విజయవాడకు రోజూ విమాన సర్వీసులు | Daily Flight Services From Kadapa to Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడకు రోజూ విమాన సర్వీసులు

Published Sat, Jul 11 2020 11:20 AM | Last Updated on Sat, Jul 11 2020 12:08 PM

Daily Flight Services From Kadapa to Vijayawada - Sakshi

సాక్షి కడప : కడప ఎయిర్‌ పోర్టు నుంచి తిరిగే విమాన ప్రయాణ రోజులలో మార్పులు చేశారు. ఎప్పటికప్పుడు సీజన్ల వారీగా అధికారులు మార్పులు చేర్పులు చేస్తుంటారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో దాదాపు రెండు నెలలపాటు విమానాలు నిలిపివేశాక  మే 25 నుంచి పునః ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకు రోజుల వారీగా విమానాలు తిరుగుతున్నాయి., ప్రస్తుతానికి అధికారులు కొంత మార్పులు, చేర్పులు చేశారు. గతంలో మంగళవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం హైదరాబాదు–కడప మధ్య సర్వీసు నడుస్తుండగా....ఇప్పుడు సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ప్రయాణం చేసేలా మార్చారు. చెన్నైకి గతంలో సోమ, బుధ, గురువారాల్లో నడుస్తుండగా మార్పులు, చేర్పులు చేసి మంగళ, గురు, శనివారాల్లో తిరిగేలా షెడ్యూల్‌ రూపొందించారు. ఈ షెడ్యూల్‌ ఈనెల 14నుంచి అమలులోకి వచ్చి 31 వరకు అమలు చేయనున్నారు. తర్వాత విమాన షెడ్యూల్‌ను ఇదేవిధంగా నడపవచ్చు లేదా మార్పులు, చేర్పులు  చేసే విషయంలో అధికారులు నిర్ణయం తీసుకుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement