సభలో మాట్లాడుతున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి
టెర్మినల్ భవనం, అభివృద్ధి పనులకు వర్చువల్‌గా ప్రధాని మోదీ శంకుస్థాపన
ఏడాదికి 25 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యానికి తగినట్లుగా విస్తరణ
ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి వైఎస్సార్, వైఎస్ జగన్ ఎనలేని కృషి
ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
కడప కోటిరెడ్డిసర్కిల్/కడప కార్పొరేషన్: వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని విమానాశ్రయంలో రూ.266 కోట్లతో నిర్మించనున్న నూతన టెర్మినల్ భవనానికి ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ విమానాశ్రయం 25 లక్షల మంది ప్రయాణికుల వార్షిక సామర్థ్యం మేరకు ఆధునిక సొబగులద్దుకుంటోంది. ఇక్కడి రన్‌వేని 45 మీటర్ల వెడల్పున 2,515 మీటర్ల పొడవున విస్తరించనున్నారు. పనులు పూర్తయిన తరువాత ఈ విమానాశ్రయం పీక్ అవర్ సరి్వంగ్ కెపాసిటీ 1,800 మంది ప్రయాణికులుగా ఉంటుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషితో విమానాశ్రయం విస్తరణకు రూ.75 కోట్లతో స్థలం సేకరించారు. దీంతో రన్‌వే పొడిగిస్తున్న నేపథ్యంలో విమానాల నైట్ ల్యాండింగ్‌కు కూడా అవకాశం లభిస్తుంది. ఇప్పటికే ఇక్కడి నుంచి నిరంతరాయ సర్విసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కూడా భరించింది. 2015లో ప్రారంభమైన ఈ విమానాశ్రయం నుంచి 2017లో ట్రూ జెట్ సంస్థ ఉడాన్ స్కీమ్ కింద ఆర్‌సీఎస్ (రీజినల్ కనెక్టివిటీ స్కీమ్) అమలు చేసింది. 2021లో ఆ సంస్థ తన విమానాలను ఉపసంహరించుకుంది. 2022 మార్చి నుంచి ఇండిగోసంస్థ విమానాలను ప్రారంభించింది. ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజద్‌బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ విమానాశ్రయంలో అభివృద్ధి పనులతోపాటు టెర్మినల్ నిర్మాణంతో రూపురేఖలు మారిపోయి మహర్దశ పట్టనుందని చెప్పారు.
ఈ విమానాశ్రయం ఏర్పాటుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కృషిచేయగా, ఎయిర్‌పోర్టు అభివృద్ధికి ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు సుందరీకరణలోను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. ఎయిర్‌పోర్టుకు అతి సమీపంలో అటవీప్రాంతం ఉండడంతో అటవీశాఖ అనుమతులు తీసుకుని భూసేకరణ చేసినట్లు తెలిపారు. ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులు చేపట్టిన ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర విమానయానశాఖ మంత్రి జ్యోతిరావు సిందియాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయరామరాజు, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ సుజిత్‌కుమార్ పోదార్, ›ప్రొటోకాల్ ఆఫీసర్ సురేష్‌బాబు, టెర్మినల్ మేనేజర్ జోసెఫ్ పాల్గొన్నారు.
ముసుగు తొలగించారంతే: ఎంపీ అవినాశ్‌రెడ్డి
అనంతరం ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎప్పటినుంచో పొత్తులో ఉన్న టీడీపీ, పవన్‌కళ్యాణ్, బీజేపీ ఇప్పుడు ముసుగు తొలగించారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పొత్తులు కొత్తేమీ కాదని, ఎన్నికలు వచ్చాయంటే ఆయనకు పొత్తులు గుర్తొస్తాయని చెప్పారు. 2019లో టీడీపీ ఓటమి పాలుకాగానే చంద్రబాబు తన అనుచరులైన సుజనాచౌదరి, సీఎం రమేశ్‌లను బీజేపీలోకి పంపారని గుర్తుచేశారు. అప్పటి నుంచి ప్రత్యక్షంగా పొత్తులో ఉన్న టీడీపీ, వవన్‌కళ్యాణ్, బీజేపీ.. పరోక్షంగా కాంగ్రెస్, ఇతర పార్టీలతో కూడా కలిసే ఉన్నట్లు చెప్పారు. ఎంతమంది కలిసొచి్చనా, ఎల్లో మీడియా వారికి ఎంత మద్దతు ఇచ్చినా గెలిచేది వైఎస్సార్‌సీపీయేనని ఆయన తెలిపారు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీతో పొత్తుకోసం టీడీపీ వెంపర్లాడిందని ఎద్దేవా చేశారు. సింహం సింగిల్‌గానే వస్తుందని, జగన్ సింగిల్‌గా పోటీచేసి మళ్లీ సీఎం కావడం తథ్యమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment