
సాక్షి, కడప: ఎన్నికల వేళ జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అభిమానులు కొండంత అండగా నిలుస్తున్నారు. నీకు మేమున్నామంటూ రాజన్న బిడ్డకు తోడుగా వస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన వైఎస్ జగన్‌ను కడప విమానాశ్రయంలో లింగాల మండలం పెద్ద కూడలకు చెందిన అనిల్ అనే అభిమాని కలిశారు. 5 లక్షల రూపాయల చెక్కును అందించి అభిమానం చాటుకున్నారు.
ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాను ఇచ్చిన విరాళం చాలా చిన్నదని చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పేదల కష్టాల తీరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని, దుర్మార్గపు చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం తథ్యమని పేర్కొన్నారు. కాగా, విశాఖపట్నం జిల్లా నర్సిపట్నం నుంచి ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ జగన్ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment