సాక్షి, వల్లూరు(కడప) : మండల పరిధిలోని కడప ఎయిర్ పోర్ట్ ఆవరణంలో యువకుడు కుమార్ బోయ (19) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా డోన్ పట్టణ పరిధిలోని చానుగొండ్ల గ్రామానికి చెందిన కుమార్ బోయ గత కొంత కాలంగా తమ గ్రామస్తులతో కలసి ఎయిర్ పోర్ట్‌లో కాంక్రీట్ పనులు చేస్తున్నాడు. ఆదివారం కాంక్రీట్ కలిపేందుకు వినియోగించే ఇసుక జల్లెడ పై పడుకున్నాడు. అయితే ఇసుక లోడుతో వచ్చిన టిప్పర్ డ్రైవర్ ఇసుకను జల్లెడ పై అన్‌లోడ్ చేశాడు.
నిద్రలో ఉన్న కుమార్‌పై ఇసుక ఒక్కసారిగా మీద పడటంతో ఊపిరి ఆడక మృతి చెందాడు. కొద్ది సేపు తర్వాత సహచరులు కుమార్ కనిపించలేదని వెతక సాగారు. అయితే అక్కడే ఉన్న ఒక బాలుడు జల్లెడ పై పడుకొని ఉండటం తాను చూశానని చెప్పాడు. దీంతో ఇసుక తొలగించి చూడగా కుమార్ బోయ విగత జీవిగా పడి ఉన్నాడు. మృతుని సహచరుడు రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వల్లూరు ఎస్‌ఐ మధు మల్లేశ్వర్ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment