాచౌదరి జ్యోతి ప్రజ్వలన చేశారు. విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు నేతలు ప్రత్యేక విమానంలో వచ్చారు. ఎయిర్వేస్ అధికారులు సీఎంతోపాటు కేంద్ర మం త్రులకు ఘన స్వాగతం పలికారు. టెర్మినల్తోపాటు రన్‌వే, వెయిటింగ్ రూమ్, హాలుతోపాటు ఇతర అన్ని సౌకర్యాలను వారు పరిశీలించారు. అనంతరం టెర్మినల్ బయట ఏర్పాటు చేసిన సమావేశానికి చంద్రబాబుతోపాటు కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రిమోట్ కంట్రోల్ బటన్‌తో విమానాశ్రయానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. విమానాశ్రయ అభివృద్ధికి కృషి కడప విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, వెంకయ్యనాయుడు, సుజనాచౌదరిలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కడప విమానాశ్రయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, అంతేకాకుండా ఎయిర్‌లైన్స్ అంగీకరిస్తే నైట్‌ల్యాండింగ్‌కు చర్యలు చేపడతామన్నారు. తిరుపతి, పుట్టపర్తి, కడపలలో విమానాశ్ర యాలు ఉన్నాయని, అయితే కడపను మరింత విస్తరింపజేసేందుకు కృషి చేస్తామన్నారు. రవాణా సౌకర్యం లేకపోతే పారిశ్రామికవేత్తలు రారని, విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పారిశ్రామిక వేత్తలు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. కడప నుంచి గల్ఫ్‌కు కూడా అధిక సంఖ్యలో వెళతారని, అలాగే కడప నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నలుమూలలకు వెళ్లేందుకు అవకాశాలు కల్పిస్తామన్నారు. విమానాశ్రయం సమీపంలోనే ఏపీఐఐసీ సేకరించిన ఆరు వేల ఎకరాల భూమి కూడా పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉందని.. రాష్ట్ర విభజన సందర్భంగా స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. భవిష్యత్తులో ఇక్కడి నుంచే హైదరాబాదు, విజయవాడ, చెన్నై, విశాఖపట్టణం, ఇతర పర్యాటక ప్రాంతాలకు వెళ్లడానికి కూడా అవకాశాలు వస్తాయని బాబు హామీ ఇచ్చారు. తొలి ప్రయాణికులతో మాటామంతి ఆదివారం విమానాశ్రయాన్ని ప్రారంభించిన అనంతరం బెంగళూరు నుంచి ఎయిర్ పెగాసిస్ విమానం కడపకు వచ్చింది. ఇందులో ప్రయాణించిన కొంతమంది ప్రయాణికులతో సీఎం చంద్రబాబు, మంత్రులు ముచ్చటించారు. అనంతరం వారితో ఫొటోలు దిగారు. తర్వాత కడప నుంచి బెంగళూరుకు మరో విమానం బయలుదేరింది. లోనికి అనుమతించలేదని బీజేపీ నేతల ధర్నా కేంద్ర మంత్రులతోపాటు సీఎం వస్తున్న నేపథ్యంలో పాసులు ఇచ్చిన కొందరిని మాత్రమే పోలీసులు విమానాశ్రయంలోకి అనుమతించడంతో టెర్మినల్ వద్ద ఆందోళన చోటుచేసుకుంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డితోపాటు బీజేపీ నేత కందుల శివానందరెడ్డి, పలువురు బీజేపీ నాయకులు విమానాశ్రయం వద్ద ధర్నాకు ఉపక్రమించారు. దాదాపు అరగంటపాటు టీడీపీ డౌన్‌డౌన్....చంద్రబాబు డౌన్‌డౌన్...అధికార పక్షానికి వత్తాసు పలుకుతున్న పోలీసులు డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బయటికి వచ్చి వారికి సర్దిచెప్పి తీసుకెళ్లారు. జాతీయ జెండాకు అవమానం విమానాశ్రయం ప్రారంభోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేయాలని భావించిన అధికార యంత్రాంగం ప్రత్యేకంగా టెర్మినల్ ఎదురుగా ఏర్పాటు చేశారు. అయితే దిమ్మెకు పై ఉన్న స్తంభానికి జాతీయ జెండాను కట్టి...ఎగురవేసేందుకు సిద్ధం చేసినా సీఎంగానీ, కేంద్ర మంత్రులుగానీ పట్టించుకోలేదు. పైగా ఏర్పాటు చేసిన అధికారులైనా కనీసం సీఎం, ఇతర నేతలకు చెప్పి ఎగరవేయాల్సిందిపోయి...జాతీయ పతాకం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. -
కడపకు పూర్వ వైభవం తీసుకు వస్తా
సాక్షి, కడప : ‘కడపలో కావలసినన్ని ఖనిజ వనరులున్నాయి. బెరైటీస్ మొదలుకొని ఆస్బెస్టాస్, లైమ్ స్టోన్ లాంటి వాటికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తా....కడపపై నాకెలాంటి వివక్షలేదు. అన్ని జిల్లాలతో సమానంగా చూస్తా....ఇంకా అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తా...పర్యాటక రంగంతోపాటు సాగునీటి వనరులను అందించి ప్రతి ఎకరాకు నీరందించేలా చర్యలు చేపడుతున్నాం.. రానున్న కాలం లో కడపకు పూర్వ వైభవం తీసుకొస్తానని’ తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆదివారం ఖాజీపేటలో జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఆయన ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కడపనుంచి విమాన సర్వీసులు ప్రారంభం కావడం శుభపరిణామమని..పారిశ్రామికవేత్తలు రావడానికి కూడా అవకాశం ఏర్పడిందన్నారు. ప్రత్యేకంగా జిల్లాలోని గాలివీడులో 700 మెగా వాట్ల సోలార్ ప్లాంటును 3200 ఎకరాల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్నామని చెప్పారు. అలాగే తొండూరులో 26 మెగావాట్ల విండ్ పవర్ ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కడప నుంచే హజ్ యాత్రకు వెళ్లేలా చర్యలు ఇంతకమునుపు కడపకు ఉర్దూ యూనివర్సిటీ ప్రకటించా...కొన్ని పరిస్థితుల దృష్ట్యా కర్నూలులో పెట్టాల్సి వచ్చింది. అయితే కడపలో హజ్ హౌస్‌ను నిర్మించి కడప నుంచే పవిత్ర హ జ్‌యాత్రకు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గండికోటకు నీరు తీసుకొస్తాం ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో గండికోటకు నీరు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని, అందుకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసి కృష్ణా జలాలను తీసుకొచ్చి ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ‘నేను రాత్రింబవళ్లు నిద్రపోకుండా పనిచేస్తున్నా....ప్రాజెక్టుల వద్ద నిద్రపోయా...మీరు కూడా చైతన్యవంతులు కావాలి..నీరు-చెట్టులో భాగంగా కుంటలు, చెరువులు, చెక్‌డ్యాములు అన్నిచోట్ల పూడిక తొలగించేందుకు నిధులు ఇస్తున్నాం, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్నమయ్య ఎయిర్‌పోర్టుగా నామకరణం చేస్తాం కడపలో ఉన్న ఎయిర్‌పోర్టు పురాతన చరిత్ర కలిగింది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటీషు వారు యుద్ధ విమానాలకు ఇంధనం నింపుకోవడానికి వినియోగించడంతోపాటు తర్వాత కూడా అప్పుడప్పుడూ వినియోగించేవారు. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం కడప ఎయిర్‌పోర్టును ప్రారంభించామని ముఖ్యమంత్రి తెలిపారు. వెంకటేశ్వరస్వామిపై ఎన్నో కీర్తనలు రచించిన అన్నమయ్య ఎయిర్‌పోర్టుగా నామకరణం చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు చంద్రబాబు ప్రారంభోత్సవాలు చేశారు. బాబు మాట్లాడుతుండగా.....ఇంటిదారి పట్టిన మహిళలు తమ్ముళ్లూ కొద్దిసేపు కూర్చోండి...గంటసేపు కూడా ఓపిగ్గా కూర్చోలేకపోతే నేను ఎలా 24 గంటలు ఎలా కష్టపడాలి...కూర్చోండి తమ్మళ్లూ అంటూ బాబు ప్రసంగంలో విజ్ఞప్తి చేస్తుంటే...మరోవైపు డ్వాక్రా మహిళలు ఇంటిదారి పట్టారు. దీంతో ఏంచేయాలో తోచని కొంత మం ది ‘దేశం’ నేతలు, పోలీసులు కాసేపు కూర్చోండమ్మా అంటూ మహిళలను ప్రాధేయపడ్డారు. అయినా చాలామంది మహిళలు లేచి వెళ్లిపోవడంతో బాబు ప్రసంగ సమయంలో చాలావరకు కుర్చీ లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి సుజనాచౌదరి, మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, కలెక్టర్ కేవీ రమణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, దేశం జిల్లా నేతలు లింగారెడ్డి, పి.రామసుబ్బారెడ్డి, పుత్తా నరసింహారెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, గోవర్దన్‌రెడ్డి, అమీర్‌బాబు, గునిపాటి రామయ్య, వరదరాజులురెడ్డి, విజయమ్మ. విజయజ్యోతి, కస్తూరి విశ్వనాథనాయుడు, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, కుసుమకుమారి, దుర్గాప్రసాద్, బి.రాంగోపాల్రెడ్డితోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. -
రాజధాని నిర్మాణంలో దూసుకెళ్తా!
యజ్ఞానికి ప్రతిపక్షం ఆటంకం కలిగిస్తోంది ♦ గోదావరి-కృష్ణా అనుసంధానం చేసి తీరుతాం ♦ డిసెంబర్ నాటికి ప్రభుత్వ ఆధ్వర్యంలో కేబుల్ ప్రసారాలు ♦ ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సాక్షి ప్రతినిధి, కడప: ‘‘రైతులు స్వచ్ఛందంగా రాజధాని ఏర్పాటుకు భూములిస్తూ సహకరించారు. కానీ రాజధాని అనే యజ్ఞానికి ప్రతిపక్షం ఆటంకం కలిగిస్తోంది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని ఏర్పాటులో దూసుకెళ్తా’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేటలో ఆదివారం జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. రాజధానికోసం 33 వేల ఎకరాల భూమి అవసరంకాగా 21 వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని, మరో 12 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. గోదావరిలో 3 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని, ఆ నీటిని కృష్ణా నదికి తెప్పించే బృహత్తర కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. రాయలసీమలోని మెట్టప్రాంతాలకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీరివ్వాలనే సంకల్పంతో.. ఉన్న అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటున్నామని, అందులో భాగంగానే పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టామని చెప్పుకొచ్చారు. గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులను పూర్తి చేసి కరువు రహిత రాయలసీమగా చేస్తామన్నారు. డిసెంబర్ నాటికి ప్రభుత్వమే కేబుల్ టీవీ సర్వీసులను ఏర్పాటు చేస్తుందన్నారు. రూ.100కే కేబుల్‌టీవీ, ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇదిలా ఉండగా జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సాక్షిగా పసువుమయం చేశారు. సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించాల్సిన ఈ కార్యక్రమానికి సర్పంచ్‌కు ఆహ్వానమే అందలేదు. స్థానిక ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకూ అదే పరిస్థితి. చివరకు మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డికీ ఆహ్వానం అందలేదని సమాచారం. కేంద్రమంత్రి సుజనాచౌదరి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ నిరసన.. : ముఖ్యమంత్రి ప్రసంగం కొనసాగుతుండగా ఒక్కమారుగా సీఎం డౌన్‌డౌన్ అంటూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎన్నికల్లో మాదిగలకిచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సుజనా.. బాబు చర్చల సారాంశమేమిటో.. ఖాజీపేట జన్మభూమి కార్యక్రమ వేదికపై కేంద్రమంత్రి సుజనాచౌదరి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలాసేపు గుసగుసలాడుకున్నారు. ఓ వైపు సభ జరుగుతుండగా.. మరోవైపు సుజనా చౌదరి ఫోన్లో బిజీగా గడిపారు. ఫోన్ మాట్లాడటం ముగియగానే నేరుగా చంద్రబాబు వద్దకొచ్చి ఆయన విషయం వివరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. వీరిద్దరూ ఏదో ముఖ్యమైన అంశంపై చర్చిస్తున్నారనే భావన అందరిలో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం వీరు హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలవడం గమనార్హం. కడప విమానాశ్రయం ప్రారంభం ⇒ ‘అన్నమయ్య’ పేరును సిఫార్సు చేస్తామన్న సీఎం కడప విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రారంభించారు. బెంగళూరు నుంచి ఉదయం 11.22 గంటలకు తొలిసారి ఎయిర్ పెగాసెస్ విమానం కడపకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ ప్రధాని మోదీ పాలన అమోఘమంటూ పొగడ్తలతో ముంచెత్తారు. కడప విమానాశ్రయానికి అన్నమయ్య పేరు పెట్టాలని ప్రతిపాదనలు వచ్చాయని, ఆ మేరకు కేంద్రానికి సిఫార్సు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఏపీలోని తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి కృతనిశ్చయంతో ఉన్నామని, ట్రీపుల్ ఐటీ, ఐఐటీ, ఐఈఎస్ఆర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. హిందూపురంలో రూ.500 కోట్లతో సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ అకాడమీ ఏర్పాటు చేశామని, రక్షణశాఖ విభాగాల తయారీ కేంద్రాన్ని సీమలోనే ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. కడపలో విమానాశ్రయంతోపాటు విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చామని, వాటిని నిలుపుకోవడం మీచేతుల్లోనే ఉందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు అన్నారు. కడప విమానాశ్రయానికి తొలిసారిగా ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి వచ్చిన ఎయిర్ పెగాసెస్ విమానం -
ఎయిర్‌పోర్ట్‌కు తాళ్లపాక అన్నమయ్య పేరు !
కడప: కడప ఎయిర్‌పోర్ట్‌కు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య పేరు పరిశీలనలో ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు. ఆదివారం కడపలో ఎయిర్‌పోర్ట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా కడప - బెంగళూరు విమాన సర్వీసును చంద్రబాబు ప్రారంభించారు. అయితే అంతకుముందు విమానాశ్రయంలోకి బీజేపీ నేతలు, కార్యకర్తలు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల జోక్యంతో బీజేపీ నేతలు సద్దుమణిగారు. -
ఎయిర్‌పోర్టు ఎదుట బీజేపీ నేతల ధర్నా
వైఎస్సార్ జిల్లా : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం వైఎస్సార్ జిల్లా కడప ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో బీజేపీ నేతలను ఎయిర్‌పోర్టులోకి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఆదివారం ఉదయం కడప ఎయిర్‌పోర్టుకు వచ్చిన సీఎంను కలవడానికి బీజేపీ జిల్లా నేతలు వెళ్లగా.. వారిని లోపలికి అనుమతించకపోవడంతో బీజేపీ నాయకులు ఎయిర్‌పోర్టు ఎదుట ధర్నాకు దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. -
కడపలో ప్రారంభంకానున్న విమానాశ్రయం
-
రయ్.. య్.. య్..
రేపు ఉదయం 11.30 గంటలకు ల్యాండ్ కానున్న తొలి విమానం కడప-బెంగుళూరు మధ్య సర్వీస్ ప్రారంభోత్సవానికి సీఎం,కేంద్ర మంత్రుల రాక నెలలో కడప-హైదరాబాద్ మధ్య కొత్త సర్వీస్ కడప సెవెన్‌రోడ్స్ : దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కల ఎట్టకేలకు సాకారం కాబోతోంది. ఆదివారం కడప విమానాశ్రయం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నిర్మల సీతారామన్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి వై.సుజనా చౌదరిలు హాజరవుతున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎయిర్ పెగాసెస్ సంస్థకు చెందిన విమానం ఆదివారం ఉదయం 10.40 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి 11.30 గంటలకు కడప విమానాశ్రయంలో ల్యాండ్ కానుంది. ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత ఈ తొలి విమాన సర్వీసు 11.50 గంటలకు కడపలో టేకాఫ్ తీసుకుని 12.35 గంటలకు బెంగుళూరుకు చేరుకుంటుంది. టిక్కెట్లు అవసరమైన వారు ఎయిర్ పెగాసెస్ వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి. ఇప్పటికే పలువురు తమ టికెట్లను రిజర్వు చేసుకున్నారు. కడప నుంచి బెంగుళూరుకు టిక్కెట్ ధర రూ.1234 ఉంటుందని విమాన సంస్థ ప్రతినిధులు ప్రకటించినప్పటికీ డిమాండును బట్టి టిక్కెట్ ధరలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ప్రయాణీకుల రద్దీ పెరిగే కొద్ది ట్రిప్పులు పెంచే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. నెల రోజుల్లో హైదరాబాదు-కడప మధ్య కొత్త విమాన సర్వీసు కూడా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్టణం తర్వాత ఐదవదిగా కడప విమానాశ్రయం ప్రారంభమవుతోంది. 1939-45 మధ్య రెండవ ప్రపంచ యుద్ద కాలంలో విమానాలకు ఫ్యూయల్ నింపుకోవడానికి కడపలో ఎయిరోడ్రమ్ ఏర్పాటు చేశారు. అయితే స్వాతంత్య్రం అనంతరం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. విమానాలు, హెలికాఫ్టర్లకు ఫ్యూయల్ నింపుకోవడానికి, ఎవరైనా ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు జిల్లా పర్యటనలకు వచ్చినపుడు ఇక్కడ దిగేందుకు మాత్రమే ఎయిరోడ్రమ్ వినియోగించుకునే వారు. ఆ సందర్భాల్లో మినహా ఇక్కడ జనసంచారం కూడా ఉండేది కాదు. 2004లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. పలు విద్యా సంస్థలు, పరిశ్రమలతోపాటు మౌలిక సదపాయాల కల్పన జరిగింది. పరిశ్రమల స్థాపనకు వీలుగా ఇప్పుడున్న ఎయిర్‌పోర్టు సమీపంలో సుమారు ఏడు వేల ఎకరాల భూమిని సేకరించి ఏపీఐఐసీ మెగా ఇండస్ట్రియల్ పార్కును అప్పట్లో ఏర్పాటు చేశారు. వస్త్ర వ్యాపార దిగ్గజం బ్రాండిక్స్, ఓ ప్రైవేటు స్టీల్ కంపెనీతోపాటు కొన్ని ఐటీ కంపెనీలు కడపలో తమ యూనిట్లు నెలకొల్పేందుకు ఆసక్తి చూపాయి. ఒక ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే విమానాశ్రయం ముఖ్య భూమిక పోషిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కడప విమానాశ్రయ అభివృద్ధికి నడుం బిగించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)-రాష్ట్ర ప్రభుత్వం మధ్య మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ) జరిగింది. ఎయిర్‌పోర్టు అభివృద్ధికి అవసరమైన భూమి, నీరు, విద్యుత్, రహదారులు, నెట్ కనెక్టివిటీ, సెక్యూరిటీ వంటి కనీస వసతులను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చాలన్నది ఎంఓయూలోని సారాంశం. దీంతో వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. అప్పటికే ఎయిర్‌పోర్టుకు ఉన్న స్థలానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 287.69 ఎకరాల భూమిని సేకరించి ఏపీఐఐసీ ద్వారా ఏఏఐకి అప్పగించారు. తొలుత 34 కోట్ల రూపాయలు అవసరమవుతుందని భావించినా అన్నీ పూర్తయ్యేసరికి ఈ వ్యయం రూ.42 కోట్లకు చేరింది. ఎయిర్ పోర్టు తొలి దశలో రన్‌వేని ఆరు వేల అడుగులతో విస్తరింపజేశారు. కడప విమానాశ్రయ పరిధిలోని 1060 ఎకరాల చుట్టూ 12 కిలోమీటర్ల మేర ప్రహరీ ఏర్పాటు చేశారు. 2010లో రెండవ దశ కింద ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) భవనం, టెర్మినల్, ఇంటర్నల్ రోడ్లను ఏర్పాటు చేశారు. 2012 జూన్ నాటికే ఎయిర్‌పోర్టు ప్రారంభానికి అవసరమైన అన్ని హంగులు సమకూరాయి. అయితే, చిన్నచిన్న కారణాలు చూపెడుతూ ప్రారంభోత్సవం వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఆదివారం ఈ విమానాశ్రయం ప్రారంభం కాబోతోంది. -
7న కడప విమానాశ్రయం ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో మరో విమానాశ్రయం రాకపోకలకు సిద్ధమైంది. ఈ నెల 7న కడప విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నట్టు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి ఆ శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవనున్నారు. బెంగళూరు నుంచి బయల్దేరే తొలి విమానం ఉదయం 11.30 గంటలకు ఈ విమానాశ్రయంలో దిగనుంది. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాలకు పౌర విమానయాన సేవల్ని అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఎయిర్‌పోర్టు అథారిటీ.. ఈ ఎయిర్ పోర్టును రూ. 42 కోట్లతో అభివృద్ధి చేసింది. ఏటీఆర్-72 కేటగిరీ విమానాల రాకపోకలకు వీలుగా రన్‌వేని నిర్మించారు. ప్రయాణికుల వృద్ధిని బట్టి దీనిని ఏ-320 తరహా విమానాల రాకపోకలకు వీలుగా దీనిని నవీకరిస్తారు. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి నగరాల్లోని ఎయిర్‌పోర్టులు సేవలు అందిస్తుండగా వీటి సరసన తాజాగా కడప నగరం చేరనుంది. 2008లో తొలివిడత పనులకు శ్రీకారం... కడప విమానాశ్రయాన్ని అధునాతన సౌకర్యాలతో నెలకొల్పేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో శ్రీకారం చుట్టారు. తొలుత రూ. 34 కోట్లు అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు. 2008 జూన్‌లో తొలివిడత పనులకు శ్రీకారం చుట్టారు. 1,060 ఎకరాల పరిధిలో రక్షణ గోడ, 6 వేల అడుగుల రన్‌వే తొలివిడతలో పూర్తి చేశారు. 2010 అక్టోబర్ 10న రూ. 13 కోట్లతో రెండవ విడత పనులు చేపట్టారు. 2012 జూన్‌కు పనులన్నీ పూర్తి అయ్యాయి. కారణమేమిటో తెలియదుకాని కిరణ్ సర్కార్, అనంతరం చంద్రబాబు ప్రభుత్వం పలుమార్లు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఎట్టకేలకు ఈ ప్రాంతవాసుల కల నెరవేరనుంది. -
కడప ఎయిర్‌పోర్టుకు కొత్త సమస్య
-
రెడీ
కడప కలెక్టరేట్ : కడప ఎయిర్‌పోర్టు ప్రారంభానికి అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. జిల్లా యంత్రాంగం ప్రోటోకాల్ జాబితా కూడా సిద్ధం చేసింది. తొలుత ఈనెల 2వ తేదీన ఎయిర్‌పోర్టును ప్రారంభించాలని భావించారు. అయితే ముఖ్యమంత్రి, పౌర విమానయాన మంత్రి బిజీగా ఉండడం వల్ల ముహూర్తం కుదరలేదు. ఈనెల 7 లేదా 10వ తేదీన వారు వచ్చేందుకు వీలుందని సమాచారం. ముహూర్తం ఎప్పుడు ఖరారైనా సిద్ధంగా ఉండాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంఓయూ మేరకు అవసరమైన ఇంటర్నల్ రోడ్లు, విద్యుత్, నీరు, సెక్యూరిటీ, అగ్నిమాపక యంత్రాలు వంటి సౌకర్యాలను కల్పించారు. స్పైస్ జెట్, ఎయిర్ కోస్టాకు చెందిన విమానాలు కడపలో దిగే అవకాశం ఉందంటున్నారు. ఇందుకు ఆ సంస్థలు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఎయిర్ ఇండియా కూడా విమానాలు నడిపేందుకు ఇటీ వలే సర్వే కూడా నిర్వహించిందని అంటున్నారు. ఏటీఆర్ రకం విమానాలు కడప ఎయిర్‌పోర్టులో కాలిడనున్నాయి. ఇందులో 70 మంది ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది.కడప మీదుగా ముంబయి నుంచి చెన్నై, హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు విమానాల రాకపోకలకు అవకాశం ఏర్పడుతుంది. రోజుకు రెండుసార్లు విమానాలు నడుస్తాయని అంటున్నారు. వివిధ వ్యాపారులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు,ఇతర ఉన్నత స్థాయి వర్గాలు నిత్యం బెంగుళూరు, చెన్నై, హైదరాబాదు వంటి నగరాలకు వెళుతుంటారు వారు విమాన సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారని అంచనా వేస్తున్నారు. ప్రయాణీకుల సమస్య ఉత్పన్నం కాదని అధికారుల విశ్లేషణ. భవిష్యత్తులో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పనుంది. కడప సమీపంలోని మెగా ఇండస్ట్రియల్ పార్కులోనే ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. భవిష్యత్తులో అభివృద్ది ప్రాజెక్టులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. వీటనన్నింటికీ ఎయిర్‌పోర్టు కీలకం కానుంది. ఎట్టకేలకు జిల్లా వాసుల చిరకాల వాంఛ అయిన ఎయిర్‌పోర్టు అతి త్వరలోనే ప్రారంభం కానుంది.