సాక్షి కడప : కడప ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆ దివారం కడప ఎయిర్‌పోర్టు మీదుగా మరో సర్వీసు ప్రారంభమైంది. బెల్గాం నుంచి ఉదయం 9.40 కి బయలుదేరిన విమానం సరిగ్గా 11.10 గంటల ప్రాంతంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. మొదటి విడతలో భాగంగా వచ్చిన ప్రయాణికులందరికి ఎయిర్‌పోర్టు అధికారులు సంస్థ ఆధ్వర్యంలో స్వీట్లు, రోజా పూలు అందించి ఘన స్వాగతం పలికారు. తొలుత కడప నుంచి విమానం హైదరాబాదుకు బయలుదేరి వెళ్లింది.
ఆ తర్వాత తిరిగి కడపకు వచ్చి బెల్గాం బయలుదేరి వెళ్లింది. బెల్గాం నుంచి çకడపకు వస్తున్న సమయంలో విమానంలో 50 మంది ప్రయాణికులు ఉండగా.. కడప నుంచి బెల్గాంకు వెళుతున్న సమయంలో దాదాపు 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి 2017లో విమాన సర్వీసులు ప్రారంభం కాగా.. ఇది నాలుగవ సరీ్వసు. ఉడాన్ స్కీమ్ ద్వారా ప్రసుత్తం ఈ సరీ్వసులు నడుస్తున్నాయి. సరీ్వసు ప్రాం¿ోత్సవం సందర్భంగా ఎయిర్‌పోర్టు డైరెక్టర్ పూసర్ల శివప్రసాద్, ట్రూజెట్ సంస్థ మేనేజర్ భవ్యన్‌కుమార్ ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు.
విమానం రాకపోకల వివరాలు
► బెల్గాం నుంచి కడపకు బయలుదేరు సమయం - ఉదయం 09.40
► కడపకు చేరుకునే సమయం - ఉదయం 11.10
► కడప నుంచి హైదరాబాదుకు బయలుదేరు సమయం-ఉదయం 11.30
► హైదరాబాదు చేరుకునే సమయం-మధ్యాహ్నం 12.45
► హైదరాబాదు నుంచి కడపకు బయలుదేరు సమయం-మధ్యాహ్నం 03.05
► కడపకు చేరుకునే సమయం-సాయంత్రం 04.10
► కడప నుంచి బెల్గాంకు బయలుదేరే సమయం-సాయంత్రం 04.30
► బెల్గాంకు చేరుకునే సమయం-సాయంత్రం 06.00
Comments
Please login to add a commentAdd a comment