భారీఎత్తున సమైక్య సభకు... | Heavy peoples moved to Samaikya Sankharavam | Sakshi
Sakshi News home page

భారీఎత్తున సమైక్య సభకు...

Published Sat, Oct 26 2013 4:35 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM

Heavy peoples moved to Samaikya Sankharavam

 బెలగాం, న్యూస్‌లైన్:  సమైక్యాంధ్ర ఉద్యమం పార్వతీపురంలో ఉద్ధృతంగా కొనసాగుగోంది. ఉద్యమంలో భాగంగా  ఏపీఎన్‌జీఓ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం  ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని అన్ని బస్సులకు, ప్రధాన రహదారిలో వెళ్తున్న వాహనాలకు, రైల్వేస్టేషన్‌లో ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని రైళ్లకు విభజన వద్దు- సమైక్యాంధ్రే ముద్దు అంటూ స్టిక్టర్లను జేఏసీ నాయకులు, సభ్యులు అతికించారు. జై సమైక్యాంధ్ర అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
 ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించడం సాంకేతికంగా సాధ్యం కాదనే విషయాన్ని అందరూ గుర్తించారని, ప్రభుత్వంలోని పెద్దలు కూడా బలపరుస్తున్నారన్నారు. విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తే ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.  ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు గంజి లక్ష్మీనాయుడు, కార్యదర్శి జి.వీఆర్‌ఎస్ కిశోర్, నాయకులు కత్తిర నర్సింగరావు, మండల సత్తిబాబు, ఆర్‌ఎస్‌రావు తదితరులు పాల్గొన్నారు.  కొనసాగుతున్న న్యాయవాదుల దీక్షసమైక్యాంధ్రకు మద్దతుగా   న్యాయవాదులు విధులను బహిష్కరించి  కోర్టు జంక్షన్ వద్ద  శుక్రవారం దీక్షను  కొనసాగించారు.

ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖపట్నంలో శనివారం జరిగే న్యాయవాదుల జేఏసీ సమావేశంలో తీసుకునే నిర్ణయం ప్రకారం కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో ఏజీపీ పీ. రాజేంద్ర,  న్యాయవాదులు  జి. వెంకట్రావు, ఎస్. ప్రభాకరరావు, పివి క్రిష్ణారావు, గొర్లి రమణ, గిరీష్‌కుమార్‌మారో, జి. విజయశంకర్,  తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement