వైఎస్సార్ జిల్లా : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం వైఎస్సార్ జిల్లా కడప ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో బీజేపీ నేతలను ఎయిర్‌పోర్టులోకి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఆదివారం ఉదయం కడప ఎయిర్‌పోర్టుకు వచ్చిన సీఎంను కలవడానికి బీజేపీ జిల్లా నేతలు వెళ్లగా.. వారిని లోపలికి అనుమతించకపోవడంతో బీజేపీ నాయకులు ఎయిర్‌పోర్టు ఎదుట ధర్నాకు దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.