
మాసుంసా వలీ సమాధి
సాక్షి, పొదలకూరు (నెల్లూరు): పొదలకూరుకు సమీపంలోని లింగంపల్లి వద్ద మాసుంసా వలీ దర్గా సమాధి కదులుతోందనే పుకార్లతో వందల సంఖ్యలో జనాలు బుధవారం రాత్రి దర్గా వద్దకు చేరుకున్నారు. అక్కడే గంటల తరబడి వేచి ఉన్న భక్తులు సమాధి నిజంగానే కదులుతోందని చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న బంధువులు, స్నేహితులకు ఫోన్లు చేసి చెప్పడంతో ఈ విషయం దావానలంగా వ్యాపించింది. రెండు రోజుల క్రితం ఇక్కడి దర్గాలో భక్తులు వైభవంగా గంధమహోత్సవం నిర్వహించారు. లింగంపల్లి, పొదలకూరు తదితర గ్రామాల భక్తులు గంధమహోత్సవంలో పాల్గొన్నారు.
గంధమహోత్సవం పూర్తయిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడంతో మహిమతోనే సమాధి కదులుతున్నట్టు భక్తులు అభిప్రాయపడుతున్నారు. సాయంత్రం వేళ పెద్దగా అరుపులు వినపడినట్టు కొం దరు తెలిపారు. అయితే సమాధిపై పరచిన బట్టల కిందకు పురుగులు లేదా విషకీటకాలు చేరి కదులుతున్నాయనే అనుమానాన్ని కొందరు యువకులు వ్యక్తం చేశారు.

దర్గా వద్ద గుమికూడిన జనాలు
Comments
Please login to add a commentAdd a comment