Belgaum
-
కళ్లు చెదిరే విన్యాసం.. సచిన్ టెండూల్కర్‌ను సైతం ముగ్ధుడిని చేసింది
బెల్గామ్‌లో (కర్ణాటక) జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్‌కి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియోలో కిరణ్ తర్లేకర్ అనే స్థానిక క్రికెటర్ బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన విన్యాసం చేసి, సహచరుడు క్యాచ్ పట్టేందుకు తోడ్పడతాడు. వివరాల్లోకి వెళితే.. బెల్గామ్‌లో స్థానికంగా ఓ క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో బ్యాటర్ భారీ షాట్ కోసం ప్రత్నించి క్యాచ్ ఔట్ అవుతాడు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టుకునే క్రమంలో తర్లేకర్ అనే ప్లేయర్ అద్భుతమైన విన్యాసాన్ని చేశాడు. This video of a cricket match in Belgaum is going viral. Watch Kiran Tarlekar's catch. Sachin Tendulkar said that the player who took this casual catch must know football for sure. Even former England captain, Michael Vaughan has retweeted this video and captioned it as… pic.twitter.com/tvtuZjGenb — Alok Jain ⚡ (@WeekendInvestng) October 30, 2023 సిక్సర్‌గా వెళ్లే బంతిని గాల్లోకి నెట్టి ఫుట్‌బాల్ తరహాలో షాట్ కొట్టి సహచరుడు క్యాచ్ పట్టుకునేలా చేశాడు. ఈ తంతుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలైంది. తర్లేకర్ విన్యాసాన్ని చూసి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సైతం ముగ్దుడయ్యాడు. ఈ క్యాచ్ పట్టిన ఆటగాడికి ఫుట్ బాల్ కచ్చితంగా తెలిసి ఉండాలని కామెంట్ చేశాడు. ఇదే వీడియోను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సైతం రీట్వీట్ చేస్తూ.. గ్రేటెస్ట్ క్యాచ్ ఆఫ్ ఆల్ టైమ్ అని క్యాప్షన్ ఇచ్చాడు. -
మళ్లీ సరిహద్దు రగడ
బెంగళూరు/ముంబై/బెళగావి: మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం మరోసారి ఉద్రిక్తంగా మారుతోంది. బెళగావి నగరంలో మంగళవారం ఇరు రాష్ట్రాల అనుకూలవాదులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వాహనాలపై పరస్పరం దాడులకు దిగారు. ఇరువర్గాలను పోలీసులు అదుపులోకితీసుకున్నారు. మహారాష్ట్ర మంత్రులు, నేతలు తలపెట్టిన బెళగావి పర్యటనను నిరసిస్తూ కన్నడ సంఘాల సభ్యులు రోడ్లపైకి వచ్చారు. ప్లకార్డులు, బ్యానర్లు, పోస్టర్లు, కన్నడ జెండాలను ప్రదర్శిస్తూ మహారాష్ట్రకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెళగావిలో మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నెంబర్‌తో తిరుగుతున్న వాహనాలను అడ్డుకున్నారు. వాటి నెంబర్ ప్లేట్లపై నల్లరంగు పూశారు. కన్నడ సంఘాల నిరసనల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నగరంలో కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని ‘కర్ణాటక రక్షణ వేదిక’ ప్రకటించింది. మహారాష్ట్ర మంత్రులు చంద్రకాంత్ పాటిల్, శంభూరాజ్ దేశాయ్ మంగళవారం బెళగావిలో పర్యటించి, మహారాష్ట్ర ఏకీకరణ సమితి సభ్యులకు మద్దతు పలకాలని నిర్ణయించుకున్నారు. కొన్ని కారణాలతో వారి పర్యటన వాయిదా పడింది. శివసేన నాయకులు కూడా బెళగావి పర్యటించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. బెళగావి జిల్లా కలెక్టర్ నగరంలో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని పుణేలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం శివసేన కార్యకర్తలు కర్ణాటక వాహనాలపై రంగు చల్లారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. కన్నడిగుల ప్రయోజనాలు కాపాడుతాం: సీఎం బొమ్మై మహారాష్ట్ర, కర్ణాటక ప్రజల మధ్య ఉన్న సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయొద్దని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కోరారు. కన్నడిగులు ఎక్కడున్నా సరే వారి ప్రయోజాలను రక్షించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. సరిహద్దు వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, న్యాయ పోరాటంలో తామే నెగ్గుతామని ధీమా వ్యక్తం చేశారు. 24 గంటల్లోగా దాడులు ఆపాలి: పవార్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై కారణమని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ ఆరోపించారు. మహారాష్ట్ర సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోకి ప్రవేశించే వాహనాలపై దాడులను 24 గంటల్లోగా ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో శాంతిభద్రతలు దిగజారాయని, ఇందుకు కేంద్రం, కర్ణాటక ప్రభుత్వం బాధ్యత వహించాలని తేల్చిచెప్పారు. తమ ఓపికకు కూడా ఓ హద్దు ఉంటుందని వ్యాఖ్యానించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నా కేంద్రం, మహారాష్ట్ర సర్కారు నోరుమెదపడం లేదని పవార్ మండిపడ్డారు. బెళగావిలో మహారాష్ట్ర ఏకీకరణ సమితి కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆక్షేపించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో శాంతి భద్రతలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, బసవరాజ బొమ్మై నిర్ణయించుకున్నారు. ఇరువురు నేతలు మంగళవారం రాత్రి ఫోన్‌ద్వారా మాట్లాడుకున్నారు. సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించుకున్నారు. ఏమిటీ వివాదం? రెండు రాష్ట్రాల నడుమ సరిహద్దు వివాదం 1957 నుంచి కొనసాగుతోంది. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న బెళగావితోపాటు మరాఠా భాష మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్న 814 గ్రామాలు స్వాతంత్య్రం కంటే ముందు అప్పటి బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. బెళగావి నగరాన్ని, 814 గ్రామాలను కర్ణాటకలో 1957లో విలీనం చేశారు. కానీ, అవి తమవేనని మహారాష్ట్ర వాదిస్తోంది. వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. బెళగావి తమ రాష్ట్రంలో అంతర్భాగమని కర్ణాటక వాదిస్తోంది. అంతేకాదు అక్కడ బెంగళూరులోని విధాన సౌధను పోలిన సువర్ణ విధాన సౌధను నిర్మించింది. ఏడాదికోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోంది. -
పెళ్లి ఊరేగింపులో కన్నడ పాటలు, జెండాలు.. దాడి
బెళగావి: కర్ణాటక బెళగావిలో కన్నడ పాటలు పెట్టినందుకు వధూవరులపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలైనట్లు సమాచారం. మహారాష్ట్ర ఏకీకరణ సమితి కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. దమానే గ్రామంలో రేష్మ-సాయిబన్వర్‌ల వివాహం జరిగింది. పెళ్లి ఊరేగింపులో కన్నడ పాటలను ప్రదర్శించడంతో పాటు కన్నడ జెండాలతో డ్యాన్సులు చేశారు కొందరు. దీంతో చన్నమ్మనగర్‌కు చెందిన ఎంఈఎస్ కార్యకర్తలు కొందరు ఊరేగింపుపై దాడికి పాల్పడ్డారు. ఐదుగురు యువకులను తీవ్రంగా గాయపరిచారు. గాయపడ్డ వాళ్లను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి.. పది మంది ఎంఈఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. -
చూ మంతర్‌కాళి.. కరోనా పో: బీజేపీ ఎమ్మెల్యే పూజలు
బెంగళూరు: మహమ్మారి కరోనా వైరస్‌పై ఇంకా మూఢ నమ్మకాలు పోవడం లేదు. స్వయంగా ప్రజాప్రతినిధులే ఆ పూజలు ఈ పూజలు చేయండి.. కరోనా పోతుందని ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే అగ్నిహోత్ర హోమం చేపట్టారు. ఆ హోం చేయడం వరకు మంచిదే కానీ.. ఆ తర్వాత ధూపం పేరిట ఊరంతా పొగ పెట్టాడు. సామ్రాణి వేస్తూ స్వయంగా ఆ ఎమ్మెల్యే రిక్షా బండి తోలుకుంటూ వెళ్లాడు. కర్నాటకలోని బెళగావి దక్షిణ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ మంగళవారం పూజలు చేశాడు. కొబ్బరి, నెయ్యి, బియ్యం ఇతర మూలికలు వేసి అగ్నిహోత్ర హోమం చేశాడు. అనంతరం ఒక రిక్షా బండిలో కూడా ఆ పదార్థాలన్నీ వేసి నిప్పు పెట్టాడు. పొగ వస్తుండడంతో ఆ రిక్షా బండిని తన అనుచరులతో కలిసి గుంపుగా బెళగావి పట్టణంలో తిరిగాడు. ఆ పొగ పీలిస్తే కరోనా పోతుందని ఎమ్మెల్యే అభయ్ పాటిల్ తెలిపాడు. అయితే అతడి చర్యను ప్రతిపక్ష పార్టీలు తప్పుబట్టాయి. మూఢనమ్మకాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా తన అనుచరులతో తిరుగుతూ నిబంధనలు ఉల్లంఘించారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఆక్సిజన్ అందక 13 మంది మృతి
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆక్సిజన్ కొరత ఎందరి ప్రాణాలనో బలితీసుకుంటోంది. తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా ప్రభుత్వాస్పత్రి కరోనా వార్డులో ఆక్సిజన్ కొరతతో ముగ్గురు మహిళలు సహా 13 మంది రోగులు మంగళవారం అర్ధరాత్రి మరణించారు. ఆస్పత్రి నిర్వహణ తీరును నిరసిస్తూ బుధవారం వైద్యసిబ్బంది ఆందోళనకు దిగారు. చెంగల్పట్టు జిల్లాలో 500 పడకలతో కరోనా ప్రత్యేకవార్డును ప్రారంభించి చికిత్స అందిస్తున్నారు. వీటిల్లో ఆక్సిజన్ వసతి ఉన్న 380 పడకలున్నాయి. మంగళవారం రాత్రి పదిన్నర తర్వాత అకస్మాత్తుగా ఆక్సిజన్ సరఫరా మందగించడంతో రోగులు ఊపిరాడక విలవిలలాడటం మొదలైంది. ఆక్సిజన్‌పై ఆధారపడి చికిత్స పొందుతున్న రోగుల్లో గంటలోగా ఐదు మంది ప్రాణాలు వదిలారు. మరికొందరు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో ఆందోళన చెందిన వైద్య సిబ్బంది సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రి, మరైమలైనగర్‌లోని ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలోగా అర్దరాత్రి సమయానికి ఊపిరాడక మొత్తం 13 మంది ప్రాణాలు విడిచారు. వీరిలో 12 మంది కరోనా నుంచి కోలుకున్నవారు, ఒకరు పాజిటీవ్ నిర్దారణైన వ్యక్తిగా తెలుస్తోంది. కర్ణాటకలో నలుగురు మృతి సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఆక్సిజన్ అందక కరోనా రోగుల మరణాలు పెరిగిపోతున్నాయి. కొత్తగా మరో నలుగురు కరోనా రోగులు మృతి చెందారు. బెళగావి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బిమ్స్ ఆస్పత్రిలో బుధవారం ఉదయం ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో మూడు గంటల వ్యవధిలోనే నలుగురు చనిపోయారు. ఇటీవల చామరాజనగర జిల్లా ఆస్పత్రిలో 24 మంది కరోనా బాధితులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వెంటిలేటర్లు, బెడ్లు లభించక ప్రాణాలు కోల్పోయారని మృతుల బంధువులు ఆస్పత్రి ముందు కన్నీరు మున్నీరయ్యారు. రోగులకు సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. టోకెన్ల ప్రకారం ఆక్సిజన్ ఇస్తామని చెప్పారని, దీంతో సీరియస్‌గా ఉన్న రోగులకు తక్షణం ఆక్సిజన్ అందక ప్రాణపాయం వస్తోందని తెలిపారు. ఉత్తరాఖండ్‌లో ఐదుగురు కరోనా బాధితులు మృతి డెహ్రాడూన్/హరిద్వార్: ఆక్సిజన్ కొరత కారణంగానే కాదు, సరఫరాలో అంతరాయం వల్ల కూడా కోవిడ్–19 బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ జిల్లా రూర్కీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం వల్ల ఐదుగురు బాధితులు కన్నుమూశారు. వీరిలో ఒక మహిళ ఉన్నారు. బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 30 నిమిషాల పాటు ప్రాణవాయువు సరఫరా నిలిచిపోవడం వల్లే వారు మృతి చెందినట్లు తెలిసింది. తెల్లవారుజామున 1.30 గంటల నుంచి 2 గంటల దాకా ఆక్సిజన్ సరఫరా కాలేదని సదరు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడొకరు చెప్పారు. చనిపోయిన ఐదుగురు కరోనా బాధితుల్లో ఒకరు వెంటలేటర్‌పై, నలుగురు ఆక్సిజన్ పడకలపై ఉన్నట్లు తెలిపారు. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి ఐదుగురు కరోనా బాధితులు మరణించడం పట్ల హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ సి.రవిశంకర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
బెళగావి లోక్‌సభ సీటు బీజేపీ కైవసం
న్యూఢిల్లీ: కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోని 3 లోక్‌సభ స్థానాలు, 10 రాష్ట్రాల్లోని 12 అసెంబ్లీ సీట్లకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. కర్ణాటకలో బెళగావి లోక్‌సభ స్థానంలో దివంగత కేంద్రమంత్రి సురేష్ అంగడి భార్య, బీజేపీ అభ్యర్థి అయిన మంగళ విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ స్థానాన్ని వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి గెలిచారు. కేరళలో మళప్పురం లోక్‌సభ స్థానాన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థి అయిన అబ్దుస్సమాద్ సమాదాని గెలిచారు. తమిళనాడులోని కన్యాకుమారి లోక్‌సభ స్థానంలో బీజేపీ నేత పొన్ రాధాకృష్ణన్ కంటే కాంగ్రెస్ నేత విజయ్ వసంత్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక, కర్ణాటకలోని బసవకళ్యాణ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి శరణు సలగర గెలిచారు. మస్కిలో కాంగ్రెస్ అభ్యర్థి బసవనగౌడ తురివనహాల్ గెలిచారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ 2 చోట్ల, మరో చోట బీజేపీ గెలిచాయి. గుజరాత్లో మర్వా హదాప్ స్థానంలో బీజేపీ నేత నిమిషా సత్తార్ గెలుపొందారు. ఉత్తరాఖండ్‌లోని సాల్ట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మహేష్ గెలిచారు. తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ నేత నోముల భగత్ గెలిచారు. జార్ఖండ్‌లోని మధుపూర్‌లో జేఎఎం అభ్యర్థి హఫీజుల్ విజయం సాధించారు. -
విమానం దిగింది.. ఎగిరింది..!
సాక్షి కడప : కడప ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆ దివారం కడప ఎయిర్‌పోర్టు మీదుగా మరో సర్వీసు ప్రారంభమైంది. బెల్గాం నుంచి ఉదయం 9.40 కి బయలుదేరిన విమానం సరిగ్గా 11.10 గంటల ప్రాంతంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. మొదటి విడతలో భాగంగా వచ్చిన ప్రయాణికులందరికి ఎయిర్‌పోర్టు అధికారులు సంస్థ ఆధ్వర్యంలో స్వీట్లు, రోజా పూలు అందించి ఘన స్వాగతం పలికారు. తొలుత కడప నుంచి విమానం హైదరాబాదుకు బయలుదేరి వెళ్లింది. ఆ తర్వాత తిరిగి కడపకు వచ్చి బెల్గాం బయలుదేరి వెళ్లింది. బెల్గాం నుంచి çకడపకు వస్తున్న సమయంలో విమానంలో 50 మంది ప్రయాణికులు ఉండగా.. కడప నుంచి బెల్గాంకు వెళుతున్న సమయంలో దాదాపు 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి 2017లో విమాన సర్వీసులు ప్రారంభం కాగా.. ఇది నాలుగవ సరీ్వసు. ఉడాన్ స్కీమ్ ద్వారా ప్రసుత్తం ఈ సరీ్వసులు నడుస్తున్నాయి. సరీ్వసు ప్రాం¿ోత్సవం సందర్భంగా ఎయిర్‌పోర్టు డైరెక్టర్ పూసర్ల శివప్రసాద్, ట్రూజెట్ సంస్థ మేనేజర్ భవ్యన్‌కుమార్ ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు. విమానం రాకపోకల వివరాలు ► బెల్గాం నుంచి కడపకు బయలుదేరు సమయం - ఉదయం 09.40 ► కడపకు చేరుకునే సమయం - ఉదయం 11.10 ► కడప నుంచి హైదరాబాదుకు బయలుదేరు సమయం-ఉదయం 11.30 ► హైదరాబాదు చేరుకునే సమయం-మధ్యాహ్నం 12.45 ► హైదరాబాదు నుంచి కడపకు బయలుదేరు సమయం-మధ్యాహ్నం 03.05 ► కడపకు చేరుకునే సమయం-సాయంత్రం 04.10 ► కడప నుంచి బెల్గాంకు బయలుదేరే సమయం-సాయంత్రం 04.30 ► బెల్గాంకు చేరుకునే సమయం-సాయంత్రం 06.00 -
ఇంటి పైకప్పుపై మొసలి.. వైరల్ వీడియో!
బెంగళూరు: వర్షాలు పడుతున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో నదుల్లో, చెరువుల్లో, కాలువల్లో నివసించే ప్రమాదకరమైన జలచరాలు మనుషుల మధ్యకు వచ్చి హల్చల్ చేస్తున్నాయి. మొన్నామధ్య వడోదర నగరంలోని వీధుల్లో మొసళ్లు యధేచ్ఛగా విహరించిన సంగతి తెలిసిందే. వీధుల్లో తిష్టవేసిన మొసళ్లను తరలించడానికి అధికారులు అష్టకష్టాలు పడ్డారు. ఇక, ఓ వీధిలోని నీటిలో తిష్టవేసిన మొసలి.. అక్కడే తచ్చాడుతున్న కుక్కుపై అమాంతం దాడిచేయబోయింది. కుక్కు చివరినిమిషంలో అప్రమత్తమై తప్పుకోవడంతో ప్రాణాలతో మిగిలింది. వడోదరలో జరిగిన ఈ ఘటన తాలుకు వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా వర్షాలతో అతాలకుతం అవుతున్న కర్ణాటకలోని బెలగావ్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలకు బెలగావ్‌లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వీధులే కాదు ఇళ్లు సైతం వరదనీటికి మునిగిపోయాయి. దీంతో ఓ మొసలి ఇంటిపైకప్పు మీదకు చేరింది. బెలగావ్‌లోని రాయ్‌బాగ్ తాలూకులో ఈ ఘటన చోటుచేసుకుంది. సిమెంటు రెకులతో కట్టిన ఇంటి పైకప్పు మీదకు చేరిన మొసలి నోరు తెరుచుకొని కాలక్షేపం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటిపైకప్పు వరకు చేరిన వరదనీళ్లను ఈ వీడియోలో చూడొచ్చు. చదవండి: మెల్లగా అనుసరిస్తూ.. మెరుపుదాడి..అంతలోనే! -
రన్నరప్ భారత్
తౌరంగ (న్యూజిలాండ్): టైటిల్ పోరులో భారత హాకీ జట్టు పోరాడి ఓడింది. బెల్జియంతో ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో టీమిండియా 1–2 గోల్స్‌తో ఓడిపోయింది. దీంతో నాలుగు దేశాల ఇన్విటేషనల్ తొలి అంచె టోర్నీలో భారత్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. భారత్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను మన్దీప్ సింగ్ 19వ నిమిషంలో సాధించగా... టామ్ బూన్ (4వ ని.),డాకియెర్ (36వ ని.) చెరో గోల్ చేసి బెల్జియంను గెలిపించారు. నాలుగో నిమిషంలోనే బెల్జియం సఫలమైంది. బూన్ చేసిన గోల్‌తో 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత రెండో క్వార్టర్లో భారత్‌కు మన్దీప్ గోల్ సాధించిపెట్టాడు. దీంతో 1–1తో స్కోరు సమమైంది. అయితే మూడో క్వార్టర్ మొదలైన ఆరు నిమిషాలకే డాకియెర్ చేసిన గోల్‌తో మళ్లీ బెల్జియం ఆధిక్యంలోకి వెళ్లి దానిని నిలబెట్టుకుంది. రెండో అంచె టోర్నీ ఈనెల 24న మొదలవుతుంది. -
ప్రియుడు కాదు.. కిరాతకుడు
యువతిపై మిత్రుడితో కలసి అత్యాచారం.. హత్య కర్ణాటకలోని బెళగావి వద్ద దారుణం ఇద్దరు మహారాష్ట్ర యువకుల అరెస్ట్ సాక్షి, బనశంకరి (బెంగళూరు): ప్రేమించిన యువతిపైనే స్నేహితుడితో కలసి అత్యాచారం చేశాడు ఓ ప్రియుడు. ఆ తర్వాత ఇద్దరూ కలసి యువతిని దారుణంగా హతమార్చారు. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలోని బెళగావిలో బుధవారం చోటుచేసుకుంది. హత్యకు గురైన యువతి, నిందితులు మహారాష్ట్రకు చెందిన వారుగా గుర్తించారు. నాగపూర్‌కు చెందిన 22 ఏళ్ల ప్రీతి రెండేళ్లుగా ముంబైలోని ఒక కాల్ సెంటర్లో పనిచేస్తోంది. అదే నగరానికి చెందిన యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. మంగళవారం ఆ యువతిని రత్నగిరి విహారయాత్రకు అనిచెప్పి తీసుకువచ్చి అక్కడ ఓ లాడ్జిలో దిగారు. అదే రోజు రాత్రి ప్రియుడు తన స్నేహితుడితో కలసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని బయటపెడుతుందేమోనని ఇద్దరూ కలసి ఆ అభాగ్యురాలిని కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. తర్వాత యువతి మృతదేహాన్ని బ్యాగులో కుక్కి కారులో బెళగావికి తీసుకువచ్చారు. రాణి కిత్తూరు చెన్నమ్మ వర్సిటీ వద్ద ఉన్న వంతెన కింద పడేసి నిందితులు రత్నగిరికి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం వారిద్దరూ తిరిగి ముంబైకి ట్యాక్సీలో బయల్దేరారు. మద్యం మత్తులో కారు డ్రైవర్‌కు అమ్మాయిని హత్య చేశామని చెప్పారు. భయబ్రాంతులకు గురైన కారుడ్రైవర్ రత్నగిరి పోలీస్‌స్టేషన్‌లో వీరిపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతరం కాగతి ఏరియా పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కర్ణాటక–మహారాష్ట్ర పోలీసులు సంయుక్తంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
చిచ్చు రేపిన ఎర్రబస్సు
- డ్రైవర్, కండక్టర్లపై దేశద్రోహం కేసులు నమోదు - ‘జై మహారాష్ట్ర’ నినాదంతో బెల్గాంకు ఎంఎస్ ఆర్టీసీ బస్సు - కర్ణాటక సర్కారు ఆగ్రహం.. తీవ్ర చర్యలకు ఆదేశం - డ్రైవర్, కండక్టర్ సహా 16 మందిపై తీవ్ర అభియోగాలు - ‘బెల్గం విభజన’పై ఇరురాష్ట్రల మధ్య ఉద్రిక్తత బెల్గాం/ముంబై: ‘ఎర్రబస్సు’ రాజేసిన చిచ్చు రెండు రాష్ట్రాల నడుమ ఉద్రిక్తతకు దారితీసింది. ‘జై మహారాష్ట్ర’ అనే నినాదం రాసిఉన్న మహారాష్ట్ర ఆర్టీసీ బస్సును కర్ణాటక పోలీసులు బెల్గాంలో అడ్డుకున్నారు. డ్రైవర్, కండక్టర్లతోపాటు బస్సుకు స్వాగతం పలికిన ‘మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి’ కార్యకర్తలను అరెస్ట్‌చేసిన కర్ణాటక పోలీసులు.. వారిపై దేశద్రోహం చట్టం కింద కేసులు నమోదుచేశారు. శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనపై శివసేన ఘాటుగా స్పందించింది. కర్ణాటక ప్రభుత్వానిది మతితప్పిన చర్యగా అభివర్ణించింది. ఇటు కర్ణాటక మంత్రి రోషన్ బేగ్.. కన్నడ గడ్డపై మరాఠా అనుకూల నినాదాలు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని తీవ్ర హెచ్చరికలు చేశారు. ఏమిటీ వివాదం?: మహారాష్ట్ర సరిహద్దులోని బెల్గాం జిల్లాలో అత్యధికులు మరాఠీనే మాట్లాడతారు. కర్ణాటకలోని ఈ జిల్లాను విభజించి మహారాష్ట్రలో కలపాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. అయితే ఆ డిమాండ్‌కు ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. కాగా, మహారాష్ట్రలో బీజేపీ- శివసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వివాదానికి మళ్లీ జీవంపోశారు. ముంబై నుంచి బెల్గాంకు వెళ్లే మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులపై ‘జై మహారాష్ట్ర’ నినాదాలు రాయించారు. ఇది కర్ణాటక ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ఇటు బెల్గాం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ‘మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి’ సంస్థ.. ‘జై మహారాష్ట్ర’ బస్సులకు స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. బస్సు కర్ణాటక భూభాగంలోకి ప్రవేశించిన వెంటనే పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని 16 మందిపై దేశద్రోహం కేసులు నమోదుచేశారు. కేంద్రం జోక్యం చేసుకోవాలి: సరిహద్దులోని బెల్గాం జిల్లాను మహారాష్ట్రలో కలిపేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని శివసేన పార్టీ ప్రతినిధి నీలమ్ గోర్హే డిమాండ్ చేశారు. తమ రాష్ట్రానికి చెందిన బస్సు డ్రైవర్, కండక్టర్లపై దేశద్రోహం కేసులు పెట్టడం దారుణమని ఆమె కర్ణాటకపై మండిపడ్డారు. వివాదాల నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తక్షణమే బెల్గాం ప్రాంతంలో పర్యటించాలని శివసేన పార్టీ అధికార పత్రిక సామ్నా కోరింది. మహారాష్ట్రకు జై కొడితే చర్యలు: బెల్గాం సహా సరిహద్దులోని ఏ జిల్లాలోనైనా ‘జై మహారాష్ట్ర’ నినాదాలు చేసేవారిని ఉపేక్షించబోమని కర్ణాటక మంత్రి రోషన్ బేగ్ హెచ్చరించారు. ప్రజాప్రతినిధులుకానీ, ప్రభుత్వాధికారులుకానీ నినాదాలు చేసినట్లైతే పదవులు, ఉద్యోగాల నుంచి తొలిగిస్తామని బేగ్ అన్నారు. ఈ మేరకు కఠిన చట్టం ఒకటి రూపొందించనున్నట్లు తెలిపారు. -
చిన్ను అంటే కావేరికి ప్రాణం.. అందుకే..?
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని బెళగావి జిల్లా జుంజర్వాడిలో బోరు బావిలో పడి మరణించిన కావేరి (6) కోసం తల్లిదండ్రులు, బంధువులు తల్లడిల్లుతుంటే, చిన్నారి పెంచిన శునకం (చిన్ను) కూడా రోదిస్తూ విశ్వాసాన్ని చూపుతోంది. శనివారం సాయంత్రం బాలిక బోరుబావిలో పడగా, సోమవారం అర్ధరాత్రి బాలిక మృతదేహాన్ని వెలికితీయడం తెలిసిందే. మంగళవారం ఉదయం గ్రామ సమీపంలో కావేరీని ఖననం చేయగా, చిన్నారి పెంచుకున్న కుక్క బాలిక సమాధి స్థలం చుట్టూ తిరుగుతూ అరుస్తోంది. ఖననం తరువాత అందరూ వెళ్ళిపోగా, చిన్ను మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు సమాధి వద్దే ఉంది. సమాధిపై ఉన్న మట్టిని కాళ్లతో తీయడం, అరడం చేస్తోంది. కొంతసేపు అటుఇటు తచ్చాడి మళ్లీ సమాధి వద్దకే వస్తుంది. మూగజీవి ప్రేమను చూసిన ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు. కావేరి బోరు బావిలో పడినప్పటి నుంచి బయటికి తీసే వరకు మూడ్రోజుల పాటు చిన్ను అక్కడే ఉంది. అక్కడ వేల సంఖ్యలో గుమిగూడిన ప్రజలు కుక్కను రాళ్లతో కొట్టినా వెళ్లలేదు. చిన్ను అంటే కావేరికి ప్రాణమని, ఏడాది కిందట చిన్న పిల్లగా ఉన్న చిన్నును చేరదీసి పెంచిందని చిన్నారి మామ మహాదేవ తెలిపారు. -
అయ్యో... భయపడినట్టుగానే జరిగింది
కర్ణాటకలో బోరు బావిలో పడిన చిన్నారి కావేరి మృతి బోరు బావిలో నుంచి మృతదేహం వెలికితీత బళ్లారి: భయపడినంత అయింది. చిన్నారి కావేరి చనిపోయింది. మూడు రోజులుగా చేసిన ప్రయత్నాలు ఆమెను కాపాడలేకపోయాయి. కర్ణాటకలోని బెళగావి జిల్లా అథణి తాలూకా జుంజరవాడిలో బోరు బావిలో పడిన ఆరేళ్ల చిన్నారి కావేరి మృతి చెందింది. చిన్నారిని ప్రాణాలతో కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు ఫలించలేదు. ఆమె మృతదేహాన్ని మంగళవారం తెల్లవారుజామున వెలికితీశారు. ఆడుకుంటూ ఈ నెల 22న నిరుపయోగంగా ఉన్న బోరు బావిలో కావేరి పడిపోయింది. 30 అడుగుల లోతులో చిక్కకుపోయిన ఆమెను ప్రాణాలతో రక్షించేందుకు జిల్లా యంత్రాంగం, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా శ్రమించారు. భారీ పొక్లెయినర్లతో బోర్‌కు సమాంతరంగా తవ్వారు. దాదాపు మూడు రోజుల నుంచి మంచి నీరు లేకపోవడం, తీవ్రమైన ఎండల వల్ల పాప చనిపోయింవుంటని భావిస్తున్నారు. చిన్నారి బోరులో పడిపోయినప్పటి నుంచి తల్లిదండ్రులు తిండి తిప్పల్లేకుండా గడిపారు. తల్లి సవిత నీరసించడంతో ఆస్పత్రిలో చేర్చారు. బోరు బావిని తవ్వి మూసివేయకుండా వదిలేసిన రైతు శంకర్ పరారీలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణమైన భూమి యజమాని, బోర్వెల్ కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. -
అస్త్రశస్త్రాలతో సిద్ధం
21 నుంచి బెల్గాంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సమస్యలపై ప్రశ్నలు సంధించనున్న విపక్షాలు దీటుగా ఎదుర్కోవడానికి సహచరులకు సీఎం దిశానిర్దేశం బెంగళూరు : రెండో రాజధాని బెల్గాంలో ఈసారి శీతాకాల శాసనసభ సమావేశాలు వాడీ వేడిగా జరుగనున్నారుు. అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి విపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారుు. అరుుతే వీటిని దీటుగా ఎదుర్కొడానికి సిద్ధంగా ఉండాలని సీఎం సిద్ధరామయ్య తన సహరులకు ఇప్పటికే దిశ నిర్దేశం చేశారు. ఈనెల 21 నుంచి డిసెంబర్ 2 వరకూ బెళగావిలోని సువర్ణ సౌధలో శీతాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరుసగా కరువు కాటకాల్లో మునిగిపోరుున రైతులను ఆదుకోవడంలో సిద్ధరామయ్య ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ రైతు సంఘం నాయకులు సమావేశాల మొదటి రోజు సువర్ణసౌధ ముట్టడికి ఇప్పటికే పిలుపునిచ్చారు. చెరకు బకారుుల సత్వరం చెల్లించడంతో పాటు ఎకరాకు రూ. 15 వేలు నష్టపరిహారం, ఇక సహకార రుణాలు మాఫీ చేయాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు బీజేపీ, జేడీఎస్ నాయకులు కూడా మద్దతు ప్రకటించారు. సమావేశాల మొదటి రోజును సభను స్తంభింప చేయాలని విపక్షాలు ఏకతాటిపైకి వచ్చారుు. అరుుతే కరువు తాలూకాలుగా ప్రకటించిన ప్రాంతాల్లో రుణాలు రద్దు చేసి కొంత వరకు రైతు సంఘం నాయకులు శాంతింప చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇక కావేరి వివాదంపై చర్చించడానికి రెండుసార్లు ప్రత్యేక శాసనసభ సమావేశాలను జరిపిన సిద్ధరామయ్య ప్రభుత్వం మహదారుు వివాదం పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి చెందిన నాయకులు విమర్శిస్తున్నారు. ఈ విషయమై ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆ ప్రాంతానికి చెందిన విపక్ష నేతలు భావిస్తున్నారు. ఇక వేసవి మొదలు కాకుండానే తాగునీటి సమస్యలు, విద్యుత్ కోతలు ఉత్పన్న మవుతున్న విషయానికి సంబంధిం విపక్షాలు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడానికి అవసరమైన గణాంకాలను సేకరిస్తున్నారుు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలపై... ఇక రాష్ట్రంలో శాంతిభద్రత విషయంపై కూడా విపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలతో బీజేపీ శ్రేణులు మండిపోతున్నారు. ఈ విషయంపై బహిరంగంగానే సిద్ధు సర్కార్‌పై బీజేపీ ఎంపీ శోభాకరంద్లాజే వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. ఇక మంత్రి తన్వీర్ వ్యవహారం, ఎంఈఎస్ ప్రాబల్యం ఉన్న బెల్గాంలో ఈ సారి శీతాకాల సమావేశాలు అధికార పార్టీకి చెమటలు పట్టిస్తాయనడంలో సందేహం లేదు. -
బెల్గాం మనదే..
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాక్షి, బెంగళూరు/మైసూరు : కర్ణాటకలో బెల్గాం అంతర్భాగమేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. మహాజన్ నివేదికను అనుసరించి బెల్గాం ఎప్పటికీ కర్ణాటకలోనే ఉంటుందన్నారు. మైసూరులో స్థానిక మీడియా ప్రతినిధులతో ఆయన ఆదివారం మాట్లాడారు. ఈ విషయంలో మహారాష్ట్ర అనవసర రాద్ధాంతం చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఉత్తర కర్ణాటక ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలని మాజీ మంత్రి ఉమేష్‌కత్తి పేర్కొనడాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తప్పుపట్టారు. అఖండ కర్ణాటక ప్రతి ఒక్క కన్నడిగుడి కల అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణాటకను విభజించే ప్రసక్తే లేదన్నారు. స్థానిక సంస్థలతోపాటు వివిధ బోర్డులు, కార్పొరేషన్లలో 50 శాతం పోస్టులు మహిళలకు కేటాయించాలనేది తనతోపాటు తమ పార్టీ అభిమతమన్నారు. ఈ విషయంలో గవర్నర్ వజూభాయ్ రుడాభాయ్ వాలా సలహా తీసుకుంటామని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై నేడు (సోమవారం) బెంగళూరులో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పరమేశ్వర్ కూడా పాల్గొననున్నారని తెలిపారు. పరమేశ్వర్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వకూడదని తాను పార్టీ హై కమాండ్‌కు లేఖ రాశానన్నది ఆధార రహితమని అసహనం వ్యక్తం చేశారు. ఉత్తరకర్ణాటక ప్రాంతంలో ఏర్పడిన అతివృష్టి వల్ల నష్టపోయిన రైతులను, ప్రజలను ఆదుకునేందుకు రూ.426 కోట్ల పరిహారాన్ని అందించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాశానన్నారు. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పడిన కరువు పరిస్థితులపై కేంద్రానికి మరో నివేదిక పంపించనున్నట్లు చెప్పారు. దసరా ఉత్సవాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోబోదన్నారు. ఈ విషయంలో మైసూరు జిల్లా అధికారులతోపాటు ఉత్సవాల నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీదే అంతిమ నిర్ణయమని సిద్ధరామయ్య పేర్కొన్నారు. -
సరిహద్దు వివాదం..
ముంబై: మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ శివసేన మండిపడింది. మహారాష్ట్ర రాజకీయ పార్టీల వల్లే ఈ అంశం తీవ్రరూపం దాల్చుతోందని కన్నడ సీఎం విమర్శించారు. రామయ్య మాటలకు ధీటుగా బదులు చెప్పాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను మంగళవారం డిమాండ్ చేసింది. బెల్గాం వివాదంపై సిద్ధరామయ్య మాట్లాడుతూ.. సరిహద్దు గురించి మహారాష్ట్రతో ఎలాంటి వివాదమూ లేదని, మహాజన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఈ సమస్యను పరిష్కరించుకుంటామని అన్నారు. దీనిపై సేన అభ్యంతరం వ్యక్తం చేసింది. సరిహద్దు వివాదానికి మహాజన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం ఒక్కటే మార్గమని రామయ్య స్పష్టీకరించారు. ముఖ్యమంత్రి లేదా కనీసం ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్ అయినా ఈ విషయంలో రామయ్యకు ధీటైన బదులు చెప్పాలని సేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయం అభిప్రాయపడింది. బెల్గాం వివాద పరిష్కారానికి మహాజన్ కమిటీ ఒక్కటే పరిష్కారం చూపలేదని వ్యాఖ్యానించింది. స్వార్థప్రయోజనాల కోసం మహారాష్ట్ర నాయకులు బెల్గాం వివాదం సద్దుమణగకుండా చూస్తున్నారని రామయ్య విమర్శించారు. కర్ణాటక సరిహద్దు పట్టణం బెల్గాంలో ఇబ్బందిపడుతున్న 20 లక్షల మంది మరాఠీల గురించి మాట్లాడడం తప్పెలా అవుతుందని సామ్నా నిలదీసింది. కర్ణాటక అధికారులు మరాఠీలపై అనుచితంగా వ్యవహరిస్తున్నారు కాబట్టే ఈ సమస్య కొనసాగుతూనే ఉందని ఆరోపించింది. ‘ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్న మరాఠీ ప్రజలకు రామయ్య కృతజ్ఞతలు చెప్పాలి’ అని పేర్కొంది. బెల్గాం యెల్లూర్ గ్రామంలో మహారాష్ట్రకు అనుకూలంగా ఒక ఉన్న సైన్‌బోర్డు తొలగింపుపై గత నెల హింస చెలరేగింది. దీనిపై చవాన్ రామయ్యతో ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనను సేన తీవ్రంగా ఖండించింది. ఇది కన్నడిగుల ఉగ్రవాదమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భగవత్ వ్యాఖ్యలకు ఉద్ధవ్ సమర్థన భారత్ హిందూదేశమన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యాఖ్యలను శివసేన అధిపతి ఉద్ధవ్‌ఠాక్రే సమర్థించారు. ఆయన మాటల్లో తప్పేమీ లేదని స్పష్టీకరించారు. బాల్‌ఠాక్రే కూడా ఎన్నోసార్లు ఈ విషయం చెప్పారని, దీనిపై తమ వైఖరి మారబోదని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ప్రస్తుతం భారత్‌లో నివసిస్తున్న వారంతా హిందూ సంస్కృతి నుంచి వచ్చినవారేనని కూడా భగవత్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. ప్రణాళికాసంఘం రద్దు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విమర్శించడానికి కూడా ఉద్ధవ్ తప్పుబట్టారు. ఆ సంఘంతో ఒరిగేది ఏమీ లేదని స్పష్టం చేశారు. ‘సంఘం రద్దుపై చవాన్ అసంతృప్తితో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇన్నేళ్లలో ప్రణాళికాసంఘం ప్రజలకు చేసిన మేలేంటో ఆయన తెలియజేయాలి’ అని అన్నారు. కాశ్మీరీ వేర్పాటువాద నేతతో ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయం చర్చలు జరపడంపై మాట్లాడుతూ ఇక నుంచైనా ప్రభుత్వం పాకిస్థాన్‌తో కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. పాక్ హైకమిషన్ చర్యకు నిరసనగా ప్రస్తుతం జరుగుతున్న ఇరు దేశాల విదేశీ కార్యదర్శుల సమావేశాలను రద్దు చేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. -
యళ్లూరు చలో భగ్నం
ఎక్కడికక్కడ కరవే కార్యకర్తల అరెస్ట్ ఎంఈఎస్ ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి బెల్గాం జిల్లాలో నిషేధాజ్ఞలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెల్గాం జిల్లా యళ్లూరులో మహారాష్ట్ర శిలా ఫలకాలన్ని ఆవిష్కరించినందుకు మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఈఎస్)ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక రక్షణా వేదిక (కరవే) ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన యళ్లూరు చలో ఆందోళనను పోలీసులు భగ్నం చేశారు. బెల్గాంలోకి ప్రవేశించే అన్ని వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు కరవే కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి బెల్గాంకు దారి తీసే మార్గాలన్నిటిలో పోలీసులు శుక్రవారం రాత్రి నుంచే నాకాబందీని నిర్వహించారు. బెంగళూరు నుంచి నాలుగు వాహనాల్లో బెల్గాంకు బయలుదేరిన 45 మంది కరవే కార్యకర్తలను అర్ధరాత్రి సమయంలో రాణిబెన్నూరు వద్ద అరెస్టు చేశారు. వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కరవే అధ్యక్షుడు నారాయణ గౌడను హుబ్లీ సమీపంలో పుణె-బెంగళూరు రహదారిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా గౌడ మాట్లాడుతూ యళ్లూరులో కన్నడ పతాకాన్ని ఆవిష్కరించడానికి తమకు ఎవరి అనుమతీ అవసరం లేదని తెలిపారు. కర్ణాటకలో ప్రజా ప్రభుత్వం ఉన్నదా లేక బ్రిటిషర్ల పాలన సాగుతోందా...అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు. మరో వైపు హుబ్లీ సమీపంలోని పాలికొప్ప క్రాస్ వద్ద కరవే కార్యకర్తలు ఓ బస్సుపై రాళ్లు రువ్వారు. బెల్గాం తాలూకా కార్యాలయం ప్రాంగణంలో ఎంఈఎస్ ఎమ్మెల్యే కార్యాలయంపై ఐదుగురు కరవే కార్యకర్తలు దాడి చేశారు. కాగా జిల్లాలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నందున యళ్లూరు చలోకు అవకాశం ఇవ్వలేదని బెల్గాం ఎస్పీ డాక్టర్ చంద్ర గుప్త తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ఆందోళనలు చేయడం సరికాదని హితవు పలికారు. స్థానిక ప్రజలు శాంతియుతంగా జీవించడానికి అవకాశం కల్పించాలని ఆయన కోరారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయూలు
బెలగాం, న్యూస్‌లైన్ : రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానిక ఏరియా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన పాలవలస గంగయ్య రజక వృత్తి చేస్తున్నాడు. ఉతికిన దుస్తులు పార్వతీపురం తీసుకెళ్లి, తిరిగి రిక్షాలో స్వగ్రామం బయల్దేరాడు. మార్గమధ్యంలో పద్మపేరాంటాలు గుడి దాటిన తరువాత వెనుక నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్న అదే గ్రామానికి చెందిన నగిరెడ్డి పోలినాయుడు, ఈదుబిల్లి లకు్ష్మనాయుడు ఢీకొన్నా రు. దీంతో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యూరుు. దీనిని గమనించిన స్థానికులు వారిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్సను అందించారు. పోలినాయుడు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖ తరలించారు. -
పోలియో నిర్మూలనకు సహకరించాలి
బెలగాం, న్యూస్‌లైన్:పోలియో నిర్మూలనకు ప్రజలు సహకరించాలని వ్యాధి నిరోధక, టీకాల జిల్లా అధికారి డాక్టర్ ఎం. కిశోర్‌కుమార్ కోరారు. గురువారం స్థానిక ఏరియా ఆస్పత్రిలో పార్వతీపురం డివిజన్లో గల ‘పల్స్‌పోలియో’ రూట్ సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనెల 19న బూత్కేంద్రాల వద్ద 20, 21తేదీలలో ఇంటింటికీ వెళ్లి 0-5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. రెండు లక్షల 22 వేల మంది చిన్నారులకు చుక్కల మందు జిల్లా వ్యాప్తంగా 2,22,572 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతి ఒక్క చిన్నారికీ చుక్కల మందు వేయాలని, ఈ విషయంలో ప్రజలు కూడా సిబ్బందికి సహకరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 1600 బూత్‌లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే 160 మంది సూపర్వైజర్లు, రూట్ ఆఫీసర్లు, గ్రామాల్లో 3,200 బృందాలు, మెడికల్ ఆఫీసర్లతో 66 మొబైల్ టీమ్‌లు, మెడికల్, విద్యాశాఖ, ఐసీడీఎస్, ఆశ, తదితర విభాగాల నుంచి 6,400 మంది సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతంలో 38,832 మంది పిల్లలు లక్ష్యం కాగా 497 బూత్‌లు 994 టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో సీహెచ్ఎన్సీ ఎస్పీహెచ్ఓ డాక్టర్ ఎం.నారాయణ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చొక్కాపు రామారావు, హెల్త్ ఎడ్యుకేటర్ ఎ.లక్ష్మణమూర్తి, ఆరోగ్య పర్యవేక్షకులు ఎన్. కృష్ణమోహన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
మారకపోతే.. మీ ఖర్మ
మంత్రులపై సీఎం అసహనం * మీ పని తీరుపై అధిష్టానానికి నివేదిక ఇచ్చా * ఇకనైనా పని తీరు మార్చుకోండి *లేకుంటే.. జరగబోయే పరిణామాలకు నేను బాధ్యుడ్ని కాను * నా మాటలను పెడచెవిన పెడుతున్నారు * ఎమ్మెల్యేల ఫిర్యాదులనూ పట్టించుకోవడం లేదు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర మంత్రుల తీరుపై ఎమ్మెల్యేలు చేస్తున్న ఫిర్యాదులపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎట్టకేలకు స్పందించారు. బెల్గాంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశంలో ఆయన మంత్రుల ఎదుటే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. పని తీరును మార్చుకోక పోతే మున్ముందు చోటు చేసుకునే పరిణామాలకు తనను బాధ్యుని చేయవద్దని కోరారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మీ పని తీరుపై నివేదిక సమర్పించానన్నారు. మారండి, మారండంటూ ఎంతగా మొత్తుకున్నా వినిపించుకోడం లేదని అసహనం వ్యక్తం చేశారు. బెంగళూరులో ఉన్నప్పుడు వారంలో కనీసం మూడు రోజులు విధాన సౌధకు వచ్చి, అధికారులతో చర్చించాలన్న తన సూచనలను సైతం పెడచెవిన పెట్టారని నిష్టూరమాడారు. జిల్లా పర్యటనలకు వెళ్లినప్పుడు పార్టీ కార్యాలయాలకు వెళ్లాలని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కార్యకర్తల సమస్యలపై స్పందించడం లేదు, కేపీసీసీ కార్యాలయానికీ వెళ్లడం లేదు అంటూ ఆయన మంత్రుల వైఫల్యాల చిట్టాను విప్పారు. ఎమ్మెల్యేలు ఫోన్ చేసినప్పుడు మంత్రులు స్పందించడం లేదని, దీనిపై ఫిర్యాదులు వచ్చినా తీరు మారడం లేదని నిష్టూరమాడారు. ఇదే వైఖరి కొనసాగితే మున్ముందు ఏమవుతుందో తాను చెప్పలేనని హెచ్చరించారు. అంతకు ముందు పలువురు ఎమ్మెల్యేలు మంత్రుల పని తీరును తప్పుబట్టారు. తమను విశ్వాసంలోకి తీసుకుని నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులపై స్పందించాలని కోరారు. ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలని సూచించారు. కనీసం రెండు నెలలకోసారి సీఎల్పీ సమావేశాలను నిర్వహించి, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకోవాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. -
సిద్ధరామయ్య నియంత: యడ్యూరప్ప
బెల్గాం: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మాజీ సీఎం, కేజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిద్ధరామయ్య నియంత అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని ఆయన నియంతలా పాలిస్తున్నారని విమర్శించారు. ఒంటెత్తు పోకడతో వ్యహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, మంత్రులను అభిప్రాయాలు తెలుసుకోకుండానే పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. సొంత పార్టీని కూడా సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని వెల్లడించారు. షాదీ భాగ్య యోజన లాంటి పథకాలు ఇలాగే ప్రవేశపెట్టారని ఆరోపించారు. షాదీ భాగ్య యోజన పథకాన్ని అన్ని వర్గాలకు విస్తరించాలంటూ బెల్గాంలోని సువర్ణ సౌధలో వరుసగా రెండో రోజూ యడ్యూరప్ప ఆందోళన కొనసాగించారు. -
సభోత్సాహం
= బెల్గాంలో అసెంబ్లీ సమావేశాలు = ఉభయ సభల్లో సందడే సందడి = ముఖ్యమంత్రి, మంత్రులకు మేళ తాళాలతో స్వాగతం = భారతరత్న సచిన్, రావుకు తొలుత అభినందనలు = ఇక ఏడాదిలో రెండు సార్లు బెల్గాంలో ‘అసెంబ్లీ’ = ‘షాదీ భాగ్య’ను విస్తరించాలంటూ కేజేపీ డిమాండ్ = వాయిదా తీర్మానానికి అనుమతించని స్పీకర్ = యడ్డి ఆగ్రహం .. కాగితాలు విసిరి నిరసన = పోడియం వద్ద బైఠాయింపు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెల్గాంను మహారాష్ట్రలో విలీనం చేయాలంటూ మహారాష్ర్ట ఏకీకరణ సమితి (ఎంఈఎస్) పదే పదే చేస్తున్న రచ్చకు సమాధానంగా ఏడాదిలో ఓ సారి అక్కడ శాసన సమావేశాలను నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా సోమవారం శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. నాలుగో సారి ఈ సమావేశాలు జరుగుతున్నాయి. అక్కడ సమావేశాలను నిర్వహించే విషయమై పాలక, ప్రతిపక్షాలు ఎప్పుడో ఏక తాటిపైకి వచ్చాయి. ఇకమీదట ఏడాదిలో రెండు సార్లు బెల్గాంలో సమావేశాలను నిర్వహిస్తామని స్పీకర్ కాగోడు తిమ్మప్ప ప్రకటించారు. అధికార పక్షంలో ఉంటూ తొలి సారి ఈ సమావేశాల్లో పాల్గొనడం కాంగ్రెస్‌కు కొత్త అనుభవం. ఎర్ర తివాచీ స్వాగతం ముఖ్యమంత్రి, ఆయన మంత్రి వర్గ సహచరులకు మేళ తాళాలతో ఎర్ర తివాచీ స్వాగతం లభించింది. శాసన మండలిలో వందేమాతరం గీతం ఆలాపనతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలు తొలుత భారత రత్న పురస్కార విజేతలు ప్రొఫెసర్ సీఎన్ఆర్. రావు, సచిన్ టెండూల్కర్‌లకు అభినందనలు తెలిపాయి. శాసన సభలో స్పీకర్ కాగోడు తిమ్మప్ప అభినందన తీర్మానాన్ని చదవగానే సభ్యులు బల్లలు చరిచి ఆమోదం తెలిపారు. దీనిపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రతిపక్ష నాయకుడు హెచ్డీ. కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రులు జగదీశ్ శెట్టర్, యడ్యూరప్ప పాల్గొన్నారు. అనంతరం ఇటీవల మరణించిన కన్నడ చిత్ర దర్శకుడు డీ. రాజేంద్ర బాబు, అమర గాయకుడు మన్నాడేలకు సభ శ్రద్ధాంజలి ఘటించింది. నిమిషం పాటు సభ్యులు మౌనం పాటించారు. యడ్యూరప్ప ధర్నా షాదీ భాగ్యను అన్ని వర్గాలకు విస్తరించాలని డిమాండ్ చేస్తూ ఇక్కడి ఫ్రీడం పార్కులో నిరవధిక ధర్నా నిర్వహించిన కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప వేదికను బెల్గాంకు మార్చారు. దీనిపై వాయిదా తీర్మానాన్ని అనుతించాలని ఆయన కోరినప్పుడు స్పీకర్ తిరస్కరించారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప పోడియం వద్దకు దూసుకు వచ్చి ఆయనతో వాగ్వాదానికి దిగారు. స్పీకర్ హెచ్చరికలతో తన స్థానానికి తిరిగి వచ్చి, ప్రసంగిస్తూ ఆవేశానికి లోనై టేబుల్‌పై ఉన్న కాగితాలను విసిరి కొట్టారు. అనంతరం పోడియం వద్ద ధర్నాకు ఉపక్రమించారు. ఎంఈఎస్ ఆర్భాటం బెల్గాంలో శాసన సభ సమావేశాలు జరిగే ప్రతి సారీ ఎంఈఎస్ సభ్యుల ఆర్భాటం మామూలై పోయింది. ఆ పార్టీకి కేవలం ఇద్దరే సభ్యులున్నారు. ఇదే సందర్భంలో బెల్గాంలో ఎంఈఎస్ నిర్వహించ తలపెట్టిన మహా మేళాకు అనుమతినివ్వడంపై నిరసన వ్యక్తం చేస్తూ కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తలు ధర్నా నిర్వహించినప్పుడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు రాళ్లు విసరడంతో పోలీసులు లాఠీలను ఝుళిపించాల్సి వచ్చింది. చెన్నమ్మ సర్కిల్లో కార్యకర్తలు ఎంఈఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే సందర్భంలో శాసన సభ సమావేశాల్లో పాల్గొనడానికి వెళుతున్న ఎంఈఎస్ ఎమ్మెల్యేల వాహనాలపై ఎవరో రాళ్లు రువ్వారు. వెంటనే పోలీసులు లాఠీ ఛార్జి చేయడంతో ఆందోళనకారులు చెల్లాచెదురయ్యారు. దీనిపై ఎంఈఎస్ ఎమ్మెల్యేలు శాసన సభలో నిరసన వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే ప్రసంగం అనంతరం జరిగిన మహా మేళానుద్దేశించి ఎంఈఎస్ ఎమ్మెల్యే సంభాజి పాటిల్ మాట్లాడుతూ తమపై చేయి పడితే ఏం జరుగుతుందో తెలుసా అంటూ రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. తనతో పాటు తన సహచర ఎమ్మెల్యేపై చెయ్యి పడితే తెగి కింద పడుతుందని హెచ్చరించారు. తానిప్పుడే బెంగళూరుకు వెళతానని, ఏం జరుగుతుందో చూస్తానని సవాల్ విసిరారు. -
కర్ణాటకలో ఘెర రోడ్డు ప్రమాదం
-
భారీఎత్తున సమైక్య సభకు...
బెలగాం, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం పార్వతీపురంలో ఉద్ధృతంగా కొనసాగుగోంది. ఉద్యమంలో భాగంగా ఏపీఎన్జీఓ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని అన్ని బస్సులకు, ప్రధాన రహదారిలో వెళ్తున్న వాహనాలకు, రైల్వేస్టేషన్లో ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని రైళ్లకు విభజన వద్దు- సమైక్యాంధ్రే ముద్దు అంటూ స్టిక్టర్లను జేఏసీ నాయకులు, సభ్యులు అతికించారు. జై సమైక్యాంధ్ర అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించడం సాంకేతికంగా సాధ్యం కాదనే విషయాన్ని అందరూ గుర్తించారని, ప్రభుత్వంలోని పెద్దలు కూడా బలపరుస్తున్నారన్నారు. విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తే ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు గంజి లక్ష్మీనాయుడు, కార్యదర్శి జి.వీఆర్ఎస్ కిశోర్, నాయకులు కత్తిర నర్సింగరావు, మండల సత్తిబాబు, ఆర్ఎస్రావు తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న న్యాయవాదుల దీక్షసమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదులు విధులను బహిష్కరించి కోర్టు జంక్షన్ వద్ద శుక్రవారం దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖపట్నంలో శనివారం జరిగే న్యాయవాదుల జేఏసీ సమావేశంలో తీసుకునే నిర్ణయం ప్రకారం కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీపీ పీ. రాజేంద్ర, న్యాయవాదులు జి. వెంకట్రావు, ఎస్. ప్రభాకరరావు, పివి క్రిష్ణారావు, గొర్లి రమణ, గిరీష్‌కుమార్‌మారో, జి. విజయశంకర్, తదితరులు పాల్గొన్నారు. -
బావిలో పడి యువకుడి మృతి
బెలగాం, న్యూస్‌లైన్ : బావిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానిక వై.కె.ఎం. కాలనీకి చెందిన టి.దుర్గాప్రసాద్(32) మూడేళ్ల క్రితం బీఈడీ పూర్తి చేశాడు. ఏడాది కాలం నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. విశాఖ, విజయనగరం తదితర ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఎప్పటిలానే కాలకృత్యాల కోసం గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. శుక్రవారం ఉదయం వై.కె.ఎం కాలనీకి ఆనుకుని ఉన్న నేల బావిలో దుర్గాప్రసాద్ విగతజీవై తేలడాన్ని కొంతమంది గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అందిన ఫిర్యాదు మేరకు పార్వతీపురం టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్సై బి.లక్ష్మణరావు సంఘటన స్థలానికి చేరుకుని, పరిశీలించారు. మృతదేహాన్ని బయటకు తీయించి, పోస్టుమార్టానికి తరలించారు. అయితే దుర్గాప్రసాద్ ప్రమాదవశాత్తు జారిపడిపోయాడా, ఇంకేదైనా కారణం ఉందా అన్నది తెలియరాలేదు. ఆదుకుంటాడనుకుంటే... బీఈడీ చదివి ప్రయోజకుడై పెద్ద దిక్కుగా ఉండి కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్నామని, ఇంతలోనే విధి ఇలా చేసిందని మృతుడు దుర్గాప్రసాద్ తండ్రి పకీరు నాయుడు, తల్లి లక్ష్మి, అన్నదముల్ము సతీష్, గౌరి భోరుమన్నారు. పేద కుటుంబం కావడంతో దుర్గాప్రసాద్ తండ్రి పకీరునాయుడు స్థానిక ఏరియా ఆస్పత్రిలో జంక్షన్లో తోపుడుబండి పెట్టి టీ, ఫలహారాలను అమ్ముతూ జీవనం సాగించేవారు. దుర్గాప్రసాద్ అతనికి చేదోడువాదోడుగా ఉండేవాడు. చేతికి అందొచ్చిన కొడుకు మృతిని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది.